20 జులై 2019, శనివారం (ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

20 జులై 2019, శనివారం (ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (జూలై 20) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ప్రేమ వ్యవహారానికి సంబంధించిన సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. పాత విభేదాలు కూడా తొలిగిపోతాయి. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఇదే సరైన అవకాశం. కుటుంబ వాతావరణం సరదాగా సాగుతుంది. విద్యార్థులు ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం. 

వృషభం (Tarus) – విద్యార్థులు కష్టపడితే విజయం సాధించగలరు. ఉద్యోగులు ఆఫీసులో సమస్యలను అధిగమిస్తారు. అధికారులకు మీ ఐడియాలు నచ్చుతాయి. కొత్త పనులు టేకప్ చేసేముందు.. పాత పనులు పెండింగ్‌లో లేకుండా చూడండి. ప్రేమికులు నూతన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వివాహితులకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 

ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

మిథునం (Gemini) – మీ రోజు మీ ఖర్చులను నియంత్రించండి. వ్యాపారస్తులు అప్రమత్తతతో వ్యవహరించాలి. లేకపోతే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ముఖ్యంగా ఏజెంట్లను, బ్రోకర్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహితులకు తమ భాగస్వామితో ఏర్పడిన మనస్పర్థలు తొలిగిపోతాయి. అయితే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీ కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. అయితే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వివాహితులకు మీ భాగస్వామితో గడపడానికి.. మనసులోని భావాలను పంచుకోవడానికి సాధ్యమైనంత ఎక్కువ సమయం దొరుకుతుంది. ప్రేమికులు తీసుకొనే నిర్ణయాలు వారికి మేలే చేస్తాయి. విద్యార్థులకు సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

సింహం (Leo) – ఈ రోజు ప్రేమికులకు కొన్ని అనుకోని చిక్కులు ఎదురవుతాయి. అయినా వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోండి. వివాహితులు తల్లిదండ్రులు లేదా అత్త,మామల నుండి వచ్చే ఒత్తిళ్లను తట్టుకోవాలి. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు, ఆస్తి లావాదేవీలలో సాధ్యమైనంత వరకు నిజాయతీగా ఉండడానికే ప్రయత్నించండి. మీ తప్పు లేనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు.  

క‌న్య (Virgo) – ఈ రోజు ఆరోగ్యంతో పాటు ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని చట్టపరమైన నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆఫీసులో శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థుల ఆసక్తి ప్రత్యమ్నాయ రంగాల మీదకు మళ్లచ్చు.  వివాహితులు తమ భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ప్రేమికుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. 

తుల (Libra) –  ఈ రోజు అత్తమామల నుండి ఖరీదైన బహుమతులు లేదా కానుకలు లభిస్తాయి. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభం, ఉద్యోగస్తులకు ప్రమోషన్ సాధ్యమే. అయితే ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ పెట్టాలి. పెట్టుబడుల విషయంలో స్నేహితుల సహాయం లభిస్తుంది. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించండి. 

వృశ్చికం (Scorpio) –  ప్రేమికులు లేదా వివాహితులు రొమాంటిక్ జర్నీ చేయడానికి ఈ రోజు ఎంతో అనువైనది. అలాగే రాజకీయ నాయకులకు ఈ రోజు సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణ యోగం ఉంది.  వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. మీ తల్లిదండ్రులు లేదా ప్రాణమిత్రుల సలహాలు తీసుకోండి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఆఫీసులో తనిఖీలు లేదా ఆడిట్ జరిగే అవకాశం ఉంది. కనుక పనిపై చాలా శ్రద్ధ వహించండి. ఎలాంటి వివాాదాస్పద నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి సాదాసీదాగా ఉంటుంది. వివాహితులు కోపాన్ని నియంత్రించుకోవడం బెటర్. అలాగే మీ భాగస్వామి మనసును అర్థం చేసుకొని.. ప్రవర్తించడం మేలు. 

మకరం (Capricorn) – వ్యాపారస్తులు ప్రత్యమ్నాయ మార్గాల్లో.. అదనపు ఆదాయానికి ప్రయత్నిస్తారు. స్టాక్ మార్కెట్ రంగంలోని వ్యక్తులు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఆఫీసులో పర్సనల్ విషయాలను చర్చించకపోవడం మంచిది. వివాహితులు తమ భాగస్వామితో దూర ప్రయాణాలు చేయడానికి ఇదే అనువైన సమయం.  రాజకీయ రంగంలోని వ్యక్తులకు ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది. 

కుంభం (Aquarius) – ఈ రోజు వ్యాపారస్తులు చాలా బిజీ బిజీగా గడుపుతారు. ఉద్యోగస్తులకు కొన్ని విషయాల్లో అతి నమ్మకం, అతి విశ్వాసం పనికిరాదు. వివాహితులు భాగస్వామి తెలివితేటలను తక్కువ అంచనా వేయద్దు. అవే మిమ్మల్ని భవిష్యత్తులో..  ఓ సమస్య నుండి తప్పిస్తాయి. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం బెటర్.

మీనం (Pisces) –  ఈ రోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులు కెరీర్ విషయంలో మూడో వ్యక్తి సలహా తీసుకోకుండా ఉంటే మంచిది. మీ పని మీరు నిజాయతీగా చేసుకుంటూ వెళితే బెటర్.  అలాగే పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు. ప్రేమికులు ఒకరి పట్ల మరొకరు నిజాయతీగా ఉంటే మంచిది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.