ADVERTISEMENT
home / సౌందర్యం
గోళ్లను అందంగా మార్చే.. ఈ విభిన్నమైన నెయిల్ పాలిష్‌లు మీ దగ్గర ఉండాల్సిందే..!

గోళ్లను అందంగా మార్చే.. ఈ విభిన్నమైన నెయిల్ పాలిష్‌లు మీ దగ్గర ఉండాల్సిందే..!

చేతులు అందంగా.. మనం స్టైలిష్‌గా కనిపించాలంటే గోళ్లకు నెయిల్ పాలిష్ (Nail Polish) వేయాల్సిందే. ఏదో వేశామంటే వేసుకున్నామన్నట్టు కాకుండా.. ఈ మధ్య నెయిల్ ఆర్ట్ పేరుతో గోళ్లను (Nails) చాలా అందంగా మలుస్తున్నారు. వాటినే కాన్వాసులుగా మార్చేసి రకరకాల డిజైన్లు వేస్తున్నారు. మీరెప్పుడైనా గమనించారో లేదో .. నెయిల్ పాలిష్ వేసుకొనేటప్పుడు చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది.

నెయిల్ పాలిష్ గోళ్లను అందంగా మార్చడమే కాదు.. మనలోని ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. అలాంటప్పుడు మన దగ్గర ఉండే నెయిల్ పాలిష్‌లు కూడా దానికి తగినట్టే ఉండాలి. అందుకే మీ ముందుకు కొన్ని కూల్ నెయిల్ పాలిష్ షేడ్స్ తీసుకొస్తున్నాం. వాటిని మీ బ్యూటీ బాక్స్‌లోకి చేర్చండి.

1. నైకా యునీకార్న్ పోషన్ నెయిల్ ఎనామిల్ (Nykaa Unicorn Potion Nail Enamel)

హోలోగ్రామ్‌ని ఎప్పుడైనా పరిశీలించారా? దాన్ని కదిపే కొద్దీ రంగులు మారుతూ చాలా అందంగా కనిపిస్తుంది. ఐదు రంగుల షేడ్స్ ఉపయోగించి తయారు చేసిన ఈ నెయిల్ పాలిష్.. మీ గోళ్లకు డ్యుయల్ టోన్డ్ లుక్ ఇస్తుంది. అంతేకాదు ఈ నెయిల్ పాలిష్ వేసుకొన్న కొన్ని రోజుల వరకు.. చెక్కు చెదరకుండా ఉంటుందట. పైగా దీనిలో ఎలాంటి హానికరమైన రసాయనాలు ఉపయోగించరు. కనుక గోళ్లు కూడా పాడవకుండా ఉంటాయి.

2. కలర్ బార్ సీఎఫ్డీ 219 ఫ్లాస్ డ్రై నెయిల్ లాక్వర్ (Colorbar CFD219 Flash Dry Nail Lacquer)

క్యూట్‌గా ఉన్న బాటిల్లో అందంగా కనిపిస్తున్న ఈ నెయిల్ పాలిష్‌ను చూస్తుంటే.. వెంటనే గోళ్లకు అప్లై చేయాలనిపిస్తోంది కదా? దీన్ని గోళ్లకు వేసుకొన్న నిమిషంలోనే ఆరిపోతుంది. అలాగే మీ గోర్లు సైతం అందంగా మెరిసిపోతాయి. ఈ నెయిల్ పాలిష్ అప్లై చేసిన ఐదు రోజుల వరకు అలాగే ఉంటుంది.

ADVERTISEMENT

3. లాక్మే 9 టు 5 ప్రిమర్ అండ్ మాట్టె నెయిల్ కలర్ (Lakme 9 to 5 Primer and Matte Nail Color)

ఈ నైన్ టు ఫైవ్ నెయిల్ కలర్.. బాటిల్ మాత్రమే కాదు రంగు సైతం అద్భుతంగా ఉంటుంది. ఇది గోళ్లకు ఇన్స్టెంట్ మాట్టె ఫినిష్ లుక్  ఇస్తుంది. ఈ నెయిల్ పాలిష్ ఒకసారి వేసుకొంటే.. వారం రోజుల పాటు నిలిచి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ నెయిల్ రిమూవర్‌తో గోళ్లను శుభ్రం చేసుకొని మళ్లీ మళ్లీ నెయిల్ పాలిష్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కాలేజీకెళ్లే అమ్మాయిలు, ఆఫీసుకెళ్లే ఉద్యోగినులు ఈ నెయిల్ పాలిష్ ఉపయోగిస్తే సమయం వృథా అవకుండా ఉంటుంది.

4. లోరియల్ పారిస్ ఎల్ హ్యూలీ నెయిల్ పెయింట్ (L’Oreal Paris L’Huile Nail Paint)

సాధారణంగా లోరియల్ పారిస్ అంటే షాంపూ, కండిషనర్లే మనకు గుర్తొస్తాయి. ఇటీవలే ఈ బ్రాండ్ సైతం నెయిల్ పాలిష్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనికున్న ఫ్యాన్ షేప్ బ్రష్ కారణంగా చాలా సులభంగా నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు. పైగా పర్ఫెక్ట్ ఫినిష్ నెయిల్స్ మీ సొంతమవుతాయి.

5. మేబిల్లీన్ న్యూయార్క్ కలర్ షో బ్రైట్ మాట్టె నెయిల్ పెయింట్ (Maybelline New York Colour Show Bright Matte Nail Paint)

కోరల్ ఆరెంజ్(పగడపు) రంగులో ఉన్న.. ఈ నెయిల్ పాలిష్ మీకు బ్రైట్ లుక్ ఇస్తుంది. కాస్త డిఫరెంట్‌గా ..మరికాస్త ట్రెండీగా  ఉన్న ఈ నెయిల్ పాలిష్ గోళ్లకు మాట్టె ఫినిష్ లుక్ అందిస్తుంది.

6. లాక్మే కలర్ క్రష్ నెయిల్ ఆర్ట్ (Lakme Color Crush Nailart)

చేతి గోళ్లను సైతం కాన్వాస్‌గా మార్చేసి వాటిని కళాత్మకంగా, అందంగా తీర్చిదిద్దుతున్నారు అమ్మాయిలు. దీన్నే నెయిల్ ఆర్ట్ అని పిలుస్తున్నారు. మీక్కూడా నెయిల్ ఆర్ట్ అంటే ఇష్టమా? అయితే మీ దగ్గర ఈ లాక్మే కలర్ క్రష్ ఉండాల్సిందే. గోళ్ల అంచున మెరుపుల సొబగులు అద్దడానికి ఈ నెయిల్ పాలిష్ ఉపయోగించవచ్చు.

ADVERTISEMENT

7. డె బెల్లె జెల్ నెయిల్ లాక్వెర్ (DeBelle Gel Nail Lacquer)

ఈ నెయిల్ పాలిష్‌లో ఉండే హై పిగ్మెంటేషన్ ఫార్ములా.. గోళ్లు ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపించేలా చేస్తుంది. ఈ నెయిల్ పాలిష్‌లో సహజసిద్ధమైన సీవీడ్ ఎక్సట్రాక్ట్స్.. గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి అవి పెరిగేలా చేస్తాయి. అప్లై చేసుకొన్న తర్వాత ఇది కూడా ఎక్కువ కాలమే నిలిచి ఉంటుంది.

8. రెవ్లాన్ పర్ఫ్యూమరీ సెంటెడ్ నెయిల్ ఎనామిల్ (Revlon Parfumerie Scented Nail Enamel)

చూడటానికి పర్ఫ్యూమ్ బాటిల్లాగా ఉంది కదా. కానీ ఇది పర్ఫ్యూమ్ కాదు. నెయిల్ పాలిషే. ఇది గోళ్లకు హెల్తీ లుక్ ఇవ్వడంతో పాటు సాఫ్ట్, సిల్కీ టెక్స్చర్ అందిస్తుంది. ఈ నెయిల్ పాలిష్ అప్లై చేసుకొన్న తర్వాత ఎప్పుడు చూసినా అప్పుడే వేసుకొన్నంత ఫ్రెష్‌గా కనిపిస్తుంది. 

Featured Image: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

12 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT