ప్రతి మగాడు తన భార్యతో చెప్పే.. 10 అబద్ధాలు ఏంటో మీకు తెలుసా?

ప్రతి మగాడు తన భార్యతో చెప్పే.. 10 అబద్ధాలు ఏంటో మీకు తెలుసా?

తన దగ్గర ఏదో దాచాలని లేదా తను మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు.. కేవలం తనను సంతోషపరచాలన్న ఒకే ఒక్క కారణంతో  భర్త (Husband) తన భార్యకు (Wife) అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు (lies) చెబుతుంటాడు. అలా చెప్పడం వెనక మిమ్మల్ని బాధించకూడదనే ఉద్దేశం.. తప్ప మరొకటి ఉండకపోవచ్చు. అసలు ఎలాంటి  విషయాల్లో మగవాళ్లు తమ భార్యలకు అబద్ధాలు చెబుతారో.. ఈ కథనం ద్వారా మనం కూడా తెలుసుకుందాం.

 

ఈ డ్రస్ చాలా బాగుంది

కొన్నిసార్లు మీరు కొన్న దుస్తులు చూడటానికి చాలా బాగుంటాయి. కానీ మీ శరీరాకృతికి అవి సరిగ్గా నప్పకపోవచ్చు. అయితే మీకు డ్రస్ సూటయిందా? లేదా? అనేదానికన్నా.. మీ ఇష్టానికే మీ భర్త ఎక్కువ విలువిస్తాడు. అందుకే మీరు ధరించిన చీర, సల్వార్, లెహంగా.. ఏదైనా సరే.. మీకు  నప్పకపోతే.. బాగాలేదని అస్సలు చెప్పడు. తన మాటలను మనసులోనే దాచేసి.. మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాడు.

పదినిమిషాల్లో వచ్చేస్తా

ఈ అబద్దం ప్రతి భర్తా తన భార్యకు.. ప్రతి రోజూ చెబుతూనే ఉంటాడు. ఇంటికెప్పుడు వస్తున్నారని ఫోన్ చేస్తే ‘ఎంత.. పదినిమిషాల్లో మీ ముందుంటా’ అని అబద్ధం చెబుతారు. కానీ ఎప్పుడూ చెప్పిన సమయానికి మాత్రం ఇంటికి రారు. ఆఫీసులో జరిగే మీటింగ్స్ లేదా పని పూర్తి కాలేకపోవడం, వేరే పనుల్లో బిజీగా గడపడం వల్ల సమయానికి ఇంటికి రావడం కుదరకపోవచ్చు. అలాంటి సందర్భంలో ప్రతి భార్య తన భర్తపై కోప్పడుతుంది. ఈ పరిస్థితి నుంచి తనను తాను రక్షించుకోవడానికి.. తన భార్యామణి కోపం తగ్గించడానికి ఓ పదినిమిషాల్లో వచ్చేస్తా అని అబద్ధం చెప్పడంలో తప్పులేదు కదా.

Giphy

పర్లేదు.. నేను చూసుకుంటాను

భార్యకు ఇబ్బంది కలిగే ఏ విషయంలోనైనా సరే.. భర్తలు ఇచ్చే భరోసా ఇది. మనం ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే.. వాటిని చక్కదిద్దే విషయంలో మనం అడగాల్సిన అవసరం లేకుండానే.. మనకు సాయం అందిస్తారు. అప్పుడప్పుడూ ఇతరులపై మనకు కోపం వచ్చిన సందర్బాల్లోనూ.. మనల్ని కూల్ చేయడానికి "మరేం ఫర్లేదు.. నేను చూసుకుంటానులే" అని భరోసా ఇస్తారు.

ఇది నా సమస్య

తన భర్త సమస్యలో ఉన్నారని తెలిస్తే.. ఏ భార్య మాత్రం సైలెంట్‌గా చూస్తూ ఉంటుంది. తీరా విషయమేంటో కనుక్కోవడానికి వెళితే.. భార్యను కసిరి పంపిస్తారు. ఎందుకంటే.. తాను పడుతున్న బాధను చూసి అర్థాంగి కూడా బాధపడుతుందని. ఇది "నా సమస్య.. నీకు సంబంధం లేదని" చెబుతారు.

Giphy

నేను నీకు ఫోన్ చేశానే

వీకెండ్ రోజు ఇద్దరూ సినిమాకి వెళ్లేటప్పుడు లేదా షాపింగ్ వెళ్లాలనుకున్నప్పుడో..దాదాపుగా మగాళ్లందరూ అనే మాట ఇది. ‘నీకు ఫోన్ చేశాను.. బిజీ టోన్ వస్తోంది.  ఎవరితో మాట్లాడుతున్నావు’ అని లేదా ‘ఎంతసేపు ఫోన్ చేయాలి? ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి రెడీగా ఉండమన్నాను కదా’ అని అంటారు. నిజానికి ఆలస్యంగా వచ్చామనే విషయాన్ని కప్పి ఉంచడానికి.. ఆ తప్పును మన మీద తోసేసి ఇంక మాట్లాడకుండా చేసేస్తారన్నమాట.

నీకు మూడ్ లేకపోతే వద్దులే..

ఇలా ఎప్పుడు అంటారో తెలుసా? అది తనకు బాగా కావాలనిపించినప్పుడు. అయినా తన భాగస్వామిని ఆ విషయంలో బలవంతం చేయడం ఇష్టం లేక.. ఇలా అంటూ ఉంటారు. "మీ మనసు మారకపోతుందా.. తనకు కావాల్సింది ఇవ్వకపోతారా" అనే ఆశతో ఇలా అంటారు. అప్పడప్పుడూ అర్థరాత్రి కూడా లేచి ఈ విషయం అడుగుతుంటారు.

Giphy

నేనేం ఆ అమ్మాయిని చూడటం లేదు..

మెన్ విల్ బి మెన్ - ఈ సామెత మీకు తెలుసు కదా.. వారు భార్యను ఎంతగా ప్రేమించినప్పటికీ.. ఎవరైనా అమ్మాయి ఆకర్షణీయంగా కనిపిస్తే కచ్చితంగా చూస్తారు. అలాంటి సందర్భంలో మీ భర్తను గమనిస్తుంటే.. మీరేమీ అడగకపోయినా సరే.. "నేనేమీ ఆ అమ్మాయిని చూడటం లేదని" చెబుతారు.

ఆ అమ్మాయి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్.. జస్ట్ ఓకే అంతే..

ఈ విషయంలో పురుషులను మెచ్చుకోవాల్సిందే. తన గతం గురించి నిజాయతీగా ఒప్పుకుంటారు. దాని గురించి టాపిక్ వచ్చిన ప్రతి సారి.. దాని గురించి పెద్దగా మాట్లాడరు. ఆ విషయం మీతో చర్చించడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే.. తన గతాన్ని మీకు చెప్పి.. మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేకనే అలా చేస్తారు. పైగా మిమ్మల్ని సంతృప్తి పరచడానికి "తను నీ అంత గొప్పదేమీ కాదులే" అని చెబుతుంటారు.

Giphy

నేను చాలా స్మార్ట్, అందరి కంటే బెస్ట్

అప్పుడప్పుడూ మీ భర్త ఇలా చెప్పే ఉంటారు కదా. ఇలా చెప్పడం వెనక కారణం తన ఇగో తాను సాటిస్ఫై చేసుకోవడానికే. అంతేకాదు తన భార్య కంటే.. తానే తెలివైన వాడినని చెప్పుకోవడానికే అలా చేస్తుంటారు.

నేనెప్పుడూ నిజమే చెబుతాను

ఇలా చెప్పడం పూర్తిగా.. ఆ సమయంలో మీ ఇద్దరి మధ్య  జరిగిన సంఘటనపై ఆధారపడి ఉంటుంది. అయితే కొన్నిసార్లు  కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని, మీరు బాధపడకూడదని లేదా ఆ సమయంలో గొడవ పెద్దది చేయడానికి ఇష్టం లేకనో.. ఇలా అబద్ధం చెబుతుంటారు.

Giphy

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది