17 ఆగస్టు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

17 ఆగస్టు 2019 (శనివారం,  ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 17, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) –  ఈ రోజు ప్రేమికులకు బాగా కలిసొస్తుంది. ముఖ్యంగా మీ బంధం గురించి ఇంట్లో వాళ్లకి చెప్పడానికి అనువైన రోజు. అలాగే వివాహితులు తమ తోబుట్టువుల నుండి సహాయాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంది. అలాగే ఉద్యోగులకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు తమ చదువు నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశముంది. 

వృషభం (Tarus) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమికులు ఆచితూచి వ్యవహరించాలి. నిజాయతీతో తమ బంధం గురించి ఇంట్లో వారికి చెప్పడానికి ప్రయత్నించాలి. అలాగే వివాహితులు భాగస్వామితో ఎలాంటి అభిప్రాయ భేదాలకు తావివ్వకుండా ఉంటే మంచిది. రాజకీయ నాయకులు సైద్ధాంతిక కారణాల కారణంగా.. సొంత పార్టీకే వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది. 

మిథునం (Gemini) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు.. బాగా ఆలోచించడం మంచిది. ముఖ్యంగా నిరుద్యోగులు కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. బాండ్స్ పై సంతకాలు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారులు, ఉద్యోగులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించే విషయంలో జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆర్థికపరమైన లావాదేవీలు చేసేటప్పుడు.. అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. అలాగే వ్యాాపారస్తులు ఏజెంట్లు, బ్రోకర్లను నమ్మే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. 

సింహం (Leo) –  ఈ రోజు ఈ రాశివ్యక్తులకు అంతా శుభప్రదంగా గడుస్తుంది. ముఖ్యంగా శుభవార్తలను వినే అవకాశం లభిస్తుంది. పాత స్నేహితులు లేదా బంధువులు మిమ్మల్ని ఈ రోజు కలుస్తారు. అలాగే ప్రేమికులు కూడా తమ బంధం గురించి ఇంట్లో చెప్పడం మంచిది. అందుకు ఈ రోజు అనువైనది. వివాహితులు కూడా ఈ రోజు మంచి విషయాలు వింటారు. 

క‌న్య (Virgo) –  ప్రేమదేవత  ఈ రోజు మిమ్మ‌ల్ని చేరుకునేందుకు అనేక ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తోంది. అవివాహితులకు అనుకోని పరిచయాలు కలుగుతాయి. వివాహితులకు అనుకోని బహుమతులు, కానుకలు లభిస్తాయి. అదేవిధంగా మీకు ఈ రోజు ఆధ్యాత్మిక అంశాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. సృజనాత్మక రంగంలోని వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి.

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సాధ్యమైనంత వరకూ ప్ర‌కృతితో మమేకమై జీవించడానికి ప్రయత్నించండి. ఆ విధంగా మీలోని ఒత్తిడిని తగ్గించుకోండి. అలాగే వివాహితులు ఈ రోజు.. మీ భాగస్వామితో కలిసి మంచి రొమాంటిక్ ప్రదేశానికి వెళ్లండి. ప్రేమికులు కూడా తమ బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించండి. 

వృశ్చికం (Scorpio) – ప్రస్తుతం మీరున్న పరిస్థితులను బట్టి, వ్యక్తులకు ఎమోషనల్‌గా అటాచ్ అవ్వకండి. అప్పుడే మీరు మీ చుట్టూ ఉన్న పరిస్థితులను లోతుగా అర్థం చేసుకోగలరు. వాటి నుంచి మరిన్ని జీవిత పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా సమస్యలను పరిష్కరించుకోండి. కొన్ని సమయాల్లో భావోద్వేగాల కన్నా.. ప్రాక్టికల్ ఆలోచనలే ఎక్కువ ఫలితాలిస్తాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఎదుటివారు ఏం చెప్తున్నార‌నేదాని కంటే.. వారి బాడీ లాంగ్వేజ్ పై దృష్టి పెట్టండి. ఎందుకంటే కొంద‌రు ఒక‌టి మాట్లాడినా.. వారి మ‌న‌సులో ఉండేది వేరుగా ఉంటుంది. అందుకే మనుషులను అంచనా వేయడం. ఏ సందర్భంలోనైనా.. ఎవ‌రినీ గుడ్డిగా నమ్మేయ‌కండి. ఎదుటివారు ఇచ్చే సంకేతాల‌పై దృష్టి పెట్టండి.

మకరం (Capricorn) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులు కూడా జాబ్ మారే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు కూడా కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. వివాహితులు స్థిరాస్తులు కొనడం లేదా కొత్త ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టవచ్చు. ఎంట్రప్రెన్యూర్స్‌ లేదా స్టార్టప్స్ నిర్వహించే వారు ప్రయత్నిస్తే.. ఈ రోజు మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్య విషయంలో ఉపశమనం ఉంటుంది. వ్యాపారస్తులు బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. కాని ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులు ఆఫీసులో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అలాగే వారికి సృజనాత్మక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వివాహితులకు తమ భాగస్వామితో పటిష్టమైన బంధాలు ఏర్పడతాయి. 

మీనం (Pisces) – ఈ రోజు రాజకీయ రంగంలోని వ్యక్తులకు శుభ పరిణామం. అలాగే ఉద్యోగులు కొత్త పనిలో నిమగ్నమవుతారు. దిగుమతి-ఎగుమతి వ్యాపార రంగానికి చెందిన వ్యక్తులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. సృజనాత్మక రంగంలోని వ్యక్తులకు ఈ రోజు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు వృత్తి నైపుణ్యాల పై ఆసక్తి పెరుగుతుంది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.