21 ఆగస్టు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు మీరూ చదివేయండి)

21 ఆగస్టు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు మీరూ చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 21, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే ఉద్యోగులకు ఆఫీసులో మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. వివాహితులకు తమ భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. అయినా సహనంతో ఈ సమస్యను ఒక కొలిక్కి తెస్తారు. విద్యార్థులు కూడా ఈ రోజు బాగా అలసటకు గురవుతారు. కొన్ని పనులు వాయిదా పడే అవకాశం కూడా ఉంది. 

వృషభం (Tarus) – ఈ రోజు కుటుంబం విషయంలో కాస్త మానసిక ఆందోళనకు గురవుతారు. అలాగే భాగస్వామి విషయంలో కూడా కొన్ని పొరపాట్లు చేస్తారు. కానీ మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూడండి. అలాగే కొన్ని విషయాలలో సహనంతో వ్యవహరించండి. కోపాన్ని నియంత్రించుకోండి. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు శారీరకంగా అలసటకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు కూడా క్రీడలపై ఆసక్తి చూపిస్తారు. వివాహితులు దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు ప్రత్యర్థుల నుండి సవాళ్లు ఎదురవుతాయి. అయినా వాటిని వారు దీటుగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించే అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంది. అలాగే వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేయాలని భావించే వారికి కూడా.. ఈ రోజు మంచిది. అలాగే వివాహితులు కుటుంబ వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు చదువు విషయంలో మరింత కష్టపడాలి.  ఉద్యోగస్తులు ఆఫీసులో పెండింగ్ పనులను పూర్తి చేస్తే బెటర్. 

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా ఆఫీసులో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అయితే ఏజెంట్లు, బ్రోకర్ల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు ప్రత్యమ్నాయ కోర్సుల వైపు ఆసక్తి చూపిస్తారు. 

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు నిర్లక్ష్యం లేదా సోమరితనం వల్ల కొన్ని మంచి అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది. కనుక అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా నిరుద్యోగులు పనులను వాయిదా వేయడం శ్రేయస్కరం కాదు. వివాహితులు కుటుంబ సమస్యలను.. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా తమకు తామే పరిష్కరించుకోవడం మంచిది. 

తుల (Libra) – ఈ రోజు వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా గడుస్తుంది. కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఈ రోజు చాలా అనువైన రోజు. వివాహితులు తమ జీవిత భాగస్వామి నుండి ఓ శుభవార్తను వింటారు. అలాగే ఖరీదైన బహుమతులు లేదా కానుకలను పొందుతారు. ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఈ రోజు బాగా కలిసొస్తుంది. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆఫీసులో అనుకోని అవరోధాలు ఎదురవుతాయి. అలాగే ప్రత్యర్థుల నుండి ఒత్తిడి కూడా ఉంటుంది. అయినా సరే.. ధైర్యంగా నిలబడండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో మంచి విషయాలు లేదా శుభవార్తలు వింటారు. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) –  ఈ రోజు తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైతే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించండి. ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినా దానిని తట్టుకొని నిలబడాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. ఆఫీసులో ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. అలాగే అవివాహితులకు వివాహ సంబంధాలు కుదురుతాయి. అదేవిధంగా వివాహితులు తమ జీవిత భాగస్వామి నుండి ఓ శుభవార్తను వింటారు. వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు లేదా ప్రాజెక్టులు లభిస్తాయి. నిరుద్యోగులకు కూడా మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.  

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఏదో ఒక రూపంలో సక్సెస్ చవిచూస్తారు. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో మంచి వార్తలు వింటారు. ఉద్యోగస్తులకు కూడా పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు అదనపు లాభాలు లభిస్తాయి. సినిమా, క్రియేటివ్ ఫీల్డులో పనిచేసే వ్యక్తులకు కూడా ఈ రోజు చాలా బాగుంటుంది. 

మీనం (Pisces) – ఈ రోజు వృత్తిపరమైన నష్టాలు ఆర్థిక సంక్షోభానికి దారితీస్తాయి. కనుక రుణాలు ఇవ్వడం లేదా తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులను అమ్మే విషయంలో కూడా నూటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే ఈ రోజు మీరు కొన్ని విషయాలలో భావోద్వేగానికి గురవుతారు. మీ కుటుంబంలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.