ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ లక్ష్యసాధనకు బాటలు వేసుకోండి..!

ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ లక్ష్యసాధనకు బాటలు వేసుకోండి..!

ఈ రోజు (జూన్ 9) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) –  ఈ రోజు మీరు ఇతరుల పనిని  సమీక్షించాల్సి రావచ్చు. ఈ క్రమంలో మీరు వీలైనంత వరకు వివేకంతో వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే నిజాయతీగా కూడా ఉండాలి. అప్పుడే మీ సహచరులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే మీ మనసు చెప్పేది మాత్రమే వినండి. 


వృషభం (Tarus) –  ఈ రోజు మీరు చేపట్టిన పని ఏదైనా సవ్యంగా జరుగుతుంది. అలాగే అందరి చూపు మీపైనే ఉంటుంది. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల కోసం అంతా ఎంతో ఆసక్తిగా వేచి చూస్తారు. కొందరు మీ పట్ల కఠినంగా వ్యవహరించినా.. మీ ఆలోచనాతీరుని ప్రభావితం చేయలేరు. కాకపోతే.. అనవసర విషయాలకు వీలైనంత వరకు దూరంగా ఉండండి.


మిథునం (Gemini) –  ఈ రోజు చాలా ముఖ్యమైన సమావేశాలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతాయి. వాటిలో మీరు పూర్తి ఏకాగ్రతతో పాల్గొనడం చాలా అవసరం. ఈ రోజు మీ జీవితాన్ని ప్రభావితం చేసే సంఘటనలు జరగవచ్చు. అలా పలు వివాదాల్లో మీరు చిక్కుకొనే అవకాశం కూడా ఉంది. కానీ మీరు అన్ని సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తారు. 


కర్కాటకం (Cancer) – ఈ రోజు  పని విషయంలో ఎలాంటి మార్పులు లేకపోయినప్పటికీ.. కొన్ని క్లయింట్ మీటింగ్స్ వాయిదా పడవచ్చు. ఈ క్రమంలో మీకు చికాకుగా అనిపించినప్పటికీ.. ఆ ప్రభావం మీ కుటుంబంపై పడకుండా చూసుకోండి. సమస్యను అవతలివారి కోణం నుంచి కూడా చూడండి. 


సింహం (Leo) –  ఉన్నట్లుండి మీరు నిర్వహించాల్సిన బాధ్యతల జాబితా బాగా పెరిగిపోవడంతో.. వాటిని ఎక్కడి నుంచి ప్రారంభించాలో.. ఎక్కడ ముగించాలో మీకు అర్థం కావడం లేదు. ఈ రోజు మీరు కొత్త పనికి కూడా శ్రీకారం చుడతారు. అయితే పనితో పాటు కుటుంబ సభ్యులకు సమయం కేటాయించేందుకు కూడా ప్రాధాన్యం ఇవ్వండి.


క‌న్య (Virgo) –  ఈ రోజు మీరు చేపట్టిన చాలా పనులు సవ్యంగా పూర్తవుతాయి. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. ఉన్నట్లుండి ఎలాంటి విషయాల్లోనూ నిర్ణయాలు తీసుకోకండి. కాస్త బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. మీ ఆరోగ్యం పట్ల కూడా నేడు శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.


తుల (Libra) –  ఈ రోజు ఇతరులు తీసుకునే నిర్ణయాలు మీపై బాగా ప్రభావం చూపిస్తాయి. ఆఫీసులో మీ సీనియర్స్ కూడా మీరు గతంలో పడిన కష్టాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు లేదా మాట్లాడే మాటలను ఈ రోజు అందరూ అపార్థం చేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు నేడు నిశ్శబ్దంగా ఉండడమే మంచిది.


వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు తీరిక లేకుండా గడుపుతారు. కానీ మూడో వ్యక్తి ప్రమేయం కారణంగా కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు.  కనుక పెండింగ్‌లో ఉన్న పని పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. పరిస్థితులను గంభీరంగా మార్చేందుకు ప్రయత్నించకండి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ వహించండి. 


ధనుస్సు (Saggitarius) –  ఈ రోజు మీరు చేసే పనిలో పెద్దగా మార్పులేమీ లేకపోయినప్పటికీ.. కొన్ని విషయాలను మీరు వ్యక్తిగతంగా తీసుకుంటారు. ఈ కారణంగా మీ మూడ్ అప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇది మీరు చేసే పనిని సైతం ప్రభావితం చేస్తుంది. దీనికి తోడు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తే సమస్యలు కూడా మీకు ప్రశాంతత లేకుండా చేస్తాయి. మీరు మీ మానసిక, శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది.


మకరం (Capricorn) –  ఈ రోజు మీరిచ్చే కొత్త ఐడియాలు సత్ఫలితాలు ఇవ్వడానికి కాస్త సమయం పడుతుంది. అయితే మీరు చెప్పేది ఎదుటివారికి పూర్తిస్థాయిలో అర్థంకాక వారు.. మీతో ఏకీభవించడానికి కూడా టైం పడుతుంది. ఈ క్రమంలో మీరు సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం.


కుంభం (Aquarius) – పెండింగ్ వర్క్ పూర్తి చేయాలని మీపై కలిగే ఒత్తిడి కారణంగా.. పని భారం కాస్త ఎక్కువగా ఉండవచ్చు. అలాగే భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించేందుకు చివరి నిమషంలో సమావేశాలు ఏర్పాటు చేయాల్సి రావచ్చు. ఈ రోజు మీరు చేయాల్సిన పని చాలానే ఉన్న కారణంగా కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమయం కేటాయించలేరు.


మీనం (Pisces) –  కొన్ని కారణాల వల్ల ఈ రోజు పని కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతుంది. మీకు రావాల్సిన మెయిల్, షిప్‌మెంట్  మీరు పాల్గొనే సమావేశం కారణంగా ఆలస్యం జరగవచ్చు. అయితే సమయం గడిచే కొద్దీ ఇవన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. మీ ఆలోచనలకు ఆచరణలో పెట్టేందుకు మీరు మరింత ఉత్సాహంగా పని చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు మీ స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి సరదాగా గడపండి.


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!


ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?