ADVERTISEMENT
home / Humour
జరిగేది క్రికెట్ వరల్డ్ కప్ 2019 కాదు ! వరుణుడి వరల్డ్ కప్ ! ఆసక్తికర మీమ్స్ మీకోసం

జరిగేది క్రికెట్ వరల్డ్ కప్ 2019 కాదు ! వరుణుడి వరల్డ్ కప్ ! ఆసక్తికర మీమ్స్ మీకోసం

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ (Cricket World Cup) పై.. ప్రస్తుతం జన సామాన్యంలో పెద్ద చర్చే నడుస్తోంది. ప్రతి నాలుగేళ్ళకి ఒకసారి జరిగే వరల్డ్ కప్‌లో ఏ జట్టు గెలుస్తుంది? ఏ ఆటగాడు బాగా పరుగులు చేస్తాడు? ఎక్కువ వికెట్లు ఏ ఆటగాడు తీస్తాడు? అనే ప్రశ్నలే సాధారణంగా  వినిపిస్తాయి. ఆయా అంశాల పైనే బెట్టింగ్స్ కూడా జోరుగా సాగుతుంటాయి. 

అయితే ఈసారి ప్రపంచ కప్ మాత్రం ఇందుకు భిన్నంగా వార్తల్లోకెక్కింది. దానికి కారణం – ఇంగ్లాండ్ మొత్తం విస్తారంగా వర్షాలు కురుస్తుండడం. దాదాపు 24 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో 4 మ్యాచ్‌లు వర్షార్పణమయ్యాయి. ఇక శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్యలో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా ఫలితం కూడా మారిపోయింది. ఇక ప్రపంచ కప్ నిర్వహించే సమయంలో ఇటువంటి సంఘటనలు జరగడం అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించడం సహజం. ఈ క్రమంలో ఆయా జట్ల ఆటగాళ్ళతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు కూడా తమ నిరాశను బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. 

ఒకవేళ వర్షం కారణంగా ఆట నిలిచిపోతే చాలు.. ICC (అంతర్జాతీయ క్రికెట్ మండలి) వారిని తీవ్రంగా ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నారు కొందరు నెటిజెన్స్. కొంతమందైతే ఏకంగా మీమ్స్ రూపంలో విరుచుకుపడుతున్నారు. ఐసిసి ప్రపంచ కప్ నిర్వహిస్తున్న తీరుని సైతం తప్పుబడుతున్నారు. పలువురైతే ఏకంగా ఈ ప్రపంచ కప్ ట్రోఫీ ఆకారాన్ని కూడా మార్చేసి తమదైన శైలిలో సెటైర్లు విసురుతున్నారు. 

అలా సెటైర్లు వేసినవారిలో ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ రిషి కపూర్ కూడా ఉన్నారు. ఆయన గొడుగు ఆకారంతో డిజైన్ చేసిన ప్రపంచ కప్ ట్రోఫీ‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 

ADVERTISEMENT

Cricket World Cup Trophy in Umbrella Shape

అలాగే ఐస్ ల్యాండ్ దేశ క్రికెట్ సంఘం తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో చిత్రమైన పోస్టు పెట్టింది.  “మా ప్రాంతంలో 28 రోజులు వర్షం పడదని వాతావరణ నివేదిక ఉంది. కావాలంటే ఇక్కడ క్రికెట్ మ్యాచ్‌లు ఆడించవచ్చు. ఎందుకంటే ఐరోపా ఖండంలో లండన్ మాత్రమే కాకుండా.. చాలా ప్రాంతాలున్నాయి” అని సెటైర్ వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT

Iceland Cricket

అదే విధంగా ఇటీవలే ఇండియా, న్యూజీలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్.. ఒక్క బాల్ కూడా వేయకుండానే వర్షం కారణంగా రద్దయింది. దీంతో రెచ్చిపోయిన అభిమానులు ఇరు జట్లు నీటిలో క్రికెట్ ఆడుతున్నట్టుగా మీమ్స్ తయారుచేశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి ఇంకా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

ఈ కథనం కూడా చదవండి: క్రీడాకారులుగా దూసుకుపోవడానికి.. మన యువ హీరోలు రెడీ..!

ADVERTISEMENT

India New Zealand Cricket Match Memes

ప్రస్తతం ఈ వరల్డ్ కప్ సీజన్‌లో 22 లీగ్ మ్యాచ్‌లు, 2 సెమీఫైనల్ మ్యాచ్‌లు, 1 ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి. ఈ తరుణంలో వరుణుడు ఎప్పుడు కొంప ముంచుతాడో తెలియడం లేదని.. క్రికెట్ అభిమానులు అంటున్నారు. కాకపోతే గుడ్డిలో మెల్ల అన్నట్లు… సంతోషపడాల్సిన విషయం ఏమిటంటే.. 2 సెమీఫైనల్స్, ఫైనల్‌కి మాత్రం రిజర్వ్ డేని కేటాయించారు. ఎందుకంటే వర్షం కారణంగా తీవ్ర ఇబ్బంది తలెత్తితే.. వేరే రోజు ఆట జరగడానికి ఈ రిజర్వ్ డే ఉపయోగపడనుంది.

ఈ కథనం కూడా చదవండి: శభాష్ మిథాలీ రాజ్.. మరో చరిత్ర తిరగరాసిన క్రికెట్ దిగ్గజం

ADVERTISEMENT

Funny Memes On Rain Affected Games in World Cup 2019

ఇదిలావుండగా ఇటీవలే జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా.. దాదాపు ఇరు దేశాల ప్రజలు సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద వెబ్ వార్‌‌నే చేసుకున్నారు.  మౌకా … మౌకా.. అంటూ హిట్ అయిన క్రికెట్ యాడ్‌ని మరోసారి స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేయడమే దానికి కారణం. అయితే దీనికి ప్రతిగా పాకిస్తాన్ నుండి కూడా ఒక యాడ్ విడుదలైంది. మన దేశపు ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మీకి చిక్కిన సందర్భంలో వారు తీసిన వీడియోని వారు స్ఫూర్తిగా తీసుకున్నారు. అందులో టీ – కప్ ఎపిసోడ్‌ని వరల్డ్ కప్ ఎపిసోడ్ క్రింద మార్చారు. 

Abhinandan Tea Cup Ad

ADVERTISEMENT

ఇక దీనికి కౌంటర్‌గా మరో యాడ్ వైరల్ అయ్యింది. ఒక పాకిస్తాన్ అభిమానికి క్షౌరశాలలో అభినందన్ స్టైల్ గడ్డాన్ని డిజైన్ చేయడం ఈ యాడ్‌లో హైలెట్. ఇలా ఒక జట్టు అభిమానులు.. మరో జట్టుకి సంబంధించిన మీమ్స్, యాడ్స్ చేస్తూ.. ప్రపంచ కప్ క్రికెట్‌ని మైదానం నుండి సోషల్ మీడియాలోకి తీసుకొచ్చేశారు.

ఈ కథనం కూడా చదవండి: అలా అనుకొంటే ఇలా జరిగిందేంటి రవి శాస్త్రి బాబాయ్..?

Mauka Mauka Ad India Vs Pakistan

ADVERTISEMENT

చివరగా వరుణ దేవుడు మన దేశంలో రైతులకి ఆసరాగా రావాల్సిన వేళ… లండన్‌లో తన ప్రభావాన్ని చూపిస్తూ క్రికెట్ ఫీవర్ పైన నీళ్ళు జల్లుతున్నాడు. అలా ఈ క్రికెట్ వరల్డ్ కప్.. కాస్త వరుణుడి వరల్డ్ కప్ గా మారిపోయింది. 

18 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT