31 జులై 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

31 జులై 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (జూలై 31) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు రాజకీయ రంగంలోని వ్యక్తులకు శుభ పరిణామం. అలాగే ఉద్యోగులు కొత్త పనిలో నిమగ్నమవుతారు. దిగుమతి-ఎగుమతి వ్యాపార రంగానికి చెందిన వ్యక్తులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. సృజనాత్మక రంగంలోని వ్యక్తులకు ఈ రోజు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు వృత్తి నైపుణ్యాల పై ఆసక్తి పెరుగుతుంది. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబంలో మనస్పర్థలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అప్పులు ఇచ్చే విషయంలో లేదా తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు తాము చేసే పని పట్ల విశ్వాసం కోల్పోతారు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. కొన్ని సమస్యలు కుటుంబ సభ్యుల సహకారంతో ఒక కొలిక్కి వస్తాయి. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్య విషయంలో ఉపశమనం ఉంటుంది. వ్యాపారస్తులు బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. కాని ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులు ఆఫీసులో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అలాగే వారికి సృజనాత్మక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వివాహితులకు తమ భాగస్వామితో  పటిష్టమైన బంధాలు ఏర్పడతాయి. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు ప్రేమికులు తమ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. వివాహితులకు సంతాన విషయంలో కొంత ఆందోళనగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రత్యర్థుల కారణంగా, పనిలో కాస్త ఇబ్బంది ఏర్పడవచ్చు. అలాగే కోర్టు కేసులు, ఆస్తి లావాదేవీలు మొదలైన విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. 

మన రాశిని బట్టి బలాలు, బలహీనతలు ఇట్టే తెలుసుకోవచ్చట. అవేంటో చూసేద్దామా..!

సింహం (Leo) – ఈ రోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే వ్యాపారస్తులకు ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది. ఉద్యోగులు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేస్తారు. ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. సంఘంలో పేరు, ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. అయితే.. ఇదే సమయంలో వివాదాలకు దూరంగా ఉండండి. 

క‌న్య (Virgo) – ఈ రోజు మీరు కాస్త ప్రయత్నిస్తే.. మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. అలాగే కుటుంబ  సమస్యలు, ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే మీరు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో అదనపు ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అలాగే ఆగిపోయిన ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

తుల (Libra) – ఈ రోజు ప్రేమికులు తమ బంధం గురించి.. పెద్దవాళ్లకు తెలియజేయడానికి అనువైన రోజు. అలాగే మీకు మీ సహచరుల నుండి సరైన తోడ్పాటు కూడా లభిస్తుంది. విద్యార్థులు విజయానికి చాలా చేరువలో ఉన్నారు. మీ భాగస్వామితో మీ బంధాలు పటిష్టంగా ఉంటాయి. అలాగే ఈ రోజు మీరు పేదవారికి సహాయం చేసే అవకాశం ఉంది. 

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు మీకు ఆఫీసులో ప్రత్యర్థుల నుండి ఇబ్బందులు తలెత్తుతాయి. అయినా ఆత్మవిశ్వాసంతో మీరు వాటిని ఎదుర్కొంటారు. అలాగే మీరు మీ భాగస్వామికి... కొన్ని రోజులు దూరమయ్యే అవకాశం ఉంది. అలాగే కోర్టు సమస్యలు, ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.  వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. వివాహితులకు ఆధ్మాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు నూతన ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి మంచి విషయాలు వింటారు. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులు ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేస్తారు.

మకరం (Capricorn) –  ఈ రోజు ఉద్యోగులు పని విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆడిట్ జరిగే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే నష్టాల నుండి బయటపడతారు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే వివాహితులు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు తల్లిదండ్రుల ఆరోగ్యం మీకు ఆందోళనను కలిగించవచ్చు. కనుక జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగస్తులు అనవసరమైన వివాదాల్లో తలదూర్చకుండా ఉంటే బెటర్. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించినా.. మీరు నిజాయతీగా మీ పనులు మీరు చేసుకుంటూ పోవడం మంచిది.  అలాగే వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. అలాగే బహుమతులు కూడా పొందే అవకాశం ఉంది. పాత స్నేహితులు మిమ్మల్ని ఈ రోజు కలుస్తారు. అలాగే ప్రేమలో పడిన వారు.. తమ మనసులో మాటను చెప్పడానికి ఇదే అనువైన సమయం. వివాహితులకు ఈ రోజు రొమాంటిక్‌గా గడుస్తుంది.  

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.