పిరియడ్స్ సమయంలో.. అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ నుంచి ఏం ఆశిస్తారంటే..?

పిరియడ్స్ సమయంలో.. అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ నుంచి ఏం ఆశిస్తారంటే..?

పిరియడ్స్ (Periods).. ప్రతి అమ్మాయి జీవితంలో భాగం ఇవి. ప్రతి నెలా మనల్ని పలకరించే నెలసరి సమయంలో అమ్మాయిలు ఎదుర్కొనే ఇబ్బందులు ఎన్నెన్నో. చిరాకుగా అనిపించడం, కడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలెన్నింటితోనో బాధపడుతుంటారు అమ్మాయిలు.. ఇలాంటి సమయంలో తన భర్త లేదా బాయ్ ఫ్రెండ్ తనని కాస్త ప్రత్యేకంగా చూడాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అందుకే అబ్బాయిలకు ఓ సలహా. పిరియడ్స్ సమయంలో మీ భార్య లేదా గర్ల్ ఫ్రెండ్‌ని మీరు బాగా చూసుకుంటే చాలు.. వాళ్లకు మీ మీదున్న ప్రేమ రెట్టింపవుతుందన్నది నిజం.


పిరియడ్స్ సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ తనను ప్రేమగా చూసుకునేవారితో కలిసి ఉంటే ఈ నొప్పి చాలా వరకూ తగ్గిపోతుందని మీకు తెలుసా? ప్రేమలో ఉన్నప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్ల వల్ల ఈ నొప్పి తగ్గుతుంది. ఈ సమయంలో మీ గర్ల్ ఫ్రెండ్‌కి పంపించే మెసేజ్‌లతో (messages)  వారి మూడ్‌ని రిలాక్స్ అయ్యేలా చేయాలి. ఇలా చేయడం వల్ల వారు రిలాక్స్ అవ్వడంతో పాటు.. మీ ప్రేమ బంధం కూడా బలపడుతుంది. ఇలాంటి సమయంలో, మీరు ఎలాంటి మెసేజ్‌లు పంపాలో మీకు తెలుసా?


1. నీకిష్టమైన చాక్లెట్లు, చైనీస్ ఫుడ్ తీసుకొస్తున్నా.. ఇద్దరం కలిసి మంచి సినిమా చూద్దాం..


ఈ మెసేజ్ చూస్తే మీకు వారిపై ఎంత ప్రేమ ఉందో వారికి తప్పక అర్థమవుతుంది.


1-texts-girls-want-to-receive


2. నిన్ను ముద్దు పెట్టుకోవాలనుంది. వీలైనంత త్వరగా వచ్చేస్తా.


తన భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ అంటే ఎంత ప్రేమ.. ఆమెను ఎంత మిస్సవుతున్నాడో తెలియడానికి ఈ మెసేజ్ కంటే మరో నిదర్శనం కావాలా?


3-texts-girls-want-to-receive


3. నేను నీ గురించే ఆలోచిస్తున్నా..


భరించలేని నొప్పితో బాధపడుతోన్నా సరే.. ఈ మాట తన ముఖంలో నవ్వును తెప్పిస్తుంది.


4. నీకు షాపింగ్‌కి వెళ్లాలనిపిస్తోందా?


షాపింగ్ అంటేనే ప్రతి అమ్మాయి మూడ్ రిఫ్రెష్ అయిపోతుంది. మరింక తనకేం కావాలి?


5-texts-girls-want-to-receive


5. బేబీ.. ఈరోజు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీం తినాలనిపిస్తోంది?


ఐస్ క్రీం అంటే అమ్మాయిలందరికీ ఇష్టమే. అందుకే దీని ద్వారా కూడా మీ ప్రేమను చూపించొచ్చు.


6. వేడి నీళ్లు సిద్ధం చేసి పెట్టాను.


ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా.. మీరు శ్రద్ధ వహిస్తున్నారని తనకు అర్థం అవుతుంది.


7-texts-girls-want-to-receive


7. డిన్నర్ కోసం.. నీకు నచ్చిన వంటకాలు సిద్ధం చేస్తున్నా.


తనకు నచ్చిన వంటకాలు అదీ మీ చేతుల మీదుగా చేస్తే ఇంకెంత ఆనందంగా ఫీలవుతుందో కదా..


8. మందులు, ప్యాడ్స్ లాంటివి ఏమైనా కావాలా?


కేరింగ్‌లో ఇలాంటివి కూడా భాగమే కదా..


giphy %281%29


9. నాకు తెలిసిన అమ్మాయిలందరిలోనూ.. నువ్వు చాలా అందమైనదానివి..


పిరియడ్స్ సమయంలో అమ్మాయిలంతా ఎంతో చిరాగ్గా ఫీలవుతుంటారు. నువ్వు ఇప్పుడు కూడా అందంగా ఉన్నావు అంటూ పొగిడితే అమ్మాయిలు ఎంతో సంతోషంగా ఫీలవుతారు.


10. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. నువ్వు బాధపడకు..


సాధారణంగా పీరియడ్స్ సమయంలో పీఎంఎస్ వల్ల బాధపడే అమ్మాయిలకు ఈ మెసేజ్ చాలా ఆనందాన్ని, ధైర్యాన్ని అందిస్తుంది. వాళ్ల చిరాకును కూడా తగ్గిస్తుంది. 


9-texts-girls-want-to-receive


11. ఐ లవ్ యూ..


సందర్భం ఎలాంటిదైనా.. మూడ్ ఎలా ఉన్నా.. ఈ మూడు పదాలు అవతలి వ్యక్తి మూడ్‌ని ఇట్టే మార్చేసి వారి బుగ్గల్లో మెరుపును జోడిస్తుంది. అందుకే  వీలున్నప్పుడల్లా ఈ పదంతో మీ ప్రేమను చాటే ప్రయత్నం చేయండి. 


ఇవి కూడా చదవండి.


 పిరియడ్స్ సమయంలో నొప్పి తగ్గడానికి.. వివిధ దేశాల అమ్మాయిలు వాడే చిట్కాలివే


"కోపమా నాపైనా.. ఆపవా ఇకనైనా.." అనే ఫీలింగ్ తనకు కలిగేదెప్పుడు..?


బంధం బలపడేందుకు.. ఈ అడ్వెంచర్లు ఒక్కసారైనా చేయాల్సిందే..!