ఫ్రెంచ్ కిస్ గైడ్: పర్ఫెక్ట్‌గా ఫ్రెంచ్ కిస్.. ఎలా పెట్టాలో మీకు తెలుసా?

ఫ్రెంచ్ కిస్ గైడ్: పర్ఫెక్ట్‌గా ఫ్రెంచ్ కిస్.. ఎలా పెట్టాలో మీకు తెలుసా?

ఫ్రెంచ్ కిస్ (French Kiss).. ప్రేయసీ ప్రియులు, భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని మరో మెట్టు పైకెక్కిస్తుంది. చాలా సున్నితమైనదే.. కానీ అది చూపించే ప్రభావం మాత్రం చాలా ఎక్కువ. అయితే ఈ ముద్దు (Kiss) ఎలా పెట్టుకున్నామనే దాని పైనే ఆ ప్రభావం ఆధారపడి ఉంటుంది. అంటే మీ ముద్దు మీ భాగస్వామికి నచ్చితే.. మళ్లీ దానికోసం ఎదురుచూడటం లేదా రిలేషన్‌ని మరో అడుగు ముందుకేసే ప్రయత్నం చేయచ్చు. ఒకవేళ సరిగ్గా పెట్టకపోతే.. మధ్యలోనే ముద్దు పెట్టడం ఆపేయచ్చు. కాబట్టి అసలు ఫ్రెంచ్ కిస్ ఎలా పెట్టాలో తెలుసుకుంటే మీ పని కాస్త సులభమవుతుంది.

1. నెమ్మదిగా మొదలుపెట్టి

ముద్దు పెట్టుకోవడం అంటే ఏదో పోటీల్లో పాల్గొంటున్నట్టు.. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. పైగా ముద్దు పెట్టుకొనేటప్పుడు ఎవరు ముందు.. ఎవరు వెనుక అనే ప్రశ్నేరాదు. కాబట్టి ముద్దు పెడుతూ మీ భాగస్వామిని ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రయత్నించకండి. నిదానంగా, నెమ్మదిగా ముద్దు పెట్టుకోండి. మరేం ఫర్లేదు. ఈ నిదానం ఒక్కరిలో ఉంటే సరిపోదు. ఇద్దరిలోనూ ఉండాలి. కొంచెం ఐ కాంటాక్ట్ కూడా ఉండాలి. నెమ్మదిగా మీ భాగస్వామి దగ్గరగా జరిగి పెదవులను ఏకం చేయండి.

Giphy

2. ప్రేమ, తపన కనిపించాలి

ఏ పని చేయాలన్నా ఎంతో కొంత తపన ఉండి తీరాల్సిందే. ఫ్రెంచ్ కిస్ కూడా దీనికి అతీతమేమీ కాదు. మీరు ముద్దు పెట్టుకొనేటప్పుడు భాగస్వామికి వారి మీద మీకున్న ప్రేమ, తపన తెలియాలి. అయితే ముద్దు పెట్టుకొనే సమయంలోనూ మనకు వచ్చే కొన్ని రకాల ఆలోచనల కారణంగా.. కాస్త తొట్రుపడటం లాంటివి ఆ క్షణంలో జరగచ్చు. ఇది కూడా మీరు పెట్టే ముద్దులో ప్రతిఫలిస్తుంది. కాబట్టి ముద్దు పెట్టే సమయంలో ఏమీ ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించండి.

3. మీ భాగస్వామి స్పందన కూడా ముఖ్యమే

ముద్దు మీరొక్కరే ఆస్వాదిస్తే సరిపోదు. మీ భాగస్వామి కూడా ఆస్వాదించాలి. మీరు పెడుతున్న ముద్దు మీ భాగస్వామికి నచ్చతుందో లేదో తెలుసుకోవడం ఎలా? చాలా ఈజీ. మీరు ముద్దు పెడుతున్నప్పుడు మీ స్పీడుని వారు అందుకోలేకపోవడం, ఇబ్బంది పడుతున్నట్టు అనిపించడం, వదిలించుకోవడానికి ప్రయత్నించడం లాంటివి చేస్తున్నారంటే.. ముద్దుకి కొన్ని క్షణాలు బ్రేక్ ఇవ్వండి. మీ భాగస్వామి మిమ్మల్ని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టే విషయంలో చాలా సౌకర్యంగా ఫీలవుతుంటే.. వారు ముద్దు మధురిమలను ఆస్వాదిస్తున్నట్టే.

Giphy

4. నాలుకతో పెదవులను

నాలుక ఉపయోగించనిదే ఫ్రెంచ్ కిస్ పరిపూర్ణం కాదు. అసలు దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవడం కూడా ముఖ్యం. మీ భాగస్వామి పెదవులను సున్నితంగా నాలుకతో స్పృశించ‌డం, వారి నాలుక కొనను మీ పెదవులతో సున్నితంగా పట్టుకోవడం ద్వారా మీ ముద్దును మరింత రసవత్తరంగా మార్చేయొచ్చు.

5. చేతులకూ కాస్త పని చెప్పండి

భాగస్వామిని ఆర్తితో ముద్దు పెట్టుకుంటున్న సమయంలో.. వారి శరీర స్పర్శ మనలో పులకింత రేపుతుంది. మరి ఆ పులకింత మీ భాగస్వామి కూడా అనుభవించాలి కదా. అందుకే మీ చేతులకు కాస్త పని చెప్పాల్సిందే. వారి నడుము గట్టిగా  పట్టుకోండి. షర్టు లోపలికి చేయి పోనిచ్చి వీపుపై సుతారంగా కదిలించండి. జుట్టు లోపలికి చేయి పోనిచ్చి వారి ముఖాన్ని మరింత దగ్గరకు తీసుకోండి. మీ చేతి స్పర్శ వారికి ఎన్నో విషయాలు చెబుతుంది. వారిపై మీకున్న ఇష్టాన్ని తెలియజేస్తుంది.

Giphy

6. నోటి దుర్వాసన లేకుండా చూసుకోండి

భాగస్వామికి మీ మీద ఎంత ప్రేమున్నా.. మీ నోరు దుర్వాసన వస్తే వారు ముద్దు పెట్టడం  కష్టం. కాబట్టి మీకు ఈ విషయంలో ఏదైనా డౌట్ వస్తే.. చూయింగ్ గమ్ నమలడం లేదా మౌత్ ప్రెషనర్ వాడటం లాంటివి చేయండి.

7. చొంగ కార్చేయొద్దు

ముద్దు పెట్టే సమయంలో లాలాజలం ఊరుతుంది. అది సహజం. కానీ మీ నోట్లో ఊరిన లాలాజలం మొత్తం మీ భాగస్వామి ముఖంపై కుమ్మరించకండి. అది మీ భాగస్వామికి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల ముద్దు పెట్టాలనే కోరికను సైతం వారు చంపేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ముద్దు పెట్టుకునే సమయంలో మీకు ఈ ఇబ్బంది ఎదురైతే కాస్త బ్రేక్ తీసుకుని మళ్లీ ముద్దు కంటిన్యూ చేయండి.

Giphy

8. ముందు మాట్లాడండి

ఏ పనైనా చేసే ముందు భాగస్వామితో ఎలా చర్చిస్తామో.. ఈ విషయంలోనూ అంతే. మొదటిసారి ముద్దు పెట్టేటప్పుడు ఈ విషయం గురించి మీ పార్టనర్‌తో చర్చించండి. ఈ విషయంలో మీ భాగస్వామి సౌకర్యవంతంగా ఫీలవకపోతే మరికొంత కాలం వేచి చూడండంలో తప్పేమీ లేదు కదా.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది