ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ లక్ ఫ్యాక్టర్ ఏమిటో తెలుసుకోండి

ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ లక్ ఫ్యాక్టర్ ఏమిటో తెలుసుకోండి

ఈ రోజు (జూన్ 26) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) –  ఈ రోజు మిమ్మల్ని పలు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. మీలో కోపం, అసహనం కూడా ఈ రోజు పెరుగుతాయి. అలాగే ఆఫీసు వివాదాలు కూడా మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఇలాంటి సమయంలోనే మనో ధైర్యాన్ని పెంచుకోండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. అయితే వ్యాపార రంగంలోని వారికి ఈ రోజు శుభ దినం. మీరు వేసుకున్న ప్రణాళికలు ఒక కొలిక్కి వస్తాయి. 

వృషభం (Tarus) – ఈ రోజు మీకు ధనయోగం ఉంది. అలాగే కుటుంబ బంధాలు కూడా పటిష్టంగా మారతాయి. పాత స్నేహితులు మీ సహాయాన్ని కోరి వస్తారు. వ్యాపార రంగంలోని వారికి కూడా ఈ రోజు శుభదినం. అయితే అప్పులు ఇచ్చే విషయంలో లేదా పుచ్చుకొనే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వివాదాల జోలికి పోవద్దు. నిజాయతీగా వ్యవహరిస్తూ... మీ నెటవర్క్‌ను పెంచుకొనే ప్రయత్నం చేయండి. 

మిథునం (Gemini) – కళలు, సినిమా రంగంలో పనిచేసేవారికి ఈ రోజు బేషుగ్గా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈ రోజు శుభదినం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు.. కష్టపడితే విజయానికి చేరువవుతారు. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఇది బాగా కలిసొచ్చే రోజు. ప్రమోషన్లు లేదా బదిలీలకు ఇది అనువైన కాలం. అయినప్పటికీ కొన్ని కుటుంబ సమస్యలు వివాదాలకు కేంద్రబిందువుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలోనే ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. 

కర్కాటకం (Cancer) – వ్యాపారంలో కష్టపడి పనిచేసినప్పటికీ, ఆశించిన ఫలితాలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. ఈ రోజు పలు శుభాకార్యాలకు మీకు ఆహ్వానం అందుతుంది.  ఆస్తి సంబంధిత విషయాల్లో పలు వివాదాలు.. మిమ్మల్ని అసహనానికి గురిచేస్తాయి. 

సింహం (Leo) – ఈ రోజు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించండి.  ప్రకృతి ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. మీ మానసిక శక్తి పెరుగుతుంది. ఇక కుటుంబ విషయాలకు వస్తే.. మీకు మీ భాగస్వామి మద్దతు లభిస్తుంది. అలాగే రాజకీయాల్లో బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఇది శుభదినం. కష్టపడితే మీ లక్ష్యాలు నెరవేరే సూచనలు కనబడుతున్నాయి. 

క‌న్య (Virgo) – ఈ రోజు మీ కుటుంబంలో అపార్థాలు పెరిగే అవకాశముంది. కనుక కాస్త సంయమనంతో వ్యవహరించి.. సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి భావాలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కోపాన్ని నియంత్రించండి. ఆర్థికపరంగా చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విద్యార్థులకు పరీక్షలలో విజయం లభిస్తుంది. అదేవిధంగా ఆగిపోయిన పనులు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది.

ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట 

తుల (Libra) – ఈ రోజు మీ భాగస్వామి నుండి మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే అనవసర విషయాల్లో తలదూర్చి.. మనశ్శాంతిని కోల్పోవద్దు. ఈ రోజు కోపం, అసహనం మిమ్మల్ని ఆవరిస్తాయి. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. ఎలాంటి గొడవలు లేదా వివాదాల్లో భాగస్వాములు కావద్దు. ఆఫీసు పనులు తొలుత నత్త నడక నడిచినా.. ఆ తర్వాత పనిలో  పురోగతి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. 

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు మీకు ధనయోగం ఉంది. అలాగే శుభవార్తలు కూడా వింటారు. అలాగే మీ వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. సంఘంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. అలాగే విదేశీ ప్రయాణాలు చేయడానికి కూడా రంగం సిద్ధమవుతుంది. అలాగే మీ భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది. 

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు పలు సమావేశాల్లో మీరు పాల్గొంటారు. మీ భాగస్వామితో కాలం ఆనందంగా, ఆహ్లాదంగా సాగిపోతుంది. అలాగే ఉద్యోగ జీవితంలో మార్పులు సంభవిస్తాయి. ప్రమోషన్లు లేదా బదిలీల వంటి వార్తలు వింటారు. అయితే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే కోర్టు కేసులు, లావాదేవీలు అనేవి పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి.

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

మకరం (Capricorn) – ఈ రోజు విద్యార్థులకు శుభదినం. అయితే కష్టపడి చదివితేనే విజయం సిద్ధిస్తుందనే సూత్రాన్ని నమ్మండి. ముఖ్యంగా బద్దకాన్ని వీడండి. ఉద్యోగస్తులు నిర్లక్ష్య ధోరణిని వీడి జాగ్రత్తగా పనిచేయాలి. ఆడిట్ లేదా అత్యవసర సమావేశాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే అధికారుల నుండి వచ్చే ఒత్తిడిని తట్టుకొని నిలబడండి.  ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. 

కుంభం (Aquarius) – ఈ రోజు మీకు ఆస్తి లావాదేవీల విషయంలో లాభం చేకూరే అవకాశం ఉంది. అలాగే మీరు పలు వ్యాపార ఒప్పందాలు సైతం చేసుకుంటారు. అదేవిధంగా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రోజు మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. 

మీనం (Pisces) –  ఈ రోజు ఆఫీసులో మీకు అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. అయినా సరే నిజాయతీగా పనిచేయండి. అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగండి. మీ శత్రువులు మీపై చాడీలు చెప్పే అవకాశం ఉంది. అయినా ఇలాంటి వివాదాల్లో మీరు తలదూర్చకుండా.. మిమ్మల్ని మీరు నమ్మండి. కుటుంబ జీవితానికి వస్తే.. ఈ రోజు మీరు మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. 

ఈ కథను కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.