హైదరాబాద్ ట్రెండ్స్ : నగరంలోనే బెస్ట్ గైనకాలజిస్ట్‌లను కలవాలా? ఈ లిస్ట్ చూడండి.

హైదరాబాద్ ట్రెండ్స్ : నగరంలోనే బెస్ట్ గైనకాలజిస్ట్‌లను కలవాలా? ఈ లిస్ట్ చూడండి.

గైనకాలజీ.. స్త్రీలకు సంబంధించిన సమస్యలను పరిశీలించి వాటిని నివారించే వైద్య శాస్త్రం ఇది. రుతుస్రావం మొదలైనప్పటి నుంచి.. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల ఎదుగుదల, రుతుక్రమం, గర్భ నిరోధకాలు, గర్భం ధరించడం, ప్రసవం, ఫర్టిలిటీ.. ఇలా ఎన్నో రకాల సమస్యలకు గైనకాలజిస్ట్ (gynecologist) వద్దకు వెళ్లాల్సిన అవసరం ప్రతి మహిళకూ ఉంటుంది.

అయితే వైద్యుల వద్దకు వెళ్లేటప్పుడు వాళ్లు మంచి పేరున్న వైద్యులేనా? బాగా చూస్తారా? లేదా? వంటి విషయాలన్నీ మనం ఆలోచించడం సహజమే. దీనికోసం వారి గురించి మనకు తెలిసిన వాళ్లనడిగో.. లేక రివ్యూలు చదివో తెలుసుకుంటూ ఉంటాం. మీరూ అలా చేస్తున్నట్లయితే ఈ లిస్ట్ మన హైదరాబాద్ (Hyderabad) నగరంలోని బెస్ట్ గైనకాలజిస్ట్‌ల గురించి మీకు ఓ అవగాహన కలిగిస్తుంది.

1. డా. బాలాంబ

practo

డా. పి. బాలాంబ హైదరాబాద్‌లో అనుభవం ఉన్న గైనకాలజిస్ట్. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేసి ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి డీజీఓ పూర్తి చేశారు. మయోమెక్టమీ, హిస్టరెక్టమీ, ఇన్ ఫర్టిలిటీ ట్రీట్ మెంట్స్ వంటివెన్నో అద్భుతంగా చేసే అనుభవం ఆమె సొంతం. కేవలం రాష్ట్రంలోనే కాదు.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ అబ్సెక్ట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ కౌన్సిల్ నుంచి కూడా ఎన్నో ప్రశంసలు అందుకున్న వైద్యురాలు ఆమె. బర్కత్ పురలోని షాలినీ హాస్పిటల్స్‌లో ట్రీట్ మెంట్ అందించే బాలాంబ.. నగరంలో ఏ వైద్యులూ చేయలేని సర్జరీలు కూడా చేసి మంచి పేరు సాధించారు.

2. డా. మంజుల అనగాని

practo

హైదరాబాద్‌లో ఉన్న బెస్ట్ గైనకాలజిస్ట్‌లలో ముందుగా గుర్తొచ్చే పేరు అనగాని మంజులదే. 2015లో పద్మశ్రీ పురస్కారం పొందిన ఆమె ప్రస్తుతం సన్ షైన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో తన సేవలందిస్తున్నారు. సుమారు పదివేలకు పైగా లాప్రోస్కోపిక్ సర్జరీలు నిర్వహించిన ఆమె.. సర్జరీలు చేయడంలో కొత్త టెక్నిక్‌లలో చాలామంది గైనకాలజిస్టులకు శిక్షణ కూడా అందించారు. స్టెమ్ సెల్స్ సాయంతో ఎండోమెట్రియంని పునరుత్పత్తి చేసే ప్రక్రియను కనుగొన్న ఆమె.. దాని సాయంతో ఎంతో మందికి తిరిగి ఎండోమెట్రియం రూపొందేలా చేశారు.

అంతేకాదు.. యోని లేకుండా పుట్టిన వారికి నియోవజైనాని అమర్చే పద్ధతిని కూడా ఆమె తన పేషంట్లలో ఉపయోగించడం విశేషం. కేవలం వైద్యమే కాదు.. మహిళల్లో అన్ని విషయాలపై అవగాహన పెంచేలా సుయోషా అనే సంస్థను కూడా ప్రారంభించిన ఆమె.. దాని ద్వారా ఆరోగ్యం, చిన్నపిల్లలపై హింసకు అడ్డుకట్ట వేయడం, యాంటీ హిస్టరెక్టమీ, యుక్తవయసు అమ్మాయిల్లో హెల్త్ ఎడ్యుకేషన్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు.

3. డా. వందనా హెగ్డే

Hegde hospitals

హైదరాబాద్‌లోని బెస్ట్ గైనకాలజిస్ట్‌లలో వందనా హెగ్డే కూడా ముఖ్యమైనవారు. బెంగళూరులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో పని చేసిన ఆమె.. ఆపై రిప్రొడక్టివ్ మెడిసిన్‌లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కూడా పొందారు. తన ట్రీట్ మెంట్‌కి మాత్రమే కాదు.. ఆమె తన పేషంట్లను చూసే పద్ధతిని చూసి కూడా చాలామంది ఆమె దగ్గరికి వెళ్తుంటారు. పేషంట్లతో చాలా క్లోజ్‌గా మాట్లాడే వందనకి పదేళ్ల అనుభవం ఉంది. హైటెక్ సిటీలోని విట్టల్ రావ్ నగర్ హెగ్డే హాస్పిటల్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్, ఇన్ ఫర్టలిటీ ట్రీట్ మెంట్, ఐవీఎఫ్, ఐయూఐ వంటివి చక్కగా చేస్తారని అంటుంటారు.

హైదరాబాద్ ట్రెండ్స్: ఈ పక్కా హైదరాబాదీ వంటలు మీరు రుచి చూశారా?

4. డా. లక్ష్మీ రత్న

practo

గైనకాలజిస్ట్‌గా సుమారు నాలుగు దశాబ్దాల అనుభవం లక్ష్మీ రత్న సొంతం. మాసబ్ ట్యాంక్‌లోని నైస్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్ అండ్ న్యూ బోర్న్ హాస్పిటల్‌లో.. తన సేవలు అందిస్తున్న లక్ష్మీ రత్న అపోలో హెల్త్ సిటీలోనూ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు.. గతంలో ఫెర్నాండెజ్ హాస్పిటల్లోనూ పనిచేసిన అనుభవం ఆమె సొంతం. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్, హిస్టరోస్కోపీ, లాప్రోస్కోపీ సర్జరీస్, కాల్పోస్కోపీ, మెనోపాజ్ సమస్యల వంటి విభాగాల్లో ఆమె స్పెషలిస్ట్.

5. డా. ఎ. శాంతి

practo

డాక్టర్ శాంతి రెయిన్ బో హాస్పిటల్స్, అపోలో క్లినిక్స్‌లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. ఆమె లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ, లాప్రోస్కోపిక్ ఓవేరియన్ సిస్టెక్టమీ, లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ వంటి సర్జరీలతో పాటు హై రిస్క్‌గా పేర్కొన్న ప్రెగ్నెన్సీ కేర్ విభాగంలోనూ సిద్ధహస్తురాలు. కాకినాడలోని రంగయ్య మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత అక్కడే ఎంఎస్ కూడా చేశారు. కేవలం గైనకాలజీ మాత్రమే కాదు.. తను ఇన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా.

6. డా. శ్రీలతా గోర్తి

practo

శ్రీలతా గోర్తి హైదరాబాద్ లింగంపల్లిలోని జయభేరి ఎన్ క్లేవ్‌లో రివైవ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ అండ్ ఫర్టిలిటీ సెంటర్‌ని నిర్వహిస్తున్నారు. పదేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె.. వజైనల్ సర్జరీ, పెల్విక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్, రిప్రొడక్టివ్ మెడిసిన్, గైనకాలజికల్ సర్జరీ, అడ్వాన్స్ డ్ లాప్రోస్కోపీ వంటి విభాగాల్లో ప్రావీణ్యురాలు. చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ నుంచి ఎండీ, డీఎన్‌బీ చేసిన ఆమె లండన్‌లోని రాయల్ కాలేజీ ఆఫ్ అబ్సెక్ట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ కాలేజీలో కూడా చదివి ఎంఆర్సీఓజీ సర్టిఫికెట్ కూడా పొందారు. హైదరాబాద్‌లో కూడా ఆమె తన సేవలను అందిస్తున్నారు.

హైదరాబాద్ ట్రెండ్స్ : బెస్ట్ జిమ్ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి..!

7. డా. శోభ శ్రీనివాసులు కురువ

practo

రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న వైద్యురాలు శోభ. ఆమె మంచి గైనకాలజిస్ట్ మాత్రమే కాదు.. జనరల్ ఫిజీషియన్ కూడా. గుల్బర్గా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె యూకే నుంచి ఎంఆర్సీఓజీ సాధించారు. ప్రస్తుతం ఎస్వీ కేర్ పాలీ క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఆమె ఇన్ ఫర్టిలిటీ ట్రీట్ మెంట్, గైనకాలజికల్ సమస్యలు, వజైనల్ రిజువనేషన్, లాప్రోస్కోపీ, హిస్టరెక్టమీ, వంటి సమస్యలెన్నింటికో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

8. డా. శశికళ కోలా

birthplace

ప్రస్తుతం రెయిన్ బో హాస్పిటల్, ద బర్త్ ప్లేస్‌లలో కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తోన్న శశికళ వివేకానంద హాస్పిటల్, గ్లోబల్, కేర్, క్యూర్ వెల్ హాస్పిటల్స్‌లోనూ తన సేవలను అందిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎండీ, డీజీఓ పూర్తి చేసిన ఆమె సొంతంగా రెడ్ హిల్స్‌లో లక్ష్మీ క్లినిక్స్‌ని కూడా నిర్వహిస్తున్నారు. 1986 నుంచి 1994 వరకూ ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారామె. లాప్రోస్కోపీ, కాల్పోస్కోపీ, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, వజైనల్ హిస్టరెక్టమీ, ఎండోస్కోపీ, పోస్ట్ పార్టమ్ హెమరేజ్, ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే మెడికల్ డిజార్డర్స్ వంటి వాటన్నింటికీ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

9. డా. పద్మజా దేవి

practo

డాక్టర్. పద్మజా దేవి కూకట్‌పల్లి‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో స్నేహా క్లీనిక్స్‌ని నిర్వహిస్తున్నారు. 26 సంవత్సరాల నుంచి గైనకాలజీలోని వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నారామె. నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి డీజీఓ పూర్తి చేశారు. ఆమె మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యురాలు కూడా. పీసీఓస్ చికిత్స, సర్వైకల్ సర్క్లేజ్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, పాప్ స్మియర్, ఆడవారి సెక్సువల్ సమస్యలు, ఫైబ్రాయిడ్స్, కోపోస్కోపియా వంటి చాలా సమస్యలను చికిత్సను అందించడంతో పద్మజ స్పెషలిస్ట్.

హైదరాబాద్‌ ట్రెండ్స్: షాపింగ్ చేయాలా? అయితే ఈ మార్కెట్లపై ఓ లుక్కేయండి..!

10. డా. రోయా రోజాటి

practo

డాక్టర్ రోయా రోజాటి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఎంహెచ్‌ఆర్‌టీలో అపోలో క్రెడిల్‌లోనూ తన సేవలు అందిస్తున్నారు. వీటితో పాటు ఓవైసీ హాస్పిటల్‌లో.. చాలా తక్కువ ఫీజుతో తన సేవలు అందిస్తున్నారు. 1990 నుంచి తన కెరీర్ కొనసాగిస్తున్న ఆమె.. గుల్బర్గా యూనివర్సిటీలో ఎంబీబీఎస్, ఎయిమ్స్ నుంచి ఎండీ కోర్స్ చేయడంతో పాటు రాయల్ కాలేజ్ నుంచి ఫెలోషిప్ కూడా చేశారు. తరచూ మిస్ క్యారేజ్ అయ్యే వాళ్లకు చికిత్స చేయడంలో ఆమె స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. వీటితో పాటు లాప్రోస్కోపీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎండోమెట్రియల్ బయాప్సీ, సిస్టెక్టమీ, ఐవీఎఫ్ వంటి సేవలను కూడా అందిస్తారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.