నేటి రాశిఫలాలు చదవండి.. మీ లక్ష్యాలను సునాయాసంగా సాధించండి..

నేటి రాశిఫలాలు చదవండి.. మీ లక్ష్యాలను సునాయాసంగా సాధించండి..

ఈ రోజు (జూన్ 19) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – ఈ రోజు చాలా నిదానంగా గడుస్తుంది. అయినప్పటికీ మీరు చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి. కొత్త ప్రాజెక్టులతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాల్సి రావచ్చు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే..  మీ కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపడానికి ప్రయత్నించండి. పలు విషయాల్లో వారి సలహాలు కూడా తీసుకోండి. 

వృషభం (Tarus) – ఈ రోజు పనిలో పెద్దగా మార్పులు ఉండవు. కానీ మీ చుట్టూ ఉన్నవారితో జరిగే చిన్న చిన్న గొడవలు మీపై బాగా ప్రభావం చూపిస్తాయి. వాటిని పట్టించుకోకుండా.. మంచి విషయాలపై ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. మీకు ఏది ముఖ్యమో దాని గురించి మాత్రమే ఆలోచించండి. మీ గురించి ఇతరులు ఏం ఆలోచిస్తారన్నది మీకు అనవసరం. దాని గురించి పట్టించుకోకండి.

మిథునం (Gemini) – ఈ రోజు అలసట, చిరాకు కారణంగా మీ పని ఆలస్యంగా జరగచ్చు. అంతేకాదు.. చేయాల్సిన పని ఎక్కువగానే ఉన్నప్పటికీ దానిపై మీరు ఫోకస్ చేయలేరు. కనుక మీ కోసం కాస్త సమయం కేటాయించుకొని విశ్రాంతి తీసుకోండి. పరిస్థితుల్లో తప్పకుండా మార్పు కనిపిస్తుంది. అలాగే మీ కుటుంబానికి కూడా కాస్త సమయం కేటాయించండి. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు ఆఫీసు పనిని ఎంజాయ్ చేస్తూ చేస్తారు. అలాగే కాస్త ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడానికి కూడా ప్రయత్నిస్తారు. అయినప్పటికీ పలువురితో మీకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంది. కనుక కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే మీ భాగస్వామితో గొడవపడకండి. మూడ్ స్వింగ్స్ ప్రభావం మీ బంధంపై పడకుండా జాగ్రత్తపడండి. లేదంటే అవి అనవసర గొడవలకు దారి తీస్తాయి.

సింహం (Leo) – ఈ రోజు ఆఫీసులో మీ సహచరులను నమ్మడం మీకు కాస్త కష్టంగా అనిపించవచ్చు. కనుక మీరు మరింత ఏకాగ్రతతో, వివేకంతో, లౌక్యంతో వ్యవహరించాల్సి ఉంటుంది. మీ చుట్టూ ఉన్నవారు మీ సహనానికి పరీక్ష పెట్టచ్చు. అయినా సరే మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. అదేవిధంగా ఇతరుల వ్యక్తిగత విషయాలలో మీరు అనవసరంగా కలుగజేసుకోకండి.

క‌న్య (Virgo) –  ఈ  రోజు వరుస షెడ్యూల్స్ కారణంగా మీరు చాలా బిజీగా గడుపుతారు. అలాగే మీ ఆఫీసులో పని చేసే సహచరుల బాగోగుల గురించి కూడా పట్టించుకుంటారు. వారంతా మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు సహకరిస్తారు కూడా. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మీ మనసులోని భావాలను మీ కుటుంబ సభ్యులకు స్పష్టంగా వ్యక్తం చేయండి.

తుల (Libra) –  ఈ రోజు జరిగే ప్రతి విషయంతోనూ మీరు చాలా సంతోషంగా ఉంటారు. చిన్న చిన్న ఖర్చులతో మీ పనులు ముందుకు వెళ్లేలా చేస్తారు. మీ భాగస్వామితో సమయం గడపండి. లేదంటే వారిని నిర్లక్ష్యం చేస్తున్నట్లు వారు భావిస్తారు.

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు మీతో చాలా నిజాయితీగా వ్యవహరించాలి. అలాగే అవసరమైన పనులపై ఫోకస్ చేస్తూ ఉండాలి. మీరు చేసిన తప్పులు లేదా మీ ఎమోషన్స్ గురించి నిజాన్ని అంగీకరించాల్సిన సమయం ఇది. కొన్ని నిజాల నుండి దూరంగా జరగడం వల్ల పరిస్థితులు మరింత దిగజారతాయని గ్రహించండి.  అయినప్పటకిీ మీ స్నేహితులు మీకు సపోర్ట్‌గా ఉంటారు.

ధనుస్సు (Saggitarius) – ఆగిపోయిన పనులను.. మీరు ఈ రోజు మీ కొత్త ఐడియాలతో ముందుకు తీసుకెళ్తారు. మీ టీమ్ సభ్యులను ఒప్పించడం కాస్త కష్టమే అయినప్పటికీ.. మీరు అందులో విజయం సాధిస్తారు. అలాగే పనిలో అధిక సమయం గడపడం వల్ల.. మీ కుటుంబ సభ్యులతో గడిపే సమయంపై ప్రభావం పడుతుంది. ఈ రోజు పనికే మీ ప్రాధాన్యం ఇస్తారు.

మకరం (Capricorn) – మీ బాధ్యతలను మరోసారి మీకు గుర్తుచేసే రోజు ఇది. మీరు తీసుకొనే నిర్ణయాల గురించి మీకో స్పష్టత వస్తుంది. అదేవిధంగా.. పాత క్లయింట్స్‌కు సంబంధించి.. ఏదైనా పని గురించి మీరు ఆలోచిస్తుంటే దానికిి పాజిటివ్ ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ సభ్యుల విషయంలో గతాన్ని వర్తమానంతో లింక్ చేసి మాట్లాడకండి. వారు చెప్పేది అపార్థం చేసుకోకుండా పూర్తిగా వినండి.

కుంభం (Aquarius) – ఈ రోజు వాతావరణం కారణంగా మీరు కాస్త డల్‌గా ఉండచ్చు. మీ కుటుంబ సభ్యులు మీకు సహకారం అందించడమే కాదు.. మీ కోసం బాగా చింతిస్తుంటారు కూడా. ఈ క్రమంలో మీ శరీరానికి అవసరమైన విశ్రాంతిని  అందించండి. మరోవైపు మీ స్నేహితులు కూడా మీతో సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. 

మీనం (Pisces) – మీరు ప్రతి విషయం గురించీ లోతుగా ఆలోచించడం ఆపేయండి. అలాగే ప్రతి అంశాన్నీ వ్యక్తిగతంగా తీసుకోవడం కూడా మానేయండి. ఈ ప్రవర్తనే మిమ్మల్ని ఈ రోజు ముందుకు వెళ్లకుండా ఆపుతోంది. మీ కుటుంబ సభ్యుల ఎమోషనల్ డ్రామా కారణంగా .. మీ పర్సనల్ లైఫ్ కూడా పలు మార్పులకు గురవుతుంది. 

ఇవి కూడా చ‌ద‌వండి

నేటి రాశిఫలాలు చదవండి.. మీ భవిష్యత్తు గురించి స్పష్టంగా తెలుసుకోండి..!

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?