ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఈ గుడ్ నైట్ మెసేజ్‌లతో.. మీ రోజును ఆనందంగా ముగించండి..!

ఈ గుడ్ నైట్ మెసేజ్‌లతో.. మీ రోజును ఆనందంగా ముగించండి..!

ఉరుకుల పరుగుల జీవితం.. రోజంతా ఎవరు ఎక్కడుంటారో.. రాత్రి ఇంటికి ఎప్పుడొస్తారో అర్థం కాదు. ఇక ఇంటి నుంచి దూరంగా ఉండేవారి పరిస్థితి మరీ దారుణం.  రోజంతా ఎలాగో గడిచిపోయినా.. రాత్రి మాత్రం ఒంటరితనం వెంటాడుతుంటుంది.

ఆ ఫీలింగ్‌ని మీరు దూరం చేసుకోవడానికి.. మీ సన్నిహితులకు దూరం చేయడానికి రాత్రి పడుకోవడానికి ముందు.. ఓ చిన్న ఫోన్ కాల్ లేదా ఓ చక్కటి మెసేజ్ చేయండి చాలు. ఇది వారికి మీరు ఎప్పుడూ దగ్గరగా ఉంటారనే భావనను కలిగిస్తుంది.

అయితే గుడ్ నైట్ (good night) చెప్పేందుకు.. కేవలం రెండు ముక్కల్లో మెసేజ్ (messages) చేయడం కంటే.. మనసులోని భావాలు ఇతరులకు అర్థమయ్యేలా గుడ్ నైట్ చెబితే చాలా బాగుంటుంది కదా. అందుకే మీకోసం.. మీ సన్నిహితులకు పంపించేందుకు వీలుగా కొన్ని గుడ్ నైట్ మెసేజ్‌లు అందిస్తున్నాం. ఈ పేజీని బుక్ మార్క్ చేసి పెట్టుకొని.. రోజూ మీ మూడ్‌కి తగినట్లుగా ఆత్మీయులకు మెసేజ్ పంపించండి.

ADVERTISEMENT

రొమాంటిక్ గుడ్ నైట్ మెసేజ్‌లు

shutterstock

1. నువ్వెంతగా ప్రయత్నించినా.. నీ కలలు నా కలలకంటే ఎప్పుడూ అందంగా ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే నా కలలో నువ్వుంటావు కాబట్టి.. అవి అందరికంటే అందంగా ఉంటాయి.. శుభ రాత్రి.

2. నాకు చీకటన్నా.. లైట్లు ఆపేయడమన్నా ఇప్పుడు భయం లేదు. నువ్వు నా కలలోకి వచ్చినన్ని రోజులు ఈ ధైర్యం నాకు తోడుగా ఉంటుంది. గుడ్ నైట్ డియర్.

ADVERTISEMENT

3. గుడ్ నైట్ డియర్. నేను కలలో కూడా నీతోనే ఉండాలనుకుంటున్నా. ఎందుకంటే నా జీవితాన్నే కాదు.. నా కలలను కూడా నువ్వు రంగులమయం చేస్తావు కాబట్టి.

4. నీ తల కింద తలగడలా.. నువ్వు కప్పుకునే దుప్పటిలా నేను మారిపోతే బాగుండని నాకెప్పుడూ అనిపిస్తుంది. అలా రాత్రి కూడా నీకు తోడుగా ఉండే అవకాశం నాకు దొరుకుతుంది.. నీకు దగ్గరగా ఉండకపోతే నాకు అదోలా ఉంటుంది. శుభ రాత్రి.

5. నువ్వు నిద్రపోతున్నప్పుడు.. చాలా అందంగా ఉంటావు తెలుసా. అలా నిద్రపోతున్న నిన్ను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అలా చూస్తున్నప్పుడు.. రాత్రిలోని ఆ నిశ్శబ్దం నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నాకు చెబుతూ ఉంటుంది.

6. నీ కలలు కూడా.. నీలాగే స్వీట్‌గా క్యూట్‌గా ఉండాలని కోరుకుంటున్నా. గుడ్ నైట్ స్వీట్ హార్ట్.

ADVERTISEMENT

7. నువ్వు నాకు ఎంత దూరంలో ఉన్నావన్నది పెద్ద విషయం కాదు. ఎందుకంటే నీ ఆలోచనలెప్పుడూ నా చుట్టే తిరుగుతుంటాయి. నా ఆలోచన కూడా నీ గురించే. ఉదయం లేవగానే నా మొదటి ఆలోచన.. రాత్రి పడుకునేటప్పుడు ఆఖరి ఆలోచన నువ్వే. గుడ్ నైట్ డియర్.

8. నా మనసులో దాగున్న ఒకే ఒక్క కోరిక.. ప్రతి రాత్రి నీతో కలిసి నిద్రపోవాలని. ప్రతి ఉదయం నీ పక్కనే నిద్రలేవాలని. నీకు దూరంగా ఉన్న ప్రతి నిమిషం.. నా మనసు నీకు దగ్గరయ్యే క్షణం కోసం వేచి చూస్తూ ఉంటుంది. శుభ రాత్రి.

9. నువ్వు నా పక్కనుంటే.. ఆ రాత్రి ఎంతో అద్భుతమైన అనుభూతిగా మిగులుతుంది. స్వీట్ హార్ట్.. నేను నిన్ను ఎంతగానో మిస్సవుతున్నా. ఈ అందమైన రాత్రి నీకు మంచి నిద్రను అందించాలని కోరుకుంటూ.. గుడ్ నైట్.

10. నీ గురించి ఆలోచించగానే.. నాకు పీడ కలలు దూరమై అందమైన కలలు మొదలవుతాయి. ఎందుకంటే నువ్వు అంత అందమైన వ్యక్తివి కాబట్టి. నీకూ చక్కటి కలలు రావాలని కోరుకుంటూ.. శుభ రాత్రి.

ADVERTISEMENT

క్యూట్ గుడ్ నైట్ మెసేజ్‌లు

shutterstock

1. నేను చంద్రుడినైతే బాగుంటుందని నా ఫీలింగ్. అలా అయితే.. నిద్రపోతున్న నిన్ను దగ్గరగా చూడొచ్చు. అంతేనా.. చుక్కల కంటే అందంగా మెరిసిపోవచ్చు. నీ కల్లోకి కూడా రావచ్చు. నీ కలలు అద్బుతంగా ఉండాలని కోరుకుంటూ గుడ్ నైట్.

ADVERTISEMENT

2. స్వీట్ డ్రీమ్స్ ఎయిర్ లైన్స్‌కి స్వాగతం. కాసేపటిలో మీరు కలలరాజ్యంలో లాండ్ అవుతారు. మీ దుప్పట్లు కప్పుకొని, తలగడ సిద్ధం చేసుకొని.. కళ్లు మూసుకొని నిద్రలోకి జారిపోయేందుకు సిద్ధంగా ఉండండి. గుడ్ నైట్.

3. ఒరిజినల్ గుడ్ నైట్ మెసేజ్.. నీకోసమే.. చవకైన డుప్లికేట్స్‌ని అస్సలు నమ్మొద్దు. నేను గుడ్ నైట్ విషెస్‌కి అధికారిక డీలర్‌ని. నేను పంపితేనే తీసుకోండి. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్.

4. హే నిన్నే.. హా.. ఫోన్ పట్టుకున్న నిన్నే.. ఇంకా నిద్రపోలేదా? మంచిది. ఎందుకంటే నీ కనురెప్పలు ఒకదాన్ని మరొకటి హత్తుకొని.. నిద్ర నీ దగ్గరికి వచ్చేలోపే నీకు గుడ్ నైట్ చెప్పాలని వచ్చా. శుభ రాత్రి.

5. సూర్యుడు ఎర్రగా ఉండేవాడు కాదు.. ఆకాశం నీలంగా ఉండేది కాదు. నేను ఆనందంగా ఉండేదాన్ని కాదు. నిన్ను నేను డిస్టర్బ్ చేయని రోజుంటే ఇలా ఉండేది కాదు తెలుసా? గుడ్ నైట్.

ADVERTISEMENT

6. దేవుడు నన్ను ఓ వాట్సప్ మెసేజ్‌లా మార్చితే బాగుండు. నిన్ను సెకన్లలో చేరుకోవచ్చు. నీకు ఏమాత్రం ఖర్చు లేకుండా.. నువ్వు నన్ను చూసే వీలు కలిగించవచ్చు. నేను నీ నవ్వు ముఖం చూడచ్చు. నాకు మిలియన్ల మంది అందించే ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. గుడ్ నైట్. నాకోసం ఆ మిలియన్ డాలర్ నవ్వును మరో సారి చూపించవూ..

7. నిద్ర అనేది నాకు డ్రగ్స్ లాంటిది. నా బెడ్ దాన్ని నాకు అందించే డీలర్. దాన్ని నా నుంచి దూరం చేసే పోలీస్ నా అలారం క్లాక్. నీక్కూడా సేమ్ టూ సేమ్ కదా.. మరి ఎందుకు ఆలస్యం.. వెంటనే నిద్రపో.. ఆ మత్తులో ఈ లోకాన్నే మర్చిపో.. గుడ్ నైట్.

8. కలలు కనడం ద్వారానే.. అందమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చట. మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు.. వెంటనే వెళ్లి నిద్రపోయి.. నీ అందమైన భవిష్యత్తును నిర్మించుకో. గుడ్ నైట్.

9. ఇప్పుడు 4.7 మిలియన్ల మంది నిద్రపోతున్నారు. మరో 2.5 మిలియన్ల మంది కలలు కంటున్నారు. 1.3 మిలియన్ల మంది టీవీ చూస్తున్నారు. కానీ ఒక్క క్యూట్ పర్సన్ మాత్రం నా మెసేజ్ చదువుతూ.. నా జోకులకు నవ్వుకుంటున్నారు. ఆ వ్యక్తికి ఇదే నా శుభ రాత్రి.

ADVERTISEMENT

10. నువ్వు ఈ రాత్రి హాయిగా నిద్రపోతుండగా.. గబ్బిలాలు నీకు కాపలా కాయాలని.. దయ్యాలు నీ చుట్టూ నాట్యం చేయాలని.. డ్రాకులా నీ మెడపై అందమైన ముద్దు పెట్టాలని కోరుకుంటూ.. గుడ్ నైట్.

మీకూ ఇలాంటి కలలు వస్తుంటాయా? అయితే వాటి అర్థాలేమిటో తెలుసుకోండి

ఫన్నీ గుడ్ నైట్ మెసేజ్‌లు

Shutterstock

ADVERTISEMENT

1. నీ గురించి ఆలోచన అనే మోడ్ ప్రారంభమైంది. నిన్ను మిస్సవ్వడం అనే ప్రక్రియ కొనసాగుతోంది. నువ్వు మెలకువగా ఉంటే మెసేజ్ చేయి. అప్పుడు ఈ ఆలోచన మోడ్ డీయాక్టివేట్ అయ్యి.. నిద్ర మోడ్ యాక్టివేట్ అవుతుంది. గుడ్ నైట్.

2. ఈ రోజు నీకు చాలా అందమైన కల రావాలని కోరుకుంటున్నా. క్యూటెస్ట్ వ్యక్తి నీ కలలోకి రావాలని ఆశిస్తున్నా. అయితే రోజూ అలాంటి కలలే కావాలని కోరుకోకు. ఎందుకంటే నేను రోజూ నీ కల్లోకి రాలేను. శుభ రాత్రి

3. మంచి వాళ్లు చెడ్డవాళ్లకంటే ప్రశాంతంగా నిద్రపోగలుగుతారట. అవును మరి.. చెడ్డవాళ్లు రాత్రంతా పార్టీ చేసుకొని ఆనందంలో మునిగి తేలుతుంటే నిద్రెలా పడుతుంది.. ఇంతకీ నువ్వు పడుకున్నావా? నిద్రపోయావా? మెలకువగా ఉంటే గుడ్ నైట్ చెప్పి పడుకో..

4. రోజూ రాత్రి నేను హాయిగా పడుకుంటున్నానంటే దానికి కారణం నువ్వే. అవును. నాకు హారర్ సినిమాలంటే ఇష్టమని నీకు తెలుసు కదా.. గుడ్ నైట్ మరి.. త్వరగా కల్లోకి వచ్చేయ్..

ADVERTISEMENT

5. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ123456789,. హమ్మయ్య.. నా ఫోన్ కీ ప్యాడ్ బాగానే పనిచేస్తోంది. ఇక పడుకుంటా. గుడ్ నైట్

6. నమస్కారం. మా అర్థరాత్రి సేవలకు స్వాగతం.  మేం అర్థ రాత్రి దాటిన తర్వాత.. అందరి నిద్ర చెడగొడుతుంటాం. సేవలను వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మళ్లీ పడుకోండి. శుభ రాత్రి.

7. కళ్లు మూసుకొని ఒక్కసారి ఊహించుకో.. చందమామ మంచంపై పూల పరుపుపై చుక్కల దుప్పటి కప్పుకొని పడుకుంటే ఎలా ఉంటుంది? వూహించుకున్నావా? ఇప్పుడు తిరిగి రియాల్టీలోకి వచ్చేయ్.. నీ మంచంపై నీ దుప్పటి కప్పుకొని పడుకో. గుడ్ నైట్.

8. దేవుడా. నాకు గుడ్ నైట్ చెప్పని వాళ్ల ఫొన్ పనిచేయకుండా చెయ్యి స్వామి. నేను గుడ్ నైట్ చెప్తున్నా కాబట్టి.. రీఛార్జ్ చేయకపోయినా.. నా ఫోన్ పనిచేసేలా చూడు స్వామి. గుడ్ నైట్ మరి.

ADVERTISEMENT

9. రోజంతా ఆన్‌లైన్‌లో చాలా కష్టపడి అలసిపోయావు. చాలా లేటైంది. కష్టపడింది చాలు కానీ పడుకో. గుడ్ నైట్.

10. పడుకున్నావా? పడుకుంటున్నావా? పడుకోవా? పడుకోవట్లేదా? పడుకోవడానికి బద్ధకమా? నిద్ర రావట్లేదా? కాసేపాగి పడుకుంటావా? సరే.. ఏదైనా గుడ్ నైట్ చెప్పడం నాకు తప్పదు కదా.. గుడ్ నైట్ మరి.

కుటుంబ సభ్యులకు పంపే గుడ్ నైట్ మెసేజ్‌లు

ADVERTISEMENT

Shutterstock

1. రాత్రి అనేది కేవలం విశ్రాంతి కోసమే కాదు.. రేపటి కోసం సిద్ధమయ్యేందుకు కూడా అవసరం. ఈ రోజు ఏం జరిగినా సరే.. జీవితం మనకు రేపటి రూపంలో.. మరో కొత్త ఛాన్స్ అందిస్తూనే ఉంటుంది. అందుకే అన్నీ మర్చిపోయి రేపటి గురించి ఆలోచిస్తూ పడుకో.

2.రోజూ రాత్రి నన్ను నిద్రపుచ్చిన అమ్మకు గుడ్ నైట్. భయం లేకుండా.. సంతోషంగా నీ కొంగు పట్టుకొని నిద్రపోయిన ఆ రాత్రుల నాకింకా గుర్తే.. ఏం చేసి నీ రుణం తీర్చుకోగలను..?

3. నాకు తెలిసిన అద్భుతమైన మహిళవు నువ్వే. ఈ రోజు నువ్వు తలవాల్చి నిద్రపోతుండగా.. నీలాంటి అద్భుతమైన కల రావాలని.. నిన్ను నవ్వించాలని కోరుకుంటున్నా. గుడ్ నైట్ అమ్మా.

ADVERTISEMENT

4. నేను రేపు ఉదయం లేవగానే.. మా అమ్మంత ధైర్యంగా, శక్తిమంతంగా మారాలని ప్రతి రాత్రి.. దేవుడిని కోరుకొని పడుకుంటాను. నాకు స్ఫూర్తినందించిన అమ్మకు ధన్యవాదాలతో.. శుభ రాత్రి.

5. నా సూపర్ మ్యాన్ డాడీకి గుడ్ నైట్. నా కలలను నెరవేర్చడమే కలగా మార్చుకున్న నీకు మరింత అద్భుతమైన కలలు రావాలని కోరుకుంటున్నా.

6. నాకోసం అన్నింటినీ త్యాగం చేసిన వ్యక్తి.. నన్ను ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి.. నన్ను కాపలా కాసిన వ్యక్తి.. అవన్నీ నువ్వే నాన్న. ఇంత అద్భుతమైన తండ్రిని అందించిన భగవంతుడికి థ్యాంక్స్ చెబుతూ.. నా రోజును ముగిస్తున్నా. గుడ్ నైట్ నాన్న.

7. మా నాన్నే నా కింగ్ అని నేను అందరికీ చెప్పుకుంటా. అదేంటి “మీ నాన్న గొప్పవాడు కాదుగా..ష అని ఎవరైనా అడిగితే.. తనకున్నదంతా త్యాగం చేసి.. “నన్ను ఇంతటి వ్యక్తిని చేసిన గొప్పవాడు మా నాన్న” అని గర్వంగా చెబుతా. మా నాన్నకి ధన్యవాదాలతో శుభరాత్రి.

ADVERTISEMENT

8. డియర్ అన్నయ్య.. నా స్నేహితులు నన్ను వదిలేసినప్పుడు నువ్వు అక్కున చేర్చుకున్నావు. నువ్వే నా అతిపెద్ద స్నేహితుడవని అప్పుడు నాకు అర్థమైంది. గుడ్ నైట్ అన్నయ్యా.

9. మనమిద్దరం ఎక్కడ ఉన్నా సరే.. నువ్వెప్పుడూ నా కలల్లో.. ఆలోచనల్లో ఉంటావని గుర్తుంచుకో. ఈ రాత్రి వేళ ఈ విషయాన్ని నీతో చెప్పాలనుకున్నా. గుడ్ నైట్ అన్నయ్యా.

10.ఈ రాత్రి సమయంలో నీకోసం ఓ పెద్ద హగ్‌ని పంపుతున్నా. ఎందుకంటే నువ్వు అంత లావున్నావు.. నా టెడ్డీ బేర్. గుడ్ నైట్ తమ్ముడూ..

జీవితం విలువ తెలియజేసే ఈ 75 లైఫ్ కొటేషన్స్ .. మీలో స్ఫూర్తిని కలిగిస్తాయి..!

ADVERTISEMENT

స్నేహితులకు పంపే గుడ్ నైట్ మెసేజ్‌లు

shutterstock

1. మరో అత్యద్భుతమైన రోజు పూర్తయింది. చక్కగా కళ్లు మూసుకొని నిద్రపో.. నిన్ను నువ్వు రీఛార్జ్ చేసుకో. ఎందుకంటే.. రేపు ఈ రోజు కంటే అద్భుతంగా ఉండబోతోంది మరి. గుడ్ నైట్ ఫ్రెండ్.

2. రోజంతా కష్టపడి పనిచేశాక.. అలసిన నీకు వచ్చే నిద్రను నేను చెడగొట్టాలనుకోవట్లేదు. కానీ నీకు గుడ్ నైట్ చెప్పకుండా నా కళ్లు మూసుకోనంటున్నాయి. అందుకే గుడ్ నైట్ మై డియర్ ఫ్రెండ్.

ADVERTISEMENT

3. బాయ్ ఫ్రెండ్స్ వస్తుంటారు.. పోతుంటారు. కానీ నీ లాంటి ఫ్రెండ్ మాత్రం ఎవరికీ ఉండరు. మన స్నేహం ఎప్పుడూ ఇలాగే వెలిగిపోవాలని కోరుకుంటూ.. నా ముద్దుల స్నేహితురాలికి శుభరాత్రి.

4. నవ్వు, ఏడుపు, కోపం, ఆనందం, ఆశ్చర్యం, వినోదం.. నువ్వు లేకపోతే ఇలా జీవితంలోని గొప్ప ఎమోషన్స్ అన్నింటినీ మిస్సయ్యేదాన్నేమో.. నా స్నేహితురాలిగా ఉన్నందుకు థ్యాంక్స్. గుడ్ నైట్ ఫ్రెండ్.

5. నాకు రాత్రంతా అందమైన కలలు రావడానికి కారణం నీలాంటి స్నేహితులే. అవును… రేపంతా మీతో ఆనందంగా గడపొచ్చనే ఆలోచన.. నాకు హాయైన నిద్రను, అందమైన కలలను అందిస్తుంది. గుడ్ నైట్ బడ్డీ..

6. చీకటి రాత్రిలో చుక్కలు ఎంత ప్రకాశవంతంగా మెరుస్తాయో.. నా జీవితంలో మన స్నేహంలోని మధురానుభవాలు కూడా అంతే ప్రకాశవంతంగా కనిపిస్తాయి. గుడ్ నైట్ డియర్.

ADVERTISEMENT

7. జీవితంలో సక్సెస్ అంటే కేవలం మన కలలు ఎన్ని నెరవేరాయని మాత్రమే కాదు.. నిజమైన సక్సెస్ అంటే జీవితంలో మన కలల గురించి, కష్టాల గురించి చెప్పుకునే స్నేహితులు ఉండడం కూడా. నాకు అలాంటి ఫ్రెండ్ రూపంలో నువ్వున్నావు. గుడ్ నైట్ ఫ్రెండ్.

8. హారర్ సినిమాలు చూసేందుకు రాత్రి మంచి సమయం. ఆ సినిమాలు చూసిన తర్వాత దెయ్యాలు అసలైనవి కావని అనుకుంటూ పడుకున్నా.. అర్థ రాత్రి భయంతో లేచి ఉలిక్కిపడడానికి కూడా.. ఈ రాత్రి నీకు ఇవన్నీ జరగాలని కోరుకుంటున్నా. హ్యాపీ హారర్ డ్రీమ్స్ మై ఫ్రెండ్.

9. నీకు నిద్ర రాకపోతే నా మెసేజ్ చేయి.. ఒకవేళ పీడకలలొస్తే నాకు ఫోన్ చేయి. నీ పీడకలలన్నింటినీ తన్ని పారదోలుతాను. గుడ్ నైట్ మై ఫ్రెండ్.

10. ఓయ్.. రాత్రి అనేది రెస్ట్ కోసం.. టెక్ట్స్ కోసం కాదు.. అందుకే నీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి కలల రాజ్యానికి చేరుకో. గుడ్ నైట్ డియర్.

ADVERTISEMENT

స్ఫూర్తినిచ్చే గుడ్ నైట్ మెసేజ్‌లు

1. ఏదైనా ఒక వస్తువు మన నుంచి దూరం అయితేనే దాని విలువ తెలుస్తుంది. చీకటి అయితేనే వెలుగు విలువ తెలుస్తుంది. ప్రతి ఉదయం మీకోసం ఓ కొత్త అవకాశాన్ని తీసుకొస్తుంది. అందుకే హాయిగా నిద్రపోయి.. రేపు ఉదయాన్నే రోజును కొత్తగా ప్రారంభించు.

2. ప్రతి దానికి మంచి, చెడు ఉంటుంది. చీకటికి కూడా. చీకటి మనల్ని హాయిగా నిద్రపోయేలా చేస్తుంది. మన గురించి మనం ఆలోచించేలా చేస్తుంది. అందుకే ఎప్పుడూ వెలుగే మంచిదని అనుకోకు. ఈ చీకటిలో ఆనందంగా నిద్రపో. గుడ్ నైట్.

ADVERTISEMENT

3. రోజంతా ఒత్తిడితో ఆందోళన పడుతూ గడిపేసే.. మన జీవితాలకు రాత్రి ఓ వరం లాంటిది. ఆ నెగెటివ్ ఫీలింగ్స్ అన్నింటినీ పక్కన పెట్టి హాయిగా నిద్రపోయే అవకాశాన్ని అందిస్తుంది. అందుకే ఆనందంగా నిద్రపో. గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్

4. ఈరోజు బాగా జరగకపోతేనేం.. చీకట్లోనూ చంద్రుడు వెలుగుతున్నట్లు కష్ఠంలోనూ నవ్వుతూ ఉండు. ఉదయాన్నే సూర్యుడు వచ్చినట్లుగా రేపు ఉదయం నీకు కొత్త ఆనందాన్ని, అవకాశాలను తీసుకొస్తుంది.

5. పాజిటివ్ ఆలోచనలే పాజిటివ్ లైఫ్‌ని తీసుకొస్తాయి. అందుకే కళ్లు మూసుకొని.. అందమైన భవిష్యత్తు కోసం పాజిటివ్‌గా ఆలోచిస్తూ కలలు కను. శుభ రాత్రి.

6. కలలు కనేవాళ్లకు.. రోజు కంటే రాత్రి ఎక్కువగా ఉంటుంది. ఆ కలలను నిజం చేసుకోవాలనుకునేవారికి.. రాత్రి కంటే పగలు ఎక్కువగా ఉంటుంది. గుడ్ నైట్.

ADVERTISEMENT

7. ఈరోజు జరిగిందాన్ని గుర్తు చేసుకొని బాధపడడం, ఫీలవ్వడం కంటే.. రేపటి గురించి ఆలోచించి ఉత్సాహం తెచ్చుకోవడం మంచిది. ఎందుకంటే ఈ రోజు జరిగిపోయింది. రేపు మన చేతుల్లో ఉంది. అందమైన రేపు కోసం కలలు కంటూ నిద్రపో. శుభ రాత్రి.

8. చూసే కళ్లుండాలి కానీ… మన చుట్టూ ఉన్న వాటన్నింటిలోనూ అందం ఉంటుంది. అది అందమైన నిశీధిలోనూ దాగి ఉంటుంది. అందుకే ఆ చీకటిలోనూ అందాన్ని చూస్తూ హాయిగా నిద్రపో నేస్తం. గుడ్ నైట్

9. రోజంతటిలో అందమైన భాగం ఏంటో నీకు తెలుసా? రాత్రి పడుకునే ముందు ఈరోజు నేను అనుకున్న పనులన్నీ జరిగిపోయాయి.. అంటూ సంతోషంగా ఫీలయ్యే సమయమే. అలాంటి ఆనందం ప్రతి రోజు నీ సొంతం కావాలని కోరుకుంటూ.. శుభరాత్రి.

10. నాకు రాత్రంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే నా ప్లస్సులు, మైనస్‌లు అన్నీ ఆలోచించే వీలుంటుంది కాబట్టి. అవును.. రాత్రిలోని ప్రశాంతత నన్ను నా గురించి ఆలోచించుకునేలా చేస్తుంది. నువ్వు కూడా అలా ఓసారి ఆలోచించి చూడు. గుడ్ నైట్.

ADVERTISEMENT
ఈ గుడ్ మార్నింగ్ మెసేజెస్‌తో.. రోజంతా మరింత ఉత్సాహంగా గడపండి..!

హాయినందించే గుడ్ నైట్ మెసేజ్‌లు

shutterstock

1. ప్రతి రోజు నీపై నాకున్న ప్రేమ పెరిగిపోతూ ఉంది. రేపు ఉదయాన్నే లేచి.. నిన్ను మరింతగా ప్రేమించేందుకు సిద్ధమవ్వడానికి నేను వేచి చూస్తున్నా. ఆనందంగా పడుకో. హ్యాపీ డ్రీమ్స్. గుడ్ నైట్

2. ఈ రాత్రి దేవుడిని ప్రార్థించి.. నీ చింతలన్నింటినీ దేవుడికి వదిలేయ్. ఈ రాత్రి తను నిన్ను భయం, బాధల నుంచి దూరం చేస్తాడు.

ADVERTISEMENT

3. నీ వల్లే నా పగలు మాత్రమే కాదు.. రాత్రి కూడా అందంగా.. రంగులమయంగా మారింది. థ్యాంక్యూ.. గుడ్ నైట్

4. నీ వల్లే నాకు నిద్ర పోవాలని కూడా అనిపించడం లేదు. ఎందుకంటే నీతో జీవితం కల కంటే చాలా అందంగా ఉంది మరి. గుడ్ నైట్

5. ప్రపంచమంతా పని నుంచి కాస్త బ్రేక్ తీసుకునే సమయం ఇది. నువ్వూ బెడ్ పైకి వెళ్లి.. నీ కలల ప్రపంచాన్ని చేరుకోవడానికి సిద్ధమవ్వు నేస్తమా.. గుడ్ నైట్

7. రాత్రి ఒడిలో.. కలల ఊయలలో పున్నమి వెన్నెలలో హాయిగా నిద్రపో నేస్తమా.. గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్

ADVERTISEMENT

8. ఏసీ పెట్టుకుంటే నీ గది చల్లగా ఉంటుంది. కానీ ఇతరులను క్షమిస్తేనే మనసు చల్లగా ఉంటుంది. శుభరాత్రి. హాయిగా నిద్రపో నేస్తమా..

9. ఈ ప్రపంచంలోనే అందమైన వ్యక్తి బెడ్ పై పడుకొని నా మెసేజ్ చదువుతున్నారు. తనకంటే అందమైన తన చిరునవ్వును ఈ మెసేజ్ తీసుకురాగలిగితే అదే నాకు చాలు.. గుడ్ నైట్

10. నీకు తెలుసా.. మనిషి నీళ్లు లేకుండా పది రోజులు బతకగలడు. నిద్ర లేకుండా మూడు రోజులు బతకగలడు. కానీ నా జీవితంలో నువ్వు లేకుండా మాత్రం నేను ఒక్క రోజు కూడా బతకలేను.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

02 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT