ADVERTISEMENT
home / Food & Nightlife
హైదరాబాద్ ట్రెండ్స్: ఈ పక్కా హైదరాబాదీ వంటలు మీరు రుచి చూశారా?

హైదరాబాద్ ట్రెండ్స్: ఈ పక్కా హైదరాబాదీ వంటలు మీరు రుచి చూశారా?

హైదరాబాద్ (Hyderabad) అనగానే ముందుగా గుర్తొచ్చే వంటకం హైదరాబాదీ బిర్యానీ. ఆ తర్వాత హలీమ్. కానీ హైదరాబాద్ అంటే ఈ రెండు వంటకాలే కాదు.. నవాబుల నగరం అయిన హైదరాబాద్‌కి ఆహారం విషయంలోనూ ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ పుట్టిన ఎన్నో వంటకాలు(dishes) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. ఆహార ప్రియుల మనసులను దోచుకుంటున్నాయి.

విదేశాల నుంచి వచ్చిన ఎన్నో రుచులకు కూడా తనదైన ప్రత్యేకతను అద్ది హైదరాబాదీ వంటకాలుగా మార్చేసింది మన నగరం. మరి, అలా మన నగరంలో పుట్టి.. విదేశాలకు వెళ్లిన లేక విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి మన సంప్రదాయంలో భాగమైపోయిన వంటకాల గురించి తెలుసుకుందాం.

1. కాబూలీ బిర్యానీ

Instagram

ADVERTISEMENT

హైదరాబాద్‌లో కేవలం మాంసాహార వెరైటీలు మాత్రమే కాదు.. శాకాహార వెరైటీలు కూడా ఫేమస్. చికెన్, మటన్ బిర్యానీలతో పాటు కాబూలీ శనగలు వేసి చేసే కాబూలీ బిర్యానీ కూడా.. హైదరాబాద్ ప్రత్యేకత అని చెప్పవచ్చు. హైదరాబాద్ వచ్చి బిర్యానీ తినాలనుకుంటే మీరు నాన్ వెజిటేరియన్ అవ్వాల్సిన అవసరం లేదంటారు ఈ బిర్యానీని రుచి చూసిన వాళ్లు. నాన్ వెజ్ వెరైటీలను తలదన్నేలా ఈ బిర్యానీ రుచి ఉంటుందంట. అందుకే హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ వంటకం ఎన్నో దేశాలకు పాకింది.

2. ఉస్మానియా బిస్కట్, ఇరానీ ఛాయ్

Instagram

హైదరాబాద్‌లో తప్పక రుచి చూడాల్సిన వాటిలో ముఖ్యమైనవి ఇరానీ ఛాయ్.. అందులోకి ఉస్మానియా బిస్కట్లు. చిక్కని పాలను గంటల పాటు వేడి చేస్తూ.. అందులో ప్రత్యేకమైన టీ పొడితో పాటు సుగంధ ద్రవ్యాలు చేర్చి తయారు చేసే ఈ ఛాయ్ హైదరాబాద్ ప్రత్యేకం. ఇరాన్ నుంచి ఇక్కడికి వచ్చినా ఇక్కడి రాజులు దీనికి హైదరాబాదీ ప్రత్యేకతను జోడించారు. కాబట్టి హైదరాబాదీ ఇరానీ ఛాయ్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందులోని తియ్యతియ్యగా.. ఉప్పఉప్పగా.. కమ్మగా ఉండే లావుపాటి ఉస్మానియా బిస్కట్ ఎంతో ఆకట్టుకుంటుంది. ఒక చక్కటి ఛాయ్, ప్లేట్ నిండా ఉస్మానియా బిస్కట్లు ఉంటే చాలు.. రోజంతా ఉన్న అలసట హుష్ కాకి అయిపోతుంది.

ADVERTISEMENT

హైదరాబాద్ కి షాన్.. “ఉస్మానియా బిస్కెట్స్” చరిత్ర మీకోసం…!

3. లుక్మి

Instagram

హైదరాబాదీ వంటకాల లిస్ట్ లుక్మి లేకుండా పూర్తవదు. చతురస్రాకారంలో ఉన్న ఈ చిన్న ప్యాకెట్లలో మధ్యలో ఉన్న మటన్ కీమా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతూ అద్భుతమైన రుచిని అందిస్తుంది. వీటితో పాటు వచ్చే అద్భుతమైన చట్నీ నోరూరిస్తుంది. ఈ వంటకం హైదరాబాద్ ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ వస్తే బిర్యానీ, హలీమ్ తర్వాత ఈ డిష్ ఆకట్టుకుంది.

ADVERTISEMENT

రంజాన్ సీజన్ స్పెషల్.. హైదరాబాద్ ఖీమా లుక్మీ గురించి మీకు తెలుసా??

4. షీర్ కుర్మా

Instagram

హైదరాబాద్‌లో రంజాన్ సమయం వచ్చిందంటే చాలు.. చార్మినార్ వీధుల్లో ఓ ప్రత్యేకమైన సేమ్యా అందుబాటులో ఉంటుంది. అదే షీర్ కుర్మా. ఈ వంటకం ప్రత్యేకత మరేమీ ఉండదు. కేవలం సేమ్యా, పాలు, డ్రైఫ్రూట్స్.. ముఖ్యంగా ఖర్జూరాలు వేసి చేసే స్వీట్ ఇది. రంజాన్ వచ్చిందంటే చాలు.. ముస్లిం స్నేహితులను ప్రతి ఒక్కరూ షీర్ కుర్మా కోసం అడగడం హైదరాబాద్‌లో కనిపిస్తుంది. అద్భుతమైన రుచి దీని సొంతం. కాబట్టే హైదరాబా‌ద్‌లో పుట్టిన ఈ రెసిపీ అన్ని దేశాల్లో ప్రాచుర్యం పొందింది.

ADVERTISEMENT

5.షాహీ టుక్ డా

Instagram

హైదరాబాద్‌లో బాగా ప్రాచర్యం పొందిన స్వీట్స్‌లో షాహీ టుక్ డా.. డబల్ కా మీఠా ముఖ్యమైనవి. ఈ రెండింటి రెసిపీ దాదాపు ఒకేలా ఉంటుంది. అయితే డబల్ కా మీఠాను బ్రెడ్ ముక్కలుగా చేసి తయారు చేస్తే షాహీ టుక్ డా చేయడానికి మాత్రం బ్రెడ్‌ని ముక్కలు చేయరు. ఇది హైదరాబాద్‌లో పెళ్లిళ్లు, ఫంక్షన్లలో కూడా కనిపిస్తుంది. హైదరాబాదీ భాషలో బ్రెడ్ ని డబల్ రోటీ అంటారు. వేయించిన బ్రెడ్‌తో చేసే స్వీట్ కాబట్టి దీన్ని డబల్ కా మీఠా అంటారు. ముక్కలు అలా ఉంచితే దాన్ని షాహీ టుక్ డా అంటారు.

6. హైదరాబాదీ మరజ్

ADVERTISEMENT

Instagram

హైదరాబాద్‌లో ఎక్కువమంది ఇష్టపడే వంటకాల్లో బిర్యానీ తర్వాత ఉండేది ఇదేనేమో. ఇది హైదరాబాదీ స్పెషల్ మటన్ సూప్. సాధారణంగా భోజనానికి ముందు సూప్ ఇష్టపడేవారైనా.. లేకపోయినా కాస్త ఘాటుగా, కారం ఉండే ఈ వంటకాన్ని మాత్రం ఇష్టపడతారు. మెత్తని మటన్ ముక్కల్ని ఉడికించిన నీటితో చేసే ఈ వంటకం నవాబుల కిచెన్‌లో రూపొందిందట. కేవలం మటన్ ముక్కల్నే కాదు.. చికెన్ ముక్కల్ని కూడా ఉడికించి దీన్ని చేసి అందిస్తున్నాయి కొన్ని రెస్టారెంట్లు. ఇలాంటిదే మరో రెసిపీ హైదరాబాద్ స్పెషల్ పాయా. మటన్‌తో కాకుండా కాళ్లను మరిగించి.. ఎముకల్లోని మూలుగు మొత్తం అందులోకి చేరేలా చేసే ఈ వంటకం కూడా ఎంతో రుచిగా ఉంటుంది.

ఈ పసందైన వంట‌కాలు.. ఊరి పేర్ల‌తో ఎందుకు ప్ర‌సిద్ధి చెందాయో తెలుసా?

7. శిఖంపురీ (హైదరాబాదీ) కెబాబ్స్

ADVERTISEMENT

Instagram

అటు మటన్, ఇటు శనగలు, ఉల్లిపాయలు అన్నీ కలిపి చేసిన ఈ కెబాబ్స్ హైదరాబాద్‌లో ఫేమస్. కీమాని కాల్చి తయారుచేసే ఈ కెబాబ్స్ అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. అద్భుతమైన వాసనతో నోరూరించేలా ఉంటుందీ వంటకం. కెబాబ్ కొరకగానే నొట్లో ఇలా కరిగిపోతూ అద్భుతమైన రుచిని అందిస్తుంది. చక్కటి నెయ్యి లేదా నూనెతో కాల్చితే దాని వాసన, అద్భుతమైన రుచి వంటివన్నీ వీటిని ప్రత్యేకంగా మారుస్తాయి.

ఇవే కాదు.. కుబానీ కా మీఠా, దమ్ ఫుక్త్, మిర్చి కా సాలన్, పత్తర్ కా ఘోష్త్. బాదం జాలీ వంటివి కూడా హైదరాబాద్‌కి మాత్రమే ప్రత్యేకం. మరి, ఇందులో మీరు ఎన్ని టేస్ట్ చేశారు? కామెంట్లలో తెలియజేయండి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

23 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT