ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
రాఖీ పండక్కి.. మీ అక్కా, చెల్లెళ్ళ కోసమే ఈ బహుమతులు (Raksha Bandhan Gift Ideas In Telugu)

రాఖీ పండక్కి.. మీ అక్కా, చెల్లెళ్ళ కోసమే ఈ బహుమతులు (Raksha Bandhan Gift Ideas In Telugu)

రాఖీ(Rakhi), రక్షాబంధన్(Rakshabandan), రఖ్రీ.. పేరేదైనా కానీ.. అన్నా, చెల్లెలు.. అక్కా,తమ్ముడి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపే ఈ పండగకు మన సంప్రదాయంలో చాలా ప్రాధాన్యముంది. సోదర, సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమానురాగానికి, ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తుంది ఈ పండగ. తన సోదరుడి క్షేమాన్ని కాంక్షిస్తూ అక్కాచెల్లెళ్లు తన చేతికి రాఖీ కడితే.. ఎలాంటి కష్టమొచ్చినా నేనున్నానే భరోసా ఇస్తాడు సోదరుడు.

అందుకే రాఖీ  పండగ వస్తోందంటే చాలు.. అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లలో ఏదో తెలియని ఉత్సాహం, సంతోషం కనిపిస్తాయి. ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ రాఖీ పండగను జరుపుకుంటారు. అందుకే దీనిని రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. 

ప్రాంతాన్ని బట్టి, ఆచార వ్యవహరాలను బట్టి ఈ శ్రావణ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ పౌర్ణమి ఈ ఏడాది ఆగస్టు 15న వచ్చింది. అంటే 15/08/2019 తేదిన మనం రాఖీ పండగను జరుపుకోబోతున్నామన్నమాట. ఈ నేపథ్యంలో రాఖీ పండగ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలతో పాటు.. రాఖీ పండగ రోజు సోదరికి లేదా సోదరుడికి ఎలాంటి బహుమతులు(Gifts) ఇవ్వాలో కూడా తెలుసుకుందాం.

రాఖీ పండగ ప్రాముఖ్యత (Importance Of Raksha Bandhan)

అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక ఈ రాఖీ పండగ. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ పండగను జరుపుకుంటాం. రాఖీ పండగ రోజు తన సోదరుని చేతికి సోదరి రక్షాబంధనం కడుతుంది. తనకు అనునిత్యం రక్షణ కవచంలా నిలుస్తున్న అతని ఆయురారోగ్యాలకు, ఐశ్వర్యానికి రక్షగా  ఆ రాఖీ నిలుస్తుందని భావిస్తారు. రాఖీ పండగనే రక్షాబంధన్ అని, రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. సిక్కులు ఈ పండగను రఖ్రీ అని పిలుస్తారు. హిందూ సంప్రదాయంలో ఈ పండగకు చాలా ప్రాముఖ్యం ఉంది. అందుకే తమ సోదరి ఎంత దూరంలో ఉన్నా.. అన్నదమ్ములు ఆమె దగ్గరకు వెళ్లి మరీ రాఖీ కట్టించుకుంటారు.

ADVERTISEMENT

ఈ పండగకు చారిత్రక, పౌరాణిక ప్రాధాన్యం కూడా చాలానే ఉంది. పురాణాల ప్రకారం బలిచక్రవర్తికి శ్రీమహాలక్ష్మి రక్షాబంధనం కట్టిందట. శ్రీకృష్ణుడికి సైతం ద్రౌపదీ  దేవి రాఖీ కట్టిందని చెబుతారు. విఘ్నేశ్వరుడికి సంతోషిమాత, యముడికి యమున రక్షా బంధనాలు కట్టారు. చరిత్రను తరచి చూస్తే రాఖీ కట్టిన సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి. చిత్తోర్ రాణి కర్ణావతి తన కోటను గుజరాత్ నవాబు బహదూర్ షా.. ముట్టడించినప్పుడు తనను రక్షించమని కోరుతూ ఢిల్లీ చక్రవర్తి హుమయూన్‌కి రాఖీ పంపిందట.

దానితో కర్ణావతిని, ఆమె రాజ్యాన్ని రక్షించడానికి బహదూర్ షాను తరిమేశాడట. అలాగే  ఈ రాఖీ ఓ సారి అలెగ్జాండర్ ప్రాణాన్ని కాపాడిందని చెబుతారు. పురుషోత్తముడి పరాక్రమం గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రుక్సానా అతనికి రాఖీ పంపిందట. యుద్ధ సమయంలో అలెగ్జాండర్‌ను చంపే అవకాశం వచ్చినప్పటికీ చంపకుండా  వదిలేశాడట. చూశారా.. మన పురాణాలు, చారిత్రక గ్రంథాల్లో రాఖీకి ఎంత ప్రాధాన్యముందో. 

Shutterstock

ADVERTISEMENT

రాఖీ పండగ ఎలా జరుపుకుంటారంటే..(How Is Raksha Bandhan Celebrated?)

రాఖీ పండగ రాక ముందే పండగ సందడి మొదలవుతుంది. తన సోదరుడి కోసం స్వయంగా రాఖీలు తయారుచేసే వారు కొందరైతే.. తన అన్నకు నప్పే, నచ్చే రాఖీని ఎంపిక చేయడానికి షాపులన్నీ తిరిగేవారు మరికొందరు. రాఖీ కట్టడం కోసం థాలీ (పళ్లెం)ని ప్రత్యేకంగా సిద్ధం చేసుకుంటారు. దీని కోసం రంగులు, చమ్కీలు ఉపయోగిస్తారు. అలాగే  తన సోదరుడి కోసం ప్రత్యేకంగా స్వీట్ తయారుచేస్తారు.

ఇవన్నీ పండగ రావడానికంటే ముందే జరిగిపోతాయి. పండగ రోజు ఉదయాన్నే సోదరి శుచిగా తయారై తన అన్నకు రక్షాబంధనం కట్టడానికి  అన్నీ సిద్ధం చేసుకుంటుంది. పూజాది కార్యక్రమాలు పూర్తిచేసి ముందుగా అలంకరించి పెట్టుకున్న థాలీలో (పళ్లెం) కుంకుమ, అక్షతలు, మిఠాయి, దీపాన్ని అమర్చుతుంది. తర్వాత తన సోదరునికి హారతినిచ్చి బొట్టు పెట్టి రాఖీ కడుతుంది. ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత.. తన చెల్లెలికి ప్రేమతో అన్న బహుమతిని అందిస్తాడు.

ఆధునికతను సంతరించుకున్న రాఖీ (Modern Rakhi Celebrations)

మిగిలిన పండగల మాదిరిగానే రాఖీ పండగ సైతం ఆధునిక హంగులను అద్దుకుంటోంది. సాధారణంగా సోదరి, సోదరుడికి రాఖీ కడుతుంది. ఉత్తరభారతంలో అయితే సోదరుడితో పాటు అతని భార్యకు కూడా రాఖీ కడతారు. కానీ ఇటీవలి కాలంలో తమకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అక్కలకు చెల్లెలు లేదా తమ్ముడు రాఖీ కడుతున్నారు. అలాగే తమ సంతోషంలోనూ కష్టంలోనూ పాలు  పంచుకుంటోన్న స్నేహితురాలికి.. రాఖీ కట్టి వారిపై తమకున్న ఆప్యాయతను, తమ జీవితంలో వారికున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నారు. ఒకప్పుడు రాఖీ గిఫ్ట్‌గా ఆమెకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు వారికి అవసరమైన, వారు ఇష్టపడే బహుమతులు ఇస్తున్నారు. కేవలం సోదరులు మాత్రమే కాదు.. అక్కచెల్లెళ్లు సైతం తమ సోదరుడికి రాఖీ కట్టిన తర్వాత కానుకలిస్తున్నారు.

ADVERTISEMENT

గిఫ్ట్ ఎంపిక చేయడానికి పనికొచ్చే కొన్ని టిప్స్ (Tips To Select Rakhi Gifts For Your Sibling)

రాఖీ పండగ  రోజు చెల్లెలికి లేదా అక్కకు నచ్చే విధంగా గిఫ్ట్ కొనడమంటే మాటలు కాదు. కచ్చితంగా చెప్పాలంటే వారిని మెప్పించే గిఫ్ట్ కొనడమంటే.. ఓ పెద్ద టాస్క్ లాంటిదే. ఏం కొనాలని ఆలోచించే కొద్దీ అది ఆలస్యమవుతూనే ఉంటుంది. మేం చెప్పే ఈ చిట్కాలు ఫాలో అయితే కచ్చితంగా వారికి నచ్చే బహుమతి అందించవచ్చు. దాని కోసం ఏం చేయాలంటే..

 

1. ఇష్టాలను గుర్తించండి (Identify Their Favourites)

ముందుగా మీ సోదరి ఇష్టాయిష్టాలేంటో గుర్తించాలి. ఈ విషయంలో మీరు పనిగట్టుకొని పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచీ మీ ఇద్దరూ కలసి పెరిగారు కాబట్టి.. ఏది నచ్చుతుందో ఏది నచ్చదో మీకు ఓ అవగాహన ఉంటుంది. కాబట్టి ఓ పెన్నూ, పేపరూ తీసుకొని తనకు నచ్చేవన్నీ రాయడం మొదలుపెట్టండి. అది పూర్తయిన తర్వాత  మీరు రాసిన జాబితాలో ఆమె తక్కువగా ఇష్టపడేవాటిని కొట్టేయండి. ఇప్పుడు మీ చేతిలో మీ సోదరి బాగా ఇష్టపడేవి మాత్రమే ఉంటాయి.  వాటిలో ఏది బాగుంటుందనిపిస్తే అది కొని బహుమతిగా ఇవ్వొచ్చు.

2.పర్సనలైజ్డ్ బహుమతి (Personalized Gifts)

మనం ఎలాంటి బహుమతి ఇచ్చినా.. పర్సనలైజ్డ్ బహుమతి ముందు అన్నీ దిగదుడుపే. ఎందుకంటే అది మీ ఇద్దరి అనుబంధానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.  మీ దగ్గర ఉన్న ఫొటో కలెక్షన్‌లో మీ సోదరికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఫొటోలతో.. పర్సనలైజ్డ్ గిఫ్ట్ తయారుచేయించి ఇవ్వండి. అలాగే మీ ఇద్దరూ కలిసి దిగిన చిన్ననాటి ఫొటోలను సైతం పర్సనలైజ్డ్ బహుమతిగా తయారుచేసి ఇవ్వచ్చు.

ADVERTISEMENT

3. విష్ లిస్ట్ చెక్ చేయండి (Check Wish List)

ప్రతిఒక్కరికీ ఏదో ఒక విష్ లిస్ట్ ఉంటుంది. తాము కొనుక్కోవాలనుకున్నవి, ఎక్కడికైనా వెళ్లాలనుకున్నవి.. ఇలా తాము చేయాలనుకుంటున్నవి ఎన్నో ఉంటాయి. దాన్నే మనం విష్ లిస్ట్ అంటాం. వాటి గురించి అప్పుడప్పుడూ చర్చిస్తుంటారు కూడా. ఫలానా వస్తువు నేను కొనుక్కోవాలనుకున్నాననో లేదా ఫలానా చోటకి వెళ్లడం నా డ్రీమ్ అనో.. ఇలా తాము చేయాలనుకున్నవాటి గురించి అప్పుడప్పుడూ చెబుతుంటారు. ఆమె విష్ లిస్ట్‌లోంచి ఒకదాన్ని ఎంపిక చేసుకొని.. ఆమెకు బహుమతిగా ఇవ్వడం ద్వారా ఆమెను సంతోష పెట్టవచ్చు. ఉదాహరణకు ఆమెకు ట్రావెలింగ్ అంటే ఇష్టమైతే.. ఆమెకు నచ్చిన టూరిస్ట్ స్పాట్‌కి టిక్కెట్లు  బుక్ చేసి ఇవ్వండి.

రాఖీ పండగ సందర్భంగా.. చెల్లెలికి ప్రేమతో అందించే బహుమతులు (Raksha Bandhan Gift Ideas For Sisters In Telugu)

చెల్లెలు రాఖీ కట్టగానే ఆమెకు బహుమతినివ్వడం మన సంప్రదాయంలో భాగం. తన అన్న ఎలాంటి బహుమతినిచ్చినా సరే.. మనస్ఫూర్తిగా ఆమె తీసుకుంటుంది. రాఖీ పండగ నాడు సాధారణంగా చెల్లెలికి చాక్లెట్లు, గాజులు, కొత్త దుస్తులు లాంటివి ఇస్తూ ఉంటారు. ఈ సారి కాస్త కొత్తగా మీ చెల్లెలి ఇష్టానికి తగిన గిఫ్ట్ ఎంచుకుంటే బాగుంటుంది కదా. అందులోనూ రాఖీ పండగకు మరికాస్త సమయం ఉంది కాబట్టి.. ఈ లోగా ఆ గిఫ్ట్‌ను కొనడం లేదా ప్రత్యేకించి తయారు చేేయించుకోవడం లాంటివిచేయచ్చు.

రూ 500 కంటే తక్కువ ధరలో లభించే.. ఫ్రెండ్ షిప్ డే గిఫ్ట్స్ (Friendship Day Gifts Below Rs.500)

1. పర్సనలైజ్డ్ జ్యుయలరీ. (Personalized Jewellery)

కొంతమంది రాఖీ పండగ రోజు తమ చెల్లెలి కోసం బంగారం, వెండి లాంటివి ఇస్తూ ఉంటారు. మీరు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లయితే వాటితో పర్సనలైజ్డ్ జ్యూయలరీ చేయించి ఆమెకు అందించండి. పర్సనలైజ్డ్ అంటే ఆమె పేరునే పెండెంట్ మాదిరిగా తయారు చేయించి ఇవ్వచ్చు. లేదా ఉంగరంపై ఆమె పేరు వచ్చేలా తయారు చేయించి బహుమతిగా అందించవచ్చు. లేదా గోల్డ్ ప్లేటెడ్ చెయిన్, పెండెంట్ ఇవ్వొచ్చు. ఇదైతే తక్కువ ధరలోనే మనకు దొరుకుతుంది. వీటిని ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు.

ADVERTISEMENT

2.మేకప్ పౌచ్ (Multi Functional Bag)

మీ చెల్లెలికి మేకప్ వేసుకోవడం అంటే ఇష్టమా? అయితే మీరు ఆమెకు మేకప్ పౌచ్‌ను బహుమతిగా అందించవచ్చు. ఇందులో ఆమె తన మేకప్ సామగ్రిని భద్రపరుచుకుంటుంది.

3. స్మార్ట్ వాచ్ (Smart Watch)

ఇది స్మార్ట్ యుగం. మనం చాలా విషయాల్లో టెక్నాలజీపైనే ఆధారపడి జీవిస్తున్నాం. మీ సోదరి టెక్నాలజీ అన్నా, టెక్ గ్యాడ్జెట్స్ అన్నా ఆసక్తి ఎక్కువ చూపించే వ్యక్తి అయితే.. ఆమెకు ఈ స్మార్ట్ వాచ్‌ను బహుమతిగా అందించండి. ఇది తనకు కచ్చితంగా నచ్చుతుంది. తన చేతిపై ఈ వాచ్‌ను చూసుకున్న ప్రతిసారి.. ఆమెకు మీపై ప్రేమ మరింత పెరుగుతుంది.

4. ఫిట్ బిట్ (Workout Tracker)

మీ సిస్టర్ ఫిట్‌నెస్ ఫ్రీకా? ఫిట్‌నెస్ విషయంలో అసలు రాజీ పడని మనస్తత్వమా? అయితే రాఖీ పండగ రోజు మీరిచ్చే బహుమతి సైతం దానికి తగినట్లే ఉండాలి కదా.అందుకే ఈ ఫిట్ బిట్‌ను ఆమెకు కానుకగా అందించండి. ఇది ఆమెను మరింత ఫిట్‌గా తయారయ్యేలా చేస్తుంది. పైగా దీన్ని చూసిన ప్రతిసారి అన్నయ్య నాకు దీన్ని బహుమతిగా ఇచ్చాడని మురిసిపోతుంది.

5. వుడెన్ బ్యాంగిల్ హోల్డర్ (Bangle Stand)

నేటి తరం అమ్మాయిలు ఆధునికత, ఫ్యాషన్ అంటున్నా సంప్రదాయాన్ని మాత్రం వదిలిపెట్టడం లేదు. దీనికి నిదర్శనం గాజులపై వారికి తగ్గని మక్కువే. మీ చెల్లి లేదా అక్కకు గాజులు వేసుకోవడమన్నా.. వాటిని సేకరించడమన్నా బాగా ఇష్టమైతే వారికి ఈ ఉడెన్ బ్యాంగిల్ హోల్డర్ కానుకగా ఇవ్వండి.

ADVERTISEMENT

6. క్రిస్టల్ బ్రేస్లెట్ (Bracelet)

మీ సోదరి స్టైలిష్‌గా కనిపించడానికి ఆసక్తి చూపించే వారైతే.. ఆమెకు ఈ క్రిస్టల్ బ్రేస్లెట్ బహుమతిగా అందించండి. అందంగా మెరుస్తున్న ఈ బ్రేస్లెట్ ఆమెను మరింత ఫ్యాషనబుల్‌గా కనిపించేలా చేస్తుంది. మీరు కానుకగా ఇచ్చిన ఈ స్టైలిష్ బ్రేస్లెట్ చూడగానే.. ఆమె ముఖంలో కనిపించే సంతోషమే అది ఆమెకు ఎంతగా నచ్చిందో తెలియజేస్తుంది.

7. పర్ఫెక్ట్ సిస్టర్ కాఫీ మగ్ (Coffee Mug)

కొంతమంది అన్నయ్యలు తమ చెల్లెలంటేనే చాలు.. హడలెత్తిపోతుంటారు. అలాంటి అన్నయ్యలకు చెల్లెలు చేసే చిలిపి పనులన్నా.. వారు చేసే అల్లరన్నా చాలా ఇష్టం. అలాగే వారు ఇచ్చే సలహాలు సైతం వారికి బాగా ఉపయోగపడతాయి. కొన్ని విషయాల్లో అక్కచెల్లెళ్లే మనకు దిక్సూచిలా మారి దారి చూపిస్తారు. మీ సోదరి కూడా అలాగే ఉంటారా? అయితే ఆమెకు ఈ ఫర్ఫెక్ట్ సిస్టర్ కాఫీ మగ్ బహుమతిగా ఇవ్వొచ్చు.

8. మొక్కలు (Bonsai)

ఇటీవలి కాలంలో మొక్కలను బహుమతిగా ఇచ్చే అలవాటు బాగా పెరుగుతోంది. ఇలా మొక్కల రూపంలో మీరిచ్చిన బహుమతి వల్ల పర్యావరణానికి మేలు కలగడంతో పాటు.. ఆ మొక్క ఎదిగేకొద్దీ మీపై వారికున్న ప్రేమ మరింతగా పెరుగుతుంది.  కాబట్టి ఈ రాఖీ పండగకు మీ సోదరికి ఓ మొక్కను బహుమతిగా అందించండి.

9. హెడ్ ఫోన్స్ (Wireless Headphone)

మీ చెల్లి లేదా మీ అక్క మ్యూజిక్ లవర్ అయితే ఆమె అభిరుచికి తగిన బహుమతి అందించవచ్చు. దీని కోసం హెడ్ ఫోన్స్ సరైన ఎంపిక. ఈ వైర్లెస్ హెడ్ ఫోన్స్ చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో. ఇది మీ సోదరికి కచ్చితంగా నచ్చుతుంది.

ADVERTISEMENT

10. డిజైనర్ డ్రస్ (Lehenga Set)

రాఖీ కట్టినప్పుడు తన చెల్లెలికి ప్రేమతో బట్టలు కొనిస్తాడు అన్నయ్య. ఈ సారి కూడా అదే ఆలోచనలో ఉన్నారా? అయితే వారికి నచ్చిన డిజైనర్ డ్రస్ ఎంపిక చేసి వారికి అందించండి. వారి ఆనందానికి అంతే ఉండదు. ఆమెను మరింత సర్ప్రైజ్ చేయాలంటే తనకు నచ్చిన డిజైనర్ బొతిక్ నుంచి డ్రస్ తీసుకొచ్చి మీ చెల్లి లేదా అక్కకు బహుమతిగా ఇవ్వండి.

11. హెయిర్ డ్రైయర్ (Hair Dryer)

హెయిర్ డ్రైయరా? అని ఆశ్చర్యపోతున్నారా? రాఖీ పండగకి హెయిర్ డ్రయర్‌తో పాటు.. హెయిర్ స్ట్రెయిటనర్ కూడా మీ సోదరికి బహుమతిగా అందించవచ్చు. అది వారికి ఎంతో ఉపయోగపడుతుంది.

12. విండ్ ఖైమ్స్ (Windchime)

విండ్ ఖైమ్స్‌ను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. మరి, ఆ అదృష్టం మీ సోదరికి అడుగడుగునా ఎదురవ్వాలంటే ఈ విండ్  ఖైమ్స్ ఆమెకు బహుమతిగా ఇవ్వండి. దీన్ని ఇంటిని డెకరేట్ చేయడానికి సైతం ఉపయోగించవచ్చు. అంతేకాదు.. వీటి నుంచి వచ్చే చిరు శబ్ధాలు దుష్టశక్తులను దరి చేరనివ్వకుండా చేస్తాయని నమ్ముతారు.

13. పర్ప్యూమ్స్ (Perfume )

పర్ఫ్యూమ్స్‌ను ఇష్టపడే మీ సోదరికి వాటిని మించిన బహుమతి మరొకటి ఉంటుందా? అందుకే అందమైన సెంట్ లేదా పర్ఫ్యూమ్ బాటిల్ ఇవ్వండి. అయితే ఒకటే బాటిల్ ఇస్తే ఏం బాగుంటుంది? ఇదుగో ఈ మినీ పర్ఫ్యూమ్ బాటిల్ సెట్‌ను కానుకగా ఇవ్వండి.

ADVERTISEMENT

14. స్పా టబ్ (Pedicure Tub)

పెడిక్యూర్ చేసుకోవడానికి స్పా టబ్ ఉపయోగిస్తారు. కేవలం పాదాల అందం కోసం మాత్రమే కాదు.. పాదాల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఎక్కువ సమయం నిల్చొని ఉండే ఉద్యోగం చేయడం లేదా ఆఫీసుకి వెళ్లాలంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసే మీ సోదరికి ఈ స్పా బకెట్ బహుమతిగా అందించవచ్చు. పైగా ఇది వారికి బాగా ఉపయోగపడుతుంది.

15. నెయిల్ పాలిష్ సెట్స్ (Nail Enamel)

ఇటీవలి కాలంలో అమ్మాయిలు నెయిల్ పాలిష్‌తో మ్యాజిక్ చేస్తున్నారు. నెయిల్ ఆర్ట్‌తో ఆకట్టుకుంటున్నారు. మీ సోదరి కూడా నెయిల్ పాలిష్ వేసుకోవడానికి ఇష్టపడతారా? అయితే ఆమెకు ఈ నెయిల్ పాలిష్ సెట్‌ను రాఖీ పండగ గిఫ్ట్‌గా అందించండి. నెయిల్ పాలిష్ సెట్‌తో పాటు నెయిల్ ఆర్ట్ స్టిక్కర్లను కూడా అందిస్తే తను చాలా  సంతోషిస్తుంది.

16. వుడెన్ జ్యుయలరీ బాక్స్ (Jewellery Box)

మీ సోదరికి కాస్త డిఫరెంట్‌గా బహుమతి అందించాలనుకుంటే ఉడెన్ జ్యుయలరీ బాక్స్ గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. తన ఫ్యాషన్, స్టేట్మెంట్ జ్యుయలరీని దాచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

17. లిప్ స్టిక్ సెట్స్ (Lipstick Combo Kit)

అమ్మాయిలకు లిప్ స్టిక్ వేసుకోవడమంటే చాలా ఇష్టం. కొంతమంది అయితే అసలు పెదవులకు లిప్ స్టిక్ అప్లై చేసుకోనిదే అడుగు కూడా బయటకు పెట్టరు. వారి దగ్గర లిప్ స్టిక్ కలెక్షన్ కూడా అలాగే ఉంటుంది. లిప్ స్టిక్‌ను కూడా మీ సోదరికి రాఖీ పండగ బహుమతిగా అందించవచ్చు. అయితే ఒకటీ రెండూ కాకుండా.. ఇలా ఓ పెద్ద సెట్ ఇస్తే బాగుంటుంది కదా.

ADVERTISEMENT

18. పర్సనలైజ్డ్ ఫొటో స్టాండ్ (Personalized Photo Frame)

ఇటీవలి కాలంలో పర్సనలైజ్డ్ ఫొటో స్టాండ్స్‌కి క్రేజ్ బాగా పెరుగుతోంది. మన ఫొటోని యానిమేటెడ్ ఫొటోగా మార్చి తయారుచేసే ఈ ఫొటోస్టాండ్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మీరు కూడా ఇలాంటి ఓ ఫొటో స్టాండ్‌ను మీ సోదరి కోసం చేయించి ఇవ్వచ్చు. ఇది కచ్చితంగా మీకు నచ్చుతుంది. దీని కోసం మీరేం చేయాలో తెలుసా? www.regalocasila.com వెబ్ సైట్‌కి వెళ్లి వారి ఫొటోను అప్లోడ్ చేయడమే.

19. పుస్తకాలు (Books)

ఒక్క పుస్తకం వంద మంది మిత్రులతో సమానమని చెబుతారు. పుస్తకమందించే నాలెడ్జి అలాంటిది. పుస్తకం మానసిక వికాసాన్ని కలిగిస్తుంది. కాబట్టి సాధికారత దిశగా నడిపించే పుస్తకాలను ఆమెకు బహుమతిగా అందించండి. దీని కోసం ఎలాంటి పుస్తకాలు ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? ది ఆల్కెమిస్ట్, యూ క్యాన్ విన్, రంగనాయకమ్మ రచన “స్వీట్ హోం” లాంటి పుస్తకాలు వారికి బహుమతిగా అందించవచ్చు.

20. పెప్పర్ స్ప్రే (Pepper Spray For Women)

ఇటీవలి కాలంలో అమ్మాయిలపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో మనకు తెలుసు. అన్నయ్యగా ఆమెకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మీదే. అన్ని సందర్భాల్లోనూ మీరు మీ చెల్లితో ఉండలేకపోవచ్చు. కానీ ఈ పెప్పర్ స్ప్రే మాత్రం మీ సోదరి వెంట ఎప్పుడూ ఉంటుంది. ఆపద సమయాల్లో ఆమెను రక్షిస్తుంది. కాబట్టి  ఈ రాఖీ  పండగకు ఆమెకు ఓ పెప్పర్ స్ప్రే బాటిల్ కొని బహుమతిగా ఇవ్వండి.

అన్న కోసం చెల్లెలి కానుక (Rakhi Gift Ideas For Brother)

రాఖీ పండగ రోజు అన్న చెల్లికి గిఫ్ట్ ఇవ్వడం పాత పద్ధతి. రాఖీ కట్టిన తర్వాత.. తన సోదరుడికి ప్రేమగా బహుమతిని అందించడం కొత్త పద్దతి. ఇలా ఒకరికొకరు కానుకలను అందించుకోవడం వల్ల.. వారి మధ్య ఉన్న ప్రేమానుబంధాలకు మరింత బలంగా చేకూర్చినట్లు అవుతుంది. మీరు కూడా మీ తోబుట్టువుకి ప్రేమగా బహుమతిని అందించాలనుకుంటున్నారా? ఏది కొనాలో తేల్చుకోలేకపోతున్నారా? అయితే మీ సోదరుడి ఇష్టానికి తగినట్టుగా కొన్ని బహుమతులను సూచిస్తున్నాం. వాటిలో మీ అన్నయ్య లేదా తమ్ముడికి ఏదిష్టమో అది బహుమతిగా అందించండి.

ADVERTISEMENT

1. లాప్ టాప్ స్లీవ్ (Laptop Sleeves)

నేటి యువతరం దగ్గర కచ్చితంగా ఉంటున్న వాటిలో లాప్ టాప్ కూడా ఒకటి. చదువు, ఉద్యోగం, సోషల్ మీడియా అంటూ లాప్ టాప్ ముందేసుకుని కూర్చుంటారు. అలాంటి లాప్ టాప్‌ని మరింత స్పెషల్‌గా మార్చేవే లాప్ టాప్ స్లీవ్స్. అస్తమానూ లాప్ టాప్‌తోనే సమయం గడిపే వారికి.. కాస్త చుట్టూ ఉన్న లోకాన్ని కూడా పట్టించుకోమని ఫన్నీగా చెప్పే అవకాశం సోదరిగా మీకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ గ్రాటిట్యూడ్ లాప్ టాప్ స్లీవ్‌ను మీ అన్నకు బహుమతిగా ఇవ్వండి.

2. స్పీకర్ సెట్ (Portable Bluetooth Speaker)

నేటితరం కుర్రకారుకి పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టుకుని వినడం బాగా అలవాటు. అందుకేనేమో.. చాలామంది అమ్మానాన్నల్ని బతిమాలి బామాలి.. సౌండ్ బాక్స్, హోం థియేటర్ లాంటివి కొనిపించుకుంటారు. మీ సోదరుడు  కూడా అదే ప్రయత్నంలో ఉన్నారా? అయితే ఈ స్పీకర్ సెట్ తనకి గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. ఈ బుల్లి ఫ్యాన్సీ బ్లూటూత్ స్పీకర్ తనకు బాగా నచ్చుతుంది. ఈ విషయంలో మాది గ్యారంటీ.

3. బూట్లు (Shoes)

ఇంటర్వ్యూకి వెళ్లాలంటే ఫార్మల్ షూ వేసుకోవడం తప్పనిసరి. మరి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న మీ తమ్ముడు లేదా అన్నయ్యకు ఫార్మల్ షూకి మించిన బహుమతి ఏముంటుంది? అందుకే ఈ రాఖీ పండగకు రక్షా బంధనం కట్టడంతో పాటు బూట్ల జతను కానుకగా ఇవ్వండి. ఇంటర్వ్యూకి వెళ్లే వారికి మాత్రమే కాదు.. ఎవరికైనా ఈ షూ పెయిర్ బహుమతిగా ఇవ్వచ్చు.

4. గేమింగ్ యాక్సెసరీస్ (Gamepad)

వీడియోగేమ్స్ అంటే ఇష్టపడే మీ సోదరుడికి ఏ తరహా బహుమతులు అందిస్తే బాగుంటుంది? గేమింగ్ యాక్సెసరీస్, గేమింగ్ క్యాసెట్స్, ప్లే స్టేషన్.. ఇలా వీడియో గేమ్స్‌కి సంబంధించినవి ఏవైనా వారికి బహుమతిగా ఇవ్వచ్చు. మొబైల్లో గేమ్స్ ఆడేవారికి గేమ్ కంట్రోలర్, మినీ గేమ్ జాయ్ స్టిక్ రాఖీ కానుకగా ఇవ్వచ్చు.

ADVERTISEMENT

5. గ్రూమింగ్ కిట్ (Men’s Grooming Kit)

మనం ఏ బహుమతి ఇచ్చినా.. అది ఎదుటి వారికి బాగా ఉపయోగపడేలా ఉండాలి. మీది కూడా ఇలాంటి అభిప్రాయమేనా? అయితే ఈ గ్రూమింగ్ కిట్‌ను మీ సోదరుడికి బహుమతిగా అందించండి. ఎందుకంటే దాని అవసరం.. మీ సోదరుడికి దాదాపు ప్రతి రోజూ ఉంటుంది కదా. దీనిలో షాంపూ, షేవింగ్ జెల్, ఫేస్ స్క్రబ్ మొదలైనవి ఉంటాయి. రాఖీ పండగనాడు మీ సోదరునికి ఇవ్వడానికి ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్.

6. బియర్డ్ షేపర్ (Beard Shaper)

ఇప్పుడు అబ్బాయిలంతా చిత్ర విచిత్రమైన గడ్డాలతో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మీ అన్నయ్య కూడా అంతే స్టైలిష్‌గా ఉంటే బాగుంటుంది కదా. అందుకే ఈ బియర్డ్ షేపర్‌ను మీ అన్నయ్యకు రాఖీ గిఫ్ట్‌గా ఇవ్వండి.

7. ఓకేయెస్ట్ బ్రదర్ కాఫీ మగ్ (Coffee Mug)

ఫొటోస్, కొటేషన్స్ ఉన్న కాఫీ మగ్స్ ఇవ్వడం మనకు అలవాటే. కానీ ఈ సారి కాస్త డిఫరెంట్‌గా ఉండే కాఫీ మగ్ ఇస్తే బాగుంటుంది. దీనికి సరైన ఎంపిక ఈ ఓకేయెస్ట్ బ్రదర్ కాఫీ మగ్. దీంతో మీ సోదరుడిని సరదాగా ఆటపట్టించవచ్చు. 

8. హెల్మెట్ (Helmet)

మీ అన్నయ్య క్షేమాన్ని మీరు కోరుకుంటున్నట్లయితే.. ఈ రాఖీ పండగకు హెల్మెట్ బహుమతిగా ఇవ్వండి. ఇది ద్విచక్రవాహనంపై చక్కర్లు కొట్టే మీ అన్నయ్యకి రక్షణగా నిలుస్తుంది.

ADVERTISEMENT

9. సూపర్ హీరో సాక్స్ (Socks)

నిజం చెప్పండి.. మీ అన్నయ్య సూపర్ హీరో కంటే.. ఏ మాత్రం తక్కువ కాదు కదా. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని ఏడిపించినా, వేధించాలని చూసినా.. వారి ఆట కట్టించేది మీ అన్నయ్యే కదా. మీకు తనే సూపర్ హీరో అని మీ అన్నయ్యకు తెలియజేయాలి కదా. దానికి సరైన ఎంపిక ఈ సూపర్ హీరో సాక్స్.

10. ఫన్నీ మెసేజ్ ఉన్న టీషర్ట్ (Black T-Shirt)

అన్నయ్యకి, చెల్లెలికి మధ్య చిన్న చిన్న తగాదాలు రావడం, వాదులాడుకోవడం సహజం. నిజానికి అవి వారిద్దరి మధ్య అనుబంధాన్ని మరింత బలంగా మార్చేస్తాయి. అందుకే మీరిచ్చే బహుమతి కూడా అలాగే ఉంటే బాగుంటుంది కదా.. ఈ బ్రదర్ సిస్టర్ టీషర్ట్ అలాంటిదే. ఈ ప్యాక్‌లో మీ అన్నయ్యతో పాటు.. మీకూ టీషర్ట్ ఉంటుంది. ఎప్పుడైనా మీ ఇద్దరికీ మధ్య ఏదైనా తగాదా వచ్చినప్పుడు ఈ టీషర్ట్ బాగా పనిచేస్తుంది.

11. సన్ గ్లాసెస్ (Sun glasses)

అన్నయ్యే చెల్లికి హీరో. మరి, ఆ హీరోకి కాస్త హీరోయిజం జోడిస్తే ఎలా ఉంటుంది? సూపర్‌గా ఉంటుంది కదా. అయితే  మీ అన్నయ్యకు లేదా తమ్ముడికి ఈ కూలింగ్ గ్లాసెస్ బహుమతిగా ఇవ్వండి.

12. కఫ్లింక్స్ (Cufflinks)

ఫార్మల్, సెమీ ఫార్మల్ వస్త్రధారణలో కఫ్లింక్స్‌కు చాలా ప్రాధాన్యముంది. వీటిని షర్ట్ కఫ్స్ దగ్గర బటన్స్‌కి బదులుగా ఉపయోగిస్తారు. ఇవి మీ సోదరుడికి జెంటిల్మెన్ లుక్ ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ADVERTISEMENT

13. వాలెట్ (Men’s Wallet)

అబ్బాయిలు ఎప్పుడూ తమ వెంట ఉంచుకొనే వాటిలో వాలెట్ కూడా ఒకటి. కాబట్టి రాఖీ గిఫ్ట్‌గా వాలెట్‌ను కూడా ఇవ్వచ్చు. పైగా చెల్లి లేదా అక్క ఇచ్చిందనే సెంటిమెంట్‌తో దాన్ని ఎంత కాలమైనా వాడుతూనే ఉంటారు.

14. ట్రావెలింగ్ బ్యాగ్ (Backpack)

కొంతమందికి ఆఫీసు పనుల మీద తరచూ.. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరికొందరికి ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. అలాంటివారు తమకు వీలుచిక్కినప్పుడల్లా.. ఏదో ఒక టూరిస్ట్ స్పాట్‌కి వెళుతుంటారు. మీ సోదరుడు కూడా అంతేనా? అయితే అతనికి ఓ ట్రావెలింగ్ బ్యాగ్ కొని వారికి రాఖీ పండుగ బహుమతిగా ఇవ్వండి. 

15. వుడెన్ ఫొటో ఫ్రేమ్ (Wooden Photo Frame)

ఫొటో ఫ్రేమా అని తీసిపడేయకండి. ఎందుకంటే ఇటీవలి కాలంలో మార్కెట్లో విభిన్నమైన ఆకృతుల్లో తయారైన ఫొటో ఫ్రేమ్స్ లభిస్తున్నాయి. వాటిలో చెక్కతో తయారుచేసినవి చాలా వైవిధ్యంగా ఉంటున్నాయి. వాటిని మీ సోదరుడికి బహుమతిగా ఇవ్వచ్చు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది

03 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT