ADVERTISEMENT
home / సౌందర్యం
మీ కురులు అందంగా కనిపించాలంటే.. హైలైట్ చేసుకోండిలా..!

మీ కురులు అందంగా కనిపించాలంటే.. హైలైట్ చేసుకోండిలా..!

ఈ రోజుల్లో అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే చక్కని డ్రస్సింగ్ మాత్రమే కాదు.. అందుకు తగిన హెయిర్ స్టైల్ కూడా ఉండాల్సిందే. మరి, ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నా కురులు అందంగా కనిపించాలంటే అవి ఆరోగ్యంగానూ ఉండాలి. అప్పుడే కర్లింగ్, లేయర్స్, హెయిర్ డై లేదా హైలైటర్.. వంటివి ఉపయోగించడం ద్వారా కురులను మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.

అయితే హెయిర్ కలర్ లేదా హెయిర్ హైలైటర్స్ ఉపయోగించడానికి కూడా ఓ క్రమపద్ధతి ఉందని మీకు తెలుసా?? చాలామంది కురులను హైలైటర్ సహాయంతో అందంగా తీర్చిదిద్దుకోవడానికి బ్యూటీపార్లర్స్‌ని ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ కాస్త సమయం కేటాయించి ఓపిక వహిస్తే చాలు.. ఇంట్లోనే హెయిర్‌ని హైలైట్ చేసుకోవచ్చు. అందుకు కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి.

ఇంట్లోనే కురులు హైలైట్ చేసుకునే విధానాలు..

ADVERTISEMENT

Shutterstock

హెయిర్ హైలైట్ చేసుకోవడానికి నాలుగు పద్ధతులు ఉన్నాయి. అవి..

1. ఫాయిల్ హైలైట్స్

2. హెయిర్ పెయింటింగ్

ADVERTISEMENT

3. ఫ్రాస్టెడ్ హైలైట్స్

4. హెయిర్ చంకింగ్

 

ఫాయిల్ హైలైట్స్..

ఈ పద్ధతిని హెయిర్ డ్రస్సర్స్ ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అల్యూమినియం ఫాయిల్స్ ఉపయోగించి కురులను (hair) పాయలు పాయలుగా విడదీసి వాటిలో కొన్ని పాయలకు మాత్రమే హైలైటర్ లేదా హెయిర్ కలర్ ని ఈ ప్రక్రియలో అప్లై చేస్తారు. ఇలా అల్యూమినియం ఫాయిల్ చుట్టడం ద్వారా కురుల్లో ఉష్ణోగ్రత పెరిగి హెయిర్ కలర్ వాటికి బాగా పడుతుంది. ఈ పద్ధతి ద్వారా కురులను తీర్చిదిద్దుకోవడానికి కావాల్సినవి..

ADVERTISEMENT

హైలైటింగ్ కిట్

హెయిర్ బ్రష్ 

రబ్బర్ గ్లౌజులు

సెక్షనింగ్ క్లిప్స్

ADVERTISEMENT

హెయిర్ టింటింగ్ బ్రష్

అల్యూమినియం ఫాయిల్

వెడల్పాటి పళ్లున్న దువ్వెన

కలర్ సేఫ్ షాంపూ అండ్ కండిషనర్

ADVERTISEMENT

ఎలా వేసుకోవాలంటే..

మీరు ఎంపిక చేసుకున్న హెయిర్ డై లేదా కలర్ ని కిట్ లో ఉన్న సూచనలకు అనుగుణంగా కలుపుకోవాలి. చిక్కుల్లేకుండా కురులను స్మూత్ గా దువ్వుకోవాలి. ఇప్పుడు మీ చేతికి రబ్బర్ గ్లౌజులు వేసుకొని మీ జుట్టుని మధ్య లేదా కింది భాగంలో పాయలుగా విడదీసుకోవాలి. ఇలా విడదీసుకున్న పాయల్లో వేటికైతే మీరు కలర్ వేయాలని భావిస్తున్నారో వాటిని అల్యూమినియం ఫాయిల్ సహాయంతో జాగ్రత్తగా చుట్టుకునేందుకు వీలుగా ఫాయిల్ ని కట్ చేసి పెట్టుకోండి.

ఇప్పుడు సెక్షనింగ్ క్లిప్స్ సాయంతో జుట్టుని పాయలుగా పూర్తిగా విడదీయండి. ఇప్పుడు మీరు ఏ పాయకైతే కలర్ వేసుకోవాలని అనుకుంటున్నారో దాని కింద ఉన్న జుట్టుని అల్యూమినియం ఫాయిల్ తో జాగ్రత్తగా కవర్ చేయండి. అనంతరం మీకు నచ్చిన కలర్ ని కురుల కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి అల్యూమినియం ఫాయిల్ తో చుట్టండి.

అది ఊడిపోకుండా సెక్షనింగ్ క్లిప్స్ ని కూడా ఉపయోగించవచ్చు. ఇలా జుట్టులోని మీకు నచ్చినన్ని పాయల్ని హైలైటర్ లేదా హెయిర్ కలర్ సాయంతో హైలైట్ చేసుకోవాలి. కిట్ పై సూచించిన సమయం పూర్తైన తర్వాత కురుల నుంచి ఫాయిల్స్ ని తొలగించి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అనంతరం నాణ్యమైన కండిషనర్ అప్లై చేసుకోవాలి.

ADVERTISEMENT

హెయిర్ పెయింటింగ్..

ఈ ప్రక్రియలో చేత్తోనే కురులను అందంగా పెయింట్ చేసుకోవడం ద్వారా హైలైట్ చేసుకోవచ్చు. అయితే ఈ పద్ధతిని సాధారణంగా ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ లు ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి, ఈ పద్ధతిని ఉపయోగించి ఇంట్లో స్వయంగా మన కురులను మనం తీర్చిదిద్దుకోవాలంటే అందుకూ ఓ పద్ధతి ఉంది. ఇందుకు కావాల్సినవి..

హైలైటింగ్ కిట్

రబ్బర్ గ్లౌజులు

ఫ్లాట్ బ్రష్

ADVERTISEMENT

హెయిర్ టింటింగ్ బ్రష్

సెక్షన్ క్లిప్స్

షాంపూ

కండిషనర్

ADVERTISEMENT

ఎలా వేసుకోవాలంటే..

ముందుగా మీకు నచ్చిన హెయిర్ కలర్ లేదా హైలైటర్ ని ఎంపిక చేసుకొని కిట్ పై ఉన్న సూచనలకు అనుగుణంగా దానిని కలుపుకోవాలి. ఇప్పుడు చేతులకు రబ్బర్ గ్లౌజులు వేసుకొని కురులను పాయలుగా విడదీసుకోవాలి. వాటిని సెక్షనింగ్ క్లిప్స్ సహాయంతో విడదీసి ఫ్లాట్ బ్రష్ సహాయంతో మిక్స్ చేసిన కలర్ ని హెయిర్ టింటింగ్ బ్రష్ సాయంతో అప్లై చేసుకోవాలి. ఈ క్రమంలో కురుల కుదుళ్ల వద్ద నుంచి కాకుండా మధ్య భాగం నుంచి చివర్ల వరకు కలర్ అప్లై చేసుకోవాలి. ఇలా కురుల మొత్తాన్ని హైలైట్ చేసుకునే వరకు ఇదే ప్రక్రియను కొనసాగించాలి. అనంతరం కిట్ పై సూచించిన సమయం మేరకు దానిని ఆరనిచ్చి షాంపూతో శుభ్రం చేసుకొని, కండిషనర్ అప్లై చేసుకోవాలి.

 

ఫ్రాస్టెడ్ హైలైట్స్..

పై భాగంలో కనిపించే కురులకు లేదా కింది భాగంలో ఉండే కురులను మాత్రమే హైలైటర్ ద్వారా హైలైట్ చేసే ప్రక్రియ ఫ్రాస్టెడ్ హైలైట్స్. ఇందుకోసం కావాల్సినవి..

ADVERTISEMENT

హైలైటింగ్ కిట్

రబ్బర్ గ్లౌజులు

హెయిర్ టింటింగ్ బ్రష్

కలర్ సేఫ్ షాంపూ అండ్ కండిషనర్

ADVERTISEMENT

ఎలా వేసుకోవాలంటే..

హైలైటింగ్ కిట్ పై ఉన్న సూచనలకు అనుగుణంగా ముందు హెయిర్ కలర్ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హైలైటింగ్ క్యాప్, రబ్బర్ గ్లౌజులు వేసుకొని కురులను కిట్ లో ఉన్న హుక్ సాయంతో ఆ క్యాప్ కి ఉన్న రంధ్రాల నుంచి జాగ్రత్తగా బయటకు తీయాలి. వాటిలో మీకు నచ్చిన పాయలకు హెయిర్ కలర్ లేదా హైలైటర్ ని అప్లై చేసుకోవాలి. కిట్ పై సూచించినంత సమయం ఆరనిచ్చి ఆ తర్వాత క్యాప్ తొలగించాలి. అనంతరం షాంపూతో తలను శుభ్రం చేసుకొని కండిషనర్ అప్లై చేసుకోవాలి.

 

హెయిర్ చంకింగ్..

కురులను హైలైట్ చేసుకునే ప్రక్రియలో సాధారణంగా జుట్టుని చిన్న చిన్న పాయలుగా విడదీస్తుంటారు. కానీ మరీ చిన్నవిగా కాకుండా కాస్త పెద్ద పాయలుగా విభజించి కూడా వాటిని హైలైట్ చేసుకోవచ్చు. ఇందుకు ఉపయోగించే ప్రక్రియే హెయిర్ చంకింగ్. ఈ పద్ధతిలో కలర్ చేసిన హెయిర్ సాధారణ జుట్టులా కాకుండా కాస్త భిన్నంగా, ఫంకీగా కనిపిస్తుంది. ఈ పద్ధతిలో కురులను హైలైట్ చేసుకునేందుకు కావాల్సినవి..

ADVERTISEMENT

హైలైటింగ్ కిట్

హెయిర్ బ్రష్

రబ్బర్ గ్లౌజులు

సెక్షనింగ్ క్లిప్స్

ADVERTISEMENT

హెయిర్ టింటింగ్ బ్రష్

అల్యూమినియం ఫాయిల్

వెడల్పాటి పళ్లున్న దువ్వెన

కలర్ సేఫ్ షాంపూ

ADVERTISEMENT

కండిషనర్

ఎలా వేసుకోవాలంటే..

కిట్ లో సూచించిన విధంగా హెయిర్ కలర్ కలుపుకొని సిద్ధం చేసుకున్న తర్వాత ఫాయిల్ ఉపయోగించి పాయల్ని డై చేసుకున్న పద్ధతిలోనే వీటినీ హైలైట్ చేసుకోవాలి. అయితే ఈ పద్ధతిలో కురులను చిన్నవిగా కాకుండా కాస్త పెద్ద పాయల్లానే విభజించుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన విధంగా హైలైటర్ అప్లై చేసుకున్న తర్వాత కిట్ పై ఇచ్చిన నిర్ణీత సమయం పాటు వాటిని ఆరనిచ్చి ఆ తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అనంతరం నాణ్యమైన కండిషనర్ అప్లై చేసుకోవాలి.

సరైన దిశలో అప్లై చేసుకోండి..

కురులను హైలైటర్ తో హైలైట్ చేసుకునే ప్రక్రియలో దానిని సరైన దిశలో అప్లై చేసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే లుక్ మొత్తం ఎబ్బెట్టుగా మారి మనం ఇబ్బందిపడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మరి, సరైన దిశలో హైలైటర్ ని అప్లై చేసుకోవడం ఎలాగో ఓసారి చూద్దాం రండి..

ADVERTISEMENT

ముందుగా కురులను చిక్కులు లేకుండా దువ్వుకొని చిన్న చిన్న పాయలుగా విడదీసుకోవాలి. ఇప్పుడు నచ్చిన హెయిర్ కలర్ లేదా హైలైటర్ ని మిశ్రమంగా కలుపుకొని బ్రష్ సహాయంతో కుదుళ్ల వద్ద నుంచి కొద్ది సెంటీమీటర్స్ గ్యాప్ ఇచ్చి చివర్ల వరకు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఈ క్రమంలో బ్రష్ ని పై నుంచి కిందకు లేదా కింద నుంచి పైకి.. ఏదో ఒక్క దిశలో మాత్రమే ఉపయోగించాలి.

ఇలా తల ముందు భాగం నుంచి మొదలుపెట్టి మధ్యభాగానికి వచ్చే సరికి మరింత తక్కువ కురులను పాయలుగా తీసుకొని వాటిని బ్రష్ తో హైలైట్ చేయాలి. క్రమంగా వెనుక భాగానికి అప్లై చేసుకునే సరికి మరింత సన్నగా పాయలు తీసుకుంటూ రావాలి. ముఖ్యంగా కురులకు సమానంగా హెయిర్ కలర్ అప్లై చేసుకోవాలని భావించకండి. అలా చేయడం వల్ల లుక్ పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు.

ఇంటి వద్దే హెయిర్ హైలైట్ చేసుకునేందుకు చిట్కాలు..

సాధారణంగా హెయిర్ కలర్ తో జుట్టుని హైలైట్ చేసుకునేందుకు అనుభవం కలిగిన సౌందర్య నిపుణులు లేదా బ్యూటీ పార్లర్స్ ని ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే కాస్త సమయం కేటాయించి, ఓపిగ్గా ఇంటి వద్దే హెయిర్ ని హైలైట్ చేసుకోవాలని భావించేవారు కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అవి..

ముందుగానే సిద్ధం చేసుకోండి..

ఇంటి వద్దే కురులను హైలైటర్ తో హైలైట్ చేసుకునేందుకు అవసరమైన వస్తువులన్నీ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. కాబట్టి ముందుగా కురులు చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. అలాగే హైలైటింగ్ చేసుకోవడానికి ఒక రోజు ముందుగానే తలస్నానం చేసి ఉండాలి. ఆ తర్వాతే హైలైట్ చేసుకోవడం ప్రారంభించాలి.

ADVERTISEMENT

నాణ్యమైన షాంపూ ఉపయోగించండి..

కురులను హైలైటర్ సహాయంతో హైలైట్ చేసుకున్న తర్వాత నిర్ణీత సమయం పాటు ఆరనిచ్చి ఆ తర్వాత నాణ్యమైన షాంపూతో తలస్నానం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మనం ఉపయోగించే షాంపూలో ప్రమాదకర లేదా హానికరమైన రసాయనాలు ఏవీ లేకుండా జాగ్రత్తపడాలి. లేదంటే కురులకు అప్లై చేసుకున్న హైలైటర్ రంగుని అవి ప్రభావితం చేసి రంగు మారిపోయేలా చేస్తాయి. కాబట్టి నాణ్యమైన షాంపూ ఉపయోగించడం చాలా ముఖ్యం.

కిట్ సరిచూసుకోండి..

మీరు మొట్టమొదటిసారిగా మీ కురులను హైలైట్ చేసుకుంటున్నారా?? అయితే మీ వద్ద ఉన్న హైలైటింగ్ కిట్ ని ఓసారి సరిచూసుకోండి. అందులో కలర్, స్పెషల్ అప్లికేటర్, బ్రషెస్, సూచనలు ఉన్న పుస్తకం, ఫాయిల్, క్యాప్, గ్లౌజులు.. మొదలైనవి ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి.

సరైన రంగుని ఎంచుకోండి..

హెయిర్ హైలైటింగ్ ప్రక్రియలో ఇదొక కీలకమైన స్టెప్. మీరు ఎంచుకునే హైలైటర్ లేదా హెయిర్ కలర్ మీ కురుల అందాన్ని పెంచే విధంగా ఉండాలి. కాబట్టి డార్క్ హెయిర్ ఉన్నవారికి లైట్ బ్రౌన్ లేదా గోల్డెన్ హైలైట్స్, ఎర్రని కురులు ఉన్నవారికి మీడియం బ్రౌన్ లేదా గోల్డెన్ బ్రన్నెట్ కలర్స్ బాగుంటాయి.

ముందు టెస్ట్ చేయండి..

మీరు ఎంచుకున్న హైలైటర్ లేదా హెయిర్ కలర్ మీకు నప్పుతుందో లేదో తెలుసుకోవడానికి ముందుగా ఒకటి లేదా రెండు పాయలకు దానిని అప్లై చేసి టెస్ట్ చేయడం తప్పనిసరి. అప్పుడే అది మీకు నప్పుతుందో లేదో తెలుస్తుంది. అలాగని పాయలోని కురుల మొత్తానికి దీనిని అప్లై చేయాల్సిన అవసరం లేదు. చివర్లు లేదా మధ్యభాగంలో కొద్దిగా అప్లై చేస్తే చాలు. అది మీకు నప్పుతుందో లేదో ఇట్టే తెలిసిపోతుంది.

ADVERTISEMENT

హైలైట్స్ ఎక్కడ చేసుకోవాలి?

Shutterstock

కొంతమంది కురులు మొత్తాన్ని హైలైట్ చేసుకోవాలని భావిస్తే; ఇంకొందరు కురుల మధ్య భాగం వద్ద నుంచి చివర్ల వరకు మాత్రమే హైలైట్ చేసుకోవాలని అనుకుంటారు. మరి, మీరు మీ కురులను ఏ ప్రాంతంలో హైలైట్ చేసుకోవాలని భావిస్తున్నారు? దీని గురించి మీరు ముందుగానే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రాక్టీస్ ఉండాల్సిందే..

అభ్యాసం చేసే కొద్దీ పర్ఫెక్ట్ నెస్ దానంతట అదే వస్తుందని అంటూ ఉంటారు. ఇది హెయిర్ హైలైటర్ కి కూడా వర్తిస్తుంది. మీరు హెయిర్ హైలైట్ చేసుకోవడానికి ఒకటి లేదా రెండు రోజుల ముందే ఓసారి హైలైటర్ అప్లై చేసుకోవడం ప్రాక్టీస్ చేయాలి. అలాగని హెయిర్ హైలైటర్ నే ఇందుకు ఉపయోగించాల్సిన పని లేదు. కండిషనర్ ని బ్రష్ సాయంతో హైలైటర్ గా భావించి అప్లై చేసుకున్నా సరిపోతుంది. ఫలితంగా హైలైటర్ కిట్ లో ఉన్న వస్తువులు ఏవి ఎలా ఉపయోగించాలో మీకు ఓ అవగాహన ఏర్పడుతుంది.

ADVERTISEMENT

చర్మాన్ని సంరక్షించుకోండి..

హెయిర్ హైలైటర్ అప్లై చేసుకోవడానికి ముందు నుదురు, తలకట్టు చుట్టూ, చెవుల వద్ద స్కిన్ ప్రొటెక్టర్ ని అప్లై చేసుకోవడం మరచిపోవద్దు. లేదంటే హైలైటర్ లో ఉండే బ్లీచింగ్ ఎలిమెంట్స్ కారణంగా చర్మం ప్రభావితమవుతుంది.

లేయర్స్‌గా హైలైట్ చేసుకోండి..

మీరు కురులను చిన్న చిన్న పాయలుగా విడదీసి హైలైట్ చేసుకోవడం ప్రారంభించిన తర్వాత వాటిని ఒకదాని తర్వాత ఒకటిగా కిందకు విడిచిపెట్టండి. తల కింది భాగం నుంచి హైలైట్ చేసుకోవడం మొదలుపెట్టి క్రమంగా నుదురు భాగం వరకు రావాలి. అవసరమైతే జుట్టుని లేయర్స్ గా విడదీసేందుకు అల్యూమినియం ఫాయిల్స్ ఉపయోగించండి.

ఎక్కువ రోజులు నిలిచి ఉండాలంటే..

కురులకు హైలైటర్ అప్లై చేసుకున్న తర్వాత అది ఎక్కువ రోజులు నిలిచి ఉండాలంటే తలస్నానం తరచుగా కాకుండా కాస్త ఎక్కువ గ్యాప్ ఇచ్చి చేయాలి. అంటే హైలైటర్ అప్లై చేసుకున్న తర్వాత నిర్ణీత సమయానికి షాంపూతో దానిని శుభ్రం చేసుకోవడం సహజమే. ఆ తర్వాత రెండోసారి తలస్నానం చేసే క్రమంలో ఎంత ఎక్కువ గ్యాప్ ఇష్తే హైలైటర్ లేదా హెయిర్ కలర్ కురులకు అంత బాగా పడుతుంది. ఫలితంగా ఎక్కువ రోజులు నిలిచి ఉంటుంది.

ప్రొఫెషనల్‌ని సంప్రదించండి..

ఒకవేళ మీరు మొట్టమొదటిసారిగా జుట్టుకి హైలైటర్ అప్లై చేసుకుంటున్నట్లయితే ముందుగా మీరోసారి ప్రొఫెషనల్ ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవడం చాలా మంచిది. మీరు ఏ కలర్ ఎంపిక చేసుకోవాలి? కురులను ఎక్కడెక్కడ హైలైట్ చేసుకోవాలి? ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.. మొదలైన విషయాలను వారితో చర్చించి వారి సూచనలు, సలహాలు తీసుకోవాలి. ఇవి మీకు హెయిర్ హైలైటింగ్ ప్రక్రియలో బాగా ఉపకరిస్తాయి.

ADVERTISEMENT

తేమని అందించండి..

కురులను హైలైటర్ లేదా హెయిర్ కలర్ తో హైలైట్ చేసుకున్న తర్వాత నిర్ణీత వ్యవధి పాటు ఆరనిచ్చి షాంపూతో శుభ్రం చేసుకోవడం మామూలే. కానీ ఆ తర్వాత కురులకు నాణ్యమైన కండిషనర్ అప్లై చేసి 5 నుంచి 10 నిమిషాల పాటు మ్రుదువుగా మర్దన చేసుకోవాలి. ఫలితంగా కుదుళ్ల ద్వారా కురులకు అవసరమైన తేమ అంది జుట్టు ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంది.

టోనర్ ఉపయోగించండి..

మీకు నచ్చిన కలర్ తో హెయిర్ ని హైలైట్ చేసుకున్న తర్వాత వాటి అందాన్ని మరింత పెంచేందుకు టోనర్ ని ఉపయోగించాల్సిందే. ఈ టోనర్స్ హైలైట్ చేసిన కురుల షేడ్ ని మరింత డార్క్ లేదా లైట్ గా చేయడం ద్వారా జుట్టు అందాన్ని ఇనుమడించేలా చేస్తాయి. అలాగే హైలైట్ చేసిన కురులు మిలమిలా మెరుస్తుంటాయి.

హైలైటింగ్ ప్రక్రియలో చేయాల్సినవి, చేయకూడనివి..

కురులను హెయిర్ కలర్ లేదా హైలైటర్ తో హైలైట్ చేసే ప్రక్రియలో కొన్ని చేయాల్సిన, చేయకూడని పనులు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుని ముందుగా జాగ్రత్తపడితేనే హైలైటర్స్ లుక్ మరింత ఇనుమడించేలా చేయచ్చు. ఇంతకీ అవేంటంటే..

ముఖాక్రుతికి అనుగుణంగా ఉండాల్సిందే..

మనం హెయిర్ హైలైటింగ్ చేసుకునే ప్రక్రియలో మొట్టమొదటి ప్రాధాన్యం మన ముఖాక్రుతికే ఇవ్వాలి. దానికి అనుగుణంగా ఉండే విధంగానే హెయిర్ ని హైలైట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కురులు హైలైట్ చేసుకునే ప్రాంతాన్ని ఎంపిక చేసుకునే క్రమంలోనూ దీనికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే హెయిర్ కలర్ ఎక్కడ లైట్ గా ఉండాలి.. ఎక్కడ డార్క్ గా ఉండాలి.. అనేది కూడా దీని ఆధారంగానే నిర్ణయించుకోవాలి. అప్పుడే లుక్ ఇనుమడిస్తుంది.

ADVERTISEMENT

అతి పనికిరాదు..

హైలైట్ చేసుకుంటున్నాం కదాని మొత్తం జుట్టంతటినీ ఒకే రంగుతో హైలైట్ చేస్తే అది సాధారణ హెయిర్ డై లానే కనిపిస్తుంది. అలాకాకుండా ఉండాలంటే మనం ఉపయోగించే హెయిర్ కలర్ పరిమాణం, సాంద్రత.. వంటివన్నీ ముందుగానే మనం పక్కాగా ఉండేలా చూసుకోవాలి.

కాలానికి అనుగుణంగా ఉండాలి..

మనం కురులను హైలైట్ చేసుకోవడానికి ఉపయోగించే షేడ్స్ ఆయా కాలాలకు అనుగుణంగా కూడా ఉండాలంటున్నారు సౌందర్య నిపుణులు. అయితే ఏ సీజన్ లో ఏ కలర్స్ బాగుంటాయనేది మీ దగ్గర్లోని సౌందర్య నిపుణులను సంప్రదించి తెలుసుకోవడం మంచిది.

హైలైట్స్ పట్ల జాగ్రత్త వహించాలి..

ఒకసారి ఎంతో కష్టపడి కురులను నచ్చిన కలర్ లేదా హైలైటర్ తో హైలైట్ చేసుకున్న తర్వాత వాటి పట్ల తగిన జాగ్రత్త వహించడం కూడా చాలా అవసరం. కురులకు తగినంత తేమ అందించడం, సల్ఫేట్ తక్కువగా ఉండే ఉత్పత్తులు వినియోగించడం, కలర్ సేఫ్ షాంపూ, కండిషనర్ ఉపయోగించడం, తలస్నానం మరీ తరచుగా చేయకపోవడం.. వంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి. మరీ అవసరమనిపిస్తే డ్రై షాంపూని ఉపయోగించవచ్చు.

మరీ లైట్ షేడ్ వద్దు..

హెయిర్ ని హైలైట్ చేసుకునేందుకు మనం ఎంపిక చేసుకునే హెయిర్ కలర్ లేదా హైలైటర్ షేడ్ మరీ లైట్ గా ఉండకూడదు. అంటే మన చర్మఛాయలో కలిసిపోయే విధంగా ఉండకూడదు. దీని వల్ల హెయిర్ హైలైటర్ ఉపయోగించినా తగిన ఫలితం మనకు కనిపించదు. కాబట్టి మీ కురులు, చర్మం రంగుకు భిన్నంగా ఉండే షేడ్ నే హెయిర్ హైలైటింగ్ కోసం ఉపయోగించాలి. అలాగని పూర్తి వ్యతిరేకంగా ఉన్న షేడ్స్ ని ఉపయోగించడం కూడా సరికాదు.

ADVERTISEMENT

ఒకేసారి ఎక్కువ రంగులు ఉపయోగించకండి..

Shutterstock

నచ్చిన రంగుతో జుట్టుని హైలైట్ చేసుకుంటున్నాం కదాని ఒకేసారి ఎక్కువ రంగులను ఉపయోగించకండి. ఒక్కసారి హైలైట్ చేసుకొనేటప్పుడు మూడు కంటే ఎక్కువ షేడ్స్ ఉపయోగించకుండా జాగ్రత్తపడండి. లేదంటే లుక్ మొత్తం ఎబ్బెట్టుగా మారి మీకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతుంది.

తరచూ అడిగే ప్రశ్నలు – వాటి సమాధానాలు

హెయిర్ హైలైటింగ్ ప్రక్రియలో ఎక్కువమంది తరచూ అడిగే కొన్ని ప్రశ్నలు – వాటి సమాధానాలు ఓసారి చూద్దాం రండి..

ADVERTISEMENT

జుట్టుని కలరింగ్ చేసుకున్న తర్వాత హైలైట్ చేసుకోవచ్చా?

ఒక్కసారి జుట్టుని కలర్ చేసుకున్న తర్వాత వెంటనే హైలైట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆశించిన ఫలితాలు కనిపించకపోవచ్చు. అదీకాకుండా కలర్, హైలైటర్ లో ఉండే రసాయనాల ప్రభావం కారణంగా జుట్టు సైతం పాడయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కలరింగ్ చేసుకున్న పది నుంచి పదిహేను రోజుల తర్వాత దానిని హైలైట్ చేసుకోవడం మంచిది. ఫలితంగా కురులు ఆరోగ్యంగా ఉండడంతోపాటు, మనం అప్లై చేసుకున్న హైలైటర్ అందంగానూ కనిపిస్తుంది.

కురులను హైలైట్ చేసుకోవడం వాటి ఆరోగ్యానికి మంచిదేనా?

కురులను హైలైట్ చేసుకోవడానికి మనం ఉపయోగించే కలర్ లేదా హైలైటర్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. అయితే మరీ తరచూ హైలైటర్స్ ఉపయోగించడం వల్ల వాటిలోని రసాయనాలు కురుల్లో పేరుకుపోయి వాటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండడమే మంచిది. అలాగే కొందరిలో సహజంగానే కురులు రెండు రంగుల్లో కనిపిస్తుంటాయి. అటువంటివారు చాలా తక్కువ మోతాదులో కలర్ లేదా హైలైటర్ ని ఉపయోగించినా చూడడానికి చాలా బాగుంటుంది.

కురులకు అప్లై చేసిన హైలైట్స్‌ని తొలగించడం ఎలా??

కురులకు అప్లై చేసిన హైలైట్స్ ని తొలగించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అయితే వాటి ప్రభావం ఎంత వరకు ఉంటుందనేది మాత్రం మనం ఉపయోగించిన హెయిర్ కలర్ లేదా హైలైటర్ గాఢతపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ హైలైట్స్ ని తొలగించేందుకు ఒక బౌల్లో కొద్దిగా నీరు తీసుకొని అందులో ఎప్సమ్ సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. వేసుకున్న కలర్ వదిలిపోవడం మొదలయ్యేంతవరకు ఈ మిశ్రమంలో కురులను ముంచి ఉంచాలి. అయితే ఈ చిట్కా తాత్కాలిక కలర్స్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది.

హైలైట్స్ మంచివా? లేక జుట్టు మొత్తానికి కలర్ వేసుకోవడం మంచిదా??

కురుల్లోని ఒకటి లేదా రెండు పాయలకు నచ్చిన కలర్ లేదా హైలైటర్ ఉపయోగించి హైలైట్ చేసుకోవడం ద్వారా కురులు మరింత అందంగా కనిపించేలా చేసుకోవచ్చు. మీ కురుల సాధారణ రంగులో కలిపి చూసినప్పుడు ఈ హైలైట్స్ అందంగా కనిపిస్తాయి. ఒక సింపుల్ హెయిర్ కట్ లేదా కొన్ని లేయర్స్ ని మాత్రమే మీరు హైలైట్ చేయాలనుకున్నప్పుడు అందుకు హైలైటర్స్ మంచి మార్గం. అలాకాకుండా జుట్టు మొత్తానికి కలర్ వేసుకోవడం ద్వారా అంతా ఒకేలా కనిపిస్తుంది. ఈ పద్ధతి తెల్ల వెంట్రుకలను కవర్ చేసుకోవడానికి మంచిది.

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి

వర్షంలో తడవడం వల్ల.. అందం పెరుగుతుందా? తగ్గుతుందా?

తేనెతో మీ కురులు మెరిపించాలా? ఈ 15 హెయిర్ ప్యాక్స్ ప్రయత్నించి చూడండి..!

మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా? వాటిని ఇలా దూరం చేసుకోండి..!

30 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT