ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ లక్ష్యాలను సునాయాసంగా సాధించండి

ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ లక్ష్యాలను సునాయాసంగా సాధించండి

ఈ రోజు (మే 3) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు మీ పనిపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి మీ టీంలో బాగా సీనియర్ వ్యక్తి సలహా తీసుకొని దానిని ఫాలో అవ్వండి. చేసే పనిని ఏకాగ్రతతో పూర్తి చేయండి. స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లి సమయం గడపడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.


వృషభం (Tarus) – ఆఫీసులోనైనా.. ఇంట్లోనైనా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. చిన్న చిన్న విషయాల్లో మీ కుటుంబ సభ్యులు లేదా టీం మేట్స్‌తో గొడవపడకండి. వీలైనంతవరకు పాజిటివ్‌గా ఆలోచించండి.


మిథునం (Gemini) – మీ రోజు నెమ్మదిగా ప్రారంభం అయినా.. పనులన్నీ క్రమంగా సర్దుకుంటాయి. అయితే ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా మీ ఏకాగ్రత దెబ్బతినవచ్చు. మీ కుటుంబ సభ్యులు మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు అవసరమైన స్పేస్ ఇస్తారు.


కర్కాటకం (Cancer) – ఈ రోజంతా మీకు ముఖ్యమైన సమావేశాలు, ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుస్తుంది. కొన్ని ముఖ్య విషయాలకు సంబంధించి మీరే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో ఇబ్బందిపడాల్సి ఉంటుంది.


సింహం (Leo) – ప్రస్తుతం మీరు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమైన విషయాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. అలాగే కొత్త ప్రాజెక్ట్స్, పనులను కూడా ప్రారంభించవద్దు. మీ మనసులో ఉన్న అభిప్రాయాలను స్పష్టంగా ఎదుటివారికి తెలియజేయండి.


క‌న్య (Virgo) – ఈ రోజు మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నప్పటికీ మీకు ఏమీ చేయాలని అనిపించకపోవచ్చు. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోలేరు. ఏ విషయాన్ని మీరు నియంత్రించాలని చూడకండి. పరిస్థితులు చేయి దాటిపోతాయి. ముఖ్యంగా మీ భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండండి.


తుల (Libra) – పని విషయంలో ప్రణాళికాబద్ధంగా ఎప్పుడు, ఏం చేయాలో మీకంటూ ఓ స్పష్టత ఉంది. దాని ప్రకారమే మీరు ముందుకు వెళ్తుంటారు. అయితే మీ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు మీకు ఇతరుల సహాయం కూడా అవసరం అవుతుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి మీ సహకారం అవసరం అవుతుంది.


వృశ్చికం (Scorpio) – ఈ రోజంతా మీరు చాలా బిజీగా గడపచ్చు. అయితే కుటుంబపరమైన ఇబ్బందుల కారణంగా మీపై ఉన్న విపరీతమైన ఒత్తిడి మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకుంటూనే ఏకాగ్రతతో పని చేయడానికి ప్రయత్నించండి.


ధనుస్సు (Saggitarius) – మీరు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఫలితంగా ఈ రోజంతా చాలా బిజీగా గడుస్తుంది. అలాగే మీకున్న కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ స్పష్టంగా ఉండేలా చూసుకోండి.


మకరం (Capricorn) – మీరు సమయానికి పని పూర్తి చేసినా సమావేశాల్లో జాప్యం జరిగే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించిన అవకాశాలు రావచ్చు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం గురించి విన్న వార్త కాస్త బాధను కలిగించవచ్చు.


కుంభం (Aquarius) – మీరు తీసుకున్న నిర్ణయాలు, మీకున్న ప్రణాళికలు మీకే గందరగోళంగా అనిపించవచ్చు. మీకున్న అసహనం, అభద్రత మీ పనిని ప్రభావితం చేయవచ్చు. మీ గురించి బాగా తెలిసిన వ్యక్తికి మీ పరిస్థితి గురించి వివరించి తగిన సలహా తీసుకోండి. ఎక్కువ ఒత్తిడికి గురికాకండి.


మీనం (Pisces) – మీరు చేస్తున్న పనికి తగిన ప్రతిఫలం, గుర్తింపు మీకు అందుతుంది. ఫలితంగా మీరు ఊహించని విధంగా ఆనందం మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. కనుక ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి.


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి - మీ సమస్యలకు సత్వర పరిష్కారాలను పొందండి..!


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా..!?


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?