ఉమ్మడి కుటుంబంలో.. ఆలుమగలకు లైంగిక జీవితం కాస్త ఇబ్బందికరమేనా..?

ఉమ్మడి కుటుంబంలో.. ఆలుమగలకు లైంగిక జీవితం కాస్త ఇబ్బందికరమేనా..?

పెళ్లయ్యాక నాలుగేళ్ల పాటు ఉమ్మడి కుటుంబంతో కలిసి (Joint family)  జీవించాం. అక్కడ మాకు బాగానే ఉన్నప్పటికీ.. . భార్యా భార్తలుగా మాకు లభించే లైంగిక స్వేచ్ఛ  (sex) విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడేవాళ్లం. రాత్రి పడక గదిలో కలయికకు ఏ ఇబ్బందీ లేదు గానీ.. కాస్త ప్రత్యేకంగా డ్రస్ లేదా ప్రాప్స్ ఉపయోగించాలనుకుంటే మాత్రం అక్కడ అది అస్సలు సాధ్యం అయ్యేది కాదు.


ఎక్కడ పడితే అక్కడ.. ఎప్పుడు పడితే అప్పుడు మాకు కలిసే అవకాశం లేకపోవడం మాత్రమే కాదు.. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులే ఉంటాయి.


సోషల్ మీడియాలో పాపులరైన ఓ ఆరుగురు మహిళలు ఉమ్మడి కుటుంబంతో కలిసుండడం వల్ల.. వారి లైంగిక జీవితం ఎలా ప్రభావితమైందో చెబుతున్నారు. వారి అనుభవాలేంటో చూద్దాం రండి.


1. ఆ దుస్తులు ధరించలేను..


నా భర్త, నేను రెండేళ్ల పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి ముందు అన్ని రకాల చాలా సరదాగా రొమాన్స్ చేసేవాళ్లం. కానీ పెళ్లి తర్వాత మాత్రం రాత్రి పూటకే పరిమితమైపోయాం. అంతేకాదు.. చక్కటి సెక్సీ బేబీడాల్ వేసుకొని నా భర్తకు వెల్ కం చెప్పాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. కానీ మా అత్తమామలతో కలిసి ఉంటాం.. కాబట్టి అది అస్సలు కుదరదు. మా అత్తమామలు ఎక్కడికైనా వెళ్లినప్పుడు నా కోరిక నెరవేర్చుకోవాలని నేను వేచి చూస్తున్నా.


2. వీకెండ్స్‌లో మాత్రమే..


ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు.. పలు అంశాలు  సాధారణంగా ఆలుమగల లైంగిక జీవితం పై కూడా ప్రభావం చూపిస్తాయి. రాత్రిపూట ఏ మాత్రం శబ్దం చేయకుండా.. ఓ గదిలోనే సంసారం చేయాల్సి వస్తుంది.  అంతేకాదు.. మిగిలినవాళ్లందరూ నిద్రపోయాకే అది సాధ్యమవుతుంది.


భార్య భర్తలుగా మేం పంచుకొనే ప్రేమ బంధాన్ని.. కేవలం బెడ్ రూమ్‌కి మాత్రమే పరిమితం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు చాలానే ఉంటాయి. అందుకే లాంగ్ వీకెండ్స్ వచ్చినప్పుడు నేను, నా భర్త బయటకు వెళ్తుంటాం.  మాకు నచ్చిన హోటల్‌లో బస ఏర్పాటు చేసుకొని.. మా ఇద్దరికే పరిమితమైన మధుర క్షణాలను అనుభవిస్తుంటాం.


sex-life-1


3. అలా దొరికిపోయాం.


అంతా కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నామంటే.. కాస్త ఏమరపాటుగా ఉన్నా అనుకోని సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రోజు అలాగే జరిగింది. మేం భార్య, భర్తలిద్దరం వైన్ తాగి కలయికలో పాల్గొనాలని అనుకున్నాం. అలా ఒక డ్రింక్ తాగి ..మరో డ్రింక్ కోసం కిచెన్‌కి వెళ్లొచ్చాక తలుపు గడియ పెట్టడం మర్చిపోయాం. వైన్ తాగి సగం సగం దుస్తుల్లో మేం మావైన క్షణాలను పంచుకుంటూ ఉంటే.. మా అత్తగారు తలుపు గడియ తీసుందని దాన్ని అలా ఓ తోపు తోసింది.


వెంటనే సగం దుస్తుల్లో మేమిద్దరం ఆమెకు కనిపించేశాం. దాంతో ఆమె షాక్ తింది. మేం కూడా సిగ్గు పడిపోయాం. కానీ ఆమె మమ్మల్ని అలా చూసిన వెంటనే.. తలుపు గడియ వేసేసింది. లైట్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండడం వల్ల మాకు కాస్త ఇబ్బంది తగ్గిందనుకోవాలి. అయినా ఆ తర్వాత కొన్నిరోజుల పాటు.. ఆ ఇబ్బంది మమ్మల్ని వదిలిపోలేదు. ఇప్పుడు గదిలోకి వచ్చాక గడియ వేశామా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాం.


4. కేవలం రాత్రి మాత్రమే..


ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉండడం వల్ల.. ఆలుమగలు పగటి వేళ తమవైన ప్రేమైక క్షణాలను పంచుకొనే అవకాశం ఉండదు. రాత్రి పూట.. అదీ తమ తల్లిదండ్రులు వారి గదిలోకి వెళ్లిపోయిన తర్వాతే.. ఆ ఆనందం మొదలవుతుంది. మధ్యాహ్నం ఎప్పుడైనా ఆలుమగలు.. లైంగిక చర్యలో పాల్గొనాలని భావించినా.. పరిస్థితిని అంచనా వేస్తూ.. ఎవరి కంటపడకుండా.. రాత్రి వరకూ ఆగాల్సి వస్తుంది. ఏ కారణం లేకుండా మధ్యాహ్నం తలుపులు వేసుకోలేరు కదా. అలా వేసుకున్నా.. వారు తల్లిదండ్రుల గది ముందు నుండి వెళ్తుంటే.. ఏదో గిల్టీ ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది.  


sex-life-2


5. బెడ్‌రూంకి మాత్రమే పరిమితం..


మేమిద్దరం మా లైంగిక జీవితాన్ని బాగానే ఆస్వాదిస్తున్నాం. మా అత్తమామలతో కలిసి ఉన్నా.. మాకు పెద్ద ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు. వాళ్ల గదికి.. మా గదికి దూరం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. టీవీ చూస్తూ కాస్త వాల్యూమ్ ఎక్కువగా పెట్టి.. మా గదిలో మేం వెళ్లేవాళ్లం. అంతా బాగానే ఉన్నా.. కేవలం బెడ్ రూంకి మాత్రమే మా లైంగిక ముచ్చట్లు పరిమితం కావడం నాకు కాస్త ఇబ్బందిగానే అనిపించేది. సినిమాల్లో చూపించినట్లు.. సోఫాలో లేదా కిచెన్‌లో మా సరదాలు తీర్చుకోవాలని నా కోరిక. కానీ అది కుదిరేది కాదు. ఆ ఇబ్బంది తప్ప మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి.


6. ఏమాత్రం తేడా లేదు..


మాది కూడా ఉమ్మడి కుటుంబం. కానీ దీనివల్ల నాకు నా లైంగిక జీవితంలో ఎలాంటి ఇబ్బంది లేదు. మా అత్తమామలతో కలిసి ఒకే ఇంటిలో జీవించడం.. అదో పెద్ద సమస్య కాదని నా ఫీలింగ్. మా పెళ్లయి మూడేళ్లవుతుంది. మా లైంగిక జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక కొన్ని ప్రత్యేకమైన కోరికలుంటే.. వాటిని తీర్చుకోవడానికి వెకేషన్స్ ఎలాగూ ఉంటాయి కాబట్టి పెద్ద సమస్యగా అనిపించదు.


ఇవి కూడా చదవండి.


సెక్స్ విషయంలో.. అబ్బాయిలకు ఉండే కలలు, కోరికలు ఇవే..


సెక్స్‌లో పాల్గొనడం వల్ల మన ఆరోగ్యానికి.. ఎన్ని ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా?


సెక్స్ త‌ర్వాత.. అమ్మాయిలు ఏం ఆలోచిస్తారో మీకు తెలుసా..?


Images : Giphy