15 జులై, 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

15 జులై, 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (జూలై 15) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – ఈ రోజు మీరు మీ భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు. అయితే దీని కంటే ముందు మీరిద్దరూ మీ మధ్య ఏర్పడిన మనస్పర్థలను దూరం చేసుకోవడం మంచిది.  అలాగే ఈరోజు వ్యాపారస్తులకు అన్ని విధాలుగా లాభసాటిగా గడుస్తుంది. ఉద్యోగస్తులు పదోన్నతులు పొందుతారు. రాజకీయ రంగంలోని వ్యక్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. 

వృషభం (Tarus) –  ఈ రోజు మీరు సీరియస్‌గా ఉండే.. ఒక రిలేషన్ షిప్ కోసం ఎదురుచూస్తుంటారు. కానీ మీరు స్నేహం చేయబోయే  వ్యక్తి మీ ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు. కనుక జాగ్రత్తగా ఉండండి. వివాహితులు ఖర్చుల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించండి. ఉద్యోగస్తులు కోపాన్ని నియంత్రించుకోవాలి. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది.

మిథునం (Gemini) –  ఈ రోజు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం చాలా ముఖ్యం. ఈ యాటిట్యూడ్ కారణంగా చాలావరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. పని విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహితులు తమ భాగస్వామి విషయంలో సహనంతో ప్రవర్తించాలి. ప్రేమికులు కొత్త నిర్ణయాలు తీసుకొనే ముందు ఆచితూచి వ్యవహరించాలి. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు చక్కని ఐడియాలతో మీ అధికారులను ఇంప్రెస్ చేస్తారు.  అయినా కొంతమంది ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రతికూల ఫలితాలు సంభవించినా.. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. వివాహితులు తమ భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. 

సింహం (Leo) – మీరు ప్రేమించే వ్యక్తితో ఏర్పడిన వివాదాలను, మనస్పర్థలను ఈ రోజు దూరం చేసుకుంటారు.  వివాహితులు తమ భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగస్తులు కొన్ని విషయాలలో సంయమనం పాటించాలి. వ్యాపారస్తులు ఏజెంట్ల సలహాలు తీసుకొనే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

క‌న్య (Virgo) –  ఈ రోజు మీరు ఎంపిక చేసుకున్న మార్గం.. మీకే కష్టంగా అనిపించవచ్చు. ఈ క్రమంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. వివేకంతో ప్రవర్తించండి. వివాహితులు తమ సంసార గొడవల్లో మూడో వ్యక్తి సలహా తీసుకోకుండా.. ఉంటే బెటర్. విద్యార్థులు ఇంకా కష్టపడి చదవాలి. ఉద్యోగస్తులు పలు వివాదాలలో తలదూర్చకుండా ఉంటే బెటర్. 

తుల (Libra) – మీ రిలేషన్ షిప్ విషయంలో..  ఎవరిపైనా ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే తల్లిదండ్రుల సలహాలు కూడా తీసుకోండి. ఉద్యోగస్తులు ఆఫీసు ప్రాజెక్టుల నిమిత్తం.. ఫీల్డ్ వర్క్ చేయడం లేదా దూర ప్రాంతాలకు వెళ్లడం జరుగుతుంది. వ్యాపారస్తులు స్టాక్ మార్కెట్ మీద ఆసక్తి పెంచుకుంటారు. 

వృశ్చికం (Scorpio) – పని విషయంలో మీకు చాలా ఒత్తిడిగా ఉంటుంది. అయితే మీ కొలీగ్స్ సహాయం తీసుకోవడం ద్వారా మీరు ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. వివాహితులు కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ భాగస్వామి ఇబ్బందులను కూడా అర్థం చేసుకొని ప్రవర్తించాలి. వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంది. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. 

ధనుస్సు (Saggitarius) – మీకున్న ఐడియాలను.. కార్యరూపంలో పెట్టాలని మీరు భావిస్తున్నారు. మీ పై అధికారులు కూడా మీరు చేస్తున్న పనులను గమనిస్తున్నారు. కనుక వారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించండి. వివాహితులు తమ భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే పాత మిత్రులను కూడా కలుస్తారు. 

మకరం (Capricorn) – మీ సంసార బంధం ప్రేమ, ఆప్యాయతలతో సంతోషంగా కొనసాగుతుంది. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ వచ్చినా.. అందుకు కారణం ఏంటో తెలుసుకొని వెంటనే సమస్యను పరిష్కరిస్తారు. వ్యాపారస్తులు డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. విద్యార్థులు బద్దకాన్ని వీడి.. కష్టపడి చదవాలి. అప్పుడే ఫలితాన్ని పొందగలరు. 

కుంభం (Aquarius) – రొటీన్‌కు భిన్నంగా ఉండేందుకు ప్రయత్నించే క్రమంలో.. మీరు ప్రత్యేకమైన వ్యక్తులను కలుసుకుంటారు. వారు మీకు బోలెడంత సంతోషాన్ని పంచుతారు. అయితే అక్కరకు రాని స్నేహాల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని గుర్తుపెట్టుకోండి. ఉద్యోగస్తుల నిజాయతీకి, శ్రమకి తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది.

మీనం (Pisces) – మీరు కలేదో, వాస్తవం ఏదో గుర్తించలేని పరిస్థితిలో.. ఈ రోజు  ప్రవర్తిస్తారు. కొత్త వ్యక్తులను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల్లో తలదూర్చవద్దు. అలాగే మీకు ఎవరో.. ఏదో మాట ఇచ్చారని దాని కోసం ఎదురుచూస్తూ కూర్చోకండి. మీరు చేయాల్సింది చేయండి. ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

14 జులై, 2019 (ఆదివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?