నేటి రాశిఫ‌లాలు చదవండి.. మీ సమస్యలను సులభంగా పరిష్కరించుకోండి..!

నేటి రాశిఫ‌లాలు చదవండి.. మీ సమస్యలను సులభంగా పరిష్కరించుకోండి..!

ఈ రోజు (మే 29) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – మీరు కేవలం చేసే పని మీద మాత్రమే మీ ఏకాగ్రతను లగ్నం చేయండి. ఫలితంగా చేయాల్సిన పని ఎక్కువగా ఉన్నప్పటికీ.. మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అలాగైతే రోజు ముగిసే సమయానికి మీరు సాధించిన విజయాలను చూసి మీరు గర్వించే అవకాశం ఉంటుంది. 


వృషభం (Tarus) – మీరు చేపట్టిన పనులు సక్రమంగా జరుగుతున్నాయి కాబట్టి.. పనిలో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ ఆఫీసులో కొందరు వ్యక్తుల ప్రవర్తన కారణంగా మీకు కాస్త బాధ కలగవచ్చు. మీ అసౌకర్యాన్ని వారికి తెలియజేయాలని అనుకున్నా దానికి.. ఈ రోజు సరైంది కాదని తెలుసుకోండి. మీరు చేపట్టిన పని పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టి దానిని సక్రమంగా చేయండి.


మిథునం (Gemini) – ఈ రోజు మీరు చేయాల్సిన పని కాస్త నెమ్మదిగా జరుగుతుంది. అయితే కొత్త లావాదేవీలకు సంబంధించి మీకో స్పష్టత వస్తుంది. మీ తెలివితేటలను పనులు పూర్తి చేసేందుకు సక్రమంగా వినియోగించుకోండి. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కుటుంబ జీవితం సాఫీగానే సాగుతుంది. పలు వేడుకలకు మీరు తప్పక హాజరుకావాలని మీ స్నేహితులు మిమ్మల్ని బలవంతపెడతారు. వారితో సంతోషంగా గడపండి.


కర్కాటకం (Cancer) – మీరు కొన్ని పనులు ఆలస్యంగా చేయడం వల్ల.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆఫీసులో మీరు ఇతరులకు అప్పగించిన బాధ్యతలను మరోసారి సరిచూసుకొని అవసరమైతే మార్పులు చేయాలనుకుంటారు. ఈ విషయంలో ఎవరి మీదా మీ కోపాన్ని ప్రదర్శించకండి. మీ కుటుంబ సభ్యులు కూడా మీకు సహకరిస్తారు. వారి సలహాలను కూడా స్వీకరించండి.


సింహం (Leo) –  ఈ రోజు మీ పని సక్రమంగా జరుగుతుంది. కానీ మీ ఆర్థిక వ్యవహారాల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఈ రోజు జరిగే ఓ ముఖ్యమైన సమావేశం మీరు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. అయితే భవిష్యత్తులో మాత్రం ఈ పరిస్థితుల్లో మార్పు రావచ్చు. 


క‌న్య (Virgo) – మీరు ఎడతెరిపి లేని ఆలోచనలతో సతమతమవుతున్న కారణంగా.. పనిలో జాప్యం జరగవచ్చు. అయితేనేం.. మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీకో స్పష్టత వస్తుంది. ముఖ్యంగా ఈ రోజు మీ కుటుంబ విషయాలకు సంబంధించి.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. 


తుల (Libra) – గతంలో మీరు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా ఈ రోజు చేసే పనిలో జాప్యం జరగవచ్చు. దానికి ఇతరులను కారణంగా చేసి నిందించడాన్ని ఆపండి. మీరు కొత్త వ్యక్తులతో కలిసి పని చేయాల్సి రావచ్చు. అయితే వారిని పని విషయంలో ఎంత వరకు నమ్మచ్చనే విషయంలో మీకు స్పష్టత వస్తుంది. కాబట్టి నిదానంగా అడుగులు వేయండి. 


వృశ్చికం (Scorpio) – మీరు మీ రోజుని చాలా చక్కగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. మీరు సక్రమంగా వ్యవహరించని కారణంగా మీ చుట్టూ ఉన్నవారు కూడా కాస్త ఇరకాటంలో పడతారు.  పలు లావాదేవీలు సక్రమంగా జరిగినా.. టీమ్ అభిప్రాయలకు సంబంధించి ఎలాంటి స్పష్టత రాదు. కనుక వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. 


ధనుస్సు (Saggitarius) – మీరు ఈ రోజు చాలా వివేకంతో వ్యవహరించాల్సి ఉంటుంది. పని సక్రమంగా జరగని కారణంగా మీరు కాస్త మూడీగా ఉంటారు. అలాంటి పరిస్థితి ఎదురైతే.. మీ ప్రాధాన్యాలను ఒకసారి సరిచూసుకొని వాటికి అనుగుణంగానే పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో మీకు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తారు. అలాగే మీరు సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తారు.


మకరం (Capricorn) – మీరు ఇటీవలి కాలంలో చేపట్టిన పనుల్లో కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా సక్రమంగా సాగుతాయి. అయితే కుటుంబ వివాదాల విషయంలో కాస్త జాగ్రత్త వహించండి . గతంలో జరిగిపోయిన సంఘటనల గురించి.. వర్తమానంలో చర్చించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా ఇలా చేయడం వల్ల తర్వాత మీరే పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో వేసే ప్లాన్స్ కారణంగా.. ఈ  రోజు మీకు కాస్త బిజీగా ఉన్నట్లు అనిపిస్తుంది.


కుంభం (Aquarius) – ఈ రోజు మీరు చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి. కాబట్టి చెప్పింది చేయడానికే ప్రయత్నించండి. ఆ విధంగా మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోండి. లేదంటే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ ప్రవర్తనను తప్పుబట్టే అవకాశాలు లేకపోలేదు. అలాగే ఇతరులు ఇచ్చిన సలహాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.


మీనం (Pisces) – ఈ రోజు మీ సమయం చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. అన్ని పనులు మీకు అనుకూలంగానే జరుగుతాయి. అయితే ఇలాంటి సమయాల్లో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే బెటర్. అలాగే ఏ విషయంలోనూ మరీ మొండిగా వ్యవహరించకండి. అంతా మీ ప్రణాళిక ప్రకారం సక్రమంగా జరిగేలా చూసుకోండి


Credit : Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ రోజు రాశిఫ‌లాలు చదవండి.. మీ లక్ష్యాలు సాధించేందుకు బాటలు వేసుకోండి..


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?