ఈ రోజు రాశిఫలాలు చదవండి.. విజయం వైపు పయనించండి..!

ఈ రోజు రాశిఫలాలు చదవండి.. విజయం వైపు పయనించండి..!

ఈ రోజు (జూన్ 8) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) – ఈ రోజు మీరు పూర్తి చేయాల్సిన పెండింగ్ వర్క్ చాలా ఉంది. దీనిని వెంటనే పూర్తిచేయండి. పనిలో అధిక సమయం గడపడం వల్ల మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కేటాయించే సమయం తగ్గచ్చు. అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదురుకావచ్చు. కనుక కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. మీ కెరీర్ విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదా ఇంటర్వ్యూలకు వెళ్లాలన్నా... ఈ రోజు మంచిది. 


వృషభం (Tarus) –  మీరు ఒకవేళ ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తుంటే.. ఈ విషయంలో మీకు ఓ స్పష్టత అనేది అవసరం. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో చర్చించి.. నిర్ణయం తీసుకోండి. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కాస్త జాగరూకతతో వ్యవహరించండి. అలాగే మీరు ప్రేమిస్తున్న వ్యక్తికి మీ మనసులో విషయంలో చెప్పాలన్నా లేదా పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నా.. అందుకు ఈ రోజు సరైనదిగా భావించండి. 


మిథునం (Gemini) –  ఈ రోజు మీ పని నిదానంగా జరగడం వల్ల.. మీ ఆలోచనలను సరిచూసుకునేందుకు మీకు కాస్త సమయం ఉంటుంది. ఈ క్రమంలో అవసరమైతే ఆఫీసులో సహచరుల సహాయం కూడా తీసుకోండి. అదేవిధంగా పని కారణంగా ఎదురయ్యే ఒత్తిడిని కూడా సాధ్యమైనంత వరకూ ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ఇక మీ వ్యక్తిగత జీవితానికి వస్తే, ఈ రోజు మీ కుటుంబ వివాదాలను పరిష్కరించుకోవడానికి.. మీ మనసులోని మాటలను వారితో చెప్పడానికి సరైన సమయం. 


కర్కాటకం (Cancer) –  ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా పని చేస్తారు. అలాగే కొత్త విషయాలు నేర్చుకుంటారు. ముఖ్యంగా మీ క్రియేటివిటీకి ప్రశంసలు దక్కుతాయి. కాకపోతే మీ సహచరులపై ఓ అభిప్రాయం ఏర్పరచుకునే ముందు.. బాగా లోతుగా ఆలోచించండి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు వారితోనే కలిసి పని చేయాల్సి ఉంటుంది. అలాగే కొత్త బంధాలను ఏర్పరచుకోవడానికి ఈ రోజు మంచిది. 


సింహం (Leo) –  ఈ రోజు మీకు పని విషయంలో.. కొన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్న సమయానికి దానిని పూర్తిచేస్తారు. అలాగే స్పష్టతతో మీ టీంని ముందుకు తీసుకెళ్తారు. ఈ క్రమంలో మీకున్న ఇతర సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడానికి ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతివిశ్వాసాన్ని ప్రదర్శించకండి. కెరీర్ విషయంలో ఏవైనా మార్పులు మీరు కోరుకుంటే.. అందుకు నిర్ణయం తీసుకోవడానికి ఈ రోజు మంచిదని భావించండి. 


క‌న్య (Virgo) –  ఈ రోజు మీ సహనానికి పరీక్ష. మీరు కోరుకున్న దానికి వ్యతిరేకంగా ఈ రోజు అంతా పని చేస్తారు. ఈ క్రమంలో మీరు వివేకంతో నిర్ణయాలు తీసుకోవడం బెటర్. మీకు ఏది ముఖ్యమో దాని మీదే ఫోకస్ చేయండి. సహనాన్ని  మాత్రం కోల్పోకండి. చాలా నిజాయతీగా మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. 


తుల (Libra) –  ఈ రోజు చాలా ఒత్తిడితో మీరు పనిచేస్తారు. అయినప్పటికీ.. పెండింగ్ పనులన్నీ కూడా అనుకున్న సమయానికే పూర్తి చేయగలుగుతారు. కొన్ని కొత్త ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుడతారు. కానీ భాగస్వాముల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సరైన అగ్రిమెంట్లు లేకుండా ఒప్పందాలు చేసుకోవద్దు. 


వృశ్చికం (Scorpio) –  ఒక పెద్ద ప్రాజెక్ట్‌ను మీరు టేకప్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో మీరు చాలా నిదానంగా, ఏకాగ్రతతో పని చేయాల్సి ఉంటుంది. అవసరమైతే చేసిన పనినే మళ్లీ చేయాల్సి రావచ్చు. ఈ క్రమంలో మీ సహచరులు కూడా స్పష్టత కోసం మిమ్మల్నే ఆశ్రయించవచ్చు. వారితో సహనంతో వ్యవహరించండి. ఇక మీ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే, మీ ప్రాజెక్ట్ పనులు మీ కుటుంబం పై ప్రభావం చూపిస్తాయి. కనుక మీ కుటుంబీకులతో కాస్త సహనంగా వ్యవహరించండి. 


ధనుస్సు (Saggitarius) –  చాలా మంచి ఐడియాలతో మీరు ఈ రోజు ఆఫీసులోకి అడుగుపెడతారు. అయితే మీ ఆలోచనలను అమలుపరచడంలో మాత్రం కాస్త ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఈ క్రమంలో మీరు మీ సీనియర్స్‌ని సంప్రదించి వారి సలహాలు తీసుకోండి. ఫలితంగా మీకో స్పష్టత రావచ్చు. అలాగే ఇతరులు చెప్పేది జాగ్రత్తగా, పూర్తిగా వినండి. కొన్ని నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. కాస్త వివేకంతో ఆలోచించాల్సిన అవసరముందని తెలుసుకోండి. 


మకరం (Capricorn) –  మీరు పూర్తి చేయాల్సిన డెడ్ లైన్స్ చాలా దగ్గర్లో ఉన్న కారణంగా.. కొన్నింటికి మీరు ఛార్జ్ తీసుకోవాల్సి వస్తుంది. దీనికి తోడు మీ చుట్టూ ఉన్నవారు  మీకు సహకరించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మీరు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి.  నిజాయతీగా మీ పని మీరు చేయండి. 


కుంభం (Aquarius) –  ఈ రోజు మీపై పలు నిందారోపణలు రావచ్చు. అయితే తప్పు మీ వైపు లేదని మీరు భావిస్తే.. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. ధైర్యంగా మీ మనసులోని మాటలను బయటపెట్టండి. తప్పు ఎక్కడ జరిగిందో మీ సహచరులకు స్పష్టత ఇవ్వండి. 


మీనం (Pisces) –  ఈ రోజు మీరు చాలా పనులు చేయాలని అనుకుంటారు. కానీ ఏ విషయంలోనూ స్పష్టత ఉండదు. ఇతరులను బాగా నమ్ముతారు. ఈ క్రమంలో ఎవరినైనా సహాయం అడిగితే.. దానిని స్వీకరించేందుకు కూడా మీరు సిద్ధంగా ఉండండి. మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితులు కూడా ఈ రోజు తలెత్తవచ్చు. ఇలాంటి సమయంలో.. కాస్త ధైర్యంగా వ్యవహరించండి. 


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!


ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?