మనసు చెప్పే భాష మన ఫ్యాషన్ ( ఈ అద్భుతమైన కొటేషన్లు మీకోసం)

మనసు చెప్పే భాష మన ఫ్యాషన్ ( ఈ అద్భుతమైన  కొటేషన్లు మీకోసం)

ఫ్యాషన్ (Fashion) అనేది కేవలం గ్లామర్ కోసమే కాదు.. మనమంటే ఏంటో తెలిపేందుకు కూడా  ఉపయోగపడుతుంది. మనం ఎలాంటి వ్యక్తులమో మనం ధరించే దుస్తులు చెబుతాయి. మన సెన్స్ ఆఫ్ స్టైల్ (Style)  బట్టి మన వ్యక్తిత్వాన్ని గుర్తించవచ్చంటారు నిపుణులు. అలాంటి ఫ్యాషన్ గురించి, స్టైల్ గురించి మాటల్లో చెప్పడం కాస్త కష్టమే.

కానీ ఫ్యాషన్ రంగానికి చెందిన కొందరు ప్రముఖులు ఎంతో స్పూర్తినిచ్చే మాటలు చెప్పి.. వాటిని చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా చేసేశారు. ఫ్యాషన్ రంగానికి చెందిన ఈ కొటేషన్స్ ఎప్పుడూ అవుట్ ఆఫ్ స్టైల్ కావంటే అతిశయోక్తి కాదు. ఆ కోట్స్ మీరూ ఓసారి చదివేయండి

 

 

ప్రేరణాత్మకమైన ఫ్యాషన్ కొటేషన్లు (Inspirational Fashion Quotes)

1.నువ్వు జీవితంలో కోరుకునేవి అన్నీ సాధించగలవు. అయితే దానికోసం నువ్వు మొదటి చేయాల్సింది మంచి డ్రెస్సింగ్ సెన్స్ కలిగి ఉండడం.

2. ఒక అమ్మాయికి సరైన షూ అందిస్తే చాలు.. తను ఈ ప్రపంచాన్నే గెలుస్తుంది.

3. స్టైల్ అనేది మనలో ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మనం చేయాల్సిందల్లా దాన్ని గుర్తించడమే.

4. ఈరోజుల్లో ఫ్యాషన్ అనేది ఓ భాష. మీ వేషధారణే మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది.

5. రోజువారీ జీవితాన్ని కొనసాగించేందుకు ఫ్యాషన్ మీకో కవచం లాంటిది.

6. ఎవరో ఒకరు ధరించే వరకూ.. దుస్తులకు సరైన అర్థం లేదు.

7. ఫ్యాషన్ అంటే సంవత్సరానికి నాలుగు సార్లు డిజైనర్లు రూపొందించేది. స్టైల్ అంటే అందులో మీరు ఎంపిక చేసుకొనేవి.

8. దుస్తులు మన శరీరతత్వానికి సరిపడేలా ఉండాలే కానీ.. శరీర తత్వం దుస్తులను బట్టి మారకూడదు.

9. స్టైల్ అనేది మీరు మాట్లాడకముందే.. మీ గురించి ఎదుటివాళ్లకు చెప్పేసే ఒక మార్గం

10. ప్రజలందరూ మిమ్మల్ని తదేకంగా చూస్తుంటారు. వారు చూసే చూపులకు మీ స్టైల్‌తో కాస్త విలువ పెంచండి.

Instagram

ప్రముఖ ఫ్యాషన్ కొటేషన్లు (Famous Fashion Quotes)

11. మీ బాడీ లాంగ్వేజ్, మీ పద్ధతిని మార్చేస్తుంది. కేవలం శారీరకంగానే కాదు.. మానసికంగానూ మిమ్మల్ని ఎదిగేలా చేస్తుంది.

12. స్టైల్ అనేది ఎక్కడో కొనే వస్తువు కాదు. అది ఓ షాపింగ్ బ్యాగ్, లేబుల్, ప్రైస్ ట్యాగ్ వంటివాటిలో ఉండదు. అది మీ మనసు నుండి మొదలై.. బయట ప్రపంచానికి కనిపిస్తుంది. 

13. మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకుండా ఉండాలంటే.. మీరు అందరికంటే విభిన్నంగా ఉండాల్సిందే.

14. ఫ్యాషన్ అనేది మనం తినే ఆహారపదార్థాల లాంటిది. రోజూ ఒకే మెనూ ఎలా తినమో రోజూ ఒకే రకమైన దుస్తులు ధరించలేం.

15. ఐదేళ్లప్పుడు కొత్త కొత్త దుస్తులు ధరించడం ఆటగా ప్రారంభమవుతుంది. అది ఎప్పటికీ ముగిసిపోదు.

16. సొగసు అంటే అందరిలో ప్రత్యేకంగా నిలవడం మాత్రమే కాదు.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆకర్షించడం.

17. అందరూ మన దుస్తులపైనే కాకుండా.. కాసేపు మనపై కూడా దృష్టి పెట్టాలి. అదే ఫ్యాషన్.

18. నా స్టైల్ అనేది నీ స్టైల్ కాదు. నీ స్టైల్ అనేది నీకే ప్రత్యేకంగా ఉంటుంది. అది నువ్వేంటనేది నీదైన రీతిలో చెబుతుంది.

19. డబ్బులు సంతోషాన్ని కొనలేవు అని ఎవరు చెప్పారో కానీ.. వాళ్లకు షాపింగ్‌కి ఎక్కడికి వెళ్లాలో తెలియదేమో. .

20. అమ్మాయిలు అబ్బాయిల కోసం డ్రస్ చేసుకోరు. వేరే అమ్మాయిల కోసం వాళ్లు సిద్ధమవుతారు. వాళ్లు అబ్బాయిల కోసం రెడీ అవ్వాలంటే ఎప్పుడూ నగ్నంగా తిరగాల్సిందే.

Instagram

ట్రెండింగ్ ఫ్యాషన్ కొటేషన్లు (Trending Fashion Quotes)

21. జీవితంలో అత్యుత్తమమైనవన్నీ ఉచితంగా లభిస్తాయి. అత్యుత్తమమైన వాటిలో రెండో వరుసలో ఉండేవి చాలా ఖరీదైనవి.

22. షాపింగ్ లాంటి మంచి విషయాలు బాధను తొలగిస్తుంటే.. డబ్బు చెడు విషయాలకు కారణం ఎలా అవుతుంది?

23. నువ్వు వేసుకునే డ్రస్ గురించి కాదు.. ఆ డ్రస్‌లో నువ్వు జీవించబోయే జీవితం గురించి ఆలోచించు..

24. లిటిల్ బ్లాక్ డ్రెస్ (ఎల్ బీడీ) వేసుకుంటే చాలు.. మీరు ఏ సందర్భానికైనా సరే.. మరీ ఎక్కువగా రడీ అయినట్లు కానీ, తక్కువగా తయారైనట్లు కానీ కాదు.

25. ట్రెండ్‌నే పట్టించుకుంటూ ఉండిపోకండి. ఫ్యాషన్ మీపై ప్రభావం చూపడం కాదు.. మీరంటే ఏంటో తెలియజేసేలా చేయండి.

26. అత్యుత్తమమైన ఫ్యాషన్ ఎప్పుడూ వీధుల్లోనే కనిపిస్తుంది. ఇంతకుముందు, ఇకపైన కూడా..

27. రోజూ నువ్వు నీ పెద్ద శత్రువును కలవబోతున్నట్లుగా డ్రస్ వేసుకొని.. రడీ అయ్యి ఇంటి నుంచి బయల్దేరాలి.

28. దుస్తులు మంచి రుచికరమైన భోజనం, అద్భుతమైన సినిమా, వినసొంపైన సంగీతం లాంటివి.

29. రోజూ మారిపోయే ట్రెండ్స్ ఉన్న ఈ లోకంలో ఎప్పటికీ నిలిచిపోయే ఫ్యాషన్‌లా ఉండాలని కోరుకోండి.

30. జీవితంలో ఒకే ఒక రూల్ ఉంటుంది. ఎప్పుడూ బోరింగ్‌గా ఉండకపోవడం.. ఎఫ్పుడైనా క్యూట్‌గా రడీ అవడమే అది. జీవితం చాలా చిన్నది. దాన్ని రోజూ ఎంజాయ్ చేయాలి.

ఈ ఫ్యాష‌న‌బుల్ వ‌స్తువులు.. మీ వార్డ్‌రోబ్‌లో త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే..!
Instagram

క్లాసిక్ ఫ్యాషన్ కొటేషన్లు (Classic Fashion Quotes)

ప్రియమైన ఫ్యాషన్ మహారాణి, ఒక్క కొత్త వస్తువు కూడా కొనకుండా.. కొత్త వార్డ్ రోబ్ ఎలా తయారుచేసుకోవాలో చెబుతాం.. వింటావా..?

31. ఒక మహిళ తనకు సౌకర్యవంతమైన దుస్తులు, నచ్చిన దుస్తులు మాత్రమే ధరించాలి. అప్పుడే ఆమె అందంగా కనిపిస్తుంది. 

32. నాకు ఫ్యాషన్ అంటే ఇష్టం. నన్ను నేను బయట ప్రపంచానికి పరిచయం చేసుకునే దారి అది.

33. ఫ్యాషన్ అనేది ఓ భాష. కొంతమందికి అది పుట్టుకతోనే వస్తుంది. కొంతమందికి నేర్చుకుంటే వస్తుంది. కొంతమందికి అది ఎప్పటికీ రాదు.

34. ఫ్యాషన్ అంటే కలలు కనడం.. ఇతరులను కలలు కనేలా చేయడం.

35. ఫ్యాషన్ అంటే సౌకర్యవంతంగా ఉంటూనే.. అందంగా కనిపించడం

36. బాగా రడీ అవ్వడం కూడా ఒక రకమైన మర్యాదే..

37. నలుపు రంగు దుస్తులు ధరించే అమ్మాయిల జీవితం కలర్ ఫుల్‌గా ఉంటుంది.

38. ఫ్యాషన్ అనేది ఓ కళ. దాని కాన్వాస్ మీరే..

39. మీ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా సరే.. ఎప్పుడూ లేచి అద్భుతంగా రడీ అయి ప్రపంచానికి చూపించాల్సిందే.

40. ఒక మహిళ అందంగా ఉందన్న ఫీలింగ్ కంటే.. ఆమెను ఏ డ్రస్సూ అందంగా చూపలేదు.

 

తొడలు లావుగా ఉన్నాయా? ఇలా చేస్తే సన్నగా కనిపిస్తారు..!

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.