తొలిరాత్రిని బాగా ఎంజాయ్ చేయాలా?? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..

తొలిరాత్రిని బాగా ఎంజాయ్ చేయాలా?? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..

పెళ్లైన త‌ర్వాత జ‌రిగే తొలిరాత్రి (wedding night).. అదేనండీ.. శోభ‌నం గురించి ప్ర‌తి అమ్మాయికీ ఎన్నో భ‌యాలు, ఏవేవో సందేహాలు ఉండ‌డం స‌హ‌జ‌మే. అందుకే.. ఫ‌స్ట్ నైట్ అన‌గానే చాలామంది భ‌య‌ప‌డుతూ ఉంటారు. అయితే తొలిరేయి గురించి ఓవైపు ఎంత‌గా భ‌యం ఉంటుందో మ‌రోవైపు అంతే ఆత్రంగా కూడా అనిపిస్తుంటుంది.


ఆ మ‌ధుర‌మైన రేయిని ఎప్ప‌టికీ మ‌ర్చిపోకుండా ఉండేలా ఒక మ‌ధుర జ్ఞాప‌కంగా మార్చుకోవాల‌ని ప్ర‌య‌త్నించాల‌ని భావిస్తారు. కానీ తొలిరాత్రి భ‌ర్త‌తో క‌లిసి బాగా ఎంజాయ్ చేయాల‌న్నా లేక లైంగిక‌ప‌రంగా భ‌ర్త‌లో మ‌రింత కోరిక‌ను ర‌గిలించేలా చేయాల‌న్నా కొన్ని చిట్కాలు ఫాలో అయితే చాలు.


త‌ద్వారా తొలిరేయిని మ‌ధుర జ్ఞాప‌కంగా మ‌లుచుకోవ‌డం మాత్ర‌మే కాదు.. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ క‌లిసి శృంగారంలో మునిగి తేలుతూ స్వ‌ర్గ‌పు అంచుల‌ను తాక‌వ‌చ్చు. అలాంటి చిట్కాల్లో కొన్ని మీ కోసం..* మీ భ‌ర్తకే ఆ అవ‌కాశం ఇవ్వండి..
శృంగారంలో పాల్గొనే క్ర‌మంలో శ‌రీరంపై నూలుపోగు లేకుండా ఉండ‌డానికి కొంద‌రు దంప‌తులు ఇష్ట‌ప‌డుతుంటారు. ఒక‌వేళ మీరు కూడా ఈ కోవ‌కు చెందిన వ్య‌క్తులే అయితే తొలిరేయి నాడు.. మీ దుస్తులు తొల‌గించే అవ‌కాశాన్ని మీ భ‌ర్త‌కే ఇవ్వండి. ఎందుకు అని ఆలోచిస్తున్నారా?? పెళ్లి త‌ర్వాత మొద‌ల‌య్యే వైవాహిక జీవితంలో ఈ సంద‌ర్భం మీకు అనేక‌సార్లు ఎదురుకావ‌చ్చు.


కానీ పెళ్లి దుస్తుల‌లో మీరిద్ద‌రూ ఒక‌ట‌య్యే వేడుక మాత్రం ఒక్క‌సారే వ‌స్తుంద‌ని గుర్తుంచుకోండి. పెళ్లికూతురిగా.. అందాల భ‌రిణెలా మెరిసిపోయే మిమ్మ‌ల్ని, మీ అందాల‌ను ఆక‌ట్టుకునేలా ఉన్న లోదుస్తుల‌తో ఒక్క‌సారిగా చూస్తే ఇంకేముంటుంది.. మీ భ‌ర్త‌లో ఉన్న శృంగార‌ప‌ర‌మైన కోరిక‌లు రెట్టింపు కావాల్సిందే.. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి ఎంత‌గా ఎంజాయ్ చేస్తారో మీకే తెలుస్తుంది.


gif1


* కొవ్వొత్తులు వెలిగించండి..
సాధార‌ణంగా సినిమాల్లో తొలిరేయి స‌న్నివేశాలు చూసిన‌ప్పుడు ఆ గ‌దిలో కొన్ని క్యాండిల్స్ కూడా మ‌న‌కు క‌నిపిస్తుంటాయి. ఇవి గ‌దిలోని వెలుతురిని త‌గ్గించ‌డం ద్వారా ఆలుమ‌గ‌లిద్ద‌రికీ కావాల్సిన ప్రైవ‌సీని వారికందించ‌డ‌మే కాదు.. ప‌రిమ‌ళ‌భ‌రిత‌మైన సువాస‌న‌లు వెద‌జల్లుతూ వారిలోని లైంగిక‌ప‌ర‌మైన కోరిక‌ల‌ను రెట్టింప‌య్యేలా చేసేందుకు కూడా ఉప‌క‌రిస్తాయి. కాబ‌ట్టి ఈ చిట్కాను మీరు కూడా ప్ర‌య‌త్నించి చూడండి.


గ‌దిలో చ‌క్క‌ని ప‌రిమ‌ళాల‌ను వెద‌జ‌ల్లే రోజ్, మ‌ల్లె.. వంటి సెంటెడ్ క్యాండిల్స్‌ని వెలిగించి.. ఆ గ‌దిలో మీ భ‌ర్త‌తో క‌లిసి ఏకాంతంగా స‌మ‌యం గ‌డ‌పండి. ప్ర‌తిసారీ మీకో కొత్త అనుభ‌వంలా అనిపించ‌డం ఖాయం. అయితే ఇలాంటి సంద‌ర్భాల‌కు చ‌క్క‌గా స‌రిపోయే ‘Smells Like The First Kiss’ క్యాండిల్ POPxo Shopలో కూడా ల‌భ్య‌మ‌వుతోంది.


* ఇద్ద‌రూ క‌లిసి ఫ్రెష్ అవ్వండి..
పెళ్లి అంటేనే ఎన్నో వేడుక‌ల స‌మాహారం.. దానికి తోడు బంధుమిత్రుల స‌మ‌క్షంలో అంద‌రితోనూ మాట్లాడుతూ, స‌ర‌దాగా గ‌డుపుతూ ఉన్న‌ప్ప‌టికీ.. రాత్ర‌య్యేస‌రికి ఎక్క‌డ‌లేని అల‌స‌ట ఆవ‌హించ‌డం స‌హ‌జ‌మే. మ‌రి, ఇలా అల‌స‌ట‌తో ఉన్న స‌మ‌యంలోనే తొలిరాత్రి కూడా అంటే కాస్త క‌ష్ట‌మే.


అల‌స‌ట కార‌ణంగా దానిని స‌రిగా ఎంజాయ్ చేయ‌లేక‌పోవ‌చ్చు. కాబ‌ట్టి మీకు వీలైతే మీ భ‌ర్త, మీరు క‌లిసి ఫ్రెష్ అవుతూనే ఈ వేడుక‌ను జ‌రుపుకునేందుకు ప్ర‌య‌త్నించండి. అదేనండీ.. ఇద్ద‌రూ క‌లిసి స‌ర‌దాగా ట‌బ్ బాత్ లేదా బ‌బుల్ బాత్.. వంటివి చేస్తూనే మీ తొలిరాత్రి వేడుక‌ను జ‌రుపుకోండి. అయితే ఆ గ‌దిలో సెంటెడ్ క్యాండిల్స్ పెట్ట‌డం మాత్రం మ‌ర్చిపోకూడ‌దు.


gif2


* మ్యూజిక్ త‌ప్ప‌నిస‌రి..
పెళ్లి తంతుని ఎంత హ‌డావుడిగా ముగించినా తొలిరేయిని మాత్రం వీలైనంత ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో జరుపుకోవ‌డం చాలా మంచిది. అందుకే పెళ్లి పనుల్లో మీరు బిజీగా ఉన్న‌ప్ప‌టికీ మీకు బాగా న‌చ్చిన రొమాంటిక్ సాంగ్స్ క‌లెక్ష‌న్ మీ స్నేహితురాలికి ఇచ్చి దానిని ఒక సీడీ లేదా పెన్ డ్రైవ్ లోకి మార్చి ఇవ్వ‌మ‌ని చెప్పండి.


ఆ సీడీ లేదా పెన్ డ్రైవ్‌ని మీ వెంట పెట్టుకోవ‌డం ద్వారా మీ తొలిరేయి నాడు.. వాటిని వింటూనే ఒక‌రి ఒడిలో మ‌రొక‌రు ఒదిగిపోతూ సెక్స్‌ని మ‌రింత ఎంజాయ్ చేయ‌చ్చు. మీకు తెలుసా?? మ‌న మూడ్‌ని ప్ర‌భావితం చేయ‌డంలో సంగీతం చాలా కీల‌క‌మైన పాత్ర పోషిస్తుంది.


* చిలిపి బ‌హుమ‌తి..
తొలిరేయి నాడు నూత‌న దంప‌తులు కొంద‌రు బ‌హుమ‌తులు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. ఈ క్ర‌మంలో మీరిచ్చే బ‌హుమ‌తి కాస్త చిలిపిగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఉదాహ‌ర‌ణ‌కు కిస్సింగ్ లిప్స్ ఉన్న మొబైల్ ఫోన్ క‌వ‌ర్, సెక్స్‌కు సంబంధించిన ప‌ద‌జాలం ఉన్న టీ ష‌ర్ట్.. ఇలా ఏదైనా కావ‌చ్చు. అయితే మీరిలా ఇచ్చే బ‌హుమ‌తి ఇటు మీలోనూ, అటు మీ భ‌ర్త‌లోనూ లైంగిక‌ప‌ర‌మైన కోరిక‌ల‌ను క‌లిగించేదిగా ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డాల్సి ఉంటుంది.


* క‌లిసి చ‌ద‌వండి..
ప్రేమ‌, శృంగారానికి సంబంధించిన ఒక మంచి న‌వ‌ల ఎంపిక చేసుకొని దానిని మీ భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ క‌లిసి చ‌ద‌వ‌డానికి ప్ర‌య‌త్నించండి. ఇది కాస్త స‌మ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ మీ మ‌ధ్య కూడా చక్క‌ని బంధం పెన‌వేసుకునేలా చేస్తుంది. లేదా తొలిరేయి గురించి మీకు ఉన్న ఊహ‌లు, కోరిక‌ల గురించి మీరే ఒక కాగితంపై రాసి వాటిని మీ భ‌ర్త‌కు చ‌దివి వినిపించండి. తప్ప‌కుండా ఫ‌లితం క‌నిపిస్తుంది.


* ఆహారంతో మ‌రింత ర‌స‌వ‌త్తరంగా..
శృంగారం అంటే కేవ‌లం రెండు త‌నువుల క‌ల‌యిక మాత్ర‌మే కాదు.. అంత‌కుమించి ర‌తిక్రీడ ద్వారా రెండు మ‌న‌సుల‌ను పెన‌వేసే ఒక వేడుక కూడా. అందుకే దానిని సాదాసీదాగా కాకుండా కాస్త ఆస‌క్తిక‌రంగా మ‌లుచుకోగలిగితే అది దంప‌తులను మ‌రింత ద‌గ్గ‌ర చేస్తూనే తొలిరేయి ర‌స‌వ‌త్తరంగా సాగేలా చేస్తుంది. కాబ‌ట్టి మీకు ఎంతో ఇష్ట‌మైన చాక్లెట్, పాలు, తేనె.. ఇలా ఏదైనా స‌రే.. న‌చ్చిన ఫుడ్ ఐటెమ్‌ని కూడా మీ శృంగారంలో భాగం చేసుకుంటే స్వ‌ర్గ‌పు అంచుల‌ను తాక‌డం గ్యారంటీ..


gif4


ఇవండీ.. తొలిరేయి నాడు నూత‌న దంప‌తుల సిగ్గు, బెరుకును దూరం చేస్తూ.. వారిని మ‌రింత ద‌గ్గ‌ర చేసే కొన్ని చిట్కాలు. ఏం పెళ్లైన అమ్మాయిలు.. మీరూ వీటిని త‌ప్ప‌కుండా ప్ర‌య‌త్నిస్తారు క‌దూ!!


GIFs: Giphy, Tumblr


Featured Image: Shutterstock


ఇవి కూడా చదవండి


సెక్స్‌కు సంబంధించి.. కొత్త దంప‌తుల‌కు ఉండే సందేహాలు ఇవే..!


శృంగార‌ంలో.. "ఫోర్ ప్లే" చాలా ముఖ్యం.. ఎందుకంటే..?


మీ సెక్స్ మూడ్‌ని.. రొమాంటిక్‌గా మార్చే విషయాలివే..!