భార్యాభర్తల మధ్య.. వయసు తేడా ఎక్కువగా ఉండటం మంచిదేనా? కాదా?

భార్యాభర్తల మధ్య.. వయసు తేడా ఎక్కువగా ఉండటం మంచిదేనా? కాదా?

ఇటీవలి కాలంలో వధు, వరుల మధ్య వయసు తేడా పెద్దగా కనిపించట్లేదు. దీనికి కారణం తాము వివాహం చేసుకోబోయే వ్యక్తి వయసు గురించి.. అమ్మాయిలకు అబ్బాయిలకు.. వారి తల్లిదండ్రులకు ఓ క్లారిటీ ఉండడమే. కానీ కొన్ని పెళ్లిళ్లలో.. వధు, వరుల మధ్య పదేళ్లకు తగ్గకుండా వయసు తేడా ఉంటోంది. నేను కూడా ఇలాంటి పెళ్లికి ఓసారి వెళ్లాను.

అక్కడ పెళ్లి కూతురు వయసు 24, పెళ్లి కొడుకు వయసు 35. ఈ రోజుల్లో కూడా ఇంత వయసు తేడాతో పెళ్లిళ్లు జరుగుతున్నాయా? అని ఆశ్చర్యపోయాను. కానీ వారి అనుబంధానికి వయసు పెద్ద అడ్డంకి కాలేదు. వారి పెళ్లయి మూడేళ్లవుతోంది. చాలా సంతోషంగా జీవిస్తున్నారు. అప్పుడే నాకు.. జీవిత భాగస్వాములిద్దరూ ఆనందంగా జీవించడానికి వయసుతో సంబంధం లేదా? అనే సందేహం వచ్చింది. అంతేకాదు.. వయసు భేదం ఎక్కువగా ఉండే భార్యాభర్తలంతా (wife and husband) ఇంతే సంతోషంగా ఉంటారా? లేదా వీళ్లిద్దరే అలా ఉన్నారా? అనే అనుమానం కూడా వచ్చింది. ఆ విషయం తెలుసుకోవడానికే పలువురు మహిళలతో మేం మాట్లాడాం. ఈ క్రమంలో వారేం చెప్పారో తెలుసుకుందాం.

కొన్నిసార్లు అలా.. మరి కొన్నిసార్లు ఇలా..

నాకు, నా భర్తకు ఏడేళ్ల వయసు బేధం ఉంది. ఈ ఏజ్ గ్యాప్ నాకెప్పుడూ ఇబ్బంది కలిగించలేదని నేను అబద్ధం చెప్పలేను. ఎందుకంటే.. వయసు తేడా వల్ల మా ఇద్దరికీ వేర్వేరు సోషల్ సర్కిల్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్స్ చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారని ఆయన అనుకుంటారు. ఆయన ఫ్రెండ్సేమో 40 ఏళ్లకు పైనున్నవారే ఉంటారు. కాబట్టి మేము, మా ఇద్దరి స్నేహితులతో కలసి సరదాగా గడిపే అవకాశం లేదు. అయితే మా ఇద్దరికున్న వయసు తేడానే ఉన్న.. మా స్నేహితులకు మాత్రం ఇది అసలు సమస్య కానే కాదు. ఇద్దరూ తమ భాగస్వాముల స్నేహితులతో చాలా చక్కగా కలిసిపోతుంటారు.

భార్యభర్తల మధ్య వయసు సమస్య కానే కాదు

నేను నా  బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్ చేసే సమయానికి నా వయసు 23 అతని వయసు 28. ఇప్పటికీ మా మనస్తత్వాలు, ఆలోచనల్లో చాలానే తేడాలుంటాయి. నేనేమో ప్రతి చిన్నదాన్ని ఈజీగా తీసుకునే వయసులో ఉన్నాను. తను మాత్రం ఏ విషయమైనా సీరియస్‌గా తీసుకునే దశలో ఉన్నాడు. మొదట్లో ఇద్దరికీ కొన్ని విషయాల్లో.. చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ వాటిని ఇద్దరం కలసి పరిష్కరించుకునేవాళ్లం.

ఏడాది గడిచేసరికి మా బంధం మరింత బలపడింది. ఇద్దరం కలసి పెళ్లిపీటలెక్కాం. పెళ్లి తర్వాత.. వయసు అసలు సమస్య కానే లేదు. పైగా బాగా సెటిలయిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వల్ల.. చాలా హాయిగా అనిపించింది. ఎందుకంటే.. కొత్తగా పెళ్లయిన దంపతులు ఎదుర్కొనే చాలా సమస్యలు మా దగ్గరికి రాలేదు.

భార్యాభర్తలిద్దరికీ వయసు తేడా ఉన్నప్పటికీ.. మీ ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ప్రేమ ఉంటే.. ఇద్దరూ కలసి సంతోషంగా గడుపుతుంటే.. మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోగులుతుంటే.. వయసు పెద్ద అడ్డంకి కానే కాదు.

Instagram

వయసు ఓ సంఖ్య మాత్రమే..

భార్యాభర్తల మధ్య వయసు భేదం అసలు సమస్య కానే కాదు. నా స్నేహితురాళ్లలో కొందరు తమ కంటే ఆరేళ్లు పెద్ద వ్యక్తిని  పెళ్లి చేసుకున్నవారున్నారు. మరికొందరు తమ కంటే ఏడాది, రెండేళ్లు చిన్నవారిని పెళ్లి చేసుకున్నారు. నేను, నా భర్త ఇంచుమించు ఒకే వయసుకి చెందినవాళ్లం. అయినా మేం సంతోషంగానే ఉన్నాం. కాబట్టి వయసు ఓ సంఖ్య మాత్రమే. భార్యాభర్తల మధ్య ప్రేమకు, అనురాగానికి – వయసుకు సంబంధం లేనే లేదు.

జీవితం ఎలా ఉంటుందో.. ఇద్దరం కలసి తెలుసుకుంటున్నాం..

నాకు కాబోయే భర్తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో కలుసుకున్నా. అతను నాకంటే ఏడాది చిన్నవాడు. నిజాయతీగా చెప్పాలంటే.. మా ఇద్దరికీ వయసు సమస్యగా అనిపించలేదు. ఇద్దరం ఒక సమయంలో చదువు పూర్తి చేశాం. ఉద్యోగాలు చేయడం ప్రారంభించాం. ఏ సమస్యలొచ్చినా.. ఇద్దరం కలిసే వాటిని పరిష్కరించుకుంటాం. మా బంధం, అర్థం చేసుకునే తత్వం మరో లెవెల్లో ఉంటాయి.

ఈ ఏజ్ గ్యాప్ లేకుండా ఉంటే బాగుండనిపిస్తుంది

24 ఏళ్ల వయసులో మా తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నాను. బాగా  చదువుకున్నాడు. బాగా సెటిలయ్యాడు. మా ఇద్దరి మధ్య దాదాపు ఐదేళ్ల గ్యాప్ ఉంది. పెళ్లయిన కొత్తలో వయసు భేదం పెద్ద సమస్య కాలేదు. కానీ రెండేళ్ల తర్వాత చాలా సందర్భాల్లో  మా ఇద్దరికీ ఏజ్ గ్యాప్ (Age Gap) లేకుండా ఉంటే బాగుండనిపిస్తుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూని తను అర్థం చేసుకోడు.

పైగా నేను చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నానని అనుకుంటాడు. మా ఇద్దరి మధ్య ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. మా ఇద్దరి వ్యక్తిత్వాలు కలవకపోవడం వల్లే ఇలా జరుగుతుండవచ్చు. అయినా నేను మా ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడానే దానికి కారణమని భావిస్తాను.

భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండటం మంచిదేనా? అనే ప్రశ్నకు మనకు సరైన సమాధానం దొరకడం కష్టమే. ఎందుకంటే ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. వారెదుర్కొనే సమస్యలు సైతం ఒకే విధంగా ఉండవు. కానీ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే.. అనుబంధం నిలుపుకోవడానికి వయసు పెద్ద అడ్డంకిగా మారదని మాత్రం తెలుస్తోంది.  

Feature Image: Instagram

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది