ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ సమస్యలకు పరిష్కార మార్గాలు పొందండి

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ సమస్యలకు పరిష్కార మార్గాలు పొందండి

ఈ రోజు (మే 12) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) – మీరు ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ మీరు పరిష్కరించుకోవాల్సిన సమస్యలే మీకు చాలా ఉన్నాయని మర్చిపోతున్నారు. కాబట్టి ముందుగా మీ కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.


వృషభం (Tarus) – మీకు ఏది ముఖ్యమో దానిపైనే మీ దృష్టంతా పెట్టండి. ఈ రోజు మీరు ఒంటరిగా గడపడానికి మీకు బోలెడంత సమయం దొరుకుతుంది. దానిని సద్వినియోగం చేసుకోండి. మీ పాత స్నేహితులు ఒకరు ఓ సలహా నిమిత్తమై మిమ్మల్ని ఈ రోజు కలుసుకుంటారు.


మిథునం (Gemini) – మిమ్మల్ని బాధపెడుతున్న అంశం ఏదో గ్రహించడానికి ప్రయత్నించండి. ఈ రోజు అన్నీ మీరు అనుకున్న విధంగానే జరుగుతాయి. పనితో పాటు వ్యక్తిగత జీవితం కూడా నిదానంగానే సాగుతుంది. అయితే మీ భాగస్వామితో ఘర్షణ పడకండి. అది మీ బంధానికి ఏమాత్రం మంచిది కాదు.


కర్కాటకం (Cancer) –  కుటుంబంలో ఉన్న కొన్ని ఘర్షణల కారణంగా కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడానికి మీకు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. దాంతో ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతుంటారు. ఈ సమయంలో మీ స్నేహితుల సహాయం తీసుకోవడం చాలా అవసరం. వారితో కలిసి గడపడం ద్వారా మీరు తిరిగి మామూలు స్థితికి చేరుకుంటారు.


సింహం (Leo) – ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రణాళికలు, కార్యక్రమాలు.. మీకు ఉన్న అడ్డంకుల కారణంగా ఈ రోజు చాలా భారంగా గడవచ్చు. ఒక్కోసారి చివరి నిమిషంలో మీ ప్లాన్స్ మార్చుకోవాల్సి రావచ్చు. ఈ కారణంగా ఎవరో ఒకరు నిరుత్సాహానికి గురవుతారు. ఏదీ వ్యక్తిగతంగా తీసుకోకండి.


క‌న్య (Virgo) – పని ప్రదేశంలో వ్యక్తులను బ్యాలన్స్ చేయడం మీకు కాస్త కష్టంగా అనిపించవచ్చు. అయితే ఇతరులలో లోపాలను దిద్దడంపై కాకుండా మీకు అప్పగించిన పనిపై దృష్టి పెట్టడం మంచిది. పనిలో ఎదుర్కొన్న ఒత్తిడి నుంచి సాయంత్రం వేళ మీరు ప్రేమించిన వారితో సమయం గడపడం ద్వారా బయటపడచ్చు.


తుల (Libra) –  ఈ రోజు మీరు చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. కాబట్టి రోజంతా చాలా బిజీబిజీగా గడుస్తుంది. మరిన్ని బాధ్యతలను మీరు నిర్వర్తించాల్సి రావచ్చు. అధిక పని గంటల కారణంగా కుటుంబ జీవితం కాస్త ప్రభావితం కావచ్చు. 


వృశ్చికం (Scorpio) –  పని ప్రదేశంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ప్రాక్టికల్ పద్ధతినే అనుసరించండి. ఎమోషనల్‌గా వారితో మాట్లాడడం వల్ల మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. అలాగే నిద్రలేమి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మీ ఆరోగ్యం పై దృష్టి పెట్టండి.


ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీకు నిదానంగా ప్రారంభం అయినా.. మధ్యాహ్న సమయానికి అన్నీ సర్దుకుంటాయి. మీ బాల్య స్నేహితులు మిమ్మల్ని కలిసే అవకాశాలున్నాయి. ఈ రోజు సాధ్యమైనంత వరకు మీ కుటుంబంతో ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. ఆఫీసు టెన్షన్లను కాసేపు పక్కన పెట్టండి.


మకరం (Capricorn) – ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపడం మంచిది. ముఖ్యంగా మీ డైట్‌ని రెగ్యులరైజ్ చేసుకునే అంశానికే అధిక ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఈ రోజు బంధువులు లేదా స్నేహితులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. పలు శుభవార్తలు కూడా మీరు వింటారు. 


కుంభం (Aquarius) – ఎమోషనల్‌గా అందరికీ తోడుండేందుకు మీరెప్పుడూ సంసిద్ధులే. అందుకే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు తోడుగా ఉండేందుకు మీరెప్పుడూ ముందే ఉంటారు. అయితే ఈ క్రమంలో మీ వ్యక్తిగత జీవితాన్ని బ్యాలన్స్ చేసుకోవడం కూడా ముఖ్యమే అని గుర్తుంచుకోండి. ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే రోజు. 


మీనం (Pisces) –  ఈ రోజు మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి కాస్త సమయం కేటాయించుకోవడానికి ప్రయత్నించండి. అన్ని పనులు ముగించుకొని.. కొంతసేపు మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి. మీకు నచ్చినవి తింటూ.. నచ్చిన సినిమా చూస్తూ.. హాయిగా గడపండి.  ఈ రోజు మీ మూడ్‌ని డిస్టర్బ్ చేసే సంఘటనలు జరగవచ్చు. అయినా వాటిని పట్టించుకోకుండా ఆనందంగా గడపండి. ముఖ్యంగా మీ సంతోషంలో మీ కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు వారికి కూడా మీపై ఉన్న ప్రేమాభిమానాలు రెట్టింపు అవుతాయి.


Credit: Asha Shah


ఇవి కూడా చదవండి


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?


ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా..!? -