ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
డిప్రెషన్ మిమ్మల్ని కుంగదీస్తోందా? దాని పని ఇలా పట్టండి

డిప్రెషన్ మిమ్మల్ని కుంగదీస్తోందా? దాని పని ఇలా పట్టండి

డిప్రెషన్ (Depression).. మనిషిని మానసికంగానే కాదు శారీరకంగానూ కుంగదీస్తుంది. దీని ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉన్నామో.. ఏం చేస్తున్నామో కూడా గుర్తించలేనంత అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. డిప్రెషన్‌కి గురి కావడానికి ఎన్నో కారణాలుండవచ్చు.

ముఖ్యంగా మహిళలు లైంగిక వేధింపులు, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, భాగస్వామి బాధ్యతా రాహిత్యం, ప్రేమకు దూరం కావడం, నమ్మిన వారు మోసం చేయడం వంటి కారణాల వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. చాలామంది అమ్మాయిలు తమకు జరిగిన విషయాన్నే ఎక్కువగా తలచుకొంటూ మరింత బాధపడుతుంటారు. ఇదే వారిని మానసికంగా కుంగిపోయేలా చేస్తుంది.

మనిషిని కుంగదీసే డిప్రెషన్‌ను తగ్గించుకోవడం ఎలా? మానసిక వైద్యుని దగ్గరకు వెళ్లడం ఒకటే పరిష్కారమా? దానిని మనంతట మనం పారద్రోలుకోలేమా? ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఏం చేయాలి? ఇతరత్రా విషయాలను ఈ కథనంలో తెలుసుకొందాం.

అపోహలను తొలగించుకోవడం ముఖ్యం

ADVERTISEMENT

మన సమస్యను అర్థం చేసుకోవడంతో పాటు కాస్త ఓదార్పునిచ్చేవారు ఉంటే అసలు డిప్రెషన్ మన దరికే చేరదు. కానీ మనం చేసే పొరపాటు ఏంటంటే.. ఏదైనా సమస్య మనల్ని ఇబ్బంది పెడుతుంటే దాని గురించి ఇతరులకు చెప్పడానికి చాలా సిగ్గుపడిపోతుంటాం. అలా చెప్పడం వల్ల ఇతరులు చులకనగా చూస్తారేమో అనే భావనే దీనికి కారణం.

అలా మనలో దాన్ని దాచుకొని ఉంచుకోవడం.. పదే పదే దాన్ని తలుచుకొంటూ ఉండటం వల్ల కొన్ని రోజులకు అది మనల్ని పట్టి పీడించే మహమ్మారిలా తయారవుతుంది. నెమ్మదిగా మనల్ని మానసికంగా బలహీనంగా మార్చేస్తుంది. అందుకే సమస్యను ఇతరులకు చెప్పడం వల్ల వారు మనల్ని తక్కువగా చూస్తారు, తప్పు పడతారనే ఆలోచన వదిలేయండి. మీకు బాగా నమ్మకస్తులు, మీ మేలుని కాంక్షించే వారికి మీ సమస్యను వివరించండి. వారు తప్పకుండా మీకు పరిష్కారం చూపిస్తారు.

లేనిపోని సందేహాలు పెట్టుకోవద్దు..

కొన్ని సార్లు డిప్రెషన్ కారణంగా తీవ్రమైన పరిణామాలు సైతం ఎదుర్కోవాల్సిన సందర్భాలు సైతం ఎదురు కావచ్చు. అలాంటప్పుడు భాగస్వామికి లేదా తల్లిదండ్రులకు దీని గురించి భాగస్వామికి చెప్పి ఓదార్పు పొందుదామని భావించినా ఎలా చెప్పాలో తెలియక ఆగిపోతుంటారు. ఇలా మానసికపరమైన కుంగుబాటుని మీలోనే దాచేసుకొంటే.. దానివల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. పైపెచ్చు కొత్త ఇబ్బందులు వచ్చి మనల్ని చుట్టుకొంటాయి. అందుకే ఒత్తిడిని లోలోపలే దాచుకొనే కంటే.. దాని గురించి మీ ఆత్మీయులకు చెప్పడమే మంచిది.

ADVERTISEMENT

దాని వల్ల మీకు సాంత్వన కలగడంతో పాటు సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది. మీ జీవితం సంతోషమయంగా ఉండాలంటే మీ అనుమానాలు, మొహామాటాలన్నింటినీ ఓ పక్కన పడేయాల్సిందే. మీ సమస్య గురించి చెబితేనే కదా ఓ పరిష్కారం దొరికేది. మీరు నిజాయతీగా మీరు ఎదుర్కొంటున్న సమస్య గురించి చెబితే వారు అర్థం చేసుకొంటారు. మీ మీదున్న ప్రేమతో దాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తారు.

తప్పు చేసినట్టు బాధపడొద్దు..

మనలో ఒత్తిడి, కుంగుబాటు కలగడానికి ఎన్నో కారణాలుంటాయి. కార్యాలయంలో పని ఒత్తిడి, కుటుంబ సహకారం లేకపోవడం, భాగస్వామితో ఉన్నా ఒంటరిగా అనిపించడం, లైంగిక వేధింపులు ఎదుర్కోవడం, ఇలాంటివి ఎన్నో మనల్ని మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి. అలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కారణం గురించి మీ భాగస్వామికి చెప్పండి. వాటిని మీరు ఎదుర్కొంటున్న సమస్యగానే భావించండి.

ADVERTISEMENT

అంతే తప్ప మీరేదో తప్పు చేసినట్టు బాధపడొద్దు. మీ పరిస్థితిని వారికి అర్థమయ్యేటట్లు వివరించండి. అంతేకాదు దీని గురించి వివరించేటప్పుడు మాటిమాటికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. అలా చెప్పడం వల్ల మీరేదో తప్పు చేశారేమోననే భావన ఎదుటి వారిలో కలిగే అవకాశం ఉంది.

ఊహలకు తావు ఇవ్వద్దు..

మీ సమస్య గురించి మీ భాగస్వామితో లేదా తల్లిదండ్రులతో చెబుతున్నప్పుడు కొన్నిసార్లు మీరు చెబుతున్నది వారు పట్టించుకోవడం లేదేమో అనిపిస్తుంది. మరికొన్నిసార్లు వారు మిమ్మల్ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని లేదా మిమ్మల్ని అనుమానిస్తున్నారనే ఆలోచలనకు తావు ఇవ్వద్దు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సానుకూలమైన అంశాన్ని సైతం మెదడు నెగటివ్‌గా తీసుకొంటుంది.

మరికొన్నిసార్లు మనమే లేనిది ఊహించుకొంటూ ఉంటాం. ఇది కూడా మంచిది కాదు. కాబట్టి  అతిగా ఊహించకోవద్దు. అంతేకాదు.. ఆ సమయంలో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయోనని విశ్లేషించవద్దు. ఎందుకంటే మీ మేలును కాంక్షించేవారు మీ సంతోషాన్నే కాదు.. మీ సమస్యలను సైతం వారివిగానే భావిస్తారు. కాబట్టి ధైర్యంగా చెప్పడానికి ప్రయత్నించండి.

ADVERTISEMENT

మిమ్మల్ని మానసికంగా కుంగదీసే సమస్య గురించి మీ సన్నిహితులకు చెబితే.. వారు దానికి పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తారు. అయితే దాని ప్రభావం మాత్రం వెంటనే పోదు. కాబట్టి మానసిక వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకొనే దిశగా కూడా ఆలోచన చేయండి.

కొన్ని ప్రేమ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయో తెలుసా?

మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడానికి ఈ పనులు చేయాల్సిందే..

ప్రేమ వివాహం.. ప్రేమతో మీకు నేర్పించే విషయాలు ఇవే..

ADVERTISEMENT

 

04 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT