ADVERTISEMENT
home / Astrology
ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి – మీ సమస్యలకు సత్వర పరిష్కారాలను పొందండి..!

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి – మీ సమస్యలకు సత్వర పరిష్కారాలను పొందండి..!

ఈ రోజు (మే 2) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

 

మేషం (Aries) – మీ ఆఫీసు పని విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.   మీకు స్పష్టత లేనిదే పనికి సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. అధికారులతో వాటి గురించి చర్చించవద్దు. అన్ని సక్రమంగా ఉంటేనే మీ పరిధిలో మీరు అప్రూవల్ ఇవ్వండి. 

వృషభం (Tarus) –  కొత్త ఉద్యోగం, క్లయింట్స్‌తో చర్చలు.. మొదలైన విషయాల వల్ల మీకు సమయమే తెలీడం లేదు. తొలుత మీరు చేస్తున్న పని కష్టంగా అనిపించినా.. ఆ తర్వాత అలవాటైపోతుంది. మీ పనిని మీరు ఎంజాయ్ చేయడం మొదలుపెడతారు. 

ADVERTISEMENT

మిథునం (Gemini) –  మీరు ఈరోజు ఏ పని చేసినా ఇతరులను ఫాలో అయిపోవడం మంచిది. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి అంతగా వర్కవుట్ అవ్వకపోవచ్చు. అయితే ఇది కేవలం ఒకానొక దశలో మాత్రమే అని గుర్తుంచుకోండి.

కర్కాటకం (Cancer) –  పని విషయంలో మీరు ఇతరుల నుంచి స్పష్టత రావాలని వేచి చూస్తున్నారు. ఫలితంగా పని నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ఈమెయిల్స్, ఫోన్ కాల్స్‌తోనే మీరు పని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవే కాదు.. త్వరలోనే మీరు మరిన్ని ప్రాజెక్ట్స్ చేపట్టనున్నారు. ఇవి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. అందుకే ప్రణాళిక బద్ధంగా మీరు వ్యవహరిస్తే.. అన్ని సమస్యలూ సర్దుకుంటాయి.

సింహం (Leo) – పని ప్రదేశంలో ఈ రోజు మీరు ఛార్జ్ తీసుకోవడమే కాదు.. చక్కని వ్యవస్థకు పునాది కూడా వేస్తారు. సహచరుల విషయంలో మొదట కాస్త గందరగోళంగా అనిపించినా.. మీకు తర్వాత స్పష్టత వస్తుంది. మీపై మీరు పూర్తి నమ్మకం కలిగి ఉండండి.

క‌న్య (Virgo) – మీరు మీ అనుబంధాల విషయంలో ఒక స్పష్టతకు రావాల్సిన అవసరం ఉంది. మీ మనసులో ఉన్న ప్రేమను ఎదుటివారికి వ్యక్తీకరించే సమయం ఇది. కాబట్టి ముందు ఆ పనిలో ఉండండి. 

ADVERTISEMENT

తుల (Libra) –  పని విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం దగ్గరపడుతోంది. అందుకు మీరు సంసిద్ధులు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి ఇబ్బందులు ఎదురైనా.. ఏకాగ్రతతో పని చేయడం ద్వారా వాటిని సునాయాసంగా అధిగమించవచ్చు.

వృశ్చికం (Scorpio) –  పని ప్రదేశంలో ఈ రోజు మీకు చాలా సర్ ప్రైజ్‌లు ఎదురుకానున్నాయి. అయితే మీ రోజంతా పనిలోనే గడిచిపోయేలా చేయకండి. అలాగే మీ కమ్యూనికేషన్‌లో స్పష్టత ఉండేలా చూసుకోండి. కుటుంబ సభ్యుల కోసం కూడా సమయం కేటాయించండి.

ధనుస్సు (Saggitarius) –  నిర్ణయాలు తీసుకోవడంలో ఇతరులు చేసే జాప్యం కారణంగా పనిలో కూడా ఆలస్యం కావచ్చు. కొత్త ఉద్యోగం లేదా పదవి కోసం ఎదురుచూసే వారికి ఒక స్పష్టత వస్తుంది. అయితే ఫలితాలు వచ్చేందుకు మాత్రం సమయం పడుతుంది. కుటుంబ సభ్యులకు ఎమోషనల్‌గా మీ సహకారాన్ని అందించండి.

మకరం (Capricorn) – మీరు చేసే ప్రతి పనికీ మీ దగ్గర ఒక వివరణ ఉంటుంది. పని విషయంలో మరింత హుందాగా వ్యవహరిస్తారు. సమావేశాల్లో జరిగే జాప్యం కారణంగా మీ పెండింగ్ పనులను కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే మరీ ఎక్కువ సమయం పని చేసినా ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించండి.

ADVERTISEMENT

కుంభం (Aquarius) – ఎవరో చేసిన తప్పుకు పనిలో మీరు బాధ్యత వహించాల్సి రావచ్చు. చేసే పనుల్లో జాప్యం జరగడం, నిరాశ.. వంటివి ఎదురుకావచ్చు. కానీ ఏది ముఖ్యమో దానిపైనే ఫోకస్ చేయండి. నిరాశ చెందకుండా పాజిటివ్‌గా ఆలోచిస్తూ పని చేయండి.

మీనం (Pisces) – మీరు గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు బాధ్యత వహించాల్సి రావచ్చు. ఫలితంగా కొత్త పనులకు సంబంధించి మీరు సలహాలు ఇచ్చినా.. మీ సీనియర్స్ వాటిని పరిగణనలోకి తీసుకున్నా మీకు తగిన గుర్తింపు రాకపోవచ్చు.

Credit: Asha Shah

ఇవి కూడా చ‌ద‌వండి

ADVERTISEMENT

మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా..!

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

01 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT