26 జులై 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

26 జులై 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (జూలై 26) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) –  ఈ రోజు మీ నిర్ణయాలే మీ విజయాలకు బాటలు వేస్తాయి. వ్యాపారస్తులు తాము కోల్పోయిన ధనాన్ని తిరిగి పొందుతారు. ముఖ్యంగా మొండి బాకీలు తీరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు తమ ఐడియాలకు పదును పెడతారు. ఈ క్రమంలో అధికారుల మన్ననలు పొందుతారు. సృజనాత్మక రంగంలోని వారికి పురోగతి ఉంటుంది. అలాగే వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి

వృషభం (Tarus) –  వివాహితులు ఈ రోజు తమ భాగస్వామితో.. ఆనందంగా గడుపుతారు. అలాగే మీ ఇంటికి  కొత్త అతిథులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త భాగస్వాములతో కలిసి పెట్టుబడి పెట్టేటప్పుడు..  వారి విశ్వసనీయతను కూడా పరీక్షించండి. రాజకీయ రంగంలోని వ్యక్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రేమికుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. 

మిథునం (Gemini) –  పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు లేదా నిరుద్యోగులు ఓ శుభవార్తను వింటారు. అలాగే ఉద్యోగస్తులకు బదిలీలు సంభవించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఆర్థిక వ్యవహారాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. కుటుంబ సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే ఆస్తి సంబంధిత విషయాలు చర్చకు వస్తాయి. వివాహితులు తమ భాగస్వామి విషయంలో సహనంగా ఉండడం మంచిది. 

కర్కాటకం (Cancer) –   ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారికి ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారస్తులు కూడా ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. ఉద్యోగులకు ఆఫీసులో అధికారుల సహకారం ఉంటుంది. వివాహితులకు కుటుంబ సంబంధాలు బలపడతాయి. అయితే కొన్ని విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.  

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సోమరితనం లేదా నిర్లక్ష్యాన్ని వీడకపోతే.. మంచి అవకాశాలను కోల్పోతారు. ఉద్యోగులకు ఆఫీసులో అంతర్గత సమస్యలు ఎదురవుతాయి. అలాగే మీకు ఈ రోజు కొత్త స్నేహితులు పరిచయమయ్యే అవకాశం ఉంది. అలాగే వివాహితులు భాగస్వామి సహాయంతో.. కొన్ని ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. 

క‌న్య (Virgo) – ఈ రోజు మీరు తల్లిదండ్రులు లేదా సోదరుల ఆరోగ్య విషయంలో మధనపడే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి.  ముఖ్యంగా దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే ఆర్థిక విషయాలలో  స్నేహితుల సహాయం పొందుతారు. వ్యాపారస్తులు ఏజెంట్లతో లావాదేవీలు జరిపే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది.

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు క్లిష్టమైన పరిస్థితులలో చిక్కుకునే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలలో మీకు కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అలాగే ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తారు. అయినా వారిని మీరు దీటుగా ఎదుర్కొంటారు. అదేవిధంగా పిల్లల విషయంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకొనే అవకాశం ఉంది. అలాగే యువత ఉద్యోగ శోధనలో విజయం సాధిస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. అయితే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగరూకతతో వ్యవహరించండి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) –  ఈ రోజు వ్యాపారస్తులకు ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది.  అలాగే ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇక రాజకీయ రంగంలోని వ్యక్తులకు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అలాగే స్నేహితులకు లేదా ఇతరులకు మీరు సహాయం చేసే అవకాశం ఉంది. 

మకరం (Capricorn) –  ఈ రోజు మీ ఆరోగ్య సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. వివాహితులు భాగస్వామితో కలిసి విదేశీయానానికి ప్లాన్ చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. అలాగే మార్కెటింగ్, సినిమా రంగాల్లోని వ్యక్తులకు పురోగతి ఉంటుంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) - ఈ రోజు మీరు నెగటివ్ ఆలోచనలకు కాస్త దూరంగా ఉండండి. వివాహితులకు సంసార పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారస్తులు పని ఒత్తిడిలో పడి.. వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోవడం మరిచిపోవద్దు. ఆఫీసులో కూడా ఉద్యోగస్తులకు అనుకోని ఇబ్బందులు ఎదురువుతాయి. అయినా ఆత్మస్థైర్యంతో వ్యవహరించండి. కోపాన్ని నియంత్రించుకోండి. 

మీనం (Pisces) – ఈ రోజు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగులు పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తే మంచిది. వ్యాపారస్తులకు తమ ప్రాజెక్టులకు సంబంధించి మార్పు సంకేతాలు కనిపిస్తాయి. ప్రత్యర్థులు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. కనుక అప్రమత్తతతో వ్యవహరించండి.  అలాగే వివాదాలకు దూరంగా ఉండండి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.