తన బిడ్డను సర్కారు బడిలో చేర్పించి.. ఆదర్శంగా నిలిచిన తెలంగాణ కలెక్టర్..!

తన బిడ్డను సర్కారు బడిలో చేర్పించి.. ఆదర్శంగా నిలిచిన తెలంగాణ కలెక్టర్..!

మార్పు రావాలంటే ఎవరో ఒకరు అడుగు ముందుకు వేయాల్సిందే. అలాగే ప్రభుత్వ పథకాలు జనాల్లోకి వెళ్లాలంటే.. వాటి ఫలితాలను, ఉపయోగాలను అధికారులు జనాలకు చెప్పాల్సిందే. ఇక విద్యా వ్యవస్థకు వస్తే.. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో నవీన సంస్కరణలు తీసుకొస్తున్నామని.. విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నామని చెబుతోంది తెలంగాణ (Telangana) ప్రభుత్వం. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని కూడా అంటోంది. ఈ క్రమంలో ప్రజలను మరోవైపు ప్రభుత్వ పాఠశాలల వైపు చూసేలా చేస్తోంది. 

అయితే ఈ విషయం జనాల్లోకి వెళ్లాలంటే.. ఎవరో ఒకరు తొలి అడుగు వేయాలి కదా. మార్పు కోసం అలాంటి అడుగే వేశారు వికారాబాద్ కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్. తన సొంత కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలులో తన కుమార్తెను జాయిన్ చేశారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్రా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం మరెందరో తల్లిదండ్రులను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. 

12 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ పాఠాలు బోధిస్తున్న.. హైదరాబాద్ ఆణిముత్యం..!

కలెక్టర్ అయేషా తన కుమార్తె విషయంలో గతంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ప్రైవేటు ప్లే స్కూలులో తనను చేర్పించే బదులు.. స్థానిక అంగన్వాడీ పాఠశాలలో తనను చేర్పించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం వల్ల అన్ని వర్గాల పిల్లలతో చనువు ఏర్పడుతుందని.. అందరితోనూ సామరస్యం, స్నేహభావం పెరుగుతుందని తెలిపారు అయేషా. తన బిడ్డకు కూడా ఈ సంప్రదాయాన్ని అలవాటు చేయడం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. 

Government School in Telangana (File Photo)

వికారాబాద్ కలెక్టర్ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తమ పాఠశాలలు కూడా నేడు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని ఈ సందర్బంగా సొసైటీ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ కూడా.. విద్యా సంవత్సర క్యాలెండరును విడుదల చేసింది. 

విజేతగా నిలవాలంటే ఏం చేయాలి?

ఉపాధ్యాయులు అందరూ జనవరి 10వ తేది నాటికి సిలబస్ పూర్తి చేయాలని.. ఏప్రిల్ 23వ తేదిని అకడమిక్ సంవత్సరానికి సంబంధించి చివరి పని దినంగా పరిగణించాలని తెలిపింది. ఈ ఏడాది తెలంగాణలో పాఠశాల ఉపాధ్యాయులకు 237 పనిదినాలు ఉండాలని ప్రభుత్వం తెలిపింది.

అలాగే గత నెలలో టీఆర్టీ–2017 నియామకాలకు సంబంధించి కూడా విద్యాశాఖ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌‌ను విడుదల చేసింది. స్కూల్‌ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీ ఉద్యోగాల భర్తీ కోసం.. నిర్దేశిత తేదీల ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. 

ముచ్చటైన "మైక్రో ఆర్ట్స్‌"తో.. మనసులను దోచేస్తున్న "తెలుగమ్మాయి"

Featured Images: telangana.gov.in portal, pixabay.com

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.