ఈ రోజు రాశిఫలాలు చదవండి.. జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకోండి

ఈ రోజు రాశిఫలాలు చదవండి.. జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకోండి

ఈ రోజు (జూన్ 23) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) –  ఈ రోజు మీరు ఎన్నో విధాలుగా గడపాలని ప్లాన్ చేస్తారు. అయినా మీకు నిరుత్సాహం కలగచ్చు. ముఖ్యంగా పలు ఆరోగ్య సమస్యలు ఈ రోజు మిమ్మల్ని చుట్టుముడతాయి. కనుక ఏ పనీ మీరు చేయలేకపోవచ్చు. ఇలాంటి సమయంలోనే కుటుంబ సభ్యులు మీకు తగిన తోడ్పాటునందిస్తారు. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని ఈ రోజు కలిసే అవకాశం ఉంది. 

వృషభం (Tarus) – ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అలాగే అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పనికి సంబంధించి కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కొత్త ఐడియాల విషయంలో మీ మెదడులో ఎన్నో ఆలోచనలుంటాయి.  ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. కాస్త సహనం అవసరం. మీ భాగస్వామితో పరుషంగా కాకుండా.. ప్రేమగా వ్యవహరించి తన ప్రేమను కూడా పొందండి. 

మిథునం (Gemini) –  ఈ రోజు ఇతరుల వ్యవహారాలలో మీకు సాధ్యమైనంత వరకు జోక్యం చేసుకోకపోవడం శ్రేయస్కరం. మీ ప్రాజెక్టులకు సంబంధించి తదుపరి కార్యాచరణ కోసం.. మీరు ప్లాన్ చేస్తారు. అలాగే ఈ రోజు  చాలా సరదాగా గడుస్తుంది. అయితే కొన్ని అత్యవసర పనుల విషయంలో స్వల్ప ఆలస్యం జరగచ్చు. కానీ మీ భాగస్వామి, స్నేహితులతో కలిసి హాయిగా గడుపుతారు.

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. అలాగే కొన్ని కొత్త అనుభవాలు కూడా మీకు ఎదురవుతాయి.  అలాగే పలు కుటుంబ వివాదాలు మీ దృష్టికి వస్తాయి. అదేవిధంగా ముందుగా వేసుకున్న ప్రణాళికల్లో చివరి నిమిషంలో మార్పులు జరగచ్చు. ఏదేమైనా, పూర్తి ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. పలువురు స్నేహితులు మీ సహాయం కోరి రావచ్చు. 

సింహం (Leo) – ఈ రోజు మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు తలెత్తవచ్చు. ఈ సమస్యలను పరిష్కరించడానికి మీరు కాస్త శ్రమించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు మీ పాత మిత్రులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది.  అదేవిధంగా కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కొందరికి సహాయం చేసే విషయంలో కాస్త లౌక్యంగా, వివేకంగా వ్యవహరించండి. 

క‌న్య (Virgo) – ఈ రోజు మీరు ఒంటరిగా గడపడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఇదే క్రమంలో కొన్ని పనులను పెండింగ్‌లో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అలాగే కొందరు మిత్రులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది.ఈ సందర్భంగా గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ప్రస్తావనకు వస్తాయి. 

 

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి.. మీ లక్ ఫ్యాక్టర్ ఏమిటో తెలుసుకోండి

తుల (Libra) – ఈ రోజు మీరు చాలా బిజీగా గడుపుతారు. ఈ క్రమంలో మల్టీ టాస్కింగ్ కూడా చేస్తారు. మరోవైపు కుటుంబానికి సంబంధించిన పనులను కూడా ఆర్గనైజ్ చేస్తారు. అలాగే కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఇతరుల భావోద్వేగాలకు మీరు విలువివ్వాల్సి ఉంది. అదే విధంగా, మిత్రులకు ధన సహాయం చేసే విషయంలో కూడా కాస్త ఆచి తూచి వ్యవహరించండి. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతారు. ఒక సంఘటన మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తుంది.  దీనికి తోడు ప్రతిఒక్కరూ మీ సహనానికి పరీక్ష పెడతారు. కాబట్టి అన్ని విషయాలను పాజిటివ్‌గానే తీసుకోండి. మిత్రులు లేదా బంధువులతో ఆచితూచి మాట్లాడండి. 

 

ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీరు బిజీగా ఉంటారు. మీ పాత ఆఫీసు కొలీగ్స్‌ను కలుస్తారు. కొన్ని కొత్త ప్రాజెక్టుల విషయంలో జరిగే చర్చలలో మీరూ పాల్గొంటారు. అయితే  అగ్రిమెంట్ల పై సంతకాలు చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. మీ కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోండి. 

మకరం (Capricorn) – ఈ రోజు మీ సమయాన్ని మీరు పూర్తిగా కుటుంబానికి కేటాయిస్తారు. ఈ క్రమంలోనే కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయి. అవే చర్చలు మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడతాయి. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. మీ భాగస్వామి సలహాలు, సూచనలు కూడా తీసుకోండి. మీరు ఈ రోజు ఓ కొత్త ప్రదేశాన్ని సందర్శించే అవకాశం కూడా ఉంది. 

కుంభం (Aquarius) – ఈ రోజు మీకు వాహన యోగం ఉంది. అలాగే డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్రోకర్లు లేదా ఏజెంట్ల మాటలు నమ్మేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. వీలైతే మీకు సన్నిహితులైన స్నేహితుల సలహాలు కూడా తీసుకోండి. పలు ముఖ్యమైన అగ్రిమెంట్లపై సంతకాలు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. 

మీనం (Pisces) – ఈ రోజు మీరు మీ ప్రొఫెషనల్ టెన్షన్లు అన్నింటిని మరిచిపోయి.. కుటుంబంతో హాయిగా గడపండి. మీ తల్లిదండ్రులను వారికిష్టమైన చోటుకి తీసుకెళ్లండి. ఈ రోజు కొన్ని మీరు కొన్ని శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు గతంలో చేసి ఓ సహాయం.. ఇప్పుడు మీకు  అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం