సెక్స్ కలలకు అర్థాలెన్నో.. మరెన్నో..!

సెక్స్ కలలకు అర్థాలెన్నో.. మరెన్నో..!

మన సబ్ కాన్షియస్ మైండ్ ఏం ఆలోచిస్తుందో అవే కలల (dreams) రూపంలో వస్తాయట. అయితే కొన్నిసార్లు ఆ సబ్ కాన్షియస్ మైండ్ చాలా చిలిపిగా మారిపోతుంది. మరికొన్నిసార్లు భయపెడుతుంది. కొన్ని కలలైతే  నిద్ర మొత్తం పాడు చేసి రాత్రంతా మెలకువగా ఉండేలా చేస్తాయి.


చిత్రమేంటంటే.. కొంతమందికి తమ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌తో లేదా వేరెవరితోనో కలయికలో (sex) పాల్గొన్నట్లు కూడా కలలొస్తాయి. సాధారణంగా ఇలాంటి కలలు రాకూడదనే కోరుకుంటారు అమ్మాయిలు. కానీ దానికి భిన్నంగా ఎవరితోనో లైంగిక చర్యలో పాల్గొన్నట్లు కలొస్తే..  నిద్ర ఎలా పడుతుంది?


వాస్తవానికి అలా జరగాలని ఎవ్వరూ కోరుకోరు. కానీ గత పరిచయాలు, కోరికలు,  పాత రిలేషన్ షిప్స్‌లో ఏర్పడిన బంధాలు.. వీటితో పాటు నెరవేరని మీ ఆశలు, ఆలోచనలే ఇలాంటి కలల రూపంలో వస్తాయట. అసలు ఈ సెక్స్ డ్రీమ్స్ వెనుక పెద్ద కథే ఉంది. అదేంటో మనమూ తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం 


1. అపరిచితుడితో..


మీరు బస్సులో చూసిన లేదా రోడ్డు పై ఎదురైన అందమైన అపరిచిత వ్యక్తితో కలయికలో పాల్గొన్నట్లు కల (dream) వచ్చిందా? అయితే దీనికి మీ సబ్ కాన్సియస్ మైండ్‌కు అసలు  సంబంధమే లేదు. మరి ఎందుకు ఇలాంటి కల వచ్చింది? బహుశా అతనిలో ఉన్న ఏదో ఒక లక్షణం.. మిమ్మల్ని ప్రభావితం చేసుండవచ్చు. అదే ఈ కలకు కారణమై ఉండవచ్చు.


కాబట్టి అతన్ని చూడగానే మీ మెదడు ఏం ఆలోచించింది?  మీరు అతనిలో ఏ లక్షణాలను బాగా గమనించారో గుర్తించండి. మీకు స్పష్టత వచ్చేస్తుంది. పైగా మీరు ఏం కావాలనుకొంటున్నారో దాని మీద కూడా క్లారిటీ వస్తుంది.


2. ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో


ఈ మధ్య కాలంలో.. మీరు మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో సెక్స్‌లో (sex)  పాల్గొన్నట్లు కల వచ్చిందా? భయపడకండి. దాదాపుగా అందరికీ ఇలాంటి కలలు వస్తాయి. అయితే.. ఇలాంటి కల మీకు వచ్చిదంటే అతని మీద.. మీకు మళ్లీ ప్రేమ పుట్టుకొస్తుందని కాదు. బహుశా మీ జీవితంలో అతను తీసుకొచ్చిన మార్పులను మీరు మిస్సవుతున్నారని కూడా అర్థం కావచ్చు.


అలాగే మీరు మీ ప్రస్తుత భాగస్వామిలో.. మీరు కోరుకొన్న ఏదో ఒక లక్షణాన్ని మిస్సవుతున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు కొత్తగా మరో వ్యక్తితో రిలేషన్ షిప్ మొదలుపెట్టినప్పుడు ఇలాంటి కలలు వస్తే.. మీరు ప్రతి విషయంలోనూ ఇద్దరినీ పోలుస్తున్నారని అర్థం. 


3-sex-dreams


3. బలవంతానికి గురైనట్లు కలొస్తే..


కొన్నిసార్లు అమ్మాయిలకు తాము బలాత్కారానికి గురైనట్లు కలలొస్తుంటాయి. గతంలో ఎప్పుడైనా లైంగిక వేధింపులకు గురైన వారికి ఆ భయానక అనుభవాలు.. మనసులో ముద్రించుకొని పోవడం వల్ల ఇలాంటి కలలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకూ ఇలాంటి పరిస్థితి ఎదురై.. అలాంటి కలలొస్తుంటే.. తీవ్రమైన మానసిక వేదనతో మీరు బాధపడుతున్నట్టే లెక్క.


కాబట్టి వెంటనే మానసిక వైద్యులను సంప్రదించి ఆ ట్రామా నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. లైంగిక వేధింపులకు గురికాని వారికి సైతం ఇలాంటి కలలు రావడానికి అవకాశం ఉంటుంది. దానికి కారణం మీరు ఏదో ఒక విషయంలో నిస్సహాయంగా, నిర్లిప్తంగా ఉన్నారని అర్థం.


4. సెలబ్రిటీతో సెక్స్


కొంతమందికి తాము ఇష్టపడే హీరోలు, క్రీడాకారులతో సెక్స్‌లో పాల్గొన్నట్లు కలలు వస్తుంటాయి. దీనికి వారిపై ఉన్న అభిమానం, ప్రేమ కారణమని అనుకొంటున్నారా? కానే కాదు. ఇలాంటి కలలకు వేరే అర్థం ఉంది. మీరు సమాజంలో పెద్ద హోదాను, పేరును కోరుకుంటున్నారన్నమాట. అలాగే అందరికంటే భిన్నంగా, అందరిలోనూ ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారన్నమాట.


5-sex-dreams


5. బెస్ట్ ప్రెండ్‌తో..


మీ బెస్ట్ ఫ్రెండ్ (అది అమ్మాయైనా సరే..) తనతో సెక్స్‌లో పాల్గొన్నట్లు కల వస్తే.. దానికి అర్థం మీరు వారి పట్ల లైంగిక వాంఛలు కలిగి ఉన్నారని కాదు. వారిలో మీకు బాగా నచ్చినవి, మీలో లేనివి ఏవో కొన్ని లక్షణాలు ఉండి ఉండాలి. వాటిని మీరు కూడా అలవాటు చేసుకోవాలని భావిస్తున్నారని ఈ కలకు అర్థం కావచ్చు.


6. మోసం చేస్తున్నట్లు


నిజ జీవితంలో ఇతరులను మోసం చేసే గుణం లేకపోయినా.. కొన్నిసార్లు భాగస్వామిని మోసం చేసి వేరే వ్యక్తితో కలయికలో పాల్గొన్నట్లు కలలు రావచ్చు. అయితే దీనికి అర్థం మీరు వారికి ద్రోహం చేస్తున్నారని కాదు.


మీ రిలేషన్ షిప్ విషయంలో మీరు అభద్రతా భావానికి గురి కావడం, మీ భాగస్వామి మీపై సరిగా శ్రద్ధ వహించకపోవడం వంటివి ఇలాంటి కలలు రావడానికి కారణమై ఉండొచ్చు. అలాగే వారికి తెలియకుండా.. మీరు చేసిన పని వారికి తెలిసిపోతుందనే భయం కూడా ఇలాంటి కలలు రావడానికి కారణమై ఉండొచ్చు.


7. పబ్లిక్ రొమాన్స్


నలుగురిలో ఉన్నప్పుడు ప్రేమించిన వ్యక్తితో రొమాన్స్ చేయడం చాలా కష్టమైన పనే. అందులోనూ ఇతరులు మనల్ని గమనిస్తున్నారని తెలిసినప్పుడు అది మరింత కష్టంగా ఉంటుంది. అలాంటిది పబ్లిక్ ప్రదేశాల్లో సెక్స్ చేసినట్టు కల వస్తే దాని అర్థం ఏమై ఉంటుంది?


నలుగురిలోనూ హేళనకు గురవుతారేమో అనే భయం ఇలాంటి కలలకు కారణం. ముఖ్యంగా తాను ప్రేమించే వ్యక్తుల ముందు తలదించుకోవాల్సి వస్తుందేమో అనే భయం కూడా ఈ కలలకు కారణమే. బహుశా మీరు వారికి తెలియకుండా ఏదైనా తప్పు చేసి.. అది వారికి తెలిసిపోతుందని భావిస్తే.. ఆ భయం వల్ల వచ్చే కలలివి.8. పై అధికారితో..


కాలేజ్‌లో ప్రొఫెసర్ లేదా ఆఫీసులో మీ బాస్‌తో ఏకాంతంగా సమయం గడిపినట్లు కల వస్తే.. వారంటే మీరు పడి చచ్చిపోతున్నారని కాదు. మరేంటి దీని అర్థం? మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకొనేంత స్థాయికి వచ్చారని, మీ జీవితాన్ని మీరు చక్కదిద్దుకోగలరని అర్థం.


9. అసహ్యించుకొనేవారితో సెక్స్


మీరు బాగా అసహ్యించుకొనే వ్యక్తి మీ కలలోకి రావడం, అతనితో కలయికలో పాల్గొనడం అంటే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ దానికి కారణం.. మీ ఇద్దరి మధ్య సారూప్యంగా కనిపిస్తున్న లక్షణాలను మీరు వారిలో గమనించి ఉండవచ్చు. లేదా మీరు పెంపొందించుకోవాలని భావిస్తున్న లక్షణమేదో వారిలో కూడా ఉండి ఉండవచ్చు.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.


క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.


Images: Shutterstock, Giphy