ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ అదృష్ట రేఖను అనుసరించండి

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి..  మీ అదృష్ట రేఖను అనుసరించండి

ఈ రోజు (జూన్ 10) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) –  ఈ రోజు మీరు పని ఎంత బాగా చేసినప్పటికీ కూడా.. కొన్ని విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే ఆచి తూచి వ్యవహరించండి. అలాగే మీ కొలీగ్స్ సలహాలు తీసుకొనే విషయంలో కూడా.. నూటికి పదిసార్లు ఆలోచించండి. కెరీర్ ప్లానింగ్ చేసుకోవడంతో పాటు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఈ రోజు అనువైన సమయం. వృషభం (Tarus) –  ఈ రోజు మీరు చేసే ఏ పనైనా పూర్తి క్లారిటీతో చేయడం ఎంతైనా అవసరం. లేదంటే కొన్ని వివాదాలకు మీరే కేంద్ర బిందువు అవుతారు. అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించి, మీ కుటుంబంలో పలు మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. కనుక కాస్త వివేకంతో ఆలోచించి.. ఏ నిర్ణయమైనా తీసుకోండి. ఆస్తి లావాదేవీలు లేదా ఆర్థికపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు అనువైన రోజు. మిథునం (Gemini) –  ఈ రోజు మీకు పని విషయంలో పలు అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా.. నిజాయతీతో వ్యవహరించడానికి ప్రయత్నించండి. పలువురు అబద్ధాలు చెబుతూ.. మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు. కనుక జాగరూకతతో వ్యవహరించండి. సిన్సియర్‌గా పని చేయడంలోనే ఆనందం ఉందనే విషయాన్ని గమనించండి. ప్రమోషన్స్ లేదా ఉద్యోగంలో మార్పులను గురించి చర్చించడానికి ఈ రోజు అనువైనదని గుర్తుంచుకోండి. కర్కాటకం (Cancer) – ఈ రోజు మీ కుటుంబంతో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించండి. అలా గడపడం వల్ల.. మీరు ఎనలేని ఆనందాన్ని పొందుతారు. కనుక ఆఫీసుకు సెలవు పెట్టైనా సరే.. మీ సన్నిహితుల కోసం సమయం కేటాయించండి. అలాగే ఈ రోజు మీ మిత్రులు మీ సలహాలు తీసుకోవడానికి... మిమ్మల్ని సంప్రదిస్తారు. అయితే వివాదాస్పద విషయాల్లో మీరు ఎలాంటి సలహాలు ఇవ్వద్దు. ఈ విషయంలో జాగ్రత్త వహించండిసింహం (Leo) – ఈ రోజు ఆఫీసులో లేదా ఇంట్లో కూడా వాదోపవాదాలకు కాస్త దూరంగా ఉండండి. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడమే మంచిదనే విషయాన్ని నమ్మండి. ఎదుటి వ్యక్తి ఆవేశంతో మాట్లాడుతున్నప్పుడు.. వారితో వాదించడం వల్ల ప్రయోజనం చేకూరదని భావించండి. అలాగే ఆర్థికపరమైన లావాదేవీలు జరిపే విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు అనువైన సమయం. క‌న్య (Virgo) –  ఈ రోజు మీరు కొన్ని పాజిటివ్ విషయాలు వినే సూచనలు కనిపిస్తున్నాయి. జాబ్ రావడం లేదా ప్రమోషన్లు పొందడం లాంటి శుభవార్తలు మీరు వినే అవకాశం ఉంది. ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నించండి. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు అనువైన సమయమని గుర్తుంచుకోండి. తుల (Libra) –  ఈ రోజు మీరు చేసే పనులన్నీ చాలా నిదానంగా జరుగుతాయి. కాకపోతే మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టడానికి లేదా ఇరకాటంలో పడేయడానికి కొందరు ప్రయత్నిస్తారు. కనుక, ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే.. మీకు అక్కరకు రాని కొందరు స్నేహితులతో తెగదింపులు చేసుకోవడం మంచిది. వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీకు కొత్త అసైన్‌మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా మీ టీమ్‌కు అవసరమైన సూచనలు చేయండి. ఏ మాత్రం అశ్రద్ధగా వ్యవహరించినా.. అనుకోని సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కనుక సరైన కేర్ తీసుకుంటూ.. మీ పనిని పూర్తి చేయండి. ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు అనువైన సమయం. 


 
ధనుస్సు (Saggitarius) –  మీ ఉద్యోగ జీవితం ఈ రోజు సాఫీగా సాగిపోతుంది. అయితే కుటుంబ విషయాల్లోనే మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా పెద్దలతో సఖ్యతను పాటించండి. వాదోపవాదాలకు చోటు కల్పించవద్దు. ఒకరి మనసును నొప్పించకుండా.. చాలా హుందాగా వ్యవహరించండి. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు అనువైన సమయం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మకరం (Capricorn) – ఈ రోజు మీరు కెరీర్‌కు సంబంధించి పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. అయితే.. ఈ క్రమంలో మీరు ఎలాంటి టెన్షన్‌‌కు లోను కావద్దు. ముఖ్యంగా పలు రహస్యాలను మీ కొలీగ్స్‌తో షేర్ చేసుకోకుండా ఉండడమే మంచిది. కనుక, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాస్త.. ఆచితూచి వ్యవహరించండి. 


కుంభం (Aquarius) – ఈ రోజు మీ స్నేహితులతో మీకు చిన్న తగాదాలు జరిగే అవకాశం ఉంది. కనుక, ఇలాంటి సమయాల్లో సంయమనం పాటించడం చాలా మంచిదని భావించండి. ఎలాంటి ఘర్షణలకూ తావివ్వద్దు. ఓపికతో వ్యవహరించి.. మీ మనసులోని మాటలను పంచుకోండి. కొన్ని స్నేహాలను త్యజించడానికి.. కొన్ని బంధాలను పటిష్టం చేసుకోవడానికి  ఈ రోజు అనువైన సమయం. మీనం (Pisces) –  ఈ రోజు మీరు చేసే పనులన్నీ కూడా నత్తనడకన నడుస్తాయి. కనుక, కాస్త సహనాన్ని పాటించండి. ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించవద్దు. కానీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. మీరు అనుకున్న పనిని మాత్రం ఎలాగోలా పూర్తిచేయగలరు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మీ కుటుంబంలో ఏవైనా మనస్పర్థలు ఉంటే.. వాటిని తొలిగించుకోవడానికి ఈ రోజే సరైన సమయం.


Credit: Asha Shah


ఇవి కూడా చదవండి


ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!


ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?