నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? ఈ నేచురల్ టిప్స్ ఆ సమస్యను తగ్గిస్తాయి

నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? ఈ నేచురల్ టిప్స్ ఆ సమస్యను తగ్గిస్తాయి

నోటి దుర్వాసన (bad breath).. మనలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. మనం ఆహారం తిన్న తర్వాత నోరు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, నోటిలో బ్యాక్టీరియా పెరగడం మొదలైన కారణాల వల్ల నోటి దుర్వాసన సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి మౌత్ వాష్ ఉపయోగించడం లాంటివి చేస్తుంటారు. అయితే కొన్ని సహజమైన చిట్కాలు (natural tips) పాటించడం ద్వారా నోరు దుర్వాసన రాకుండా చూసుకోవచ్చు.

1. పైనాపిల్

నోటి దుర్వాసన సమస్యను పోగొట్టుకోవడానికి చాలామందికి పైనాపిల్ బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా తిన్న తర్వాత పైనాపిల్ ముక్కలను రెండు నిమిషాల పాటు నమలడం ద్వారా.. నోరు వాసన రాకుండా చూసుకోవచ్చు. దీనికోసం పైనాపిల్ జ్యూస్ కూడా తాగచ్చు. అయితే పైనాపిల్ తిన్న తర్వాత లేదా పైనాపిల్ జ్యూస్ తాగిన తర్వాత నీరు పుక్కిలించాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఉన్న చక్కెరల వల్ల దంతాల ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది.

2. పెరుగు

పెరుగులో లాక్టోబాసిలస్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం పెరుగు నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. ఆరువారాల పాటు క్రమం తప్పకుండా పెరుగు తినడం ద్వారా నోటి దుర్వాసన తగ్గుముఖం పట్టినట్టు గుర్తించారు. పెరుగులో ఉన్న ప్రోబయాటిక్స్ ఈ సమస్యను తగ్గిస్తాయి. అందుకే ప్రతి రోజూ ఓ గిన్నెడు పెరుగు తినడం మంచిది.

3. సోంపు

మౌత్ ఫ్రెషనర్‌గా సోంపును చాలా మంది ఉపయోగిస్తారు. దీనిలో ఉన్న అరోమా సువాసనలు శ్వాసను తాజాగా మార్చేస్తాయి. భోజనానంతరం కొంత సోంపు తినడం ద్వారా నోటి దుర్వాసన రాకుండా చూసుకోవచ్చు. సాధారణంగా రోస్ట్ చేసిన సోంపు, షుగర్ కోటింగ్ ఉన్న సోంపు తింటూ ఉంటారు. ఏది నమిలినా ఒకటే ఫలితం ఉంటుంది.

Shutterstock

4. ఆరెంజ్

చాలామందిలో నోటి దుర్వాసన రావడానికి కారణం.. వారి నోటిలో లాలాజలం సరిగా ఉత్పత్తి కాకపోవడం. లాలాజలం నోటి దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియాను ఎప్పటికప్పడు తొలగిస్తుంటుంది. తగినంత లాలాజలం స్రవించకపోవడానికి విటమిన్ సి  కారణం. ఆరెంజ్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల సరిపడినంత సి విటమిన్ మనకు అందుతుంది. దీనివల్ల లాలాజలం ఉత్పత్తి పెరిగి నోటి దుర్వాసన తగ్గుతుంది. కమలాఫలం నుంచి వచ్చే సువాసనలు సైతం నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.

5. గ్రీన్ మింట్ టీ

నోటి దుర్వాసనను పోగొట్టడంలో గ్రీన్ మింట్ టీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే గ్రీన్ టీకి ఇన్ఫెక్షన్లను, దుర్వాసనను పోగొట్టే గుణాలున్నాయి. కప్పు గ్రీన్ మింట్ టీ తాగడం ద్వారా నోటి దుర్వాసనకు తాత్కాలికంగా చెక్ పెట్టవచ్చు. రోజంతా నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. ఈ చిట్కాను పాటించాల్సి ఉంటుంది.

రాత్రి నిద్రపోయే ముందు రెండు కప్పుల గ్రీన్ టీ తయారు చేసి.. చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టేయాలి. మరుసటి రోజు ఆఫీసుకి వెళ్లే ముందు ఫ్రిజ్‌లో ఉంచిన గ్రీన్ టీని.. బాటిల్లో పోసుకుని ఆఫీసుకి మీ వెంట తీసుకెళ్లండి. అప్పుడప్పుడూ కొంచెం కొంచెంగా సిప్ చేయండి. నోటి దుర్వాసన సమస్య మీ దరికి చేరకుండా ఉంటుంది.

6. బేకింగ్ సోడా

బేకింగ్ సోడా.. దీన్నే సోడియం బైకార్బొనేట్ అని కూడా పిలుస్తారు. మనం ఉపయోగించే టూత్ పేస్ట్‌లో ఇది ముఖ్యమైన పదార్థం. బేకింగ్ సోడా నోటి దుర్వాసన కలిగించే క్రిములను సంహరిస్తుంది. అందుకే కప్పు వేడి నీటిలో రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా కలిపాలి. ఈ నీటితో అరనిమిషం పాటు పుక్కిలించి ఊస్తే.. సరిపోతుంది. దీన్ని నేచురల్ మౌత్ వాష్‌గా పరిగణించవచ్చు.

Shutterstock

7. దాల్చిన చెక్క

దాల్చిన చెక్కలో యాంటీమైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి నోటి దుర్వాసనకు కారణమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. కాస్త దాల్చిన చెక్కను నమలడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడచ్చు. పైగా దాల్చిన చెక్క నుంచి వచ్చే సువాసన నోటి దుర్వాసనను నివారిస్తుంది. యాలకులు, లవంగాలు సైతం నోటి దుర్వాసనకు చెక్ పెడతాయి.

8. కొత్తిమీర

కొత్తిమీర చాలా మంచి సువాసనను అందిస్తుంది. పైగా దీనిలో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. ఆహారం తిన్న ప్రతి సారి.. కొన్ని కొత్తిమీర ఆకులను నమలడం ద్వారా నోటి దుర్వాసనను పోగొట్టుకోవచ్చు.

9. పుదీనా

పుదీనా కూడా నేచురల్ మౌత్ ప్రెషనర్‌గా పనిచేస్తుంది. దీనిలో ఉండే ఔషధ గుణాలు నోటిలో పెరిగే బ్యాక్టీరియాను సంహరిస్తాయి. తులసి కూడా నోటి దుర్వాసన సమస్యను తగ్గిస్తుంది.

Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది