ADVERTISEMENT
home / Food & Nightlife
గోదావరి జిల్లాలు అనగానే.. ఈ నోరూరించే వంటకాలు గుర్తొచ్చేస్తాయి..!

గోదావరి జిల్లాలు అనగానే.. ఈ నోరూరించే వంటకాలు గుర్తొచ్చేస్తాయి..!

గోదావరి జిల్లాలు (Godavari districts).. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి. గోదావరి నదిని ఆనుకొని ఉన్న ఈ రెండు జిల్లాలు కోనసీమగా ఫేమస్.  కోనసీమను రత్నాల సీమగా పలువురు కవులు పేర్కొన్న సంగతి తెలిసిందే. అందమైన పొలాలు, కొబ్బరి చెట్లు, చేపల చెరువులు.. కోనసీమలో కనిపించే ఇవన్నీ మనల్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి.

అయితే వీటన్నింటికంటే గోదావరి జిల్లాలు దేనికి ప్రసిద్ధో తెలుసా? అక్కడి స్పెషల్ వంటకాలు ( recipes).. అవును.. కోనసీమ అంటేనే కొన్ని ప్రత్యేకమైన వంటకాలు గుర్తొస్తాయి. రకరకాల రుచులకు నెలవైన ఈ సీమ పేరు చెప్పగానే గుర్తొచ్చే వంటకాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం రండి..

కాకినాడ కాజా

Instagram

ADVERTISEMENT

స్వీట్లలో కాకినాడ కాజా రూటే సపరేట్ అంటుంటారు.. వీటిని రుచి చూసిన వాళ్లందరూ. ఇందులో రెండు రకాలుంటాయి. ఒకటి పైన గట్టిగా.. లోపల జ్యూసీగా ఉండే గొట్టం కాజా. మరొకటి మడతలు మడతలుగా ఉంటూ నోట్లో వేసుకోగానే కరిగిపోయే మడత కాజా. ఈ రెండింటికీ కాకినాడ, తాపేశ్వరం ప్రాంతాలు చాలా ఫేమస్. అక్కడి కోటయ్య షాపులో లభించే కాజాలను జనాలు ఎగబడి మరీ కొంటారట. అందుకే కాకినాడ నుంచి ఎవరైనా వస్తున్నారంటే.. కచ్చితంగా కాజాలు తెప్పించడం మాత్రం ఎవరూ మర్చిపోరు.

రాజుగారి కోడి పులావ్

Instagram

గోదావరి జిల్లాల్లో నాన్ వెజ్ ప్రియులకు చాలా వంటకాలే అందుబాటులో ఉంటాయి. అందులో ముఖ్యమైనవి నాటుకోడితో చేసే వెరైటీలు. ఆ తర్వాతే చేపలైనా, రొయ్యలైనా లేక మటన్ అయినా. పులస చేప తర్వాత గోదావరి జిల్లాల్లో అంత ఫేమస్ అయిన వంటకం.. రాజుగారి కోడి పులావ్. నాటుకోడితో చేసే ఈ బిర్యానీ అందరినీ నోరూరిస్తుంది. ఇది అక్కడ ఎంత ఫేమస్ అంటే.. అక్కడ ఈ పేరుతో ఎన్నో రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.

ADVERTISEMENT

బెల్లం జీళ్లు

FaceBook

జీళ్లు అంటే గోదావరి జిల్లాలో చాలామందికి చిన్ననాటి తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అరవైల్లోనే బెల్లంతో తయారుచేసే ఈ జీళ్లు తయారవ్వడం ప్రారంభమయ్యాయి. ఆ జనరేషన్ వాళ్లకి ఇవే క్యాండీలు, టాఫీలు, చాక్లెట్లు. రోజూ అమ్మానాన్నలను జీళ్ల కోసం డబ్బులు అడిగి తీసుకోవడం.. స్నేహితులంతా వాటిని పంచుకొని తినడం వంటివన్నీ మనకు వాటిని చూస్తే గుర్తొస్తాయి. ఇప్పటికీ గోదావరి జిల్లాల్లో ఇవి లభ్యమవుతుంటాయి.

కంది పొడి

ADVERTISEMENT

Instagram

కంది పప్పు, శనగ పప్పు కలిపి.. ఆ మిశ్రమానికి ఎండుమిర్చి, ధనియాలు వంటివన్నీ చేర్చి చేసే ఈ పొడి కోనసీమలో చాలా ఫేమస్. ముద్ద పప్పు, కందిపొడి లేదా రసం, కందిపొడి ఇలా రకరకాల కాంబినేషన్స్ ప్రయత్నించవచ్చు. ఏ కాంబినేషన్‌లో ప్రయత్నించినా కందిపొడి నోరూరిస్తుంది. ఏదీ లేకపోయినా.. వేడివేడి అన్నంలో కందిపొడి, నెయ్యి వేసుకొని తిన్నా సూపర్‌గా ఉంటుంది. ఇది ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అన్ని రెస్టారెంట్లలో కనిపిస్తోంది.

తాటి రొట్టె

Facebook

ADVERTISEMENT

తాటి చెట్టు నుంచి కల్లు, ముంజెలు వంటివి వస్తాయని ఎక్కువమందికి తెలుసు. కానీ ఆ తాటి కాయలు బాగా పండి రాలిన తర్వాత వాటి గుజ్జులో ఇడ్లీ పిండి, బెల్లం వేసి కలిపి చేసే తాటి రొట్టె చాలామందికి తెలీదు. ఒక రకంగా ఇది దేశీ కేక్ అని చెప్పుకోవచ్చు. దీన్ని చేయడం సులభమే అయినా.. తాటిపండు గుజ్జు అందరికీ దొరకదు కాబట్టి ఇవి చాలా అరుదుగా.. అదీ వేసవి అయిపోయాక వర్షాకాలం ప్రారంభమయ్యే సమయంలోనే ఎక్కువగా దొరుకుతుంటాయి.

పొట్టిక్కలు

Instagram

వీటినే పనస పొట్టిక్కలు అని కూడా అంటారు. గోదావరి జిల్లాలో ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ ఐటం ఇది. దీన్ని తయారుచేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. నాలుగు పనస ఆకులు కలిపి కుట్టి ఓ దొప్పలా చేస్తారు. ఆ దొప్పల్లో ఇడ్లీ పిండి పోసి.. ఆవిరిపై ఉడికించేస్తే పనస పొట్టిక్కలు సిద్ధం. వీటినే పనస ఇడ్లీలని కూడా పిలుస్తుంటారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ఇవి చాలా ఫేమస్.

ADVERTISEMENT

మామిడి తాండ్ర

Instagram

వేసవి అంటే ముందుగా గుర్తొచ్చేవి మామిడి పండ్లు. ఈ మామిడి పండ్ల రుచిని సంవత్సరం మొత్తం గుర్తుండేలా చేసేది మామిడి తాండ్ర. వేసవిలో బాగా పండిన మామిడి పండ్ల నుంచి గుజ్జు తీసి.. ఆ గుజ్జును తాటి లేదా ఈత చాపలకు రుద్ది ఎండలో ఆరబెడతారు. అది ఆరిన తర్వాత మరో లేయర్ పూస్తారు. ఇలా కొన్ని వరుసలు చేసి ఆరిన వాటిని ముక్కలుగా కోసి అమ్ముతారు. తూర్పు గోదావరి జిల్లాలోని సర్పవరం వీటికి చాలా ఫేమస్.

గోంగూర మటన్

ADVERTISEMENT

Instagram

గోంగూర.. పుల్లపుల్లని ఈ ఆకుకూర అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరేమో.. ఇది కేవలం కూరలకు రుచిని అందించడం మాత్రమే కాదు.. మన శరీరానికి అవసరమైన ‘విటమిన్ సి’ కూడా అందిస్తుంది. కాబట్టి జలుబు, దగ్గు, జ్వరం వంటివన్నీ తగ్గిపోతాయట. గోంగూరలో మటన్ వేసి చేసే గోంగూర మటన్ కూర కోనసీమలో చాలా ఫేమస్. ఈ పుల్లపుల్లని కూరతో చేసే కూర మాత్రమే కాదు.. పచ్చడి కూడా ఆంధ్రాలో బాగా ఫేమస్.

పూతరేకులు

Instagram

ADVERTISEMENT

సన్నగా తెల్లని పొరల్లా ఉండే పూతరేకులు నోట్లో వేసుకోగానే అవి ఇట్టే కరిగిపోతాయి. వీటిని ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో.. ఈ స్వీట్లకు తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం చాలా ఫేమస్. సన్నని పొరలా కనిపించే ఈ రేకులను తయారుచేయడంలో చాలా ప్రత్యేకత దాగుంది. బియ్యంపిండి, మినప్పప్పు మిశ్రమాన్ని నీళ్లలా చేసి.. అందులో ఓ బట్టను వేసి దాంతో వేడి కుండ మీద రుద్ది దీనిని తయారు చేస్తారు. ఆ తర్వాత చక్కెర, బెల్లం, తేనె, డ్రైఫ్రూట్స్, నెయ్యి వంటివన్నీ వేసి.. నాలుగైదు రేకులను కలిపి పూతరేకుల తయారీని పూర్తిచేస్తారు.

ఉలవచారు

Instagram

ఇది అటు రసానికి.. ఇటు పప్పుచారుకి, సాంబార్‌కి మధ్యలో ఉండే చారు. ఉలవలతో చేసే ఈ చారు కోనసీమలోనే కాదు.. గుంటూరు, క్రిష్ణా జిల్లాలో కూడా చాలా ఫేమస్. అన్నంలో ఉలవచారు వేసుకొని.. వెన్న కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. నల్లగా ఉండే ఈ చారును తయారుచేసి ఫ్రిజ్‌లో దాచుకుంటే పది రోజుల వరకూ తినొచ్చు.

ADVERTISEMENT

వీటితో పాటు దిబ్బరొట్టె, బజ్జీ మిక్చర్, పనస పొట్టు కూర, పులస ఇగురు, కంద బచ్చలి కూర, పుల్లట్లు, బెల్లం గవ్వలు, గంగరాజు పాలకోవ, తొక్కుడు లడ్డు, పెనుగొండ కజ్జికాయలు, నగరం గరాజీలు, పాకం గారెలు వంటివన్నీ కూడా  గోదావరి జిల్లాలో బాగా ఫేమస్.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

20 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT