11 ఆగస్టు 2019, (ఆదివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

11 ఆగస్టు 2019, (ఆదివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 11, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు రుణాలు ఇచ్చే విషయంలోనూ మరియు తీసుకొనే విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా లౌక్యం ప్రదర్శించాలి. అలాగే వివాహితులు కుటుంబంలో మనస్పర్థలు వచ్చినప్పుడు సహనంతో సమస్యలను ఒక కొలిక్కి తీసుకురావాలి. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ప్రత్యర్థుల నుండి సవాళ్లను ఎదుర్కొంటారు. అయినా సరే ధైర్యంగా ముందుకు వెళ్తారు. మీరు నిజాయతీగా ఉన్నంత కాలం.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. అలాగే వివాహితులు ఈ రోజు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే సంఘంలో గౌరవ, మర్యాదలు కూడా పెరుగుతాయి. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశివ్యక్తులకు కుటుంబం నుండి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. కెరీర్, వివాహం లాంటి విషయాల్లో కుటుంబీకులు మీకు సలహాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి సందర్భాల్లో మీలో మనసులోని భావాలను నిజాయతీగా పంచుకోండి. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో తెలియజేయడానికి ఇదే సరైన రోజు. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు శారీరక శ్రమకు ఎక్కువగా గురవుతారు. విద్యార్థులు పలు క్రీడా పోటీలలో పాల్గొంటారు. వివాహితులు కూడా ఇంటి పని, తోట పనితో బాగా బిజీగా గడుపుతారు. ముఖ్యంగా ఈ రోజు మీరు మీ కుటుంబంతో సరదాగా గడుపుతారు. వ్యాపారస్తులకు ఆర్థిక స్థితిగతులు కూడా బాగుంటాయి. అలాగే పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు. 

సింహం (Leo) – ఈ రోజు వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంది. అలాగే పలు కీలక ఒప్పందాలు కూడా చేసుకుంటారు. పలు వివాదాల నుండి కూడా బయటపడతారు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగంలోని వ్యక్తులకు ఈ రోజు బాగా కలిసొస్తుంది. అలాగే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. 

క‌న్య (Virgo) – ఈ రోజు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. వారితో మీకు ఒక విధమైన అనుబంధం కూడా ఏర్పడుతుంది. అలాగే అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ప్రేమికులకు ఈ రోజు చాలా అనువైనది. తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ప్రయత్నించవచ్చు. అలాగే వివాహితులకు తమ భాగస్వామితో ఏర్పడిన మనస్పర్థలు తొలిగిపోతాయి. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

తుల (Libra) – ఈ రోజు వ్యాపారస్తులు కొన్ని విపత్కర పరిస్థితుల్లో చిక్కుకొనే అవకాశం ఉంది. అయినా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. అలాగే ఖర్చులను కూడా తగ్గించుకోండి. వివాహితులు తమ భాగస్వామి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. అలాగే వివాదాలకు తూరంగా ఉండండి. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు అదృష్టం మీ తలుపు తట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా పలు శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అపరిచితులను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహితులు దూర ప్రయాణాలు చేసేందుకు ప్రణాళికలు రచించే అవకాశం ఉంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఎంతో కష్టపడతారు. అలాగే తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని కూడా పొందుతారు. అయితే చిన్న చిన్న తప్పిదాలు, నిర్లక్ష్యం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి విషయంలోనైనా సరే... అప్రమత్తంగా ఉండండి. వివాహితులు ఈ రోజు తమ భాగస్వామికి చెందిన ఓ విషయంలో ఉద్వేగానికి గురవుతారు. 

మకరం (Capricorn) – ఈ రోజు మీరు మీ ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ధ వహించాలి. వీలైతే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి. అలాగే వ్యాపారస్తులు ఈ రోజు చాలా బిజీగా గడుపుతారు. ఆగిపోయిన పనులు కూడా ఓ కొలిక్కి వస్తాయి. తమ బిజినెస్ విస్తరించే క్రమంలో.. కొందరు కొత్త పార్టనర్స్‌ని కూడా కలిసే అవకాశం ఉంది. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. 

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పూర్తి ఆత్మ విశ్వాసంతో పనిచేస్తారు. వివాహితులకు తమ భాగస్వామితో సంబంధాలు కూడా బాగా మెరుగుపడతాయి. మీ వ్యాాపార విస్తరణకు మీ స్నేహితులు కూడా ఎంతో సహాయం చేస్తారు. అలాగే ఈ రోజు మీరు పలు శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. ప్రత్యర్థుల నుండి మీకు కొన్ని సమస్యలు ఎదురైనా.. వాటిని మీరు లౌక్యంతో పరిష్కరిస్తారు. 

మీనం (Pisces) –   ఈ రోజు మీరు తీసుకున్న ఓ నిర్ణయం మీకు భవిష్యత్తులో ఎనలేని ప్రయోజనం చేకూరుస్తుంది. వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలను సిద్ధం చేయడానికి ఇదే సరైన సమయం. అలాగే కోర్టు లావాదేవాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగానికి చెందిన వ్యక్తులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.