ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. విజయం వైపు పయనించండి

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. విజయం వైపు పయనించండి

ఈ రోజు (జూన్ 27) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) –  ఈ రోజు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. వ్యాపార లావాదేవీలు మీరు అనుకున్న విధంగా ఒక కొలిక్కి రాకపోవచ్చు. ఉద్యోగస్తులు కూడా ఎంతో ఒత్తిడితో పనిచేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. ఈ రోజు మీ ప్రేమ వ్యవహారం ఒక అనుకోని మలుపు తిరిగే అవకాశం కూడా ఉంది. 

వృషభం (Tarus) – ఈ రోజు మీ కుటుంబ బంధాలు పటిష్టంగా మారతాయి. అలాగే మీకు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. మీ ఆఫీసు వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ముఖ్యంగా మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. ప్రమోషన్లకు అవకాశాలు ఉంటాయి.  ముఖ్యంగా మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. 

మిథునం (Gemini) – పత్రిక లేదా సినిమా రంగంలో పనిచేసేవారికి ఈ రోజు చాలా మంచిది. అనుకోని అవకాశాలు మీ తలుపు తడతాయి. అలాగే మీ ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటాయి. వ్యాపార రంగంలోని వారికి కూడా ఇది కలిసొచ్చే కాలం. మీ ప్రాజెక్టులు జాప్యం కాకుండా వేగవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించవచ్చు. లేదా బదిలీలు కూడా సంభవించవచ్చు.

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అనుకోని నష్టాలను మీరు చవిచూసే అవకాశం ఉంది. ముఖ్యంగా వాహనాల నిర్వహణకు ఖర్చు పెరుగుతుంది. మీ ప్రియమైన వారితో కలిసి మీరు విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మొత్తానికి ఈ రోజంతా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. 

సింహం (Leo) – ఈ రోజు మీ కుటుంబ సభ్యుల అనారోగ్యం మీకు ఆందోళనను కలిగించవచ్చు. అలాగే మీ ఆర్థిక లావాదేవీలు కూడా అంత సాఫీగా సాగవు. అయితే పలు సామాజిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. అలాగే  కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి.

క‌న్య (Virgo) – ఈ రోజు మీ పనిలో పురోగతి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. అయితే వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. అలాగే ఆస్తి సంబంధిత విషయాలు, చట్టపరమైన విషయాల్లో సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కొన్ని విషయాల్లో మీరు నిజాయతీగా వ్యవహరించడం చాలా అవసరం. 

ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట

తుల (Libra) – ఈ రోజు మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అలాగే వాదోపవాదాలకు దూరంగా ఉండండి. ఆఫీసులో కొన్ని గందరగోళ పరిస్థితులు ఎదురుకావచ్చు. అయితే ఆ సమస్యలు వేగంగానే ఒక కొలిక్కి వస్తాయి. ఆస్తి తగాదాలు జరిగినప్పుడు సంయమనం పాటించండి. అలాగే కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు ఇది బాగా కలిసొచ్చే కాలం. కష్టపడితే విజయం సిద్ధిస్తుంది. 

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు కుటుంబ వివాదాలు ఒక పరిష్కార దిశగా ప్రయాణిస్తాయి. అలాగే మీకు ధన, వాహన యోగం కూడా ఉంది. మీరు కొత్త ఉద్యోగం లేదా వ్యాపారం మొదలుపెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.  

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీ స్నేహితుల మధ్య పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని శాంతంగా పరిష్కరించుకోండి. అలాగే కొన్ని చెడు సంఘటనలకు మీరు దూరంగా ఉంటే బెటర్. లేనిపోని వివాదాల్లో చిక్కుకోవద్దు. కొన్ని రాజకీయపరమైన కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటారు. అలాగే మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.  

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?
 
మకరం (Capricorn) –  ఈ రోజు మీరు కొత్త పనులు మొదలుపెట్టకపోవడం మంచిది. అలాగే మీరు కొన్ని ప్రతికూల సంఘటనలను ఎదుర్కొనే అవకాశం ఉంది. విద్యార్థులకు ఇది బాగా కష్టపడాల్సిన సమయం. వ్యాపార రంగంలో వారు కూడా ఈ సమయంలో ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్. ఉద్యోగస్తులు ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే విజయం సాధిస్తారు. 

కుంభం (Aquarius) – ఈ రోజు మీకు అనుకోని విధంగా.. అధిక మొత్తంలో ధనం కలిసొస్తుంది. అలాగే కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. నిరుద్యోగులు కూడా శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. ఇక కుటుంబ జీవితానికి వస్తే.. మీకు మీ భాగస్వామితో సంబంధాలు బలపడతాయి. మీరు విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. 

మీనం (Pisces) –  ఈ రోజు మీరు పలు ట్రైనింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తారు. కాకపోతే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి.. బాగా కష్టపడాలి. మీ కెరీర్‌కు ఏ విధంగానూ ఉపయోగపడని.. పనులకు దూరంగా ఉండండి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా వ్యవహరించండి. సాధ్యమైనంత వరకూ మీ భాగస్వామితో, పిల్లలతో ఎక్కువ సమయం గడపండి.

ఈ కథను కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.