నేటి రాశిఫ‌లాలు చదవండి.. మీ సమస్యలను సులభంగా పరిష్కరించుకోండి..

నేటి రాశిఫ‌లాలు చదవండి.. మీ సమస్యలను సులభంగా పరిష్కరించుకోండి..

ఈ రోజు (మే 24) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – ఒకసారి ఒక పని చేస్తే మీరు దానిపైనే ఫోకస్ అంతా పెట్టాల్సి ఉంటుంది. అలాకాకుండా పని గురించి ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పనిలో మీరు ఛార్జ్ తీసుకోవాల్సిన సమయం ఇది. స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం వల్ల కుటుంబ సభ్యుల్లో ఒకరు బాధపడచ్చు.


వృషభం (Tarus) – చేసే పనిలో పెద్దగా మార్పు ఉండదు. కానీ ఒక కొత్త డీల్ లేదా కాంట్రాక్ట్ లేదా ఆర్డర్ పై మీరు సంతకం పెడతారు. మీ ఆర్థిక వ్యవహారాలను సరిచూసుకోండి. కుటుంబపరమైన ఒత్తిళ్లు కాస్త ఎక్కువగా ఉండచ్చు.


మిథునం (Gemini) – పని విషయంలో అంతా బాగానే ఉన్నా.. ఆర్థిక వ్యవహారాల కారణంగా మీరు అంత సంతోషంగా ఉండకపోవచ్చు. పని ప్రదేశంలో ఎవరితోనూ గొడవపడకండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వాగ్వాదాలకు కూడా దిగకండి. స్నేహితులతో సమయం గడపడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు.


కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు అనుకున్న విధంగానే పని ముందుకెళ్తుంది. అంతేకాదు.. ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశాల కోసం మీరు ఎదురుచూస్తున్నట్లైతే ఈ విషయాల్లో మీకు ఓ స్పష్టత వస్తుంది. క్రియేటివ్ లేదా మీడియా రంగంలో పని చేసేవారికి ఈ రోజు నుంచి అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో మీ గురించి మీరు శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.


సింహం (Leo) – పనిలో మీ కష్టాన్ని అధికారులు గుర్తించే అవకాశాలున్నాయి. అంతేకాదు.. మీరు ఇచ్చే కొత్త ఐడియాలకు ఇతరులు సహాయసహకారాలు కూడా అందిస్తారు. అయితే ఆర్థిక వ్యవహారాల విషయంలో అనవసర ఖర్చులు ఎక్కువ లేకుండా జాగ్రత్తపడడం మంచిది.


క‌న్య (Virgo) – పని విషయంలో మీరు తీసుకోవాల్సిన స్టెప్ గురించి సీనియర్స్ నుంచి సలహా తీసుకుంటారు. ఓ కొత్త ఉద్యోగం లేదా బాధ్యత మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. అయితే మీ వ్యక్తిగత విషయాల గురించి ఆఫీసులో ఎవ్వరితోనూ చర్చించకండి. మంచి స్నేహితులతో సమయం గడపండి.


తుల (Libra) – రోజులో మొదటి సగభాగంలో పని బాగా జరుగుతుంది. కానీ ఇతరుల కారణంగా మిగతా సగభాగం పని సక్రమంగా జరగకపోవచ్చు. పెండింగ్‌లో ఉన్న పని అలానే ఉండిపోతుంది. ఈ కారణంగా ఆఫీసులో ఎవ్వరితోనూ గొడవపడకండి. అలాగే పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు నేడు తీసుకోవద్దు. ముందు కుటుంబ సమస్యలను పరిష్కరించుకోండి.


వృశ్చికం (Scorpio) – మీకు, ఇతరులకు మధ్య అపార్థాలు తలెత్తేలా కొన్ని సంఘటనలు జరగవచ్చు. అయితే నిజం ఏంటన్నది క్రమంగా అందరూ తెలుసుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అనవసరంగా ఒత్తిడికి గురికాకండి. దాని కారణంగా మీ సంతోషమంతా ఆవిరైపోయే అవకాశాలున్నాయి. వీలైనంత వరకు కూల్‌గా ఉండేందుకు ప్రయత్నించండి.


ధనుస్సు (Saggitarius) – పని విషయంలో అంతా సక్రమంగానే జరుగుతున్నా.. పెండింగ్‌లో ఉన్న పేమెంట్స్ కారణంగా మీకు, క్లయింట్స్‌కి మధ్య చికాకులు తలెత్తవచ్చు. అలాగే మీ భాగస్వామితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలున్నాయి. వాటిని నిశ్శబ్దంగా, నిదానంగా పరిష్కరించుకోండి.


మకరం (Capricorn) – పెండింగ్‌లో ఉన్న పనంతా పూర్తి చేయడం వల్ల పనిలో ఉత్పాదకత బాగానే కనిపిస్తుంది. అయితే పనిలో కొత్త డెవలప్ మెంట్ జరగడానికి మీరు కూడా కాస్త కష్టపడాల్సి ఉంటుంది. అయితే మీకున్న ఆలోచనలు ఇతరులకు చెప్పి వాటికి అంగీకరించేలా వారిని ప్రోత్సహించాల్సి ఉంటుంది.


కుంభం (Aquarius) – మీరు చాలా ఎక్కువ ఫోకస్‌తో పని చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత పక్కాగా ప్రణాళిక రూపొందించినా దానిని అమల్లో పెట్టడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది.  అయితే కళ్లకు మరీ శ్రమ కలిగించకండి. మీ స్నేహితులని కలిసి వారితో కాస్త సమయం గడపండి.


మీనం (Pisces) – మీరు ఈ రోజు ఎమోషనల్‌గా, డల్‌గా ఉంటారు. మీ మనసులో ఉన్న అభద్రతాభావన మీ మాటలు, ప్రవర్తనపై ప్రభావం చూపిస్తుంది. అలాగే మీరు హాజరు కావాల్సిన శుభకార్యాలు ఉన్నప్పటికీ వాటికి హాజరయ్యేందుకు మీరు అంతగా ఆసక్తి చూపరు.


Credit: Asha Shah


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీక్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన వస్తువులను కొనేయండి


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ రోజు రాశిఫ‌లాలు చదవండి.. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి..!


ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ గమ్యాలను నిర్దేశించుకోండి


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?