బిగ్ బాస్ బ్యూటిఫుల్ కపుల్.. వరుణ్, వితికల ప్రేమకథ మీకు తెలుసా?

బిగ్ బాస్ బ్యూటిఫుల్ కపుల్.. వరుణ్, వితికల ప్రేమకథ మీకు తెలుసా?

వరుణ్ సందేశ్ (varun sandesh), వితికా షేరూ (vitika sheru).. "బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3" లో సెలబ్రిటీ కపుల్‌గా అడుగుపెట్టిన ఈ జంట.. హౌజ్‌లో ఎదురయ్యే సవాళ్లను జంటగానే ఎదుర్కొంటున్నారు. ఒకరికొకరు అన్ని సందర్భాల్లో అండగా నిలుస్తూ.. సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. అంతేకాదు.. తెలుగు బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టిన మొదటి సెలబ్రిటీ జంటగా వీరిద్దరూ ఇప్పటికే పేరు సాధించారు. 

అలాగే వీరు మరో క్రెడిట్ కూడా సాధించారు. బిగ్ బాస్ హౌజ్‌లో తమ పెళ్లి రోజు (ఆగస్టు 19) జరుపుకున్న మొదటి జంట వరుణ్, వితికలదే కావడం గమనార్హం.  చాలామందికి వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలుసు. కానీ వీరి ప్రేమ కథ గురించి తెలిసిన వాళ్లు కొందరే. మరి, వీరి మూడో వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. వీరి ప్రేమ కథ గురించి మనం కూడా తెలుసుకుందామా..!

Instagram

వరుణ్ తన సినిమా కెరీర్‌ని 'హ్యాపీ డేస్' సినిమాతో ప్రారంభించాడనే విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన ఆ సినిమా వరుణ్ సందేశ్‌కి మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. ఇక వితిక భీమవరానికి చెందిన అమ్మాయే అయినా.. పదిహేనేళ్ల వయసులోనే కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కన్నడంలో రెండు సినిమాలలో నటించిన తర్వాత ఆమె.. ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించింది. అయితే అవేవీ ఆమెకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టలేకపోయాయి. ఆ తర్వాత వరుణ్ హీరోగా నటించిన "పడ్డానండీ ప్రేమలో మరి" సినిమాలో కథానాయికగా కనిపించింది వితిక.

Instagram

వరుణ్, వితికల మధ్య ప్రేమ పుట్టడానికి కూడా ఈ సినిమా షూటింగ్ ఒక కారణంగా చెప్పుకోవచ్చు. 2015లో విడుదలైన ఈ "పడ్డానండీ ప్రేమలో మరీ" చిత్రంతో వీరిద్దరూ కలిసి జంటగా కనిపించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో.. కేవలం మూడు నెలలు మాత్రమే వీళ్లు మాట్లాడుకున్నారట. ఆ తర్వాత కొన్నాళ్లు విడిగానే ఉన్నా.. వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం, ప్రేమ ఏర్పడ్డాయి.

వరుణ్‌కి తనపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకున్న వితిక.. తనని ప్రపోజ్ చేసిందట. ఆ తర్వాత రెండు వైపులా పెద్దవాళ్ల అనుమతి తీసుకొని ప్రేమను పెళ్లి పీటలెక్కించారీ జంట. ఆ తర్వాత అదే సంవత్సరం అంటే.. 2015 డిసెంబర్‌లోనే ఎంగేజ్‌మెంట్‌తో ఒక్కటైందీ జంట. ఆ తర్వాత ఆరు నెలల గ్యాప్ తీసుకొని.. 2016 ఆగస్టు 19న హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు, బంధువులతో పాటు ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు హాజరయ్యారు.

Instagram

పెళ్లి తర్వాత కూడా.. తమ ప్రేమను వ్యక్తం చేయడానికి వచ్చిన ఏ సందర్భాన్నీ వదిలేవారు కాదీ ఇద్దరూ. వరుణ్‌లో కనిపించే నిజాయతీ, అమాయకత్వం అంటే.. తనకు ఎంతో ఇష్టమని వెల్లడిస్తుంటుంది వితిక. ఇక వితిక ఒక బెస్ట్ ఫ్రెండ్‌లా తనకెప్పుడూ సలహాలిస్తూ ఉంటుందని.. అలాంటి వ్యక్తితో జీవితం పంచుకోవడం తన లక్ అని వరుణ్ చెబుతుంటాడు. వీరిద్దరికీ ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. కాబట్టి వీరి సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా ఆ ఫొటోలతోనే నిండి ఉంటాయి.

Instagram

బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నా సరే.. తమ పెళ్లి రోజును గ్రాండ్‌గా జరుపుకోవడంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు వితిక, వరుణ్‌లు. హౌజ్‌లో అందరికీ బిర్యానీ వండి పెడతానని వితిక చెప్పిన సంగతి తెలిసిందే. ఇక వరుణ్ కోసం రాహుల్‌ని అడిగి.. ఓ మంచి పాటకు లిరిక్స్ కూడా కట్టించుకుంది. వీరి పెళ్లి రోజు సందర్భంగా ఇద్దరూ సంప్రదాయబద్ధంగా సిద్ధమై మరోసారి దండలు మార్చుకోవడం విశేషం. వితిక తెలుపు, ఆకుపచ్చ రంగుల చీర కట్టుకోగా వరుణ్ క్రీమ్ కలర్ కుర్తా, ఆరెంజ్ కలర్ ధోతీ ధరించాడు. ఇంటి సభ్యులందరూ మాటే మంత్రమూ అంటూ పాట పాడుతుండగా.. వరుణ్ వితికలు ఇద్దరూ దండలు మార్చుకున్నారు. ఇంటి సభ్యులందరూ వారిపై పూలు జల్లి వారిని ఆశీర్వదించారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.