home / సౌందర్యం
వేసవిలో సన్ స్క్రీన్ లోషన్.. వాడటం వల్ల కలిగే ప్రయోజనాలివే..!

వేసవిలో సన్ స్క్రీన్ లోషన్.. వాడటం వల్ల కలిగే ప్రయోజనాలివే..!

వేసవి కాలం(summer) మొదలవగానే చాలామంది చేసే మొదటి పని సన్ స్క్రీన్ లోషన్(sunscreen lotion) కొనుగోలు చేయడం. ఈ కాలంలో భానుడి ప్రతాపం చాలా తీవ్రంగా ఉంటుంది. దాని నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే సన్ స్క్రీన్ కచ్చితంగా ఉపయోగించాల్సిందే. ఇది సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా కాపాడుతుంది. వేసవిలో మాత్రమే కాదు.. మిగిలిన కాలాల్లో సైతం సన్ స్క్రీన్ కచ్చితంగా ఉపయోగించాల్సిందే.

సన్ స్క్రీన్ లోషన్ చర్మాన్ని ఎండ, అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడటం మాత్రమే కాకుండా ఇతర సౌందర్య ప్రయోజనాలను సైతం అందిస్తుంది.

3-summer-sunscreen

సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:

  1. సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. ఫలితంగా మీరు యంగ్‌గా కనిపిస్తారు. ఇది ముడతలతో పాటు చర్మంపై సన్నని గీతలు కూడా ఏర్పడకుండా చేస్తుంది.
  2. వేసవిలో అమ్మాయిలను ఇబ్బంది పెట్టే సమస్య ట్యానింగ్. సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల చర్మంపై ట్యాన్ ఏర్పడదు. ఎండలో ఎక్కువ సమయం తిరగాల్సి వచ్చినప్పుడు ప్రతి రెండు గంటలకోసారి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం మంచిది.
  3. సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల కొల్లాజెన్, కెరాటిన్, ఎలాస్టిన్ వంటి చర్మాన్ని రక్షించే పోషకాలు అందుతాయి. ఇవి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.
  4. సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల అతినీలలోహిత కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా ఉంటుంది. కాబట్టి చర్మ కాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

Also Read: ట్యాన్ ని తొలగించడానికి ఇంటి చిట్కాలు (Home Remedies To Remove Sun Tan In Telugu)

1-summer-sunscreen

సన్ స్క్రీన్ లోషన్ ఎలా రాసుకోవాలి?:

ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అరగంట ముందు ముఖానికి, మెడకు, చేతులకు.. ఇలా ఎండ తగిలే భాగాలకు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాల్సి ఉంటుంది. సరిపడినంత సన్ స్క్రీన్ లోషన్ తీసుకొని ముఖమంతా చుక్కలు చుక్కలుగా పెట్టుకొని సమానంగా పరుచుకొనేలా రాసుకోవాలి. మీది పొడిచర్మం అయితే సన్ స్క్రీన్ లోషన్ రాసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు. బయటకు వెళ్లినప్పుడు చెమట ఎక్కువ పట్టినా లేదా స్విమ్మింగ్ చేసినా రెండు గంటలకోసారి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాల్సి ఉంటుంది.

ట్యాన్ బారిన పడకుండా ఉండేందుకు చిట్కాలు

సన్ స్క్రీన్ ఎలా ఎంచుకోవాలి?

సన్ స్క్రీన్ ఎంచుకొనే విషయంలో కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆరుబయట గడిపే సమయం, చర్మతత్వం, వయసు, లైఫ్ స్టైల్ ఆధారంగా సన్ స్క్రీన్ లోషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఎస్పీఎఫ్ విలువ 30 కంటే ఎక్కువ ఉన్న లోషన్ ఎంచుకోవడం మంచిది. ఈ విషయంలో మీకు స్పష్టత రానట్లైతే మీ చర్మ సంబంధ నిపుణులను సంప్రదించి వారు సూచించిన దాన్ని ఉపయోగించడం మంచిది.

చర్మతత్వం ఆధారంగా ఉపయోగించదగిన సన్ స్క్రీన్ లోషన్లు

4-summer-sunscreen

పొడి చర్మం కలిగిన వారికి నప్పే సన్ స్క్రీన్లు

1. Avene very high protection cream SPF 50

దీని ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ దీన్ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది చాలా తేలికగా ఉండటంతో పాటు జిడ్డుగా అనిపించదు.

2. Kaya Daily Moisturizing Sunscreen SPF 30

ఈ సన్ స్క్రీన్ లోషన్ హానికరమైన అల్ట్రావయెలెట్ ఎ, అల్ట్రావయెలెట్ బి కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని ప్రకాశవంతంగానూ మారుస్తుంది.

3. Biotique Bio Carrot SPF 40 Sunscreen

పేరుకి తగినట్టుగానే దీనిలో క్యారెట్ గుణాలుంటాయి. కాబట్టి చర్మానికి సూర్యకిరణాల నుండి రక్షణను అందివ్వడంతో.. పాటు చర్మాన్ని సైతం అందంగా మెరిసిపోయేలా చేస్తుంది.

4. Natio Daily Defence Face Moisturizer SPF 50

ఈ సన్ స్క్రీన్ చర్మానికి రాసుకొన్నప్పుడు అసలు జిడ్డుగా అనిపించదు. దీనిలో ఉన్న విటమిన్ ఇ, కలబంద చర్మానికి పోషణను అందిస్తాయి. పైగా చర్మాన్ని సూర్యకిరణాల నుంచి సమర్థంగా రక్షిస్తాయి.

5. Abeeno Protect + hydrate lotion Sunscreen SPF 50

ఈ సన్ స్క్రీన్ లోషన్ చర్మాన్ని సూర్యరశ్మి ప్రభావం నుంచి రక్షించడంతో పాటు స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది.

6. POPxo రికమెండ్ చేసే సన్ స్క్రీన్ లోషన్: Neutrogena Ultra Sheer Dry Touch Sunblock SPF 50+

ఈ సన్ స్క్రీన్ లోషన్ ప్రమాదకరమైన అల్ట్రా వయలెట్ ఎ, అల్ట్రా వయలెట్ బి కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అంతేకాదు చర్మం రంగు మారకుండా చూస్తుంది. అలాగే చర్మం ముడతలు పడకుండా చూస్తుంది. ఇది ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ లోషన్. కాబట్టి ముఖానికి రాసుకొన్నప్పుడు జిడ్డుగా అనిపించదు.

జిడ్డు చర్మానికి నప్పే సన్ స్క్రీన్ లోషన్లు

1. Lotus Safe Sun UV Screen Matte Gel SPF 50

ఇది సన్ స్క్రీన్ లోషన్‌గా మాత్రమే కాదు.. మేకప్ బేస్‌గానూ పనిచేస్తుంది. అంతేకాదు.. చర్మగ్రంథులు ఎక్కువ మొత్తంలో నూనెలు విడుదల చేయకుండా చూస్తుంది. కాబట్టి ముఖం చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది.

2. VLCC Matte Look SPF 30 Sunscreen Gel Cream

ఆయుర్వేద మూలికలతో తయారైన ఈ సన్ స్క్రీన్ లోషన్ చక్కటి మేకప్ లుక్‌ను కూడా ఇస్తుంది.

3. Aroma Magic Cucumber Sunscreen Lotion SPF 30

ఈ సన్ స్క్రీన్ లోషన్లో హానికరమైన పారాబెన్లు, సల్ఫేట్లు ఇతర రసాయానాలు ఏమీ ఉండవు. కాబట్టి దీన్ని ఉపయోగించడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయేమోననే భయం అవసరం లేదు.

4. L’Oreal Paris UV Perfect Super Aqua Essence SPF 50

ఈ సన్ స్క్రీన్ లోషన్ చర్మంలోకి చాలా సులభంగా ఇంకిపోవడం మాత్రమే కాకుండా పన్నెండు గంటల పాటు సూర్యరశ్మి ప్రభావం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

5. POPxo రికమెండ్ చేస్తున్న సన్ స్క్రీన్ లోషన్: Organic Harvest Sunscreen For Oily Skin SPF 30

చాలా తేలికగా ఉండే ఈ నాన్ గ్రీజీ సన్ స్క్రీన్ లోషన్ చర్మం విడుదల చేసే నూనెలను పీల్చుకొంటుంది. దీని వల్ల చర్మం జిడ్డుగా కనిపించదు. ఈ సన్ స్క్రీన్ లోషన్ జిడ్డు చర్మం కలిగినవారికి సరైన ఎంపికగా భావించవచ్చు.

2-summer-sunscreen

మిశ్రమ చర్మతత్వం కలిగినవారికి నప్పే సన్ స్క్రీన్ లోషన్లు

1. Glenmark La Shiled Sunscreen Gel SPF 40

కాస్త ఖరీదు ఎక్కువే అయినప్పటికీ.. ఈ సన్ స్క్రీన్ జెల్ కాంబినేషన్ స్కిన్ కలిగినవారికి బాగా ఉపయోగపడుతుంది.

2. VLCC Anti Tan Sunscreen Lotion SPF 25

నిమ్మతో పాటు ఇతర సహజమైన పదార్థాలతో తయారుచేసిన ఈ సన్ స్క్రీన్ లోషన్ చాలా తక్కువ ధరకే మనకు లభిస్తుంది.

3. Patanjali Sunscreen SPF 30 with Natural Moisturizers

ఈ సన్ స్క్రీన్ లోషన్ చర్మాన్ని సూర్యరశ్మి నుంచి రక్షించడం మాత్రమే కాకుండా చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. కాకపోతే దీని నుంచి వెలువడే వాసన అంత బాగుండదు.

4. Jovees Argan Sun Guard Lotion SPF 60 PA +++

మిశ్రమం చర్మతత్వం కలిగినవారికి నప్పే మరో సన్ స్క్రీన్ లోషన్ ఇది. అప్లై చేసుకొన్నప్పుడు చాలా తేలికగా అనిపించే ఈ సన్ స్క్రీన్ లోషన్ ఫ్లేవర్ చాలా అద్భుతంగా ఉంటుంది.

5. Aroma Magic Aloe Vera Sunscreen Gel SPF 20

ఈ సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడానికి అనువుగా ఉన్నప్పటికీ దీని ఎస్పీఎఫ్ విలువ చాలా తక్కువ.

6. POPxo రికమెండ్ చేస్తున్న సన్ స్క్రీన్ లోషన్: Avene Sun Care Kit for Normal to Combination Skin

సహజమైన సన్ స్క్రీన్ లోషన్లు:

1. Lotus Safe Sun 3-in-1 matte look daily Sunblock SPF 40

ఈ త్రీ ఇన్ వన్ సన్ స్క్రీన్ లోషన్లో సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, స్కిన్ లైటనర్ ఉంటాయి. కాబట్టి ఈ ఒక్కదానితోమూడు రకాల ప్రయోజనాలను పొందవచ్చు. పైగా ఇది పూర్తిగా సహజసిద్ధమైన ఉత్పత్తులతో తయారైంది కాబట్టి దుష్ప్రభావాలు ఎదురవుతాయనే భయం కూడా ఉండదు.

2. Biotique Bio Sandalwood 50+ SPF UVA/UVB Sunscreen

ఈ సన్ స్క్రీన్ లోషన్లో చందనం, తేనె వంటి గుణాలున్నాయి. కాబట్టి చర్మానికి పోషణను అందివ్వడంతో పాటు చర్మానికి రక్షణ కూడా అందుతుంది.

3. Kaya Youth Protect Sunscreen SPF 50

ఈ సన్ స్క్రీన్ లోషన్ చర్మాన్ని హానికరమైన యూవీ కిరణాల నుంచి రక్షించడం మాత్రమే కాకుండా చర్మాన్ని సున్నితంగా మార్చేస్తుంది.

4. Lakme Sun Expert Fairness+UV lotion SPF 50 PA+++

ఈ సన్ స్క్రీన్ లోషన్ 97 శాతం వరకు సూర్యకిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చూస్తుంది.

5. Lacto Calamine Sun Shield SPF 30 PA ++

చక్కటి సువాసన కలిగిన ఈ సన్ స్క్రీన్ లోషన్ చాలా మంచి ఫలితాన్నిస్తుంది.

6. POPxo రికమెండ్ చేస్తోన్న సన్ స్క్రీన్ లోషన్: Neutrogena Normal Skin Combo

ఈ నాన్ గ్రీజీ సన్ స్క్రీన్ లోషన్ చర్మానికి అప్లై చేసుకోవడం ద్వారా చాలా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఇది సూర్య కిరణాల నుంచి చర్మాన్ని 98 శాతం వరకు రక్షిస్తుంది. దీన్ని మిశ్రమ చర్మతత్వం కలిగినవారు మాత్రమే కాకుండా డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ కలిగినవారు సైతం ఉపయోగించవచ్చు.

సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:

5-summer-sunscreen

సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం వల్ల చర్మానికి ప్రయోజనాలున్నప్పటికీ కొన్ని దుష్ఫలితాలు కలిగే అవకాశాలూ ఉన్నాయి.

1. సన్ స్క్రీన్ లోషన్ తయారీలో ఉపయోగించే కొన్ని రకాల రసాయనాల కారణంగా స్కిన్ అలర్జీలు రావచ్చు.

2. కొన్ని రకాల సన్ స్క్రీన్స్ ఉపయోగించడం వల్ల మొటిమల సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.

3. సన్ స్క్రీన్ లోషన్ తయారీలో ఆక్సీబెంజోన్ ఉపయోగిస్తారు. ఇది సూర్యుని నుంచి వెలువడే యూవీ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చూస్తుంది. అయితే దీని వల్ల చర్మకణాలు పాడవుతాయి.

4. సన్ స్క్రీన్ లోషన్లో ఉపయోగించే కొన్ని రసాయనాల కారణంగా శరీరంలో క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దీనిలో ఉన్న బెంజోఫినోన్స్ అనే రసాయనం వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్ అధికంగా విడుదలవుతుంది. దీని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

సన్ స్క్రీన్ రాసుకొన్నప్పుడు మీ చర్మంపై ఎర్రటి పొక్కులు రావడం లేదా చర్మం పింక్ రంగులోకి మారిపోవడం గమనిస్తే వెంటనే శుభ్రం చేసుకోవాలి. చర్మంపై మరీ ఎక్కువ ర్యాషెస్ వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. అలాగే వారి సూచనల మేరకే సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం మంచిది. 

ఇవి కూడా చదవండి:

ఆయిలీ స్కిన్ కలిగిన వారికి.. సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్..!

కళ్ల కింద నల్లటి వలయాలా? తేనెతో వాటిని దూరం చేసుకోవచ్చు

సులభమైన పద్ధతిలో.. ఇంట్లోనే లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు..!

10 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this