ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ లక్ ఫ్యాక్టర్ ఏమిటో తెలుసుకోండి

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ లక్ ఫ్యాక్టర్ ఏమిటో తెలుసుకోండి

ఈ రోజు (జూన్ 21) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) –   ఈ రోజు మీరు పలు కుటుంబ పరమైన ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో మీ ఇంట్లో పెద్దవాళ్ల సలహాలు తీసుకోండి. ఆస్తి పంపకాలు లాంటి విషయాల్లో వివేకంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ వ్యాపారం కూడా విస్తరించే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో కూడా జాగరూకతతో వ్యవహరించండి. 

వృషభం (Tarus) – మీరు ఈ రోజు ఆరోగ్య ఇబ్బందులతో బాధపడే అవకాశం ఉంది. అలాగే మానసికంగా కూడా మీరు ఎంతో కుంగుబాటుకు లోనవుతారు. అయినా సరే ఆత్మస్థైర్యంతో, మనో ధైర్యంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించండి. మీ శత్రువులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టాలని భావిస్తారు. కనుక నిజాయతీతో వ్యవహరించండి. అప్పుడు మీదే విజయం. 

మిథునం (Gemini) – ఈ రోజు అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. వ్యాపారం కోసం మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడా నెరవేరుతాయి. అలాగే మీరు సృజనాత్మకంగా కూడా ఆలోచించడం మొదలుపెడతారు. కొన్ని పనులు ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టడం మంచిది. అప్పుడు సత్ఫలితాలు పొందుతారు. అలాగే మీకు వివాహ ప్రతిపాదనలు కూడా వచ్చే అవకాశం ఉంది. వివాహమైన వారు కూడా ఓ శుభవార్తను వింటారు. 

కర్కాటకం (Cancer) –  ఈ రోజు మీ స్నేహం ప్రేమగా మారవచ్చు. అలాగే ఓ సమర్థవంతమైన వ్యక్తిని  కలుస్తారు. విదేశీ ప్రయాణాలు చేయడానికి ఇదే అనువైన సమయం. అలాగే మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ శ్రమకు తగ్గ ఫలితం లేదా ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్నాళ్ల నుంచో పెండింగ్‌లో ఉన్న ఓ పని పూర్తవుతుంది. మీ భాగస్వామితో సంబంధాలు కూడా బలంగా ఉంటాయి.

సింహం (Leo) –  ఈ రోజు మీ చుట్టూ ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. కనుక  ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఎవరినీ నొప్పించే పనులు చేయవద్దు. అదేవిధంగా మీ వ్యాపారంలో హెచ్చుతగ్గులు కూడా కనిపిస్తాయి. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. క్లిష్టమైన పరిస్థితుల్లో మీకు ఆర్థిక సహాయం లభిస్తుంది. అదేవిధంగా వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. 

క‌న్య (Virgo) –  ఈ రోజు మీకు అనుకోని విధంగా ధనం, ఆస్తులు లేదా లాభాలు కలిసి వస్తాయి. కనుక ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. అలాగే మీ కుటుంబంలో వేడుకల వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రియమైన స్నేహితులతో ఈ రోజు  కలిసి మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఉద్యోగ పరంగా లేదా వ్యాపార పరంగా మీ బాధ్యతలు మరింత పెరుగుతాయి.  

తుల (Libra) –  ఈ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే ఉద్యోగపరంగా లేదా వ్యాపార పరంగా మీకు తీవ్ర నష్టాన్ని కలిగించే ఓ సంఘటన జరగవచ్చు. అందుకే ముందుగానే అప్రమత్తంగా ఉండండి. అలాగే మీ సహోద్యోగులను లేదా వ్యాపార భాగస్వాములను కూడా..  అప్రమత్తం చేయండి. ముఖ్యంగా మీ ఆత్మస్థైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు. మీలో భావోద్వేగాన్ని కలిగే సంఘటనలు కూడా ఈ రోజు జరగవచ్చు.

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు మీకు రోజంతా బిజీగా ఉంటుంది. శారీరక అలసట కూడా పెరుగుతుంది. అలాగే పలువురు సీనియర్లు ఆఫీసులో మీ మద్దతు పొందుతారు. ఈ రోజు మీకు సామాజిక గౌరవం పెరుగుతుంది. అలాగే కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి.  ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. అదేవిధంగా మీ భాగస్వామితో సంబంధాలు మరింత పటిష్టమవుతాయి. 

 

ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మిమ్మల్ని మీ పాత స్నేహితులు కలిసే అవకాశం ఉంది. అలాగే కొన్ని విషయాల్లో మీరు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. అలాంటి సంక్షోభ సమయాల్లో మీ కుటుంబం మీతో ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.  అలాగే కొన్ని లీగల్ ఇబ్బందులను మీరు ఎదుర్కొంటారు. ఇలాంటి సమయాల్లో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. 

మకరం (Capricorn) – ఈ రోజు మీరు మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లేదా మీరు గతంలో ప్రేమించిన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది.  అలాగే మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. మీ ఆఫీసులో మీకు తగిన గౌరవం లభిస్తుంది. అయితే ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. 

కుంభం (Aquarius) –  ఈ రోజు పలువురు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు. బయటకు వెళ్లేటప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకెళ్లవద్దు. అలాగే అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆస్తి విషయాలలో విభేదాలు పెరగవచ్చు. వ్యాపారంలో కూడా సమస్యలు ఉండవచ్చు. అయితే ఇన్ని సమస్యలున్నా.. మీరు సాధ్యమైనంత వరకూ వాటితో పోరాడడానికే ప్రయత్నిస్తారు. ఈ సమయంలో మీ తల్లిదండ్రుల మద్దతు కూడా లభిస్తుంది.

మీనం (Pisces) –  ఈ రోజు మీరు తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకోండి. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయవద్దు. అలాగే మీ ఆర్థిక సమస్యలు అధిగమించబడతాయి. కుటుంబంతో కలిసి పండగలు, ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే కొన్ని ఆఫీసు సమస్యలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. అధికారులతో వాదోపవాదాలు కూడా జరుగుతాయి. అయినా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం