ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ సమస్యలను పరిష్కరించుకోండి

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ సమస్యలను పరిష్కరించుకోండి

ఈ రోజు (జూన్ 20) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – ఈ రోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాంతో కొంత అలసటకు గురవుతారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే, ఈ రోజు సాధ్యమైనంత వరకూ మీ భాగస్వామితో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. అలాగే వ్యాపారం, రాజకీయాలు మొదలైన విషయాల్లో కాస్త లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి లాభసాటిగా ఉన్నా.. రుణాలు ఇచ్చే విషయంలోనూ.. రుణాలు పొందే విషయంలోనూ కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి.  

వృషభం (Tarus) – ఈ రోజు మీరు పలు శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే డబ్బును సాధ్యమైనంత వరకూ ఆదా చేయడానికి ప్రయత్నించండి. పొదుపు మంత్రం పాటించండి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే, వైవాహిక సమస్యలు ఎన్ని ఉన్నా.. వాటిని సమయస్ఫూర్తితో, ఆత్మస్థైర్యంతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా కుటుంబ వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.   

మిథునం (Gemini) – ఈ రోజు మీకు మీ సోదరులు లేదా సోదరీమణుల నుండి సహాయం అందుతుంది. అలాగే మీరు చేసే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు లేదా వ్యాపార ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇక మీ వ్యక్తిగత జీవితానికి వస్తే, మీరు ఎవరినైనా ప్రేమిస్తే.. మీ మనసులో మాటను వారికి ధైర్యంగా చెప్పేయండి. దానికి ఇదే సరైన సమయం. అలాగే కొత్త ఆదాయ వనరులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కాకపోతే, ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ద చూపించండి. 

కర్కాటకం (Cancer) –  వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రోజు కొంత ప్రతికూలత కనిపిస్తుంది. అయినా భయపడాల్సిన పనిలేదు. నిజాయతీగా మీ పని మీరు చేయండి. ఇక ఉద్యోగస్తులు కూడా ఈ రోజు కొన్ని నెగటివ్ పరిస్థితులను చవిచూస్తారు. కనుక కాస్త జాగరూకతతో వ్యవహరించండి. ఇక కుటుంబ జీవితానికి వస్తే, ఈ రాశి వారికి ఈ రోజు కొంత పురోగతి కనిపిస్తుంది. కష్టాలలో ఉన్నవారికి.. వారి భాగస్వామి నుండి సరైన సమయంలో సపోర్టు అందుతుంది. 

సింహం (Leo) –  ఈ రోజు ఉద్యోగస్తులకు శుభదినం. జీతాలు పెరగడం, పదోన్నతులు లభించడం వంటివి జరుగుతాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి రోజే. కొత్త ఆదాయ వనరులు పెరగడం, పెట్టుబడికి తగ్గ ప్రయోజనాలు సిద్దించడం జరుగుతుంది. సృజనాత్మక రంగంలో పనిచేసే వారు.. కొత్త ఐడియాలకు శ్రీకారం చుడతారు. ఇక ఒక రకంగా మీకు మంచి బ్రేక్ ఇచ్చే సమయం. ఇలాంటి సమయాల్లోనే మీ విజయాన్ని మీ కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి. ముఖ్యంగా మీ భాగస్వామితో మీ ఆనందాన్ని పంచుకొని.. తనకు సమయం కేటాయించండి. 

క‌న్య (Virgo) –  ఈ రోజు మీకు చాలా జాగరూకతతో వ్యవహరించాల్సిన సమయం. నిర్లక్ష ధోరణిని వీడండి. లేదంటే కొన్ని మంచి అవకాశాలను  కోల్పోతారు. అలాగే వ్యాపార రంగంలోని వారికి కూడా ఈ రోజు గడ్డు కాలమే. అందుకే సాధ్యమైనంత వరకు కొత్త ఆర్డర్లు తీసుకొనే విషయంలో లేదా కొత్త  ప్రాజెక్టులకు నాంది పలికే విషయంలో కాస్త వివేకంగా ఆలోచంచండి. ప్రత్యర్థుల సవాళ్లను స్వీకరించడానికి సిద్దంగా ఉండండి. అందుకు వీలైతే మీ కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోండి. 

తుల (Libra) –  ఈ రోజు మీరు మీ భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. వీలైతే ఒక రోజు సెలవు పెట్టి పూర్తిగా తనతోనే గడపండి. ఇక మీ ఉద్యోగ జీవితానికి వస్తే.. మీరు జాబ్‌కు సంబంధించి మంచి విషయాలు వింటారు. అలాగే పలు మతసంబంధమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. 

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు మీ ఇంటికి అతిథులు వచ్చే అవకాశం ఉంది. మీ ఇల్లు మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండిపోతుంది. అయితే పలు కుటుంబ వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. సమయస్ఫూర్తితో ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇక మీ ఉద్యోగ జీవితానికి వస్తే.. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు పలువురు రాజకీయ నాయకులను లేదా సెలబ్రిటీలను మీరు కలిసే అవకాశం ఉంది. 

ధనుస్సు (Saggitarius) – పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి, విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. బాగా కష్టపడితే విజయం ఎంతో దూరంలో లేదనే విషయాన్ని మీరు నమ్మండి. అలాగే వ్యాపార రంగంలోని వారికి కూడా ఈ రోజు మంచి ఫలితాలే అందుతాయి. ఉద్యోగస్తులు మాత్రం కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆఫీసు పనులకు సంబంధించి కొన్ని సమస్యలున్నా.. ఆఖరికి వాటిని అధిగమించడం ద్వారా ప్రశంసలు పొందుతారు. ఇక కోర్టు కేసులు, తగాదాలు లాంటి వాటిలో చిక్కుకున్న వారి సమస్యలు కూడా ఈ రోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 

మకరం (Capricorn) – ఈ రోజు మీవస్తువులు లేదా డబ్బు చోరికి గురయ్యే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే మీ ఆర్థిక స్థితిగతులు కూడా అంత ప్రభావవంతంగా ఉండవు. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కొన్ని ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా ముఖ్యం. 

కుంభం (Aquarius) –  ఈ రోజు పలు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది. కనుక కాస్త ఉపశమనం పొందడానికి ప్రయత్నించండి. అలాగే ఈ రోజు మీ ఇంటికి పలువురు అతిథులు వచ్చే అవకాశం ఉంది. వారి రాక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే మీ కుటుంబ వాతావరణం కొంత ఆహ్లాదంగా మారుతుంది. అదేవిధంగా పలు విదేశీ యాత్రలు చేసేందుకు మీరు ఈ రోజు ప్రణాళికలు రచిస్తారు. 

మీనం (Pisces) –  ఈ రోజు మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. లేదా ఇదే కోపం మిమ్మల్ని అనుకోని చిక్కుల్లో పడేస్తుంది. అలాగే ఈ రోజు మీరు చాలా బిజీగా గడుపుతారు. కొన్నిసార్లు అసహనానికి కూడా గురవుతారు. ఇలాంటి సందర్భాల్లోనే వివేకంతో ఆలోచించాలి. స్నేహితులను శత్రువులుగా మార్చుకొనే బదులు.. మీరే కొన్ని విషయాలలో రాజీ పడాలి. అందుకే కాస్త లౌక్యంగా వ్యవహరించడానికి ప్రయత్నించండి. 

ఇవి కూడా చదవండి

ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.