ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఈ అమ్మాయిలు నడిపే రాక్ బ్యాండ్ చాలా స్పెషల్.. ఎందుకంటే..?

ఈ అమ్మాయిలు నడిపే రాక్ బ్యాండ్ చాలా స్పెషల్.. ఎందుకంటే..?

రాక్ బ్యాండ్ (Rock band).. హుషారైన సంగీతంతో మనసుని ఉరకలెత్తిస్తుంది. సినిమా పాటలను తమదైన స్టైల్లో పాడటం.. సందర్భానికి తగినట్లు ప్రత్యేకంగా పాటను రాసి.. ట్యూన్ చేసి మరీ పాడటం రాక్ బ్యాండ్ స్పెషాలిటీ. అందుకేనేమో రాక్ బ్యాండ్ సంస్కృతి కార్పొరేట్ ఈవెంట్లు, కాఫీ షాపుల నుంచి పుట్టినరోజులు, పెళ్లిళ్ల వరకు వచ్చింది. నేడు సినిమాలకు పాటలు పాడిన సింగర్స్ చాలామంది రాక్ బ్యాండ్స్ ఏర్పాటు చేసుకొంటున్నారు.

కాలేజీ కుర్రాళ్లు, ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం తమ అభిరుచికి అనుగుణంగా రాక్ బ్యాండ్ ఏర్పాటు చేసి ప్రదర్శనలిస్తున్నారు. అలాంటిదే లక్నోకి చెందిన మేరీ జిందగీ (Meri Zindagi) రాక్ బ్యాండ్. ఈ బ్యాండ్ గురించి మనం చర్చించుకొనేంత ప్రత్యేకత ఏముంది? నిజంగానే ఈ బ్యాండ్ మిగిలిన వాటితో పోలిస్తే భిన్నం, ప్రత్యేకం. ఎందుకంటారా? ఇది మన దేశంలో మొట్టమొదటి ఫీమేల్ రాక్ బ్యాండ్. పైగా వీరు పాడే పాటలకు తీసుకొనే ఇతివృతాలన్నీ మహిళల సమస్యలకు చెందినవే. ఈ పాటలకు తామే స్వయంగా ట్యూన్ రాసుకొని మరీ పాడతారు.

1-meri-zindagi

మేరీ జిందగీ రాక్ బ్యాండ్‌ను లక్నోకు చెందిన జయా తివారీ ప్రారంభించారు. ఈ రాక్ బ్యాండ్‌కు లీడ్ సింగర్, రైటర్‌గా ఆమే వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన జయ రేడియో జాకీగా పనిచేస్తున్నారు. వాస్తవానికి ఈ బ్యాండ్‌ను 2010లో ప్రారంభించారు. ఈ స్థితికి చేరడానికి వారు చాలానే కష్టపడాల్సి వచ్చింది. బ్యాండ్‌లో చేరిన తర్వాత.. కొందరు వ్యక్తిగత కారణాల రీత్యా మధ్యలోనే మానేయడం వల్ల.. వీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. తల్లిదండ్రులు లేదా అత్తమామల ఒత్తిడికి తలొగ్గి కొందరు బ్యాండ్ నుంచి వెళ్లిపోయేవారు. వారి స్థానంలో కొత్త సింగర్స్‌ని వెతుక్కోవడం కాస్త కష్టంగానే ఉండేదట.

ADVERTISEMENT

ఇప్పుడు ఈ బ్యాండ్‌లో జయ కాకుండా.. మరో నలుగురు మహిళలున్నారు. నిహారికా దూబే (28) సింథసైజర్‌గా పనిచేస్తున్నారు. అనామికా జున్జున్వాలా (17) డ్రమ్స్, పూర్వి మాలవీయ(22) గిటార్ వాయిస్తారు. సౌభాగ్య దీక్షిత్ (20) ఓకలిస్ట్ కమ్ పెర్క్యూషనిస్ట్‌గా పనిచేస్తున్నారు. వీరి డ్రస్ కోడ్ కూడా కాస్త డిఫరెంట్‌గా, మహిళా సాధికారతను తెలియజేసేదిగా ఉంటుంది. పింక్ చుడీదార్ లేదా పింక్ చీర ధరించి మరీ పాటలు పాడతారు.

2-meri-zindagi

ఈ బ్యాండ్ సభ్యులంతా మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారే. అలాగని వీరంతా ఏదో ఖాళీగా ఉండి టైం పాస్ కోసం ఈ బ్యాండ్ ఏర్పాటు చేయలేదు. వీరిలో ఉద్యోగాలు చేసేవారు కొందరైతే.. కాలేజీలో చదువుకొంటున్నవారు మరికొందరు. వీరి సంగీత సాధన ఉదయం ఏడున్నరలోపే అయిపోతుంది. ఆ తర్వాత ఎవరి పనులు వారు చూసుకొంటారు.

ఏ రంగంలో అడుగుపెట్టిన మహిళలైనా సరే.. వారికి విజయం అంత తేలిగ్గా రాదు. ఆ విజయాన్ని అందుకోవడానికి చాలా శ్రమపడాల్సి ఉంటుంది. ఆ శ్రమనే తమ పాటల రూపంలో తెలియజేస్తూ మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు మేరీ జిందగీ రాక్ బ్యాండ్ సభ్యులు.

ADVERTISEMENT

ఇంతకీ మేరీ జిందగీ ఎలాంటి పాటలు పాడుతుందో తెలుసా? సెక్స్ ఆధారిత గర్భస్రావాలు, బాలికా విద్య, బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్, గృహ‌హింస‌, మహిళా రైతుల గురించి పాటలు పాడుతుంటారు. అలాగే ధూమపానానికి వ్యతిరేకంగానూ తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఎవరికైనా ఎవరిమీదైనా కోపమొస్తే.. నోటి నుండి మొదటగా వచ్చే మాట ‘నీయమ్మ’ అనే. ఇలాంటి పద్దతిని మార్చుకోవాలని పిలుపునిస్తూ #maaki పేరుతో క్యాంపెయిన్ నిర్వహించారు. ఇది చాలా పెద్ద హిట్టయ్యింది. 

ఈ బ్యాండ్ ఇప్పటి వరకు 100 ప్రదర్శనలు చేసింది. సుమారుగా 70 పాటల వరకు కంపోజ్ చేశారు. వాటిలో యూపీ మహిళా పోలీస్, సీఆరెస్- గుర్గావ్ కీ ఆవాజ్, హెల్ప్ లైన్ 1090 కు జింగిల్స్, ట్యూన్స్ అందించారు.

ఈ బ్యాండ్ కేవలం మహిళల సమస్యలపైనే పోరాటం చేయదు. పురుషుల సమస్యలపైనా పోరాటం చేస్తుంది. ధూమపానం వల్ల వారికి కలిగే అనారోగ్యాన్ని వివరిస్తూ.. #nosutta అనే మరో క్యాంపెయిన్ నిర్వహించారు. ఇది కూడా మంచి ఫలితాలను సాధించింది. అందుకే మేరీ జిందగీకి మహిళలతో పాటు పురుషుల ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే.

Images: Facebook

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

30 May 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT