మీ రాశిఫలాలు వీక్షించండి.. సమస్యలను ఆత్మస్థైర్యంతో పరిష్కరించుకోండి..!

మీ రాశిఫలాలు వీక్షించండి.. సమస్యలను ఆత్మస్థైర్యంతో పరిష్కరించుకోండి..!

ఈ రోజు (మే 18) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) –  మీరు ఈ రోజు అనుకున్న సమయానికి పని పూర్తి చేయడం మాత్రమే కాదు.. కుటుంబానికి కూడా తగిన సమయం కేటాయిస్తారు. అయినా కాస్త వివేకంతో ప్రవర్తించండి. కుటుంబంలో ఎదురయ్యే పలు వివాదాలను నేర్పుతో పరిష్కరించండి. ఎదుటివారు చెప్పేది ప్రశాంతంగా విని నిర్ణయం తీసుకోండి. 


వృషభం (Tarus) – చివరి నిమిషంలో జరిగే మార్పుల కారణంగా.. ఆఫీసులో పని చాలా ఎక్కువగా ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. పని స్పష్టత లేకుండా సాగుతుందనే భావన కూడా మీకు కలగవచ్చు. అయినా సరే ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. సాధ్యమైనంత వరకు మీకు అప్పగించిన పనులను నిజాయతీగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. 


మిథునం (Gemini) – మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కష్టపడి పని చేసే తత్వం గలవారు కావడం వల్ల.. మీరు చేసే పని కూడా త్వరగానే పూర్తవుతుంది. ఆర్థికంగా కాస్త అభ్రదతాభావం ఉన్నా.. దాన్ని మీ పనిపై ప్రభావం చూపనీయకండి. పనిని జాగ్రత్తగా బ్యాలన్స్ చేయండి. ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. 


కర్కాటకం (Cancer) –  బాధ్యతలను తీసుకోవడానికి మీరు మరింత ఉత్సాహంగా ముందుకు రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా పని విషయంలో ఇతరులు మీతో  పోటీకి రావచ్చు. అంతేకాదు.. మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం కూడా చేయచ్చు. కానీ మీపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని అలాగే కొనసాగించండి. మిమ్మల్ని మీరు గట్టిగా నమ్మండి.


సింహం (Leo) –  చేస్తున్న పని ఎక్కడ ఆగిపోయిందో, ఏ కారణం వల్ల అలా జరిగిందో మీకు ఈ రోజు ఓ స్పష్టత వస్తుంది. అలాగే ఆఫీసులో సహచరుల మూలంగా ఏర్పడే వివాదాలను నేర్పుతో పరిష్కరించండి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ రోజు ఓ స్పష్టత వస్తుంది. గతంలో జరిగిన విషయాల గురించి కుటుంబ సభ్యులతో వాదించకండి. వారితో సున్నితంగా వ్యవహరించండి. 


క‌న్య (Virgo) –  చివరి నిమిషంలో జరిగే మార్పుల కారణంగా.. మొదట్లో పని భారం ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా రోజు ముగిసే సమయానికి అన్నీ మీరు అనుకున్నట్లుగానే జరుగుతాయి. కొత్త వెంచర్స్ విషయంలో మీకు ఓ స్పష్టత ఏర్పడుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడుపుతారు.


తుల (Libra) –  కొన్ని సమావేశాలు చివరి నిమిషంలో వాయిదా పడడం వల్ల.. మీకు విశ్రాంతి తీసుకోవడానికి కాస్త సమయం లభిస్తుంది. అందుకే సాయంత్రం వేళ మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా సమయం గడుపుతారు. మీ కొత్త ఐడియాల గురించి వారితో చర్చిస్తారు. 


వృశ్చికం (Scorpio) –  కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో ఓ స్పష్టత లేని కారణంగా.. పని విషయంలో కాస్త గందరగోళంగా ఉంటుంది. అందుకే.. ఈ రోజు ఏ విషయంలోనూ వాదోపవాదాలకు దిగకండి. అలాగే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం. అలసటను వీడి.. కాస్త ప్రశాంతతతో గడపండి. ముఖ్యంగా మీ పని ఒత్తిడి.. మీ కుటుంబంపై ప్రభావం చూపకూడదని తెలుసుకోండి.


ధనుస్సు (Saggitarius) –  మీరు చేసే పనిలో ఈ రోజు పెద్దగా మార్పు లేకపోయినా.. ఒక ముఖ్యమైన సమావేశం ముగిసిన తర్వాత మానసికంగా అలసిపోయినట్లుగా మీకు అనిపించవచ్చు. ఈ క్రమంలో మీ సీనియర్లు లేదా కుటుంబ సభ్యులను సంప్రదించి సలహా తీసుకుంటారు. మీ స్నేహితులు అందించే సలహాలను కూడా పాటించండి. 


మకరం (Capricorn) – ఈ రోజు మీరు పనిలో చాలా బిజీగా గడుపుతారు. ముఖ్యమైన సమావేశాలు కొన్ని నిర్వహిస్తారు. ఎదుటివారితో ఏదో ఒక రకంగా పని పూర్తి చేయించుకుంటారు. తద్వారా వచ్చే ఫలితాలతో మీరు సంతోషిస్తారు కూడా. కానీ పనిలో ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబంతో కూడా సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడం మంచిది. 


కుంభం (Aquarius) – మీరు చేయాల్సిన పనులన్నీ.. మీ జాబితా ప్రకారం పూర్తి చేసే క్రమంలో అక్కడక్కడా కాస్త జాప్యం జరగవచ్చు. అంతమాత్రాన మీరు నిరుత్సాహపడవద్దు. అన్నీ మన నియంత్రణలో ఉండవని గుర్తుంచుకోండి. అలాగే వేరొకరి ప్రవర్తన కారణంగా కూడా మీకు బాధ కలగవచ్చు. మీ మనసులో ఉన్న వాటిని స్నేహితులు, కుటుంబ సభ్యులు.. ఎవరితోనైనా పంచుకోండి.


మీనం (Pisces) –  ఓ సమావేశం ద్వారా మీకు ప్రస్తుత పరిస్థితులు, వాటి ఫలితాలపై ఒక స్పష్టత ఏర్పడుతుంది. అలాగే మీ టీంలో పలువురి ప్రవర్తన కారణంగా మీరు నిరుత్సాహపడవచ్చు. అయినా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీకలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !


ఇవి కూడా చదవండి


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా


ధనురాశి అమ్మాయిల ప్రత్యేకతలు ఏమిటో ఆంగ్లంలో చదివేయండి


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?