నేటి రాశిఫలాలు చదవండి.. మీ సమస్యలను సులభంగా పరిష్కరించుకోండి

నేటి రాశిఫలాలు చదవండి.. మీ సమస్యలను సులభంగా పరిష్కరించుకోండి

ఈ రోజు (మే 14) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – ఈ రోజు ఏ పని చేపట్టినా సూపర్ పాజిటివ్‌గా జరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నిస్తారు. అయితే కుటుంబ సభ్యుల మధ్య జరిగే వాగ్వాదాలు, గొడవల కారణంగా కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ రోజు బాగానే గడుస్తుంది.


వృషభం (Tarus) – ఈ రోజు మీరు రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారు. మీ బుర్రలో ఎన్నో క్రియేటివ్ ఆలోచనలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ మీరు ఆచరణలో పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. అలాగే మీ ఆర్థిక అంశాలను కూడా ఒకసారి సరిచూసుకోండి. కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇవ్వండి.


మిథునం (Gemini) – ఈ రోజు మీ ఆరోగ్యంతో పాటు కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇవ్వండి. మీ సన్నిహితులతో ఏర్పడిన మనస్పర్థలు, వివాదాలను పరిష్కరించుకొనేలా మీ వంతు ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకూ సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకొనేలా ఆలోచించండి.


కర్కాటకం (Cancer) – ఈ రోజు మీకు తీరిక లేనట్లుగా అనిపించవచ్చు. అలాగే చేసే పనిపై దృష్టి పెట్టడం కూడా చాలా కష్టమనిపిస్తుంది. ఈ సమస్యల నుండి తప్పించుకోవాలని మీకు అనిపించవచ్చు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడినా అది ఎదుటివారికి సవ్యంగా అర్థం కాని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ కారణంగా మీరు ఇతరులతో మాట్లాడాలని కూడా అనుకోరు.


సింహం (Leo) – ప్రస్తుతం మీరు చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారు. అయితే అనుకోకుండా ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అందుకే రుణాలు ఇచ్చేటప్పుడు, తీసుకొనేటప్పుడు వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఎన్ని సమస్యలు ఉన్నా.. మీ భాగస్వామితో గడిపేందుకు కాస్త సమయం కేటాయించుకోండి. మీ వ్యక్తిగత జీవితాన్ని.. ఉద్యోగ జీవితంతో ముడిపెట్టవద్దు.


క‌న్య (Virgo) – మీరు ఈ రోజు కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పని కాస్త నిదానంగా జరగవచ్చు. కానీ వ్యక్తిగత జీవితాన్ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాల్సి ఉంది. అలాగే మీ ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇప్పటి నుండే ప్రణాళికలు రచించండి. ఈ విషయంలో మీ కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకోండి.


తుల (Libra) – మీ ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. మీ గురించి మీ కుటుంబ సభ్యులు ఆలోచించడమే కాదు.. వారి వంతుగా చేయదగ్గ సహాయం కూడా చేస్తారు. ఇప్పటి పరిస్థితుల్లో.. మీరు మీ శరీరానికి తగినంత విశ్రాంతి అందించడం కూడా ముఖ్యమే. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి.


వృశ్చికం (Scorpio) – మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన సమయం ఇది. గతంలో జరిగిన ఒక పొరపాటుని అంగీకరించేందుకు మీరు గత కొద్ది రోజులుగా వెనకాడుతున్నారు. దానిని అంగీకరించేందుకు ఇదే సరైన సమయం అని భావించండి. అలాగే వివేకంతో, బాగా ఆలోచించి మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి.


ధనుస్సు (Saggitarius) – మీరు చేసే పనిలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కానీ కొత్త వెంచర్స్ గురించి ఆలోచనలు చేస్తే మంచిది. అదేవిధంగా, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇచ్చే సూచనలు, సలహాలు మీకు బాగా ఉపకరిస్తాయి. చివరి నిమిషంలో మీ ప్రణాళికలో మార్పులు జరగచ్చు. ఇతరుల పని బాధ్యతలు కూడా మీరే తీసుకోవాల్సి రావచ్చు.


మకరం (Capricorn) – మీరు ఈ రోజు రిలాక్స్ కావడం చాలా మంచిది. అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురికాకండి. అన్నీ సక్రమంగా జరుగుతాయి. మీ సమస్యల్ని మీరే పెద్దవి చేసుకోకండి. మీరు ప్రేమించేవారి సలహా తీసుకోండి.


కుంభం (Aquarius) – మీరు ఈ రోజు చేసే పని కాస్త వేగం పుంజుకుంటుంది. అలాగే రిస్క్ తీసుకునేందుకు కూడా మీరు ముందుంటారు. మీ సహచరులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుని తమ వంతు సహకారం అందిస్తారు. అలాగే పాత స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబ జీవితం కూడా సాఫీగా సాగుతుంది.


మీనం (Pisces) – మీ చుట్టూ జరిగే విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవడం ఆపేయండి. అలాగే చేసే పని మీదే పూర్తి ఏకాగ్రతను పెట్టండి. లేదంటే పనులు అనుకున్న సమయానికి పూర్తి అయ్యే అవకాశాలు తగ్గుముఖం పడతాయి. 


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


మీ రాశిఫలాలు వీక్షించండి.. వివేకంతో నిర్ణయాలు తీసుకోండి..!


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?


ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం