50 షేడ్స్ ఆఫ్ గ్రేను మించిన.. 10 అడల్ట్ సినిమాలు ఇవే..!

50 షేడ్స్ ఆఫ్ గ్రేను మించిన.. 10 అడల్ట్ సినిమాలు ఇవే..!

సెక్స్(Sex) సినిమా అనగానే మనకు గుర్తొచ్చే రెండు చిత్రాలు కామసూత్ర, ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే. ఈ సినిమాలు చూసిన తర్వాత ఎవరికైనా సెక్స్ పై ఎంతో కొంత ఆసక్తి పెరగకుండా పోదు. కొంతమంది అయితే తమ భాగస్వామితో కలసి ఈ చిత్రాలు (movies) చూస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఎప్పుడూ ఇవేనా? ఇంకా కొత్త చిత్రాలేమీ లేవా? అనిపిస్తుంటుంది. అందుకే మీకోసమే టాప్ 10 అడల్డ్ మూవీస్‌ను (Sex Movies) పరిచయం చేస్తున్నాం. ఇవి మిమ్మల్ని లైంగికంగా ఉత్తేజితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

1. కిల్లింగ్ మి సాఫ్ట్లీ

ఈ చిత్రంలో కథానాయిక అన్ని రకాలుగా మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అయితే ఇదంతా ఆమె జీవితంలోకి మరో వ్యక్తి రాకముందు వరకు మాత్రమే. ఆ వ్యక్తితో ప్రేమలో పడడం కోసం.. తన కలయికలో ఆనందాన్ని పొందడం కోసం.. తన బాయ్ ఫ్రెండ్‌ను సైతం వదిలేస్తుంది. చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది కదా. ఈ సినిమాలో సూపర్ హాట్ హీరోయిన్ హీథర్ గ్రాహం కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో రికార్డు స్థాయిలో రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయంట. 

Giphy

2. టై మి అప్! టై మి డౌన్!

పేరు వింటేనే థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. ఇక చూస్తే ఎలా ఉంటుందో? ఈ సినిమాలో కథనాయకుడిగా ఆంటోనియో బాండిరాస్ నటించాడు. స్థూలంగా ఈ సినిమా కథేంటంటే.. తన మాజీ ప్రియురాలితో కలసి బ్రతికేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆమె అతన్ని గుర్తు పట్టదు. దీంతో ఆమెను తిరిగి ఆకట్టుకోవడానికి, ప్రేమలో పడేయటానికి ప్రయత్నిస్తుంటాడు. అందులో భాగంగానే ఆమె కాళ్లు, చేతులను కట్టేసి బంధిస్తాడు. ఆ తర్వాత ఎలాంటి రొమాంటిక్ డ్రామా జరుగుతుందో తెర పై చూడాల్సిందే.

3. లై విత్ మి

ఈ సినిమా మొత్తం లైలా, డేవిడ్‌ల చుట్టూనే తిరుగుతుంటుంది. నైట్ క్లబ్‌లో కలుసుకున్న వీరిద్దరూ అనుకోకుండా కలయికలో పాల్గొంటారు. ఆ తర్వాత డేవిడ్ తన గర్ల్ ఫ్రెండ్‌ను వదిలేసి లైలా దగ్గరకు చేరుకుంటాడు. ఇద్దరూ కలిసి జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే అన్నీ అనుకున్నట్లే సాగితే గొడవేముంది? తను ఓ ట్రాప్‌లో చిక్కుకున్నట్లు లైలా భావిస్తుంది. ఆమె ఇలా భావించడానికి కారణమేంటి? వారిద్దరి మధ్య ఏం జరిగింది? తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో నాయికా, నాయికల మధ్యసాగే రొమాంటిక్ సన్నివేశాలు కాస్త శ్రుతి మించి ఉంటాయట. 

4. క్రూయల్ ఇంటెన్షన్స్

ఈ సినిమా మీరు చూడకపోతే ఇప్పుడు కచ్చితంగా చూడాల్సిందే. ఈ సినిమా హైస్కూల్లో చదువుతున్న టీనేజ్ పిల్లల చుట్టూ తిరిగే కథ. 2000లో విడుదలైన ఈ సినిమాకు ఎమ్టీవీ బెస్ట్ కిస్ అవార్డ్ 2000 దక్కింది. ఈ సినిమాలో కూడా అడల్ట్ సన్నివేశాలు కాస్త శ్రుతి మించి ఉంటాయట. 

Giphy

5. బ్లూ ఈజ్ ది వార్మెస్ట్ కలర్

ఫ్రెంచ్ టీనేజ్ అమ్మాయి తన వీధి చివరన ఉన్న.. ఓ లెస్బియన్ బార్ దగ్గర మరో అమ్మాయిని కలుసుకుంటుంది. అంటే ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య ఏర్పడిన అనుబంధానికి ఈ సినిమా ప్రతీక. ఈ సినిమాకు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో సైతం అవార్డులు దక్కాయి.

6. సెక్రటరీ

కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కుంటూ ఉంటుంది ఓ అమ్మాయి. ఆమె ఓ అటార్నీ దగ్గర సెక్రటరీగా చేరుతుంది. అప్పటికే అనేక సమస్యల మధ్య సతమతమవుతున్న ఆమెకు.. తనకు కూడా ఓ సమస్యగా మారతాడు. ఎందుకంటే అతన్ని డీల్ చేయడం చాలా కష్టం. అయితే నెమ్మదిగా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ మొదలువుతుంది. చివరకు అది బీడీఎస్ఎమ్ రిలేషన్‌గా మారుతుంది. ఈ పరిణామం చాలా ఆసక్తిని కలిగిస్తుంది.

7. ది లాస్ట్ టాంగో ఇన్ పారిస్

విడాకులు తీసుకున్న ఓ అమెరికన్ వింత ప్రవర్తన, ఫ్రెంచ్ వనితతో అతని కన్ఫ్యూజింగ్ రిలేషన్‌షిప్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. శ్రుతి మించిన రొమాన్స్, లైంగిక హింసతో కూడిన సన్నివేశాల కారణంగా ఈ సినిమా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. అయితే విమర్శకులు మాత్రం ఈ జోనర్ సినిమాల్లో "ది లాస్ట్ టాంగో ఇన్ పారిస్"ను ఉత్తమ చిత్రంగా పరిగణిస్తారు.

Giphy

8. షార్ట్ బస్

తన భర్తతో లైంగిక ఆనందాన్ని పొందలేకపోతున్న ఓ మగువ కథ ఇది. ఈ విషయంలో ఆమె ఎంతగా ప్రయత్నించినా..  ఎన్ని ప్రయోగాలు చేసినా పెద్దగా ఫలితం కనిపించదు. ఆ నిరాశ, నిస్ప్రహలే ఆమెను ఓ సెక్సువల్ సెలూన్‌కి వెళ్లేలా ప్రేరేపిస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

9. షేమ్

సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నట్లు నటించే ఓ సెక్స్ అడిక్ట్ కథ ఇది. ఈ సినిమా పురుషుడి శరీర అవసరాలను తెలియజేయడంతో పాటు.. చుట్టూ ఉన్న పరిస్థితులు అతనిలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో ఈ చిత్రంలో ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.

10. బేసిక్ ఇన్‌స్టింక్ట్

ఓ క్రైమ్ నవలా రచయిత్రి బాయ్ ఫ్రెండ్ హత్యకు గురవుతాడు. అతని హత్యతో ఆమెకు సంబంధం ఉంటుంది. ఈ విషయంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ డిటెక్టివ్‌ను సైతం ఆమె ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కొన్ని హత్యలు జరుగుతాయి. అనుమానితులూ పెరుగుతారు. మరి ఈ మిస్టరీను ఎలా ఛేదించారు? కథలో రొమాన్స్ పాత్ర ఏంటి? తెలుసుకోవాలనంటే  సినిమా చూడాల్సిందే.

Giphy

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.