ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
హెచ్ఐవీ లైంగిక చ‌ర్య వ‌ల్ల మాత్ర‌మే రాదు.. అదొస్తే మ‌ర‌ణ‌మే శ‌రణ్యం కాదు..!

హెచ్ఐవీ లైంగిక చ‌ర్య వ‌ల్ల మాత్ర‌మే రాదు.. అదొస్తే మ‌ర‌ణ‌మే శ‌రణ్యం కాదు..!

హెచ్ఐవీ (HIV) .. అంటే హ్యూమ‌న్ ఇమ్యునో డెఫీషియ‌న్సీ సిండ్రోమ్‌..  ఈ మాట విన్న ప్ర‌తి ఒక్క‌రూ భ‌య‌ప‌డ‌తారు లేదా అస‌హ్యించుకుంటారు. ఇదో పెద్ద ఆరోగ్య స‌మ‌స్యే. కానీ హెచ్ఐవీ వ‌చ్చిందంటే త‌ప్ప‌నిస‌రిగా మ‌ర‌ణ‌మే శ‌రణ్యం మాత్రం కాదు. ఒక‌ప్పుడు మ‌న దేశంలో హెచ్ఐవీ గురించి మాట్లాడాలంటే అదేదో పాపంగా భావించేవారు. కానీ ప్ర‌స్తుతం రోజులు మారుతున్నాయి. ప్ర‌తిఒక్క‌రికీ ఆరోగ్యం ప‌ట్ల అవ‌గాహ‌న ఏర్ప‌డుతోంది. హెచ్ఐవీ గురించి కూడా ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. అవ‌గాహ‌న పెంచుకుంటున్నారు.

ఇలా అవ‌గాహ‌న పెర‌గ‌డం వల్ల వ్యాధి ఎక్కువ‌గా ప్ర‌బ‌ల‌కుండా ఉంటుంది. 19వ శ‌తాబ్దంలో మొద‌టిసారి జంతువుల్లో ఈ వ్యాధిని గుర్తించారు. ఆ త‌ర్వాత 1959లో కాంగోలోని ఓ వ్య‌క్తి ర‌క్త న‌మూనాల‌ను ప‌రిశీలించ‌గా అత‌డికి హెచ్ఐవీ సోకిన‌ట్లు తెలిసింది. అదే ప్ర‌పంచ చ‌రిత్ర‌లో నమోదైన మొద‌టి హెచ్ఐవీ కేసు. ఆ త‌ర్వాత ఎంతోమందికి ఈ వ్యాధి ప్ర‌బ‌లింది. అనంతరం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డిసెంబ‌ర్ 1 తేదిని ప్రపంచ ఎయిడ్స్ దినంగా జ‌రుపుతూ ఈ స‌మ‌స్య‌పై అంద‌రిలో అవ‌గాహ‌న పెంచడానికి సంకల్పించింది. 

కండోమ్ వాడాల‌ని, ఇత‌రుల‌కు ఉప‌యోగించిన సూదులు, ఇంజ‌క్ష‌న్లు వంటివి వాడ‌కూడ‌ద‌ని.. ఇలా WHO ప్రజలకు అవ‌గాహ‌న పెంచుతూ వ్యాధిని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తోంది. కానీ ఇంకా ఈ వ్యాధి గురించి చాలామందికి పూర్తిగా అవ‌గాహ‌న లేదు. అందుకే ఈ వ్యాధి ఎందుకు, ఎలా వ‌స్తుందో తెలుసుకోవ‌డంతో పాటు.. ఈ వ్యాధి వ‌స్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసుకొని దాని ప‌ట్ల అవ‌గాహ‌న పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. అందుకే ఈ ప్రత్యేక కథనం..

హెచ్ఐవీ అంటే ఏంటి?

ADVERTISEMENT

డాక్ట‌ర్లు ఏం చెబుతున్నారు

హెచ్ఐవీ ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయంటే..

హెచ్ఐవీ సోకే మార్గాలు

హెచ్ఐవీ వ్యాపించే మార్గాలు

ADVERTISEMENT

హెచ్ఐవీ గురించి ఉన్న అపోహ‌లు

ఎలాంటి సంద‌ర్భాల్లో హెచ్ఐవీ వ‌చ్చే అవ‌కాశాలుంటాయి..

హెచ్ఐవీ పాజిటివ్ అని ఎలా తెలుసుకోవాలి?

హెచ్ఐవీ పాజిటివ్ అని తేలితే ఏం చేయాలి

ADVERTISEMENT

హెచ్ఐవీకి మందులు

Signs And Symptoms Of HIV hiv-3861572 960 720 6609718

హెచ్ఐవీ అంటే ఏంటి? (What is HIV?)

హెచ్ఐవీ సోకితే మ‌ర‌ణిస్తార‌ని తెలుసు. కానీ దీని గురించి చాలామందికి పూర్తిగా తెలీదు. హెచ్ఐవీ సోకిన వాళ్లు ఈ స‌మ‌స్య ద్వారా మ‌రణించ‌రు. హెచ్ఐవీ వ‌ల్ల మ‌న రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ చాలా బ‌ల‌హీనంగా మారుతుంది. హెచ్ఐవీ అంటే హ్యూమ‌న్ ఇమ్యూనో డెఫీషియ‌న్సీ వైర‌స్. ఇది మ‌న శ‌రీరంలో ప్ర‌వేశించి రోగ నిరోధ‌క శ‌క్తిపై ప్ర‌భావం చూపి దాన్ని బ‌ల‌హీనంగా మారుస్తుంది. దీని వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదురై.. మ‌నం ఆ స‌మ‌స్య‌ల వ‌ల్ల మ‌ర‌ణించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.  హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్య‌క్తి నుంచి ర‌క్తం ద్వారా ఇత‌రుల‌కు ఇది సంక్ర‌మిస్తుంది. 

Signs And Symptoms Of HIVaids-108235 960 720 2879823

హెచ్ఐవీ సోకిన త‌ర్వాత చికిత్స తీసుకోక‌పోతే అదే ఎయిడ్స్‌‌గా (Aids) రూపాంత‌రం చెందుతుంది. అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియ‌న్సీ సిండ్రోమ్ అనే ఈ స‌మ‌స్య‌కు చేరుకున్న‌వారికి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ చాలా బ‌ల‌హీనంగా మారి.. ఇత‌ర స‌మ‌స్య‌ల‌న్నీ ఎదుర‌వుతాయి. ఈ దశ హెచ్ఐవీ బారిన ప‌డినా గుర్తించ‌కుండా 7, 8 సంవ‌త్స‌రాలు అలాగే ఉండిపోతే.. ఈ స్థాయికి చేరుకుంటారు.

Signs And Symptoms Of HIV drugs-20250 960 720

ADVERTISEMENT

డాక్ట‌ర్లు ఏం చెబుతున్నారు? (What Do The Doctors Say?)

హెచ్ఐవీ వ‌స్తే అక్క‌డితో జీవితం అంత‌మైపోతుంద‌ని చాలామంది భావిస్తారు. కానీ ఇది పూర్తిగా నిజం కాద‌ని వైద్యులు చెబుతున్నారు. స‌రైన చికిత్స తీసుకొని మందులు వాడుతూ రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా మార‌కుండా కాపాడుకుంటే చాలు.. ఇత‌ర వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉండొచ్చు. సాధార‌ణంగా ఎయిడ్స్ (AIDS) వ్యాధి వ‌చ్చిన వ్య‌క్తికి యాంటీ రిట్రోవైర‌ల్ థెర‌పీ ద్వారా ట్రీట్‌మెంట్ అందించ‌క‌పోతే అత‌డు దాదాపు ఒక సంవ‌త్స‌రం పాటు జీవిస్తాడు.

అదే యాంటీ రిట్రోవైర‌ల్ థెర‌పీ తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండ‌డం వ‌ల్ల.. జీవితకాలం దాదాపు ప‌ది నుంచి ఇర‌వై ఏళ్ల వ‌ర‌కూ పెంచుకునే వీలుంటుంది. అయితే హెచ్ఐవీని త‌గ్గించేందుకు ఎలాంటి మందులూ లేవు. కాబ‌ట్టి ఈ వ్యాధి సోకిన వారు జీవితాంతం ఈ యాంటీ రిట్రోవైర‌ల్ మందులు వాడుతూనే ఉండాలి.

Signs And Symptoms Of HIV hiv3

హెచ్ఐవీ ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయంటే.. (Symptoms OF HIV)

హెచ్ఐవీ సోకిన త‌ర్వాత అది శ‌రీర‌మంతా వ్యాపించి.. ల‌క్ష‌ణాలు కనిపించ‌డానికి చాలా స‌మ‌య‌మే ప‌డుతుంది. క‌నీసం ఆరు నెల‌ల నుంచి రెండేళ్ల వ‌ర‌కూ ఈ స‌మ‌స్య బ‌య‌ట‌ప‌డేందుకు స‌మ‌యం ప‌డుతుంది. ఎందుకంటే ఇది ఒక వ్యాధి కాదు. ఇది మ‌న రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసే ఓ వైర‌స్ మాత్ర‌మే. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని త‌గ్గించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం ఇత‌ర వ్యాధుల బారిన ప‌డుతుంది. ఆ వ్యాధులతోనే మ‌ర‌ణించే అవ‌కాశం ఉంటుంది. అంతేకానీ.. హెచ్ఐవీ వ‌ల్ల‌ మ‌ర‌ణించినవారు ఎవ‌రూ లేరు. ఇది బ‌య‌ట‌ప‌డేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఇది కూడా ఒక ర‌క‌మైన వైర‌స్ కాబ‌ట్టి.. ముందుగా ఫ్లూ వైర‌స్ మ‌న శ‌రీరంలో అడుగుపెడితే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో ఇక్క‌డా అవే క‌నిపిస్తుంటాయి.

గొంతులో మంట‌ (Flame In The Throat)

సాధార‌ణంగా గొంతులో మంట‌గా అనిపించిన‌ప్పుడు ఏదైనా ఆహారం తీసుకోవ‌డం లేదా నీళ్లు తాగ‌డం వంటివి చేస్తే అది త‌గ్గిపోతుంది. కానీ హెచ్ఐవీ సోకినవారిలో ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించి.. ఏం చేసినా ఆ స‌మ‌స్య అంత త్వ‌ర‌గా త‌గ్గ‌దు.

ADVERTISEMENT

పొడి ద‌గ్గు (Dry Cough)

చాలారోజుల నుంచి త‌గ్గ‌కుండా పొడిద‌గ్గు వేధిస్తుంటే.. దాని గురించి ఓసారి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. హెచ్ఐవీ సోకిన‌వారిలోనూ రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గి టీబీ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తే ప్ర‌మాదం ఉంది. కొంద‌రికి ఎక్కువ ద‌గ్గు లేక‌పోయినా క‌ఫం ఎక్కువ‌గా వ‌స్తుంటుంది. నోరు రుచి తెలియ‌కుండా మారిపోతుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మిగిలిన ప‌రీక్ష‌ల‌తో పాటు హెచ్ఐవీ ప‌రీక్ష కూడా చేయించుకోవ‌డం మంచిది.

వాంతులు (Vomiting)

ఎప్పుడూ వాంతి వ‌స్తున్న‌ట్లుగా అనిపించ‌డం, భోజ‌నం చేయ‌గానే తిన్న‌దంతా వాంతి అయిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లుంటే హెచ్ఐవీ ప‌రీక్ష కూడా ఓసారి చేయించుకోవ‌డం మంచిది.

చాలా అల‌స‌ట‌గా ఉండ‌డం (Tiredness)

హెచ్ఐవీ వ‌ల్ల మ‌న రోగ‌నిరోధ‌క శ‌క్తి చాలా త‌గ్గుతుంది. అందుకే ఏ ప‌నీ చేయ‌క‌పోయినా రోజంతా అల‌స‌ట‌గా అనిపిస్తుంటుంది. ఏ ప‌నీ చేయ‌బుద్ధి కాదు. రోజంతా ప‌డుకొనే ఉండాల‌నిపిస్తుంటుంది.

కండరాలు ప‌ట్టేసిన‌ట్లుగా ఉండ‌డం (Muscle Tone)

పెద్ద పెద్ద వ‌స్తువులు ఎత్తిన‌ప్పుడు లేదా వ్యాయామం చేసిన‌ప్పుడు  మ‌న‌కు కండ‌రాలు  ప‌ట్టేసిన‌ట్లుగా అనిపించ‌డం స‌హ‌జం. కానీ ఇవేవీ చేయ‌కుండానే రోజూ.. ఇలాగే కండ‌రాలు ప‌ట్టేసిన ఫీలింగ్ ఉంటే మాత్రం వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం మంచిది.

ADVERTISEMENT

త‌ర‌చూ జ్వ‌రం రావ‌డం (Frequent Fever)

జ్వ‌రం రావ‌డం అన్న‌ది ప్ర‌తి మ‌నిషికి స‌హ‌జం. మ‌న శ‌రీరంలోకి ఏదైనా ఇత‌ర వైర‌స్ లేదా బ్యాక్టీరియా ప్ర‌వేశించిన‌ప్పుడు దాని నుంచి మ‌న‌ల్ని కాపాడేందుకు మ‌న శ‌రీరం సృష్టించే ప్ర‌క్రియ‌ల్లో ఇదీ ఒక‌టి. అయితే అప్పుడ‌ప్పుడూ కాకుండా త‌ర‌చూ జ్వ‌రం వ‌స్తూ సాధార‌ణం కంటే ఎక్కువ‌గా అంటే కనీసం ఓ వారం, ప‌దిరోజులు ఉంటుంటే హెచ్ఐవీ ఉందేమోన‌ని అనుమానించాల్సి ఉంటుంది.

బ‌రువు త‌గ్గ‌డం (Weight Loss)

హెచ్ఐవీతో బాధ‌ప‌డుతుంటే రోగ నిరోధక వ్య‌వ‌స్థ ప‌నితీరు మాత్ర‌మే కాదు.. బ‌రువు కూడా వేగంగా త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. మీరు బ‌రువు త‌గ్గేందుకు ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌కుండానే.. మీ బ‌రువు క‌నీసం ప‌దిశాతం త‌గ్గితే.. త‌ప్ప‌నిస‌రిగా ప‌రీక్ష‌లు చేసి హెచ్ఐవీ ఉందా? లేదా? అని చెక్ చేసుకోవాల్సిందే. 

శ‌రీరంపై నీలం రంగు చార‌లు (Blue Stirpes On Body)

శ‌రీరంపై నీలం రంగు చార‌లుంటే చాలామంది ఆ విష‌యాన్ని చిన్న అంశంగా భావించి వ‌దిలేస్తుంటారు. కానీ ఇది మీరు అనుకున్నంత సాధారణ‌మైన విష‌య‌మేమీ కాదు. అందుకే మీ ఒంటిపై ఇలాంటివి క‌నిపించిన‌ప్పుడు వెంట‌నే డాక్ట‌ర్‌ని సంప్ర‌దించ‌డం మంచిది. 

Signs And Symptoms Of HIV hiv5

హెచ్ఐవీ తీవ్రమైతే ఉండే ల‌క్ష‌ణాలు (Other Symptoms)

చ‌లిజ్వ‌రం

ADVERTISEMENT

విరేచ‌నాలు

చ‌ర్మ స‌మ‌స్య‌లు

ఆక‌లి త‌గ్గిపోవ‌డం

రాత్రి చెమ‌ట‌లు ఎక్కువ‌గా ప‌ట్ట‌డం

ADVERTISEMENT

గ‌డ్డ‌లు ఏర్ప‌డ‌డం

హెచ్ఐవీ సోకే మార్గాలు (Causes Of HIV)

హెచ్ఐవీ సోక‌డానికి కేవ‌లం కొన్ని మార్గాలు మాత్ర‌మే ఉంటాయి. ఎందుకంటే ఈ వైర‌స్ చాలా బ‌ల‌హీన‌మైంది. మ‌న శ‌రీరంలోనే ఇది జీవించ‌గ‌ల‌దు. కానీ శ‌రీరానికి బ‌య‌ట నిమిషం కూడా జీవించ‌లేదు. అందుకే వ్యాధి సోకిన ర‌క్తం లేదా ఇత‌ర శ‌రీర ద్ర‌వాలు మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తే ఈ వైర‌స్ కూడా వాటితో క‌లిపి మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. హెచ్ఐవీ ఎలా సోకుతుందంటే..

అసుర‌క్షిత శృంగారం (Unprotected Sex) –

హెచ్ఐవీ పాజిటివ్‌ అయిన స్త్రీ లేదా పురుషుడితో అసుర‌క్షిత లైంగిక చ‌ర్య‌లో పాల్గొంటే ఈ వ్యాధి వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. మ‌న దేశంలో వ‌చ్చే హెచ్ఐవీ కేసుల్లో 86 శాతం ఇలాంటివే..

హెచ్ఐవీ పాజిటివ్ ర‌క్తం ద్వారా (Through HIV+ Blood)

హెచ్ఐవీ సోకిన వారి ర‌క్తాన్ని ఇత‌రుల‌కు ఎక్కించ‌డం ద్వారా ఈ వైర‌స్.. వారి శ‌రీరంలోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంటుంది. ఇలా 2.57 కేసుల్లో మాత్రం జ‌రుగుతోంది.

ADVERTISEMENT

సిరంజిల ద్వారా (Used Syringes)

హెచ్ఐవీ సోకిన వ్య‌క్తికి ఉప‌యోగించిన సిరంజి లేదా గ్లూకోజ్ వంటి ఇత‌రత్రా ప‌రిక‌రాల‌ను ఉప‌యోగించ‌డం ద్వారా కూడా ఈ వ్యాధి సోకే అవ‌కాశం ఉంటుంది. ఇలా 1. 97 శాతం మందికి ఈ వ్యాధి సోకింద‌ని అంచ‌నా.

హెచ్ఐవీ వ‌చ్చిన వ్య‌క్తి ఉప‌యోగించిన రేజ‌ర్ల ద్వారా (Through Shaving Razors)

హెచ్ఐవీ సోకిన వ్య‌క్తి ఉప‌యోగించిన రేజ‌ర్ వ‌ల్ల కూడా ఇది ఇత‌రుల‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. షేవింగ్ వంటి స‌మ‌యాల్లో ర‌క్తం అందులో ఉండిపోయి వెంట‌నే ఇత‌రులు ఉప‌యోగిస్తే వారికి ఈ వైర‌స్ సోకే అవ‌కాశం ఉంటుంది.

త‌ల్లి నుంచి గ‌ర్భంలోని బిడ్డ‌కి (Due To Pregnant Mother)

హెచ్ఐవీ సోకిన త‌ల్లి నుంచి గ‌ర్భంలోని బిడ్డ‌కు కూడా ఈ వ్యాధి సోకే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది.

హెచ్ఐవీ వ్యాపించే మార్గాలు (Ways Of Spreading HIV)

హెచ్ఐవీ ఓ ఆరోగ్య‌క‌ర‌మైన వ్య‌క్తికి ఇత‌రుల ర‌క్తం ద్వారా, వీర్యం లేదా యోని ద్ర‌వాల ద్వారా, త‌ల్లి పాల ద్వారా.. ఇత‌ర శ‌రీర ద్ర‌వాల ద్వారా వ్యాపించే వీలుంటుంది.

ADVERTISEMENT

హెచ్ఐవీ గురించి ఉన్న అపోహ‌లు (Myths About HIV)

హెచ్ఐవీ ఎయిడ్స్ పై మ‌న స‌మాజంలో ఎన్నో అపోహ‌లున్నాయి. అయితే కేవ‌లం శ‌రీర ద్ర‌వాల క‌ల‌యిక ద్వారా త‌ప్పితే ఇంకే ర‌కంగానూ ఈ వ్యాధి వ్యాపించ‌దు. ఈ వ్యాధి గురించి చాలా అపోహ‌లు సమాజంలో ఉన్నాయి. చ‌దువుకున్న వాళ్లు కూడా నిజాలని న‌మ్మేస్తున్నారు. అవి ఏంటో మనమూ తెలుసుకుందాం..

– హెచ్ఐవీ ఉన్న‌వారితో క‌లిసి ఉండ‌డం, వారి భోజ‌నం పంచుకోవ‌డం, వారు ఉప‌యోగించిన టాయిలెట్ వాడ‌డం వ‌ల్ల హెచ్ఐవీ సోకుతుంది.
– వారు మ‌న ప‌క్క‌నే కూర్చొని తుమ్మినా, వారితో క‌ర‌చాల‌నం చేసినా, వారు తాగిన గ్లాసు, తిన్న ప్లేట్ వంటివాటి ద్వారా కూడా హెచ్ఐవీ వస్తుంది.
– డెంటిస్ట్‌లు ప్ర‌తిఒక్క‌రికీ స్టెరిలైజ్ చేసిన కిట్‌ని మాత్ర‌మే ఉప‌యోగిస్తారు. అయితే ఈ త‌ర‌హా వాటి వ‌ల్ల కూడా ఎయిడ్స్ వ‌చ్చే ప్రమాదం ఉంటుంది.

– ట్యాటూలు వేయించుకోవ‌డం ద్వారా, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను కుట్టిన దోమ‌లు మనల్ని కుట్ట‌డం ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది.

ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. వీటిలో ఏమాత్రం వాస్తవం లేదని గ్రహించండి.

ADVERTISEMENT

Signs And Symptoms Of HIV  hiv4

ఎలాంటి సంద‌ర్భాల్లో హెచ్ఐవీ వ‌చ్చే అవ‌కాశాలుంటాయి.. (Who Are A Greater Risk Of HIV)

చాలామంది పై కార‌ణాల వ‌ల్లే హెచ్ఐవీ వ‌స్తుంద‌ని భావిస్తుంటారు. కానీ పలువురు వ్య‌క్తుల‌కు మాత్రం హెచ్ఐవీ వ‌చ్చే ముప్పు ఎక్కువ‌గా ఉంటుంది. వారెవ‌రంటే..

స్వ‌లింగ సంప‌ర్కులు (Homosexuals)

హెచ్ఐవీ కేవ‌లం ఆడ‌, మ‌గ క‌లిస్తేనే కాదు.. ఇద్ద‌రు స్వ‌లింగ‌సంప‌ర్కుల సంభోగం వ‌ల్ల కూడా ఈ వ్యాధి వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

సెక్స్ వ‌ర్క‌ర్లు (Sex Workers) 

ఎంత సుర‌క్షిత‌మైన మార్గాల‌ను అవ‌లంబించినా సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు, హెచ్ఐవీ వ‌చ్చే ముప్పు ఎక్కువ‌గానే ఉంటుంది. అప్పుడప్పుడూ వారు ఉప‌యోగించే కండోమ్ వూడిపోవ‌డం లేదా చిరిగిపోవ‌డం వంటివి జ‌రిగి వారికి స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌.

ADVERTISEMENT

మ‌హిళ‌లు (Women) – 

భ‌ర్త‌కు హెచ్ఐవీ వ‌చ్చింద‌ని తెలీక అత‌డితో క‌లిసి ఉండ‌డం వ‌ల్ల ఈ వ్యాధి బారిన ప‌డిన మ‌హిళ‌లు ఎంతోమంది ఉన్నారు.

యువ‌తీయువ‌కులు (Young people) – 

చాలామంది యువ‌తీయువ‌కులు త‌మ తోటివారి ప్ర‌భావం వ‌ల్ల సెక్స్ వ‌ర్క‌ర్ల‌తో అసుర‌క్షిత లైంగిక చ‌ర్య‌కు పాల్ప‌డుతూ ఉంటారు. ఇలాంటివారికి వ్యాధి వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. చాలామంది యువ‌తీయువ‌కులు డ్రగ్స్ బారిన ప‌డి ఇలాంటివాటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. వీరికి హెచ్ఐవీ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌.

హెచ్ఐవీ పాజిటివ్ అని ఎలా తెలుసుకోవాలి? (How to know That You Are HIV Positive?)

ఒకవేళ మీకు హెచ్ఐవీ ఉంద‌ని అనుమానంగా ఉంటే కొన్ని ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. అలా మీకు వ్యాధి ఉందా? లేదా? అనే విషయం తెలుసుకోవచ్చు. హెచ్ఐవీ కోసం ప్రాథ‌మికంగా ఎలిసా టెస్ట్ చేస్తారు. దీని ద్వారా హెచ్ఐవీ బారిన ప‌డితే మ‌న శ‌రీరం విడుద‌ల చేసే యాండీబాడీల‌ను గుర్తించి హెచ్ఐవీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. అయితే ఇందులో ముందుగానే స‌మ‌స్య గురించి తెలుసుకునే వీలుండ‌దు. ఇలాంట‌ప్పుడు కొన్నిరోజుల త‌ర్వాత మ‌ళ్లీ ప‌రీక్షించ‌డం లేదా ఎలిసాకి బ‌దులుగా.. వెస్ట్ర‌న్ బ్లాట్ ప‌రీక్ష చేయ‌డం మంచిది. ఒక‌వేళ మీకు హెచ్ఐవీ ఉంద‌ని తేలితే అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవ‌డానికి వైద్యులు వైర‌ల్ కౌంట్ ప‌రీక్ష‌ను చేసే అవ‌కాశాలుంటాయి.

Signs And Symptoms Of HIV hiv6

హెచ్ఐవీ పాజిటివ్ అని తేలితే ఏం చేయాలి? (What Should Be Done If You Are HIV Positive)

హెచ్ఐవీ వ‌చ్చింద‌ని తేల‌గానే జీవితం పూర్తిగా అయిపోయింద‌ని బాధ‌ప‌డుతూ కూర్చోవాల్సిన అవ‌స‌రం లేదు. ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న శైలి కొన‌సాగిస్తూ, మందులు వాడుతూ మీ జీవిత‌కాలాన్ని పెంచుకునే అవ‌కాశం ఉంటుంది. హెచ్ఐవీ మందులు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌లో ఉచితంగా ల‌భిస్తాయి. మీకు హెచ్ఐవీ ఉంద‌ని తేలితే

ADVERTISEMENT

– ధూమ‌పానం, మ‌ధ్య‌పానం చేయ‌కూడ‌దు.
– అసుర‌క్షిత శృంగార సంబంధాలు ఏర్ప‌ర్చుకోకూడ‌దు.
– మీ శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే ప్ర‌య‌త్నం చేయండి.
– స‌మయానికి మందులు వేసుకుంటూ ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించాలి.
– మంచి పోష‌కాలు నిండిన ఆహారం తీసుకోవాలి.
– రోజూ యోగా, ధ్యానం, వ్యాయామం లాంటివి చేస్తుండాలి.

హెచ్ఐవీకి మందులు (HIV Treatment )

హెచ్ఐవీని పూర్తిగా త‌గ్గించేందుకు మందులు లేవు. కానీ మ‌న రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రుస్తూ, హెచ్ఐవీ వైర‌స్‌ని పెర‌గ‌నీయ‌కుండా చేసే మందులు అందుబాటులో ఉన్నాయి. 1987లో హెచ్ఐవీ మొద‌టి కేసును గుర్తించిన రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కూ ఎంతో పురోగ‌తి సాధించినా.. హెచ్ఐవీని నిమిషాల్లో పరీక్షించే టెస్టులు అందుబాటులోకి వ‌చ్చినా.. దీన్ని పూర్తిగా తగ్గించేందుకు మందులు ఏమాత్రం రాలేద‌ని చెప్పుకోవాలి.

హెచ్ఐవీ బారిన ప‌డిన వాళ్లు ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండా ఆనంద‌మైన జీవితాన్ని గ‌డిపే వీలైతే ఉంది. కొన్ని ఆరోగ్య‌ స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయేమో కానీ.. ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని కొన‌సాగిస్తూ ఉంటే మాత్రం.. జీవించే వీలు కచ్చితంగా ఉందనే చెప్పాలి.

ఇవి కూడా చ‌ద‌వండి.

ADVERTISEMENT

బొప్పాయి మీకందించే.. బహుచక్కని ప్రయోజనాలేమిటో తెలుసా..?

గ్రీన్ టీ కేవ‌లం అందానికే కాదు.. ఆరోగ్యానికీ మంచిదే..!

హార్మోన్లు మీ బ‌రువును పెంచేస్తున్నాయా? ఇలా చేసి చూడండి..

Images : Shutterstock, pixabay

ADVERTISEMENT
17 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT