ADVERTISEMENT
home / Celebrity Life
నటనతోనే కాదు.. పాటతోనూ మెప్పించిన కథానాయికలు వీరే..!

నటనతోనే కాదు.. పాటతోనూ మెప్పించిన కథానాయికలు వీరే..!

హీరోయిన్ భానుమతి గుర్తున్నారా? తాను నటించిన అన్ని సినిమాల్లో తన పాటలు (songs) తానే పాడుకున్నారు. ఆ తర్వాత అలాంటి హీరోయిన్లు మళ్లీ కనిపించలేదు. కానీ ఈ తరానికి చెందిన అందాల నాయికలు అందం, అభినయంతో పాటు తమ గాత్రంతో అలరిస్తున్నారు. ఆ పాటలు సూపర్ డూపర్ హిట్లుగా సైతం నిలిచాయి. వావ్ అనిపిస్తోంది కదా. మరింకెందుకాలస్యం.. తమ గొంతు సవరించుకున్న కొందరు టాలీవుడ్ కథానాయికల (Tollywood actresses) గురించి తెలుసుకుందాం.

శ్రుతి హాసన్

కమల్ హాసన్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైన శ్రుతి గాయనిగానూ రాణించింది. సంగీతం నేర్చుకొన్న శ్రుతి హాసన్ ‘ఈనాడు’ చిత్రానికి మ్యూజిక్ కంపోజర్‌గా పనిచేసింది. చిన్న వయసు నుంచే సినిమా నేపథ్య గాయనిగా పాటలు పాడటం ప్రారంభించింది. తన తండ్రి కమల్ హాసన్ నటించిన క్షత్రియ పుత్రుడు, హేరామ్, భామనే సత్యభామనే తదితర చిత్రాల్లో పాటలు పాడింది. హీరోయిన్‌గా  తన ప్రయాణం ప్రారంభించిన తర్వాత కూడా ఆమె పాట ఆగలేదు. సెవెన్ సినిమాలో ‘ఏలేలమా’, ఓ మై ఫ్రెండ్ సినిమాలో ‘శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్’, రేసుగుర్రం సినిమాలో ‘డౌన్ డౌన్ డౌన్ డప్పా’, ఆగడు సినిమాలో ‘జంక్షన్లో..’ మొదలైన పాటలు పాడింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం కలిపి 30 కి పైగా పాటలు పాడింది శ్రుతి.

నిత్యమేనన్

‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగులో కెరీర్ ప్రారంభించిన నిత్య మేనన్ అదే సినిమాతో సింగర్‌గానూ మారింది. ‘అలా మొదలైంది’ సినిమాలో ‘ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది’, ‘అమ్మమ్మో.. అమ్మో.. అమ్మాయి అంటే’ మొదలైన పాటలు పాడింది. తెలుగులో కంటే ముందే ‘ఐదోండ్ల ఐదు’ అనే తమిళ సినిమాలో ఓ పాట పాడింది. ఇష్క్ సినిమాలో ఓ ప్రియా ప్రియా, గుండె జారి గల్లంతయ్యిందేలో తుహిరే  పాటలు ఆమెకు సింగర్‌గా మంచి పేరు తెచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన మాలిని సినిమాలో దాదాపుగా అన్ని పాటలను నిత్య మీననే పాడింది. తెలుగు,  తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో  సుమారుగా 19 పాటలను పాడింది నిత్య మేనన్.

ADVERTISEMENT

స్వాతి రెడ్డి

మా టీవీలో కలర్స్ ప్రోగ్రాంతో అందరికీ పరిచయమైన స్వాతి.. ఆ తర్వాత డేంజర్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళ చిత్ర సీమలో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్న స్వాతి పాటలు కూడా పాడింది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ చొరవతో ఆమె సింగర్‌గానూ మారింది. 100% లవ్ సినిమాలో ‘ఏ స్క్వేర్ బీ స్క్వేర్’ పాట పాడింది తానే. ఈ పాట అప్పట్లో పెద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత స్వామి రారా సినిమాలో ‘యో యో యో మేము అంతా..’ అంటూ తన గళాన్ని సవరించుకొంది. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు సినిమాలో సైతం ‘అన్ బిలీవబుల్’ అనే పాటను పాడింది.

మమతా మోహన్ దాస్

మమతను సైతం గాయనిగా మార్చింది దేవిశ్రీ ప్రసాదే. రాఖీ సినిమాలోని రాఖీ రాఖీ రాఖీ నా కవసాఖీ పాట పాడింది మమతా మోహన్ దాసే. ఈ పాట ఎంత పెద్ద హిట్టో మనం చెప్పుకోనక్కర్లేదు కదా. ఆ తర్వాత శంకర్ దాదా జిందాబాద్‌లో ‘ఓలమ్మీ తిక్క రేగిందా’, కింగ్ సినిమాలో ‘కే ఐ ఎన్ జీ వస్తున్నాడు కింగ్’, ‘ఘనన ఘనన’, యమదొంగలో ‘ఓలమ్మీ తిక్క రేగిందా’, జగడం సినిమాలో ‘36-24-36’, చందమామ సినిమాలో  ‘సక్కుబాయినే’, ఇలా తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో 26 పాటలను పాడింది మమత.

ADVERTISEMENT

రాశిఖన్నా

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది రాశిఖన్నా. తన రెండో సినిమా జోరుతోనే సింగర్‌గా మారింది. జోరు సినిమా టైటిల్ సాంగ్, బాల‌కృష్ణుడు సినిమాలో ‘తరీరా..’, జవాన్ సినిమాలో ‘బంగారూ..’ అనే పాటను పాడింది.

మంచు లక్ష్మి

హీరోయిన్‌గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి సింగర్‌గానూ తన సత్తా చాటింది. దొంగాట సినిమాలో ‘ఏందిరో’ అంటూ అందరినీ ఆకట్టుకొంది. ఆ తర్వాత తాను వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘మేము సైతం’ కార్యక్రమానికి సైతం తానే పాట పాడింది.

ADVERTISEMENT

అంజలి

తెలుగమ్మాయి అంజలి టాలీవుడ్, కోలీవుడ్‌లో హీరోయిన్ గా గుర్తింపు పొందింది. జర్నీ, సీతమ్మ వాకిట్లో  సిరిమల్లె చెట్టు, గీతాంజలి సినిమాల్లో తన నటనతో మెప్పించింది. చిత్రాంగద సినిమాతో గాయనిగా సైతం మారింది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT

12 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT