1 జులై 2019, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

1 జులై 2019, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

ఈ రోజు (జులై 1) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు అవివాహితులకు అనుకూలమైన సమయం. అలాగే పెళ్లిచూపులకు వెళ్లడానికి అనువైన రోజు. ఇక వ్యాపారస్తులకు ఈ రోజు సులభ ధనయోగం ఉంది. ఉద్యోగస్తులు కాస్త ఒత్తిడిని ఎదుర్కొన్నా.. ఆఖరికి అనుకున్న పనిచేయడంలో సఫలం అవుతారు. అదేవిధంగా విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకుంటారు. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది

వృషభం (Tarus) – ఈ రోజు ఉద్యోగస్తులకు కష్టకాలం. అనుకోని సమస్యలు చుట్టుముడతాయి. అయినా ఆత్మస్థైర్యంతో. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే వాటిని ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబ జీవితానికి వస్తే.. మీ భాగస్వామికి మీకూ మధ్య ఏర్పడ్డ మనస్పర్థలు తొలిగిపోతాయి. అలాగే ఈ రోజు మీరు కొన్ని దుర్వార్తలు వినే అవకాశం ఉంది. కానీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వ్యవహరించండి. 

మిథునం (Gemini) – ఈ రోజు వ్యాపారస్తులకు శుభదినం. కొత్త పరికరాలు లేదా వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు బాగా కలిసొస్తుంది. పదోన్నతులు లేదా స్వస్థలానికి బదిలీలు సంభవించే అవకాశం ఉంది. కుటుంబ జీవితానికి వస్తే.. మీరు మీ భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. అయితే వాహనాలు నడిపేటప్పుడు.. ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఉద్యోగస్తులు జాగరూకతతో వ్యవహరించాలి. ఆఫీసులో ప్రత్యర్థులు మీపై అధికారులకు చాడీలు చెప్పే ప్రయత్నాలు చేసే అవకాశముంది. అలాగే పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు కాస్త వ్యతిరేక ఫలితాలను చూపించవచ్చు. ముఖ్యంగా ఒప్పందాలు రద్దు అయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మీ కుటుంబం మీకు అన్నివిధాలుగా సహకరిస్తుంది. 

సింహం (Leo) –  ఈ రోజు మీ మనసును గాయపరిచే సంఘటనలు జరగవచ్చు. అయినా బాధపడకుండా.. ప్రాక్టికల్‌గా ఆలోచించండి. వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ కనపరచండి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాదాల జోలికి వెళ్లవద్దు. అలాగే విద్యార్థులు బాగా కష్టపడాల్సిన సమయం. ఇక కుటుంబ జీవితానికి వస్తే.. మనస్పర్థలు తొలిగి.. మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

క‌న్య (Virgo) –  ఈ రోజు మీరు మీ భాగస్వామితో హాయిగా, ఆనందంగా గడుపుతారు. అలాగే పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.  వ్యాపారస్తులకు అదనపు వ్యాపార వనరులు సమకూరుతాయి.  విద్యార్థులు కూడా తమ లక్ష్యాలను చేరుకుంటారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 

ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట 

తుల (Libra) – ఈ రోజు ఉద్యోస్తులకు శుభదినం. మీ మాటలతో మీ అధికారులను ప్రభావితం చేయగలుగుతారు. అలాగే మీ కష్టానికి కూడా తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. గృహిణులు ఈ రోజు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలను చేరుకుంటారు. అదేవిధంగా కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది.

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు ఆస్తులు కొనుగోలు చేయడం లేదా అమ్మే విషయాలలో బిజీగా ఉంటారు. అలాగే మీరు ఆర్థికంగా కూడా పురోగమనం సాధిస్తారు. అదేవిధంగా పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించే అవకాశం ఉంది. అయితే మీ భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు. వాహనాలు నడిపే విషయంలో లేదా ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు నుండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మీ ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. అలాగే ఆఫీసులో అదనపు బాధ్యతలు తీసుకోవడానికి కూడా ప్రయత్నించండి. దాని వల్ల మీకు భవిష్యత్తులో మేలు జరుగుతుంది. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలను సాధిస్తారు.  సృజనాత్మక రంగం, సినిమా, మార్కెటింగ్ రంగాల్లో పనిచేసే వారికి ఈ రోజు బాగా కలిసొస్తుంది. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..? 

మకరం (Capricorn) –  ఈ రోజు మీ కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. పలు వివాదాస్పదమైన విషయాలు చర్చకు వస్తాయి. ఇలాంటి సమయంలోనే సహనంతో వ్యవహరించాలి. సమయస్ఫూర్తితో సమస్యలను చక్కబెట్టాలి. అలాగే వ్యాపారస్తులు ఈ రోజు ఏజెంట్లు, బ్రోకర్లతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. అదేవిధంగా ఈ రోజు ప్రయాణాల్లో ఆటంకాలు కూడా ఏర్పడతాయి. 

కుంభం (Aquarius) – ఈ రోజు మిమ్మల్ని పలు చర్మ సమస్యలు వేధించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఆఫీసులో కాస్త వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారస్తులు కొత్త వ్యక్తులను కలుస్తారు. విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరింత శ్రమించాలి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే... మీకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే అదనపు ఆదాయ వనరులు కూడా చేకూరుతాయి. 

మీనం (Pisces) –  ఈ రోజు వ్యాపారస్తులకు గడ్డుకాలం. ధనం చేతికి వచ్చినట్లే వచ్చి.. పోయే అవకాశం ఉంది. కనుక బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. పొదుపు చేయడానికి ప్రయత్నిస్తూ.. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవాలి. రాజకీయ రంగంలోని వ్యక్తులు సవాళ్లు ఎదుర్కొంటారు. అలాగే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం 

 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.