వైజాగ్ ట్రెండ్స్: విశాఖపట్నంలోని టాప్ డిజైనర్ బొతిక్స్

వైజాగ్ ట్రెండ్స్: విశాఖపట్నంలోని టాప్ డిజైనర్ బొతిక్స్

విశాఖపట్నం(visakhapatnam).. ఓ వైపు పచ్చని కొండలు, మరో వైపు అంతులేని సముద్రంతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుందీ నగరం. అభివృద్ధిలోనే కాదు ఫ్యాషన్లలోనూ ఈ నగరం ముందు వరసలోనే ఉంటుంది. వెడ్డింగ్ వేర్, పార్టీవేర్,డిజైనర్ వేర్ ఏదైనా సరే వైజాగ్ (Vizag) అమ్మాయిలు ఇరగదీసేస్తారంతే.

వారి ఫ్యాషన్ అవసరాలను తీర్చేందుకే ఈ నగరంలో డిజైనర్ బొతిక్స్(Designer boutique) అవతరిస్తున్నాయి. అమ్మాయిల అభిరుచి, సందర్భాన్ని బట్టి వారికి నచ్చేలా దుస్తులు డిజైన్ చేస్తున్నారు డిజైనర్లు.

ఇలాంటి బొతిక్స్‌లో ది బెస్ట్ అనిపించుకున్న కొన్నింటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. మగువ ది డిజైనర్ బొతిక్

పెళ్లి, నిశ్చితార్థం, పుట్టినరోజు, సీమంతం, ఓణీల ఫంక్షన్.. సందర్భమేదైనా సరే దానికి తగిన దుస్తులు సమయానికి అందించే బొతిక్ మగువ. వీరు మన ఆలోచనలు, అభిరుచులకు తగిన విధంగా దుస్తులు డిజైన్ చేసి అందిస్తారు. మీకు ఎలాంటి దుస్తులు నప్పుతాయో తెలియక తికమకపడుతుంటే.. మగువ స్టోర్స్‌కి వెళ్లండి. వారు మీకు నప్పే దుస్తులను డిజైన్ చేసి అందిస్తారు. అందుకే విశాఖ మగువల మనసును దోచుకుంది మగువ. చీరలు, లంగాఓణీలు, టాప్స్ ఇలా మహిళలకు అవసరమైనవన్నీఇక్కడ దొరుకుతాయి.

చిరునామా: ప్లాట్ నెం. 50-50-30/1, వందన ప్లాజా, గురుద్వార పక్కన, ఎన్ హెచ్ 5 రోడ్, సీతమ్మధార, విశాఖపట్నం.

2.ఎదాస్ డిజైనర్ బొతిక్

Facebook

‘ఎవ్రీ డ్రస్ హాజ్ ఎ స్టోరీ’ ఇది ఈ డిజైనర్ బొతిక్ ట్యాగ్ లైన్. నిజంగానే ఇక్కడి డిజైనర్ దుస్తుల వెనుక ఏదో ఒక  కథ ఉన్నట్టే అనిపిస్తుంది. పెళ్లి పట్టుచీర అయినా.. వెడ్డింగ్ లెహంగా అయినా.. ట్రెండీ టాప్ అయినా ముచ్చటైన ఎంబ్రాయిడరీ హంగులు అద్దడం వీరి ప్రత్యేకత. అందమైన కలర్ కాంబినేషన్లు, అద్భుతమైన డిజైన్లు మీకు కచ్చితంగా నచ్చుతాయి. మిమ్మల్ని మరింత అందంగా మార్చేస్తాయి.

చిరునామా: అను డిజైన్స్ అండ్ ఫ్యాషన్స్, డోర్ నెం. 1-56-36, ప్లాట్ నెం 11, ఎంవీపీ సెక్టార్ -3, రల్లాబెల్లా స్కూల్ ఎదురుగా, వెంకోజీపాలెం రోడ్, విశాఖపట్నం.

3. ఇషా స్టూడియో

Facebook

ఎత్నిక్, ఫ్యూజన్ వేర్‌లో వైవిధ్యమైన డిజైన్లతో దుస్తులను అందిస్తోన్న బొతిక్ ఇషా స్టూడియో. కస్టమైజ్డ్ డిజైన్లతో.. ఆకట్టుకొనే రంగులతో ఉన్న డిజైనర్ దుస్తులు మీకు కచ్చితంగా నచ్చుతాయి. ఈ స్టూడియోలో అందించే వస్త్రాలు అందరికీ నచ్చేలా ఉండటానికి మరో కారణం.. వినియోగదారులు ఇచ్చే సలహాలను స్వీకరించడం, వాటికి తగ్గట్టుగా నడుచుకోవడం. విశాఖపట్నం వెళ్లినవారిలో ఎక్కువ మంది సందర్శించే వాటిలో సీఎంఆర్ షాపింగ్ మాల్ కూడా ఒకటి. మీరు కూడా ఎప్పుడైనా అక్కడకు వెళితే.. ఓసారి మాల్‌లోని ఈ స్టూడియోకి వెళ్లండి. ఇక్కడి డిజైన్లు మీకు కచ్చితంగా నచ్చుతాయి.

చిరునామా: గ్రౌండ్ ఫ్లోర్, సీఎంఆర్ సెంట్రల్ మాల్, కేఎఫ్ సీ పక్కన, మద్దిలపాలెం, విశాఖపట్నం.

4. ఫినీస్

Facebook

బ్రైడల్ కలెక్షన్, పార్టీవేర్ తరహా దుస్తుల్లో మీకు నచ్చిన దుస్తులు కావాలంటే ఫినీస్‌కు వెళ్లాల్సిందే. ముఖ్యంగా బ్రైడల్ లెహంగాలు, డిజైనర్ పట్టుచీరలకు ఫినీస్ పెట్టింది పేరు. డిజైనర్ దుస్తులతో పాటు క్యాజువల్ వేర్ కూడా ఫినీస్‌లో దొరకుతాయి. అలాగే మీకు నచ్చినట్టుగా దుస్తులను డిజైన్ కూడా చేయించుకోవచ్చు. ఎంబ్రాయిడరీ, డైయింగ్, స్టిచ్చింగ్ కూడా ఫినీస్‌లో చేస్తారు.

చిరునామా: 10-50-11/6, హోటల్ ఫైవ్ ఎలిమెంట్స్, కేర్ హాస్పిటల్ దగ్గర, వాల్తేరు మెయిన్ రోడ్, విశాఖపట్నం.

5. అనీనా బొతిక్

Facebook

తమ అభిరుచిని పరిగణనలోకి తీసుకుంటూనే.. తమకు నప్పే వస్త్రాలు కావాలనుకొనేవారికి అనీనా బొతిక్ సరైన ఎంపిక. లవ్లీ కాంబినేషన్స్, వావ్ అనిపించే డిజైన్లు సౌకర్యవంతమైన ఫిట్టింగ్ కారణంగా ఈ డిజైనర్ బొతిక్ అందరి మన్ననలు అందుకుంటోంది. వెడ్డింగ్ వేర్, పార్టీవేర్ ఏది కావాలన్నా ఈ డిజైనర్ బొతిక్‌లో ప్రత్యేకంగా డిజైన్ చేసి అందిస్తారు.

చిరునామా: LIG 2/IV, రామ్ నగర్ రోడ్, రామ్ నగర్, విశాఖపట్నం.

6. రాంకిని క్రియేషన్స్ – ఫ్యాషన్స్ బొతిక్

Facebook

చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు డిజైనర్ దుస్తులు కావాలంటే రాంకిని క్రియేషన్స్‌కి వెళ్లాల్సిందే. డిజైనర్ దుస్తులతో పాటు వాటికి తగిన యాక్సెసరీస్ ఇక్కడ లభిస్తాయి. ముఖ్యంగా పార్టీవేర్, మదర్ డాటర్ మ్యాచింగ్ డిజైనర్ దుస్తులు కావాల్సిన వారు  ఈ రాంకినీ క్రియేషన్స్‌కి వెళ్లచ్చు.

చిరునామా: ఫ్లాట్ నెం.101, అపెక్స్ వై, నిర్మల సదన్ అపార్ట్మెంట్, నిర్మల సదన్ అపార్ట్మెంట్, షాపర్స్ స్టాప్ ఎదురుగా, వీఐపీ రోడ్, సీబీఎం కాంపౌండ్, విశాఖపట్నం

7. షి డిజైనర్స్

Facebook

సింపుల్‌గా ఉన్నా.. గ్రాండ్ లుక్ ఇచ్చే డిజైనర్ బ్లౌజులు కావాలనుకునేవారు షి డిజైనర్ బొతిక్‌కు వెళ్లాల్సిందే. క్రియేటివ్ డిజైన్లతో ఆకట్టుకునేలా వాటిని ఇక్కడ తీర్చిదిద్దుతారు. అందుకే విశాఖ మహిళలు ఈ  బొతిక్‌లో బ్లౌజులు డిజైన్ చేయించుకోవడానికి క్యూ కడుతుంటారు.

చిరునామా:  పోస్ట్ ఆఫీస్, ఎల్.ఐ.జీ – 91, ఆపోజిట్ లేన్ లాసన్స్ బే కాలనీ, సెక్టార్ 12, ఎంవీపీ కాలనీ, విశాఖపట్నం.

8. ఆర్ణ బొతిక్

Facebook

క్లాసీ స్టైల్ ఇచ్చే డిజైనర్ వేర్ దుస్తులకు పెట్టింది పేరు ఆర్ణ బొతిక్. క్యాజువల్ వేర్, పార్టీవేర్ రెండూ ఒకే చోట లభించే డిజైనర్ బొతిక్ ఆర్ణ.

చిరునామా: బాలాజీ ఆర్ స్క్వేర్, హార్బర్ పార్క్ రోడ్, విశాఖపట్నం.

9. రేఖాస్ డిజైన్స్

బడ్జెట్‌లో డిజైనర్ దుస్తులు కావాలనుకునేవారికి రేఖాస్ డిజైనర్స్ సరైన ఎంపిక. విభిన్న తరహా దుస్తులను డిజైన్ చేస్తూ ఫ్యాషన్ ప్రియుల ఆదరణ పొందింది ఈ బొతిక్.

చిరునామా: 39-8-11/12, జీతు అపార్ట్మెంట్స్, బీవీకే లాడ్జ్ దగ్గర, విశాఖపట్నం.

హైదరాబాద్‌లోని టాప్ 10 డిజైనర్ బొతిక్స్ ఇవే

Feature Image: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.